101 అల్ ఖారిఆహ్
ఆయతులు
: 11 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 11 అదొక మహా ఉపద్రవం! ఏమిటా మహా ఉపద్రవం? ఆ మహా ఉపద్రవమేమిటో నీకేమి తెలుసు? ఆ రోజున మానవులు చెల్లాచెదరైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగు రంగుల ఉన్ని వలె మారిపోతాయి. ఆ తరువాత ఎవరి త్రాసు పళ్ళాలైతే బరువుగా ఉంటాయో, వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాల్లో ఓలలాడుతారు. మరెవరి త్రాసు పళ్ళాలైతే తేలికగా ఉంటాయో, వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో మీకేమైనా తెలుసా? అది భగ భగ మండే అగ్ని గుండం.
No comments:
Post a Comment