Apr 5, 2021

సురాహ్ అల్‌ ఫాతిహ

 


సురాహ్ అల్ఫాతిహ

    ఆయతులు : 7                                                                                          అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

అల్ఫాతిహ  1 - 3 అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫలదినానికి స్వామి.

అల్ఫాతిహ  4 - 7  మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజుమార్గం చూపించు - నీవు అనుగ్రహించినవారూ, నీ ఆగ్రహానికి గురికానివారూ, మార్గభ్రష్టులు కానివారూ అనుసరించిన మార్గము.