107 సూరహ్ అల్ మాఊన్

 

107 అల్ మాఊన్

ఆయతులు : 7                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 7 పరలోక శిక్షను, బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? అతడే అనాథులను కసరికొట్టేవాడు, పేదవాళ్ళకు అన్నం పెట్టుఅని ప్రోత్సహిం చనివాడు. పోతే, తమ నమాజుల పట్ల అశ్రద్ధవహించేవారు, ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారు, వాడుకునే మామూలు వస్తువులను (ప్రజలకు) ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు.

No comments:

Post a Comment