70. అల్ మారిజ్
ఆయతులు
: 44 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 18
అడిగేవాడు శిక్షను గురించి అడిగాడు. అది (ఆ శిక్ష) తప్పకుండా సంభవిస్తుంది. అది అవిశ్వాసుల కొరకే. దానిని తప్పించేవారెవ్వరూ లేరు. అది ఆరోహణ సోపానాలకు స్వామి అయిన అల్లాహ్ తరఫు
నుండి సంభ విస్తుంది. యాభైవేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రోజున దైవదూతలు, ఆత్మ, ఆయన సాన్నిధ్యానికి అధిరోహిస్తారు.
కనుక ఓ ప్రవక్తా! సహనం వహించు, హుందాతనంతో కూడిన సహనం.
వారు అది దూరంగా ఉన్నదని అనుకుంటున్నారు. కాని మాకు అది దగ్గరలో
కనిపిస్తున్నది. ఏ రోజున ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుందో, కొండలు ఏకిన రంగు రంగుల ఉన్ని పింజలు మాదిరిగా అయిపోతాయో, ప్రాణస్నేహితులు ఒకరి కొకరు కనిపించినప్పటికీ, ఎవరూ ఎవరిని గురించీ పట్టించుకోవటం జరగదో. (ఆ రోజున ఆ శిక్ష సంభవిస్తుంది) దోషి
ఆనాటి శిక్ష నుండి తప్పించుకోవ టానికి తన సంతానాన్నీ, తన భార్యనూ, తన సోదరులనూ, తనకు ఆశ్రయ మిచ్చిన
దగ్గరి బంధువులనూ భూమండలంలోని వారందరినీ పరిహారంగా ఇచ్చి, ఈ ఉపాయం ద్వారా విముక్తి పొందాలని కోరుకుంటాడు. ఎంతమాత్రం కాదు. (అలా ఎన్నటికీ జరగదు) అది భగ భగ మండే నరకాగ్ని జ్వాల. మాంసాన్ని, చర్మాన్ని సైతం అది తినేస్తుంది. సత్యం పట్ల విముఖుడై, వెన్ను చూపి, ధనాన్ని కూడబెట్టి దానిని మాటిమాటికి పేర్చి పెట్టిన ప్రతివాణ్ణీ అది బిగ్గరగా అరుస్తూ తన వైపునకు పిలుస్తుంది.
19 - 35 మానవుడు తొందరపడే వాడుగా, సహనం లేనివాడుగా సృష్టించ బడ్డాడు. అతనికి కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందుతాడు, సుఖాలు కలిగినప్పుడు పిసినారితనంతో ప్రవర్తిస్తాడు. కాని (ఈ బలహీనతకు ఈ క్రిందివారే దూరంగా ఉంటారు). నమాజు చేసేవారు, తమ నమాజులను ఎల్లప్పుడూ నియమం తప్పకుండా పాటించేవారు, తమ సంపదలలో యాచకు లకూ, దిక్కులేని వారికి ఒక నిర్ణీతమైన హక్కును ఇచ్చేవారు, తీర్పుదినం సత్యమని నమ్మేవారు, తమ ప్రభువు శిక్షకు భయపడేవారు
ఎందుకంటే వారి ప్రభువు విధించే శిక్ష ఎవరూ నిర్భయంగా ఉండేటటువంటి శిక్షకాదు, తమ మర్మాంగాలను కాపాడుకునేవారు - తమ భార్యలూ, చట్టరీత్యా తమ అధీనంలో ఉండే స్త్రీలూ తప్ప, వీరి విషయంలో కాపాడుకోకుండా ఉండేవారు నిందార్హులు కారు
అయితే ఇదిగాక ఇంకా ఎక్కువ కావాలని కోరేవారు హద్దులను అతిక్రమించేవారు - తమ అమానతులను పరిరక్షించేవారు, తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారు, తమ సాక్ష్యాల విషయంలో నిజాయితీగా ఉండేవారు, తమ నమాజును కాపాడుకునేవారు- ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు.
36 - 44 కనుక ఓ ప్రవక్తా! ఈ సత్య ధిక్కారులు కుడి ఎడమల నుండి గుంపులు గుంపులుగా నీ వైపునకు ఎందుకు పరుగెత్తుకొస్తున్నారు? వారిలో ప్రతి ఒక్కడూ కానుకలతో నిండిన స్వర్గంలో తనను ప్రవేశపెట్టడం జరుగు తుందనే పేరాశ కలిగిఉన్నాడా? ఎంతమాత్రం కాదు. ఏ వస్తువుతో మేము వారిని పుట్టించామో, ఆ వస్తువేమిటో స్వయంగా వారు ఎరుగుదురు. కనుక అలా కాదు. నేను తూర్పుల, పడమరల స్వామిపై ప్రమాణం చేసి చెబుతు న్నాను, మేము వారి స్థానంలో వారికంటె మేలైన వారిని తీసుకురాగల శక్తి కలిగి ఉన్నాము,
మమ్మల్ని మించి పోయేవారెవ్వరూ లేరు.
కనుక వారిని వారి వ్యర్థ విషయాలలో, ఆటపాటలలో పడి ఉండనివ్వండి. వారికి వాగ్దానం చేయబడుతున్న దినానికి వారు చేరుకునే వరకు వారిని అలా పడి ఉండ నివ్వండి.
అప్పుడు వారు తమ సమాధుల నుండి బయటికి
వచ్చి తమ దేవతల మందిరాల వైపునకు పరుగెత్తుతున్నట్లు పరుగెత్తుతూ ఉంటారు. వారి చూపులు క్రిందికి వ్రాలి ఉంటాయి
అవమానం వారిని కమ్ముకుంటూ ఉంటుంది. ఈ దినం గురించే వారికి వాగ్దానం చేయబడుతోంది.
No comments:
Post a Comment