94 సూరహ్ అలమ్ నష్రహ్

 

94 అలమ్ నష్రహ్

ఆయతులు : 8             అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 8 ( ప్రవక్తా) మేము నీ హృదయాన్ని నీ కొరకు తెరవలేదా? నీ నడుమును విరిచేస్తూవుండిన ఒక పెద్ద భారాన్ని నీపై నుండి దించివేశాము, నీ కొరకు నీ పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడిరపజేశాము. కనుక కష్టాలతోపాటు తప్పనిసరిగా సుఖాలు కూడ ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహంలేదు. కష్టాలతోపాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉన్నాయి.  కాబట్టి నీకు తీరిక లభించినప్పుడు, కఠోరమైన ఆరాధనలో నిమగ్నుడవైపో. నీ ప్రభువు మీదనే నీ మనస్సును లగ్నం చెయ్యి.

No comments:

Post a Comment