6 సూరహ్ అల్‌ అన్‌ ఆమ్‌

 

6. అల్అన్ఆమ్

ఆయతులు : 165        అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

6. అల్అన్ఆమ్ 1 - 3 స్తోత్రం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది. ఆయన భూమినీ, ఆకాశాలనూ నిర్మించాడు. వెలుగునూ చీకట్లనూ సృష్టించాడు. అయినా సత్యసందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించినవారు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు. తరువాత మీ కొరకు ఒక జీవన వ్యవధిని నిర్ణయించాడు. ఆయన వద్ద నిర్ణయమై ఉన్న మరొక వ్యవధికూడా ఉంది. కాని మీరు ఇంకా సంశయంలోనే పడివున్నారు. ఏకైక దైవమే ఆకాశాలలోనూ ఉన్నాడు, భూమిలోనూ ఉన్నాడు. మీరు బయటికి తెలియపరచేదీ, లోపల దాచిపెట్టేదీ అంతా ఆయనకు తెలుసు. మీరు సముపార్జించుకునే చెడునూ మంచినీ ఆయన బాగా ఎరుగును.

6. అల్అన్ఆమ్ 4 - 6 ప్రజల స్థితి ఏమిటంటే, వారి ముందుకు వచ్చిన తమ ప్రభువు సూచనలలో వారు వైముఖ్యం చూపని సూచన ఏదీ లేదు. ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని కూడా అసత్యమని తిరస్క రించారు. సరే, వారు ఇంతవరకూ ఎగతాళి చేస్తూ వచ్చిన విషయానికి సంబంధించిన కొన్ని వార్తలు త్వరలోనే వారికి అందుతాయి. తమ తమ కాలాలలో అధిక ప్రాబల్యంకల ఎన్ని జాతులను మేము వారికి పూర్వం నాశనం చేశామో వారు చూడలేదా? మేము మీకు ప్రసాదించని అధికారాన్ని పుడమిపై వారికి ప్రసాదించాము. వారిపై మేము ఆకాశం నుండి మంచి వర్షాలను కురిపించాము. క్రింద నదులను ప్రవహింపచేశాము. (కాని వారు మా అనుగ్రహాలపట్ల కృతఘ్నత చూపితే) చివరకు మేము వారు చేసిన పాపాల ఫలితంగా వారిని సర్వనాశనం చేశాము. వారి స్థానంలో మరొక తరం జాతులను లేపాము.

6. అల్అన్ఆమ్ 7 - 9 ప్రవక్తా! మేము కాగితం మీద వ్రాయబడిన ఒక గ్రంథాన్ని నీపై అవతరింపజేసినా, ప్రజలు దానిని స్వహస్తాలతో తాకి చూసినా, సత్యతిరస్కారులు మటుకు ‘‘ఇది పచ్చి కనికట్టు తప్ప మరేమీ కాదు’’ అని అంటారు.  వారు, ‘‘ ప్రవక్తపై ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?’’ అని అడుగుతారు. మేము ఒకవేళ దైవదూతనే పంపి ఉన్నట్లయితే ఇప్పటికే తీర్పు జరిగి ఉండేది. వారికి వ్యవధి ఇవ్వబడి ఉండేది కాదు. ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా అతనిని మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారము. విధంగా మేము వారిని, ప్రస్తుతం వారు సంశయంలో పడివున్నారో సంశయానికే గురిచేసి ఉండేవారము.

6. అల్అన్ఆమ్ 10 - 11 ప్రవక్తా! నీకు పూర్వం కూడ చాలామంది ప్రవక్తలను ఎగతాళి చెయ్యటం జరిగింది. కాని చివరకు ఎగతాళి చేసేవారు యథార్థాన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారో, యథార్థమే వారి నెత్తిపై పడిరది. వారితో ఇలా అను : ‘‘కొంచెం భూసంచారం చేసి చూడండి, సత్యతిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో తెలుస్తుంది.’’

6. అల్అన్ఆమ్ 12 వారిని అడుగు : ఆకాశాలలో,  భూమిలో ఉన్నదంతా ఎవరిదని? - అను, సమస్తమూ అల్లాహ్దే అని. దయాదాక్షిణ్యాలు చూపటాన్ని ఆయన తన మీద విధించుకున్నాడు. (కనుకనే ఆయన మీ అవిధేయతలకు, తలబిరుసుతనాలకు మిమ్మల్ని వెంటనే పట్టుకోడు). ప్రళయం నాడు ఆయన మీ అందరినీ తప్పకుండా సమావేశపరుస్తాడు. ఇది అనుమానానికి ఏమాత్రం ఆస్కారంలేని యథార్థం. కాని తమను తాము వినాశకరమైన ప్రమాదానికి గురిచేసుకున్నవారు మాత్రం దీనిని విశ్వసించరు.

6. అల్అన్ఆమ్ 13 - 18 రాత్రి చీకటిలో పగటివెలుగులో నిలిచేది అంతా అల్లాహ్దే. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. ఇలా అను : ‘‘భూమ్యాకాశాల సృష్టికర్త, ఉపాధి ప్రదాతేగాని ఉపాధి గ్రహీత కానివాడు అయిన అల్లాహ్ను కాదని నేను మరెవరినయినా నా సంరక్షకుడుగా చేసుకోవాలా?’’ ఇలా చెప్పు : అందరికంటే ముందు నేను ఆయనకు విధేయుణ్ణి కావాలని నన్ను ఆదేశించటం జరిగింది. (ఇంకా ఇలా తాకీదు ఇవ్వబడిరది. ఎవరైనా షిర్క్చేస్తే చెయ్యనీ) ‘‘నీవు మాత్రం ముష్రిక్కులలో కలసిపోవద్దు.’’ ఇంకా ఇలా అను : ‘‘నేను ఒకవేళ నా ప్రభువు ఆజ్ఞలను ఉల్లంఘిస్తే, ఒక మహా (భయంకరమైన) రోజున శిక్షను అనుభవించవలసి వస్తుందని నేను భయపడుతున్నాను. రోజున శిక్షను తప్పించుకున్న వాడిని అల్లాహ్ నిజంగా కరుణించినట్లే. అదే ప్రస్ఫుటమైన సాఫల్యం. అల్లాహ్ గనక మీకు ఏదైనా నష్టం కలిగిస్తే, ఆయన తప్ప నష్టాన్నుండి మిమ్మల్ని రక్షించగలిగే వారెవరూ లేరు. ఆయన మీకు ఏదైనా మేలు కలుగజేస్తే, ఆయనకు అన్నింటిపైనా అధికారం ఉంది. ఆయన తన దాసులపై సంపూర్ణమైన అధికారాలు కలిగి వున్నాడు. ఇంకా అత్యంత వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు.’’

6. అల్అన్ఆమ్ 19 - 21 వారిని అడుగు : ఎవరి సాక్ష్యం అందరి సాక్ష్యం కంటే గొప్పది? అని - ఇలా అను : నాకూ మీకూ మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. ఖురాను నా వద్దకు వహీ ద్వారా పంపబడిరది. మిమ్మల్నీ, ఇది ఎవరెవరివద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించాలని. అల్లాహ్తో పాటు ఇంకా ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారని మీరు నిజంగానే సాక్ష్యం ఇవ్వగలరా? ఇలా అను : నేను అలాంటి సాక్ష్యం ఎంతమాత్రం ఇవ్వలేను. అను: దేవుడు ఆయన ఒక్కడే. మీరు చేసే షిర్కును నేను అసహ్యిం చుకుంటున్నాను. మేము ఎవరికైతే గ్రంథాన్ని ప్రసాదించామో, తమ కుమారులను ఏమాత్రం సందేహం లేకుండా గుర్తించే విధంగానే విషయాన్ని కూడా నిస్సందేహంగా గుర్తిస్తారు. కాని తమను తామే నష్టానికి గురిచేసుకున్న వారు దీన్ని నమ్మరు. అల్లాహ్ పై బూటకపు అభాండాలు వేసేవాడికంటే లేదా అల్లాహ్ సూచనలు అసత్యాలని తిరస్కరించేవాడికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? నిశ్చయంగా అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.

6. అల్అన్ఆమ్ 22 - 24 మేము వారందరినీ సమావేశపరిచే రోజున ముష్రిక్కులను ఇలా అడుగుతాము : ‘‘మీరు మీ దైవాలుగా భావించి నిలబెట్టిన భాగస్వాములంతా ఇప్పుడెక్కడున్నారు?’’ అప్పుడు వారు : ‘‘ మా ప్రభూ! నీతోడు! మేము ముష్రిక్కులము కానేకాము’’ అని (అసత్యం) పలకటం తప్ప వేరే కుతంత్రాన్ని సృష్టించలేరు. చూడండి! అప్పుడు వారు తమను గురించి తామే విధంగా అబద్ధాలు కల్పిస్తారో! అక్కడ వారి బూటకపు దేవుళ్ళందరూ మటుమాయమైపోతారు.

6. అల్అన్ఆమ్ 25 - 30 వారిలో నీ మాటను చెవియొగ్గి వినేవారు కొందరు ఉన్నారు. కాని విషయం ఏమిటంటే మేము వారి హృదయాలపై పరదాలు వేసి ఉంచాము. అందువల్ల వారు దానిని ఏమాత్రం అర్థం చేసుకోరు. వారి చెవులను మొద్దుబారేటట్లు చేశాము. (కనుక అంతా విన్నప్పటికీ ఏమీ వినలేరు). వారు సూచనను చూసినా, దానిని విశ్వసించటం అనేది జరగదు. చివరకు వారు నీ వద్దకు వచ్చి నీతో వాదులాడేటప్పుడు, వారిలో తిరస్కరించాలనే నిర్ణయం చేసుకున్నవారు (అంతా విన్న తరువాత) ‘‘ఇదంతా పాతకాలపు గాథ తప్ప మరేదీ కాదు’’ అని అంటారు. వారు ప్రజలను సత్య విషయాన్ని విశ్వసించకుండా ఆపుతారు. స్వయంగా వారు కూడా దానికి దూరంగా పారిపోతారు. (ఇలా చేసి నీకు హాని కలుగజేస్తున్నామని వారు భావిస్తారు). వాస్తవానికి వారు అసలు తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. కాని వారికి దాని స్పృహలేదు. నరకం గట్టుపై వారిని నిలబెట్టే దృశ్యాన్ని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు వారు ఇలా అంటారు : ‘‘అయ్యో! మేము మళ్ళీ భూలోకానికి తిరిగి పంపబడే, మా ప్రభువు సూచనలు అసత్యాలని తిరస్కరించకుండా ఉండే, విశ్వాసులలో మేము కలసిపోయే మార్గం ఏదైనా ఉంటే ఎంత బాగుండును.’’ వాస్తవానికి వారు ఇలా అనటానికి కారణం, కేవలం వారు కప్పిపుచ్చిన సత్యం అప్పుడు వారి ముందు బహిర్గతం కావటమే! ఒకవేళ వారిని గత జీవితం వైపునకు తిరిగి పంపితే నిషేధించటం జరిగిన దాన్నంతా మళ్ళీ చేస్తారు. వారు అసలు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవారే. (కనుక వారు తమ కోరికను వ్యక్తం చెయ్యటంలో కూడా అబద్ధాన్నే ప్రయోగిస్తారు). వారు ఈనాడు ఇలా అంటారు : ‘‘జీవితం అంటే కేవలం ఇహలోక జీవితమే. మరణం తరువాత మనం మళ్ళీ లేపబడటం అనేది జరగదు.’’ వారు తమ ప్రభువు ముందు నిలబెట్టబడే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండును! అప్పుడు వారి ప్రభువు వారిని ‘‘ఇదంతా యథార్థం కాదా?’’ అని అడుగుతాడు. వారు ఇలా అంటారు : ‘‘అవును మా ప్రభూ! ఇదంతా యథార్థమే!’’ అప్పుడు ఆయన ఇలా సెలవిస్తాడు : ‘‘సరే, అయితే మీరు యథార్థాన్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఇప్పుడు శిక్షను చవిచూడండి.’’

6. అల్అన్ఆమ్ 31 - 32  అల్లాహ్తో తమ సమావేశపు వర్తమానాన్ని అబద్ధంగా పరిగణించిన వారు నష్టానికి గురి అయ్యారు. అకస్మాత్తుగా గడియ వచ్చిపడినప్పుడు వారే వాపోతారు: ‘‘అయ్యో! విషయంలో మేము ఎంత పొరపాటు చేశాము!’’ అని. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమ పాపాల బరువును తమ వీపులపై మోస్తూ ఉంటారు. చూడండి! వారు మోస్తూవున్న బరువు ఎంత చెడ్డదో! ఇహలోక జీవితం ఒక ఆట, ఒక తమాషా మాత్రమే.  వాస్తవానికి నష్టం నుండి తప్పించుకొనగోరే వారికి పరలోకవాసమే అత్యంత శ్రేష్ఠమైనది. అయితే మీరు బుద్ధిని ఉపయోగించరా?

6. అల్అన్ఆమ్ 33 - 36 ప్రవక్తా! ప్రజలు కల్పించే మాటలవల్ల నీకు బాధ కలుగుతుందనే విషయం మాకు బాగా తెలుసు. కాని వారు తిరస్కరించేది నిన్ను కాదు. దుర్మార్గులు వాస్తవానికి తిరస్కరిస్తున్నది అల్లాహ్ ఆయతులనే. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు తిరస్కరించబడ్డారు. కాని వారు తిరస్కారానికి, తాము గురిచెయ్యబడిన వ్యధలకు సహనం వహించారు. చివరకు మా సహాయం వారికి అందింది. అల్లాహ్ మాటలను మార్చేశక్తి ఎవరికీ లేదు. పూర్వపు ప్రవక్తలకు జరిగినదాని సమాచారాలు నీకు ఇదివరకే అందాయి.  అయినా ఒకవేళ నీకు వారి వైముఖ్యాన్ని భరించటం కష్టంగా ఉంటే, నీకు గనక శక్తివుంటే, భూమిలో ఒక సొరంగాన్ని వెదకి లేదా ఆకాశానికి నిచ్చెనవేసి, వారివద్దకు ఏదైనా సూచనను తీసుకొనివచ్చే ప్రయత్నం చెయ్యి. అల్లాహ్ గనక కోరివుంటే, వారందరినీ సన్మార్గంపై చేర్చి ఉండేవాడే. కనుక నీవు అవివేకివి కావద్దు. వినేవారు మాత్రమే సత్య సందేశాన్ని స్వీకరిస్తారు. ఇక మృతుల విషయం, అల్లాహ్ వారిని నేరుగా గోరీల నుండి లేపుతాడు. తరువాత వారు (ఆయన న్యాయస్థానంలో హాజరు అయ్యేందుకు) తిరిగి తీసుకొని రాబడతారు.

6. అల్అన్ఆమ్ 37 - 41 ‘‘ ప్రవక్తపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజేయ బడలేదు?’’ అని వారు అడుగుతారు. అను: ‘‘అల్లాహ్ కు సూచనను అవతరింపజేసే శక్తి పూర్తిగా ఉంది’’ అని. అయితే వారిలో అనేకులు అజ్ఞానంలో పడివున్నారు. భూమిపై సంచరించే జంతువు నైనా, గాలిలో రెక్కలతో ఎగిరే పక్షినైనా చూడండి. ఇవన్నీ మీవంటి జీవరాసులే. వాటి విధివ్రాత ఉన్న గ్రంథంలో మేము కొరతా చెయ్యలేదు. తరువాత ఇవన్నీ తమ ప్రభువు వద్ద ప్రోగుచెయ్యబడేవే. అయితే మా సూచనలను తిరస్కరిస్తూ ఉన్నవారు చెవిటివారు, మూగవారు, చీకట్లలో పడివున్నవారు. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తాను కోరిన వారిని రుజుమార్గవర్తనులుగా చేస్తాడు. వారితో ఇలా అను: ‘‘కొంచెం ఆలోచించి చెప్పండి:  ఎప్పుడైనా అల్లాహ్ తరఫు నుండి ఏదైనా పెద్ద ఆపద మీపై వచ్చిపడినప్పుడు లేదా చివరి గడియయే దాపురించినప్పుడు, మీరు అల్లాహ్ను తప్ప మరెవ్వర్నయినా పిలుస్తారా? చెప్పండి, మీరు సత్యవంతులే అయితే. అప్పుడు మీరు అల్లాహ్ నే పిలుస్తారు. ఆయన గనక కోరితే ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అటువంటి సందర్భాలలో మీరు నిలబెట్టిన దైవత్వపు భాగస్వాములను మీరు మరచిపోతారు.’’

6. అల్అన్ఆమ్ 42 - 45 మీకు పూర్వం అనేక జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపాము. జాతులను మేము కష్టాలకు, కడగండ్లకు గురిచేశాము, వారు మా ముందు వినయంతో తలవంచాలని. మా తరఫునుండి వారిపైకి ఆపద వచ్చిపడినప్పుడు వారు ఎందువల్ల వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరీ కఠినమయ్యాయి. షైతాను, ‘‘మీరు చేసేదంతా బాగానే ఉంది’’ అని వారిని నమ్మించాడు. తరు వాత వారు తమకు చెయ్యబడిన హితోపదేశాన్ని విస్మరించినప్పుడు, మేము వారికొరకు సకల భోగభాగ్యాల ద్వారాలను తెరిచాము. చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వారు ప్రతి మేలు విషయంలో హతాశులయ్యారు. విధంగా దుర్మార్గానికి పాల్పడినవారిని సమూలంగా నిర్మూలించటం జరిగింది. సకల లోక ప్రభువైన అల్లాహ్యే స్తుతికి పాత్రుడు. (ఆయన వారిని సమూలంగా నాశనం చేశాడు).

6. అల్అన్ఆమ్ 46 - 49 ప్రవక్తా!  వారితో  ఇలా అను: ‘‘మీరెప్పుడైనా ఆలోచించారా, అల్లాహ్ మీ చూపును మీ వినికిడిని మీనుంచి లాక్కుంటే, మీ హృదయాలకు ముద్రవేస్తే, మళ్ళీ మీకు శక్తులను అల్లాహ్ తప్ప తిరిగి ఇవ్వగల మరొక దేవుడెవడున్నాడు?’’ చూడు! ఏవిధంగా మేము మాటిమాటికీ మా సూచనలను వారికి తెలుపుతామో, మరేవిధంగా వారు వాటి నుండి తమ దృష్టిని మరల్చుకుంటారో! ఇలా అను : ‘‘మీరెప్పుడైనా యోచించారా, అల్లాహ్ తరఫునుండి అకస్మాత్తుగానో, బహిరంగంగానో మీపై శిక్ష అవతరిస్తే, అప్పుడు దుర్మార్గులు తప్ప మరెవరైనా నాశనమవుతారా? మేము ప్రవక్తలను పంపేది, వారు సచ్చరిత్రులకు సంతోష వార్తను ఇచ్చేవారు, దుశ్చరిత్రులను భయపెట్టేవారు కావాలని. కనుక, వారి మాట విని, తమ నడవడికను సంస్కరించుకునే వారికి భయంకానీ విచారంకానీ కలిగే అవకాశం లేదు. కాని మా ఆయతులు అసత్యాలని తిరస్కరించేవారు తమ అవిధేయతలకు ఫలితంగా శిక్ష తప్పకుండా అనుభవిస్తారు.

6. అల్అన్ఆమ్ 50 ప్రవక్తా! వారితో ఇలా అను:  ‘‘నా  వద్ద అల్లాహ్ నిధి నిక్షేపాలు ఉన్నాయనిగానీ, నాకు అగోచర జ్ఞానం కలదనిగానీ, నేను మీతో చెప్పటం లేదు. ఇంకా నేను దైవదూతనని కూడా అనటం లేదు. నేను కేవలం నాపై అవతరింపచేయబడే వహీని మాత్రమే అనుసరిస్తాను.’’ వారిని అడుగు : ‘‘గ్రుడ్డివాడూ కళ్ళు ఉన్నవాడూ ఇద్దరూ ఒకటి కాగలరా? మీరు అసలు ఆలోచించరా?’’ అని.

6. అల్అన్ఆమ్ 51 - 55 ప్రవక్తా! తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి, సహాయం చేసే (అధికారం కల) వాడుగానీ లేదా తమ కొరకు సిఫారసు చేసేవాడుగానీ ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసివస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని (వహీ జ్ఞానం) ద్వారా ఉపదేశించు. బహుశా వారు ( ఉపదేశం వల్లనైనా జాగరూకులై) భయభక్తుల వైఖరి అవలంబి స్తారేమో! రేయింబవళ్ళూ తమ ప్రభువును వేడుకునేవారినీ ఆయన ప్రసన్నతను పొందగోరే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నవారినీ నీవు దూరంగా తొలగిపొమ్మనకు. వారికి సంబంధించిన లెక్కలోని విషయాన్ని గురించిన భారమూ నీపై లేదు. నీకు సంబంధించిన లెక్కలోని విషయాన్ని గురించిన భారమూ వారిపై లేదు. దీని తరువాత కూడ నీవు గనక వారిని దూరంగా త్రోసివేస్తే దుర్మార్గులలో చేరిపోతావు. అసలు మేము విధంగా వారిలోని కొందరిని కొందరి ద్వారా పరీక్షకు గురిచేశాము. వారు వీరిని చూసి,  ‘‘మా  మధ్య  అల్లాహ్ దయాదాక్షిణ్యాలను పొందిన వారు వీరేనా?’’ అని అనేందుకు - అవును! అల్లాహ్, కృతజ్ఞతలు చూపే తన భక్తులను వీరికంటే బాగా ఎరుగడా? మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు, వారితో ఇలా అను : ‘‘మీకు శాంతి సమకూరుగాక! మీ ప్రభువు తనపై దయాదాక్షిణ్యాలను విధించుకున్నాడు. (కేవలం ఆయన కృపవల్లనే), ఒకవేళ మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదైనా చెడుచేసి, తరువాత పశ్చాత్తాపపడి సంస్కరించుకుంటే, ఆయన అతనిని క్షమిస్తాడు. అతని పట్ల ఉదారంగా వ్యవహరిస్తాడు.’’ విధంగా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము. అపరాధుల మార్గం పూర్తిగా విస్పష్టం కావాలని.

6. అల్అన్ఆమ్ 56 - 62  ప్రవక్తా!  వారితో ఇలా అను: ‘‘అల్లాహ్ను కాక మీరు వేడుకునే ఇతరులకు దాస్యం చెయ్యటం నాకు నిషేధించబడిరది.’’ ఇలా అను : ‘‘నేను మీ కోరికలను అనుసరించను. అలా చేసినట్లయితే, నేను మార్గభ్రష్టుడనయిపోతాను. సన్మార్గం పొందిన వారిలో ఉండను.’’ అను : ‘‘నా ప్రభువు వద్ద నుండి వచ్చిన ఒక సుస్పష్టమైన ప్రమాణం విషయంలో నేను స్థిరంగా ఉన్నాను. మీరు దానిని అసత్యమని తిరస్కరించారు. ఇప్పుడు మీరు తొందరపెడుతున్న విషయం మాత్రం నా అధీనంలో లేదు. నిర్ణయాధికారం పూర్తిగా అల్లాహ్కే ఉంది. ఆయనే సత్య విషయాన్ని ప్రకటిస్తాడు. ఆయనే ఉత్తమ నిర్ణయం చేసేవాడు.’’ ఇలా అను: ‘‘మీరు తొందరపెట్టే విషయం నా అధీనంలోనే గనక ఉన్నట్లయితే, నాకూ మీకూ మధ్య ఎప్పుడో తీర్పు జరిగిపోయి ఉండేది. కాని దుర్మార్గుల పట్ల ఎలా వ్యవహరించాలో అల్లాహ్ కు బాగా తెలుసు. అగోచరాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప ఎవరూ ఎరుగరు. భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. చెట్టునుండి ఆకైనా ఆయనకు తెలియకుండా రాలదు. భూమిలోని చీకటి పొరలలో ఉన్న గింజైనా ఆయనకు తెలియకుండా లేదు. తడిగా ఉన్నదీ, పొడిగా ఉన్నదీ అంతా ఒక విపులమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆయనే రాత్రివేళ మీ ఆత్మలను వశపరచుకుంటాడు. పగటివేళ మీరు చేసేదంతా ఆయన తెలుసుకుంటాడు. మళ్ళీ రెండోరోజు ఆయన మిమ్మల్ని వ్యవహార ప్రపంచంలోకి తిరిగి పంపుతాడు, మీ నిర్ణీత జీవిత కాలం పూర్తికావటానికి. చివరకు మీరు ఆయన వైపునకే మరలిపోవాలి. అప్పుడు ఆయన మీకు మీరు చేస్తూ ఉన్నదంతా చూపుతాడు. తన దాసులపై ఆయనకు పూర్తి అధికారం ఉంది. మిమ్మల్ని కనిపెట్టి ఉండేవారిని నియమించి పంపుతాడు. చివరకు మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన పంపిన దూతలు అతని ప్రాణం తీసుకుంటారు. తమ కర్తవ్య నిర్వహణలో వారు ఏమాత్రం అజాగ్రత్త చూపరు. మళ్ళీ వారంతా తమ నిజమైన ప్రభువు,  అల్లాహ్  సన్నిధికి మరలింపబడతారు. తెలుసుకోండి, తీర్పు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉన్నాయి. లెక్కను తీసుకోవటంలో ఆయన వడిగలవాడు.’’

6. అల్అన్ఆమ్ 63 - 67 ప్రవక్తా! వారిని ఇలా అడుగు: ‘‘భూసముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు (ఆపద సమయంలో) కడు దీనంగా విలపిస్తూ అతి గోప్యంగా వేడుకొనేది ఎవరిని? ఉపద్రవం నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే, మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో?’’ - ఇలా అను : ‘‘అల్లాహ్ మీకు దానినుండీ ప్రతి బాధనుండీ విముక్తి కలిగిస్తాడు. తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారు.’’ ఇలా చెప్పు : ‘‘ఆయనకు శక్తి ఉంది - ఏదైనా శిక్షను పైనుండి మీపై అవతరింపచేయగలడు లేదా మీ పాదాల కింద నుండి తీసుకురాగలడు లేదా మిమ్మల్ని వర్గాలుగా విభజించి ఒక వర్గం బలాన్ని మరొక వర్గానికి రుచి చూపించగలడు.’’ చూడండి! వారు బహుశా సత్యాన్ని గ్రహిస్తారని, మేము ఏవిధంగా మా సూచనలను మాటిమాటికీ రకరకాలుగా వారి ముందు పెడుతున్నామో! అది సత్యం అయినా, మీ జాతి దాన్ని తిరస్కరిస్తోంది. వారితో ఇలా చెప్పు : ‘‘నేను మీ ప్రవర్తనకు బాధ్యుడనుగా నియమింపబడలేదు. ప్రతి వార్త నిజం కావడానికి ఒక గడువు అంటూ నిర్ణయమై ఉంది. త్వరలోనే స్వయంగా మీకే ఫలితమేమిటో తెలిసిపోతుంది.’’

6. అల్అన్ఆమ్ 68 - 70 ప్రవక్తా! ప్రజలు గనక మా ఆయతులలో తప్పులెన్నటాన్ని నీవు గమనిస్తే వారిమధ్య నుండి తొలగిపో, వారు ప్రస్తావనను వదలిపెట్టి మరో విషయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టేవరకు. ఒకవేళ నిన్ను షైతాను ఎప్పుడైనా ఏమరిపాటుకు గురిచేస్తే, నీవు పొరపాటును గ్రహించిన తరువాత, మళ్ళీ అటువంటి దుర్మార్గుల వద్ద కూర్చోవద్దు. వారి లెక్కలోని విషయానికీ భయభక్తులు కలవారు బాధ్యులు కారు. అయితే హితవు గరపటం వారి విధి. బహుశా వారు చెడునడతను మానుకుంటారేమో! తమ ధర్మాన్ని ఒక క్రీడగా, ఒక తమాషాగా భావించినవారిని ఇహలోక జీవితం మాయకు గురిచేసిన వారిని నీవు వదలిపెట్టు. కాని ఖురానును వినిపించి హితబోధ చెయ్యి. హెచ్చరిక చేస్తూ ఉండు. ఎందుకంటే, వ్యక్తీ తాను చేసిన చేష్టల దుష్ఫలితంలో చిక్కుకోకూడదు. చిక్కుకోవటం కూడా అల్లాహ్  నుండి  రక్షింపగల సహాయకుడూ, రక్షకుడూ, ఇంకా సిఫారసు జేసేవాడూ ఎవడూ లేని స్థితిలో,  ఇంకా అతడు సాధ్యమైన ప్రతిదానినీ పరిహారంగా ఇచ్చి విడుదల కావాలని కోరినా, అది కూడా అతడి నుండి స్వీకరించబడని స్థితిలో. ఎందుకంటే అటువంటివారు స్వయంగా తాము సంపాదించిన దాని ఫలితంగా పట్టుకోబడతారు. వారికి తమ సత్య నిరాకరణకు ప్రతిఫలంగా కాగే నీరు త్రాగటానికీ, వ్యధాభరితమైన శిక్ష అనుభవించటానికీ దొరుకుతాయి.

6. అల్అన్ఆమ్ 71 - 73 ప్రవక్తా! వారిని ఇలా అడుగు : అల్లాహ్ను వదలిపెట్టి, మాకు లాభంకానీ, నష్టంకానీ కలిగించలేని వారిని మేము వేడుకోవాలా? అల్లాహ్ మాకు రుజుమార్గం చూపిన తరువాత మేము ముందుకువేసిన అడుగును వెనక్కి తిప్పుకోవాలా? షైతానులు ఎడారిలో దారి తప్పించగా సహచరులు ఇటురా, సరైన మార్గం ఇక్కడుంది’, అని పిలుస్తూ ఉన్నప్పటికీ గాభరాపడి కలవరపాటుతో తిరుగాడే వాని స్థితి మాదిరిగానే మేము మా స్థితిని కూడా చేసుకోవాలా? వారితో ఇలా అను : ‘‘వాస్తవానికి, నిజమైన మార్గదర్శకత్వం కేవలం అల్లాహ్ మార్గదర్శకత్వమే. ఆయన నుండి మాకు ఆజ్ఞ అందజేయ బడిరది : ‘‘సృష్టి ప్రభువు ముందు విధేయతతో తలవంచండి. నమాజును స్థాపించండి. ఆయనపట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన వైపునకే మీరంతా తీసుకుపోబడతారు.’’ ఆయనే ఆకాశాన్నీ భూమినీ సత్యం ఆధారంగా సృష్టించాడు. ఆయన ప్రళయాన్ని ‘‘అయిపో’’ అని ఆజ్ఞాపించే రోజునే అది సంభవిస్తుంది. ఆయన వాక్కు పూర్తిగా సత్యమైనది. శంఖం ఊదబడే రోజున విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన గోచర అగోచర విషయాలు అన్నీ తెలిసిన జ్ఞాని, అత్యంత వివేకి, సర్వసంవేది.

6. అల్అన్ఆమ్ 74 -82 ఇబ్రాహీము గాధను జ్ఞాపకం తెచ్చుకో.  అతను  తన తండ్రి ఆజరుతో ఇలా అన్నాడు : ‘‘ఏమిటీ నీవు విగ్రహాలను దేవుళ్ళుగా చేస్తున్నావా? నేను నిన్నూ, నీ జాతివారినీ స్పష్టమైన అపమార్గంలో ఉన్నట్లుగా చూస్తున్నాను.’’ ఇదేవిధంగా మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాల పాలనా వ్యవస్థను చూపించేవారము. ఎందుకు చూపేవారమంటే, అతను దృఢంగా విశ్వసించేవారిలో ఒకడు కావాలని. రాత్రి అతనిపై ఆవరించగానే  అతను  ఒక  నక్షత్రాన్ని చూశాడు.  అన్నాడు : ‘‘ఇది నా ప్రభువు’’ అని. కాని అది అస్తమించగానే అతను ‘‘అస్తమించేవాటిని నేను ప్రేమించను’’ అని అన్నాడు. చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించగానే అతను, ‘‘ఇదీ నా ప్రభువు’’ అని అన్నాడు. కాని అదీ అస్తమించగానే ‘‘నా ప్రభువు గనక నాకు మార్గమే చూపి ఉండకపోతే, నేనూ మార్గభ్రష్టులలో కలసిపోయి ఉండేవాణ్ణే’’ అని అన్నాడు. తరువాత అతను సూర్యుణ్ణి ప్రకాశిస్తూ ఉండగా చూసి, ‘‘అసలు ఇదీ నా ప్రభువు! ఇది అన్నిటికంటే పెద్దది’’ అని పలికాడు. కాని అది కూడా అస్తమించగానే ఇబ్రాహీము ఎలుగెత్తి ఇలా ప్రకటించాడు: ‘‘నా జాతి సోదరులారా! మీరు దైవానికి భాగస్వాములుగా నిలబెట్టే వాటన్నింటి తోనూ నాకు ఏవిధమైన సంబంధం లేదు. నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమ్యాకాశాలను సృష్టించిన శక్తివైపునకు త్రిప్పుకున్నాను. నేను షిర్కుకు ఒడిగట్టే వారిలోని వాణ్ణి ఎంతమాత్రం కాను.’’ అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో ఇలా అన్నాడు : ‘‘మీరు అల్లాహ్ విషయంలో నాతో కలహిస్తున్నారా? వాస్తవానికి ఆయన నాకు  రుజుమార్గం చూపించాడు. మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం ప్రతిదానినీ ఆవరించి ఉన్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి? వాటి విషయంలో అల్లాహ్ మీపై ప్రమాణాన్నీ అవతరింప చేయనప్పటికీ వాటిని మీరు ఆయనతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు? మన ఉభయ పక్షాలలో ఎవరు నిర్భయత్వానికీ, ప్రశాంతతకూ ఎక్కువ అర్హులో మీకేమైనా తెలిస్తే చెప్పండి? వాస్తవానికి విశ్వసించిన వారికే, తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయనివారికే శాంతి, వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నారు.

6. అల్అన్ఆమ్ 83 ఇదీ మా తర్కము. దానినే మేము ఇబ్రాహీముకు, తన జాతికి వ్యతిరేకంగా ప్రసాదించాము. మేము కోరినవారికీ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. సత్యం ఏమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు.

6. అల్అన్ఆమ్ 84 - 90 మేము తరువాత ఇబ్రాహీముకు, ఇస్హాఖ్, యాఖూబ్వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము రుజుమార్గం చూపించాము. ( రుజుమార్గాన్నే) వారికి పూర్వం నూప్ాకు చూపాము. ఇంకా అతని సంతతి లోనివారైన దావూదు, సులైమాన్, అయ్యూబ్, యూసుఫ్, మూసా హారూన్లకు మేము (సన్మార్గం చూపించాము).    విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఇస్తాము. (అతని సంతతికి చెందిన) జకరియ్యా, యప్ాయా, ఈసా ఇల్యాస్లకు (మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. (ఇంకా ఆయన కుటుంబానికే చెందిన) ఇస్మాయీలు, అల్యస్, యూనుస్, లూత్లకు (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము భూలోక వాసులందరిపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాత ముత్తాతలనూ వారి సంతానాన్నీ వారి తోబుట్టువులలో చాలా మందినీ మేము అనుగ్రహించాము. వారిని మా సేవకొరకు ఎన్నుకున్నాము. వారికి రుజుమార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దానిద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. కాని వారు ఒకవేళ షిర్కు చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేదే. మేము గ్రంథాన్నీ, ఆజ్ఞనూ, ప్రవక్త పదవినీ ప్రసాదించిన వారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే (ఫర్వాలేదు) మేము అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము. వారు దానిని తిరస్కరించేవారు కారు. ప్రవక్తా! వారే అల్లాహ్ తరఫు నుండి మార్గదర్శకత్వం పొందినవారు. వారి మార్గాన్నే నీవు అనుసరించు. ప్రకటించు : ‘‘నేను (ధర్మంయొక్క ప్రచార, ప్రబోధ) కార్యానికిగాను మీనుండి ప్రతిఫలాన్నీ ఆశించటం లేదు. ఇది ఒక హితబోధ, సమస్త భూప్రజ కొరకు’’ అని.

6. అల్అన్ఆమ్ 91 - 94  ‘‘అల్లాహ్  మానవుడిపైనా దేనినీ అవతరింపచెయ్యలేదు’’ అని పలికి ప్రజలు అల్లాహ్ను గురించి చాలా తప్పుడుగా అంచనావేశారు. వారిని అడుగు : ‘‘అయితే మూసా తెచ్చిన గ్రంథం - అది సమస్త మానవజాతికి జ్యోతి, మార్గదర్శకత్వం, దానిని మీరు ముక్కలు ముక్కలుగా చేసి ఉంచుతారు, కొంతభాగాన్ని చూపిస్తారు, ఎక్కువ భాగాన్ని దాస్తారు, దాని ద్వారా మీకూ, మీ తాత ముత్తాతలకూ లేని జ్ఞానసంపద మీకు ఇవ్వబడిరది, అసలు దాన్ని అవతరింపజేసిన వాడెవడు? ఆయన ‘‘అల్లాహ్’’ అని మాత్రం చెప్పండి.   ఆపై   వారిని  తమ కుతర్కాలతో ఆడుకోవటానికి వదిలెయ్యండి. ( గ్రంథం మాదిరిగా) ఇది కూడా మేము అవతరింపజేసిన ఒక  గ్రంథం. అది ఎనలేని శుభాలు, మేళ్ళు కలది. తనకు పూర్వం వచ్చిన దానిని ధ్రువీకరిస్తుంది. దాని ద్వారా నీవు పురముల కేంద్రం (అంటే మక్కా) లోనూ దాని చుట్టుపట్లా ఉండేవారినీ హెచ్చరిక చెయ్యటానికి అది అవతరింపచెయ్యబడిరది. పరలోకాన్ని నమ్మేవారు గ్రంథాన్ని విశ్వసిస్తారు. వారు తమ నమాజులను నియమం తప్పకుండా చేస్తారు. అబద్ధపు అపనిందను సృష్టించి అల్లాహ్ పై మోపే వాడికంటే, తనపై వహీ అవతరించకపోయినప్పటికీ ‘‘నాపై వహీ అవతరించింది’’ అని చెప్పేవాడి కంటే లేదా అల్లాహ్ అవతరింపచేసినటువంటి విషయాలనే ‘‘నేను కూడా అవతరింపచేసి చూపిస్తాను’’ అని పలికేవాడికంటే మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి ‘‘ఇటు తెండి! బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ ఫలితంగా రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడు తుంది’’ అని అంటూ ఉండగా దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది! (అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): ‘‘మేము మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు ఒంటరిగా మాముందు హాజరయ్యారు. మేము ప్రపంచంలో మీకు ఇచ్చినదంతా, మీరు అక్కడే వదలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మీ వెంట మీ పనులు నెరవేరడంలో కొంత పాత్ర ఉందని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా మేము చూడటం లేదు. ఇప్పుడు మీ మధ్య సంబంధాలు అన్నీ తెగిపోయాయి. ఎవరిని గురించి మీరు గర్వపడేవారో వారందరూ మీకు కనుమరుగై పోయారు.’’

6. అల్అన్ఆమ్ 95 - 103 విత్తనాన్నీ, టెంకనూ చీల్చేవాడు అల్లాహ్. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దానినుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైనదానిని సజీవమైనదానినుండి విసర్జింపచేసేవాడూ ఆయనే. పనులన్నీ చేసేవాడు అల్లాహ్యే. అటువంటప్పుడు మీరు మార్గంతప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికితీస్తాడు. ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు. ఆయనే సూర్యచంద్రుల ఉదయాస్తమయాల కాలాలను నిర్ణయించాడు. ఇవన్నీ అపూర్వ శక్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే.  ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో, సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు.  చూడండి, మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము. ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణినుండి పుట్టించాడు. ఇంకా ప్రతి ఒక్కరికీ ఒక నివాస స్థలం ఉంది. అప్పగించబడే ఒక స్థలం ఉంది. విజ్ఞత ఉన్నవారి కొరకు మేము సూచనలను స్పష్టపరిచాము. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. దానిద్వారా సకల వృక్ష జాతులను ఉద్భవింపజేశాడు. ఇంకా పచ్చని పొలాలనూ పచ్చని చెట్లనూ సృష్టించాడు. ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండిరచాడు. ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూను, దానిమ్మ తోటలను సృష్టించాడు. వాటి పండ్లు ఒకదానినొకటి పోలివుండినప్పటికీ ప్రతిదాని ప్రత్యేకతలు వేర్వేరుగా కూడా ఉంటాయి. వృక్షాలు పంటకు వచ్చినప్పుడు, వాటికి పండ్లు కాయటం, అవి పండటం - స్థితిని మీరు కొంచెం ఆలోచనా దృష్టితో గమనించండి. విశ్వసించే వారికి వీటిలో సూచనలు ఉన్నాయి. అయినా ప్రజలు జిన్నాతులను అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టారు. వాస్తవానికి ఆయన వాటి సృష్టికర్త. తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను, కూతుళ్లను కల్పించారు. యథార్థానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు, వారు చెప్పే మాటలకు అతీతుడు. ఆయన ఆకాశాలను, భూమినీ ప్రభవింపజేసినవాడు. ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించీ తెలుసు. ఆయనే అల్లాహ్. మీ ప్రభువు. ఆయన తప్ప  మరొక  దేవుడు లేడు.  ఆయన సర్వానికీ సృష్టికర్త. కనుక మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతిదానికీ సంరక్షకుడు. చూపులు ఆయనను అందుకోలేవు. ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మద్రష్ట, సర్వజ్ఞాని.

6. అల్అన్ఆమ్ 104 చూడండి! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి వివేచనా కాంతులు వచ్చేశాయి. కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు. మరి గ్రుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తానే నష్టపోతాడు. నేను మాత్రం మీకు కావలివాణ్ణి కాను.

6. అల్అన్ఆమ్ 105 - 108 ఈవిధంగా మేము మా ఆయతులను మాటిమాటికీ విభిన్నరీతులలో వివరిస్తూ ఉంటాము. ఎందుకిలా చేస్తామంటే, ప్రజలు, ‘‘నీవు ఎవరివద్దనో పాఠాలు నేర్చుకుని వచ్చావు’’ అని అనాలని, ఇంకా మేము విజ్ఞులైన వారికి యథార్థాన్ని విశదపరచాలని. ప్రవక్తా! నీపై నీ ప్రభువు తరఫు నుండి అవతరించిన వహీని అనుసరిస్తూ ఉండు. ఎందుకంటే, ప్రభువు ఒక్కడు తప్ప మరొక దేవుడు లేనేలేడు. ముష్రిక్కులను పట్టించుకోకు. అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే, (స్వయంగా ఆయనే ఏర్పాటుచేసి ఉండేవాడంటే) వారు షిర్కు చేసేవారు కాదు. మేము నిన్ను వారికి కావలివానిగా నియమించనూ లేదు, నీవు వారికి బాధ్యుడవూ కావు. (ముస్లిములారా!) వారు అల్లాహ్ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే, వారు షిర్కుకంటే ఇంకా ముందుకుపోయి అజ్ఞానంచేత అల్లాహ్ను దూషిస్తారేమో. విధంగానే మేము ప్రతి వర్గం వారికి వారు చేసే పనులు ఆకర్షకంగా ఉండేలా చేశాము. వారు తరువాత తమ ప్రభువు వైపునకే మరలి రావలసి ఉంది. అప్పుడు ఆయన వారికి తెలుపుతాడు, వారు ఏమేమి చేస్తూ ఉండేవారో.

6. అల్అన్ఆమ్ 109 - 115 ప్రజలు గట్టి ప్రమాణాలు చేస్తూ ఇలా అంటారు : ‘‘మా ముందుకు ఏదైనా సూచన (అంటే ఒక అద్భుతం) వస్తే, మేము దానిని తప్పక విశ్వసిస్తాము.’’ ప్రవక్తా! వారికి చెప్పు : ‘‘సూచనలు అల్లాహ్ వశంలోనే ఉన్నాయి’’ అని. ఒకవేళ సూచనలు వచ్చినా, వారు విశ్వసించేవారు కారు అని నీకు ఎలా బోధపరచాలి? మొట్టమొదట వారు దానిని ( గ్రంథాన్ని) విశ్వసించనివిధంగానే మేము వారి హృదయాలను, వారి చూపులను ఇప్పుడు మళ్ళిస్తున్నాము, మేము వారిని తమ తలబిరుసుతనంలోనే దారితప్పి తిరిగేలా వదలివేస్తాము. మేము వారిపై దైవదూతలను సైతం అవతరింపజేసినా, మరణించినవారు వారితో మాట్లాడినా, మేము వారి కళ్ళముందు ప్రపంచంలోని వస్తువులు ఎన్నింటిని ప్రోగుజేసి పెట్టినా, అప్పుడుకూడా వారు విశ్వసించేవారు కాదు, (వారు విశ్వసించాలని) అల్లాహ్ సంకల్పిస్తే తప్ప. కాని వారిలో చాలామంది అజ్ఞానపు మాటలు పలుకుతారు. మేము ఇదేవిధంగా ఎల్లప్పుడూ మానవ షైతానులను జిన్నాతు షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. ప్రజలను వంచించే నిమిత్తం వారు సొంపైన మాటలను పరస్పరం ప్రేరేపించుకుంటారు. వారు విధంగా చెయ్యకూడదని నీ ప్రభువు సంకల్పమేఅయితే, వారు ఎన్నటికీ అలా చెయ్యరు. కనుక వారిని వారి మానాన వదలిపెట్టు, అబద్ధపు నిందారోపణలు చేయటానికి. (మేము వారిని ఇదంతా ఎందుకు చెయ్యనిస్తున్నామంటే) పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు (అందమైన మోసం) వైపునకు మొగ్గాలని, వారు అదంటే ఇష్టపడాలని, వారు తాము ఆర్జించుకోదలచిన చెడులను ఆర్జించుకోవాలని - పరిస్థితి ఇదైనప్పుడు నేను అల్లాహ్ను కాదని తీర్పు చెప్పే మరొకడికోసం అన్వేషించాలా, వాస్తవానికి ఆయన పూర్తి వివరాలతో మీ వద్దకు గ్రంథాన్ని పంపినప్పుడు? మేము (నీకు పూర్వం) గ్రంథం ఇచ్చిన వారికి తెలుసు, గ్రంథం నీ ప్రభువు తరఫునుండే సత్యం ఆధారంగా అవతరించిందని. కనుక నీవు శంకించేవారిలో చేరిపోకు. సత్యం రీత్యా న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది. ఆయన ఆదేశాలను మార్చేవాడు ఎవడూ లేడు. ఆయన అన్నీ వింటాడు. ఆయనకు అంతా తెలుసు.

6. అల్అన్ఆమ్ 116 - 117 ప్రవక్తా! ఒకవేళ పుడమిపై నివసించే ప్రజలలో అధికసంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే, వారు నిన్ను  అల్లాహ్ మార్గం నుండి తొలగిస్తారు. వారు కేవలం అంచనాలను అనుసరిస్తారు, ఊహాకల్పనలుచేస్తారు,  వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు, ఎవరు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నారో, ఎవరు రుజుమార్గంపై ఉన్నారో.

6. అల్అన్ఆమ్ 118 - 121 ఇక మీకు అల్లాహ్ ఆయతులపై విశ్వాసమే ఉంటే, అల్లాహ్ నామం స్మరించబడిన పశువు మాంసం తినండి. అల్లాహ్ పేరు స్మరించబడిన వస్తువును మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి? వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇదివరకే తెలియజేశాడు. చాలామంది ప్రజలు జ్ఞానం లేకపోయినా కేవలం తమ కోరికలకు లోనయి అపమార్గం పట్టించే విషయాలను మాట్లాడుతూ ఉంటారు. హద్దులు మీరే వారిని నీ ప్రభువు బాగా ఎరుగును. మీరు బహిరంగ పాపాలకూ దూరంగా ఉండండి. రహస్య పాపాలకూ దూరంగా ఉండండి. పాపాలను సంపాదించుకునే వారు తమ సంపాదనకు ప్రతిఫలం పొందితీరుతారు. అల్లాహ్ పేరుతో జిబహ్చెయ్యబడని జంతువు మాంసం తినకండి. అలా చెయ్యటం పాపం. మీతో కయ్యానికి దిగటానికిగాను షైతానులు తమ సహచరుల మనస్సులలో అనుమానాలను, అభ్యంతరాలను ప్రేరేపిస్తారు. కాని ఒకవేళ మీరు వారిపట్ల విధేయత చూపటానికి అంగీకరిస్తే నిశ్చయంగా మీరూ ముష్రిక్కులే.

6. అల్అన్ఆమ్ 122 - 123 మొదట మృతుడై, మేము ప్రాణంపోసి జ్యోతిని ప్రసాదించగా, దాని వెలుగులో ప్రజల మధ్య జీవన యాత్ర కొనసాగించే వ్యక్తీ, చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏవిధంగానూ బయటకు రాలేని వ్యక్తీ ఒకటే అవుతారా? ఇదేవిధంగా అవిశ్వాసులకు వారి పనులు మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి. ఇంకా ఇదేవిధంగా  మేము ప్రతి పట్టణంలోనూ దానిలో ఉన్న పెద్ద పెద్ద నేరస్తులను అక్కడ తమ కుతంత్రాలు, వంచనలు అనే వలను పరచటానికి నియమించాము. వాస్తవానికి వారు తమ కుతంత్రాల వలలో తామే ఇరుక్కుంటారు. కాని వారికి దాని స్పృహలేదు.

6. అల్అన్ఆమ్ 124 వారి ముందుకు ఏదైనా ఆయత్వచ్చినప్పుడు వారు, ‘‘అల్లాహ్ ప్రవక్తలకు ఇవ్వబడిరదే, స్వయంగా మాకూ ఇవ్వబడనంతవరకు, మేము విశ్వసించము’’ అని అంటారు. తన సందేశాన్ని ఎవరిద్వారా ప్రచారం చేయించాలో ఎలా చేయించాలో అల్లాహ్కే బాగా తెలుసు. దోషులు తమ కుతంత్రాలకు పర్యవసానంగా అల్లాహ్ వద్ద తీవ్రపరాభవమూ, కఠినశిక్షా అనుభవించే సమయం సమీపంలోనే ఉంది.

6. అల్అన్ఆమ్ 125 - 127 కనుక (యథార్థం ఇది) అల్లాహ్ తాను సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లామ్కొరకు తెరుస్తాడు. తాను అపమార్గం పాలు చెయ్యదలచిన వ్యక్తి హృదయాన్ని సంకుచితం చేసి ఇక దానిని ఎంతగా అదుముతాడంటే (ఇస్లామ్భావన రాగానే) అతనికి తన ఆత్మ ఆకాశానికి ఎగిరిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. విధంగా అల్లాహ్ (సత్యం నుండి పారిపోయే, సత్యాన్ని ద్వేషించే మనస్తత్వం అనే) మాలిన్యాన్ని అవిశ్వాసులపై రుద్దుతాడు. వాస్తవానికి మార్గం నీ ప్రభువు యొక్క రుజుమార్గం. దాని చిహ్నాలు హితబోధను స్వీకరించే వారికొరకు స్పష్టం చెయ్యబడ్డాయి. వారు అవలంబించిన సరియైన ప్రవర్తన కారణంగా వారి ప్రభువు వద్ద వారికొరకు శాంతి నిలయం ఉంది. ఆయన వారికి సంరక్షకుడుగా ఉంటాడు.

6. అల్అన్ఆమ్ 128 - 131 అల్లాహ్ వారందరినీ చుట్టుముట్టి సమావేశపరచే రోజున జిన్నాతులను (అంటే జిన్నాతులలోని షైతానులను) సంబోధిస్తూ ఇలా అంటాడు : ‘‘జిన్నాతు వర్గీయులారా! మీరు మానవ జాతిని పూర్తిగా వాడుకున్నారు.’’ మానవులలోని వారి మిత్రులు ఇలా విన్నవించుకుంటారు : ‘‘ప్రభూ! మేమంతా ఒకరినొకరము బాగా వాడుకున్నాము. నీవు మా కొరకు నిర్ణయించిన సమయానికి మేము ఇప్పుడు చేరుకున్నాము.’’ అల్లాహ్ అంటాడు: ‘‘సరే! ఇక అగ్నియే మీ నివాసం. అందులో మీరు కలకాలం ఉంటారు.’’ కేవలం అల్లాహ్ రక్షించదలచిన వారే దానినుండి సురక్షితంగా ఉంటారు. నిస్సందేహంగా నీ ప్రభువు వివేకవంతుడు, జ్ఞానవంతుడూను. చూడండి! ఈవిధంగా మేము (పరలోకంలో) దుర్మార్గులను ఒకరికొకరు సహచరులుగా చేస్తాము, వారు (ప్రపంచంలో ఒకరితో ఒకరు కలసి) సంపాదించిన సంపాదనకు కారణంగా.  ( తరుణంలో అల్లాహ్ వారిని ఇదీ అడుగుతాడు): ‘‘జిన్నాతులారా! మానవులారా! మా ఆయతులను మీకు వినిపించే ఈనాటి ఫలితాన్ని గురించి హెచ్చరించే ప్రవక్తలు మీ వద్దకు స్వయంగా మీనుండే రాలేదా?’’ వారు ఇలా అంటారు : ‘‘అవును వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాము.’’ ఈనాడు ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కాని ఆనాడు తాము అవిశ్వాసులమని స్వయంగా వారే తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు. ప్రజలు యథార్థమేమిటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రభువు వారి పట్టణాలను అన్యాయంగా నాశనం చెయ్యడు. ( విషయాన్ని నిరూపించటానికే వారిచే ఈవిధంగా సాక్ష్యం చెప్పించటం జరుగుతుంది).

6. అల్అన్ఆమ్ 132 - 135 ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది. నీ ప్రభువు ప్రజల పనులు ఎరుగని వాడు కాడు. నీ ప్రభువు అక్కరా లేనివాడు. కనికరించటం ఆయన స్వభావం. ఒకవేళ ఆయన అభిలషిస్తే, మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలో తాను కోరిన వేరే ప్రజలను తీసుకువస్తాడు, ఆయన మిమ్మల్ని వేరే ప్రజల సంతతి నుండి ఉద్భవింపజేసినవిధంగా. మీకు వాగ్దానం చెయ్యబడుతూ ఉన్న విషయం తప్పకుండా వస్తుంది. దేవుణ్ణి అశక్తుడుగా చేసే శక్తి మీకు లేదు. ప్రవక్తా! ఇలా అను: ‘‘ప్రజలారా! మీరు చేసేపని మీరు చేస్తూ ఉండండి. నేను కూడా నా పనిచేస్తూ ఉన్నాను. ఫలితం ఎవరి విషయంలో మేలైనదిగా ఉంటుందో త్వరలోనే మీకు తెలిసి పోతుంది.’’ ఏమైనప్పటికీ దుర్మార్గులు సాఫల్యం పొందలేరు అనేది వాస్తవం.

6. అల్అన్ఆమ్ 136 అల్లాహ్ కొరకు ప్రజలు స్వయంగా ఆయనే సృష్టించిన పొలాల నుండీ పశువుల నుండీ ఒక భాగాన్ని కేటాయించారు. ఇది అల్లాహ్ కొరకు,  ఇది  మేము నిలబెట్టిన భాగస్వాముల కొరకు అని స్వయంగా తామే తీర్మానించుకుని అంటారు. వారు నిలబెట్టిన భాగస్వాములకు చెందే భాగం అల్లాహ్ కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కు చెందేది మాత్రం వారు నిలబెట్టిన భాగస్వాములకు చేరిపోతుంది. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తారు ప్రజలు!

6. అల్అన్ఆమ్ 137 ఇదేవిధంగా చాలామంది ముష్రిక్కులకు తమ సంతాన హత్యను, వారు నిలబెట్టిన భాగస్వాములు సరైనదిగా కనిపించేలా చేశారు, వారిని వినాశానికి గురిచెయ్యటానికి, వారికి వారి ధర్మం సంశయాస్పద మైనదిగా చెయ్యటానికి.  అల్లాహ్  సంకల్పించి ఉన్నట్లయితే,  వారు ఆవిధంగా చేసి ఉండేవారు కాదు. కనుక వారిని తమ తప్పుడు నిందారోపణలు చేసుకోవటానికి వదిలిపెట్టండి.

6. అల్అన్ఆమ్ 138 ఇలా అంటారు : ‘‘ జంతువులు, పొలాలు ప్రత్యేకించబడ్డాయి. మేము తినిపించదలచిన వారే వీటిని తినగలుగుతారు.’’ వాస్తవానికి కట్టుబాటు వారు స్వయంగా కల్పించుకున్నదే. ఇంకా వారు కొన్ని జంతువులపై స్వారీ చెయ్యటాన్ని, వాటిచే బరువు లాగించటాన్ని నిషేధించారు. మరికొన్ని జంతువులపై వారు అల్లాహ్ నామాన్ని ఉచ్చరించరు. ఇవన్నీ వారు అల్లాహ్ కు అంటగట్టిన అబద్ధాలు. త్వరలోనే అల్లాహ్ తప్పుడు ఆరోపణలకు వారికి ప్రతిఫలం ఇస్తాడు.

6. అల్అన్ఆమ్ 139 ఇంకా ఇలా అంటారు : ‘‘ జంతువుల గర్భంలో ఉన్నది మా పురుషులకు ప్రత్యేకం, మా స్త్రీలకు నిషిద్ధం. కాని అది మరణించినదైతే ఉభయులూ కలసి దానిని తినవచ్చు.’’ వారు కల్పించిన మాటలకు అల్లాహ్ వారికి ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు.

6. అల్అన్ఆమ్ 140 అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల తమ సంతానాన్ని హత్యచేసినవారూ, అల్లాహ్ ఇచ్చిన ఉపాధిని అల్లాహ్ పై అబద్ధాలు మోపి నిషేధించుకున్నవారూ నిశ్చయంగా నష్టానికి గురిఅయ్యారు. నిశ్చయంగా వారు మార్గం తప్పారు. ఎన్నటికీ రుజుమార్గం పొందేవారు కారు.

6. అల్అన్ఆమ్ 141 - 144 అల్లాహ్యే నిటారు చెట్లుగల పలురకాల తోటలనూ, ద్రాక్షతోటలనూ, ఖర్జూరపు తోటలనూ సృష్టించాడు. పొలాలను పండిరచాడు. వాటిద్వారా రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. జైతూను చెట్లనూ దానిమ్మ చెట్లనూ ఉద్భవింపజేశాడు. వాటి పండ్లు రూపంలో ఒకటే. కాని వాటి రుచి వేరు. అవి పండినప్పుడు వాటి పంటను తినండి. వాటి పంటనుకోసేటప్పుడు మీపై ఉన్న అల్లాహ్ హక్కును చెల్లించండి. హద్దులు మీరకండి. హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు. ఇంకా, ఆయనే పశువులలో స్వారీ చెయ్యటానికి, బరువు మొయ్యటానికి, తినటానికి, పరచుకోవటానికి కూడా వినియోగపడే జంతువులను సృష్టించాడు. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిని తినండి. షైతానును అనుసరించకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. ఇవి, మగవీ ఆడవీ కలసి ఎనిమిది. రెండు గొఱ్ఱె జాతినుండి, మరొక రెండు మేక జాతి నుండి. ప్రవక్తా! వారిని ఇలా అడుగు : అల్లాహ్ నిషేధించింది మగ జంతువులనా లేక ఆడజంతువులనా లేక గొఱ్ఱెల గర్భాలలో, మేకల గర్భాలలో ఉన్న పిల్ల జంతువులనా?  మీరు  సత్యవంతులే అయితే నాకు సరియైన జ్ఞానంతో తెలుపండి. ఇదేవిధంగా రెండు ఒంటె జాతిలోనివి,  మరొక రెండు ఆవుజాతిలోనివి. అడుగు వారిని : వీటిలో అల్లాహ్ నిషేధించినవి మగపశువులా లేక ఆడపశువులా లేక ఒంటెల, ఆవుల గర్భాలలో ఉన్న పిల్ల పశువులా? వీటిని నిషేధిస్తూ అల్లాహ్ ఆజ్ఞలు ఇచ్చే సమయంలో మీరు ఉన్నారా? జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించే నిమిత్తం అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదించే వ్యక్తికంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లాహ్ అటువంటి దుర్మార్గులకు రుజుమార్గం చూపడు.

6. అల్అన్ఆమ్ 145 - 147 ప్రవక్తా! వారితో ఇలా అను: నా వద్దకు వచ్చిన వహీలో, తినేవాడికొరకు వస్తువూ నిషేధించబడినట్లు నాకు కనిపించదు, చచ్చిన జంతువు, కారిన రక్తము, పంది మాంసము, ఇది అపరిశుద్ధం గనక, లేక ఫిస్ఖ్‌ (అపచారం), అంటే, అల్లాహ్ పేరుతోకాక వేరేవారి పేరుతో జిబహ్ చెయ్యబడిరది (మొదలైనవి) తప్ప. కాని ఎవరైనా గత్యంతరం లేని పరిస్థితులలో (వీటిలో దేన్నయినా తింటే), అవిధేయతకు ఒడిగట్టే ఉద్దేశం లేకుండా, ఆవశ్యకత హద్దును మీరకుండా ఉంటే, నిశ్చయంగా నీ ప్రభువు మన్నిస్తాడు, కరుణిస్తాడు. యూదుమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులనూ నిషేధించాము. ఆవు, మేకల కొవ్వును కూడా, వాటి వీపునకూ లేక ప్రేగులకూ లేక ఎముకలకూ అంటివున్నది తప్ప.  ఇది మేము వారి తలబిరుసుతనానికిగాను వారికి విధించిన శిక్ష. మేము చెప్పేదంతా పూర్తిగా నిజం.  ఇక, ఒకవేళ వారు నిన్ను తిరస్కరిస్తే, నీవు వారితో ఇలా చెప్పెయ్యి: ‘‘మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. అపరాధులపై పడకుండా ఆయన శిక్షను ఆపటం అసాధ్యం.’’

6. అల్అన్ఆమ్ 148 - 149 ముష్రిక్కు జనులు (మీ మాటలకు బదులుగా) తప్పకుండా ఇలా అంటారు : ‘‘ఒకవేళ అల్లాహ్యే కోరి ఉండినట్లయితే, మేమూ మా పూర్వీకులూ షిర్కుచేసి ఉండేవారమే కాదు. మేము దేనినీ నిషేధించి ఉండేవారము కూడా కాదు. ఇటువంటి మాటలనే మాటిమాటికీ కల్పించి చివరకు వారు మా శిక్షను చవిచూచారు. వారితో ఇలా అను : ‘‘మీ వద్ద ఏదైనా జ్ఞానం ఉందా, మాముందు పెట్టటానికి? మీరు కేవలం అంచనాలను అనుసరిస్తున్నారు. మీరు చేసేవన్నీ వట్టి ఊహాగానాలే.’’ ఇంకా ఇలా అను: ‘‘(మీ వాదానికి భిన్నంగా) సత్యానికి చేర్చేవాదన అల్లాహ్ వద్ద ఉంది. అల్లాహ్ గనక సంకల్పించి ఉన్నట్లయితే నిస్సందేహంగా మీ అందరికీ ఆయన మార్గం చూపి ఉండేవాడు.’’

6. అల్అన్ఆమ్ 150 వారితో ఇలా అడుగు: ‘‘అల్లాహ్యే వస్తువులను నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షు లను తీసుకురండి.’’ ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలసి సాక్ష్యం ఇవ్వకు. మా ఆయతులను అసత్యాలుగా చిత్రించి తిరస్కరించినవారూ, పరలోకాన్ని నిరాకరించినవారూ, ఇతరు లను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టినవారూ - అలాంటి వారి కోరికలను నీవు ఎంతమాత్రం అనుసరించకు.

6. అల్అన్ఆమ్ 151 - 153 ప్రవక్తా! వారికి ఇలా చెప్పు: ‘‘రండి మీకు వినిపిస్తాను, మీ ప్రభువు మీపై విధించిన కట్టుబాట్లు ఏమిటో. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చెయ్యరాదు. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకూ ఉపాధినిస్తున్నాము. వారికీ ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి, బహిరంగమైనవైనా సరే లేక గోప్యమైనవైనా సరే. సత్యంతో తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ప్రాణాన్నీ హతమార్చకండి, విషయాలనే పాటించమని ఆయన మీకు ఉపదేశించాడు, బహుశా మీరు ఆలోచించి పని చేస్తారని. అనాథుల ఆస్తి దరిదాపులకు పోకండి, ఉత్తమమైన రీతిలో తప్ప - వారు యుక్త వయస్సుకు చేరేవరకు. కొలతలో, తూనికలో పూర్తి న్యాయం చెయ్యండి. మేము ప్రతి మనిషిపైనా అతని శక్తిమేరకే బాధ్యతా భారాన్ని మోపుతాము. పలికితే న్యాయమే పలకండి, వ్యవహారం మీ బంధువులకు సంబంధించినది అయినాసరే. అల్లాహ్తో చేసుకున్న ఒడంబడికను నెరవేర్చండి. మాటలను అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు, బహుశా మీరు హితబోధను స్వీకరిస్తారేమో అని. ఇంకా ఆయన ఇలా ఉద్బోధిస్తున్నాడు : నా రుజుమార్గం ఇదే. కనుక మీరు దీనిపైనే నడవండి. వేరే మార్గాలపై  నడవకండి.  ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి విచ్ఛిన్న పరుస్తాయి.  మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే, బహుశా మీరు వక్రవైఖరికి దూరంగా ఉంటారని.

6. అల్అన్ఆమ్ 154 - 158 మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. అది మంచివైఖరిని అవలంబించే మానవుడిపై అనుగ్రహ పరిపూర్తి, ఆవశ్యకమైన సకల విషయాల వివరణ, పూర్తిగా మార్గదర్శకం, పూర్తిగా కారుణ్యం. (ఇది ఇస్రాయీలు వంశీయులకు ఎందుకు ఇవ్వబడిరదంటే) బహుశా ప్రజలు తమ ప్రభువును కలుసుకోవటాన్ని విశ్వసిస్తారని. ఇదేవిధంగా మేము గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణించబడటం సాధ్యం కావచ్చు. ఇక మీరు,  ‘‘మాకు పూర్వం ఉన్న రెండు వర్గాలకు గ్రంథం ఇవ్వబడిరది. వారు ఏమి చదివేవారో, ఏమి చదివించేవారో మాకు తెలియదు’’ అని అనలేరు. ఇంకా మీకు, ‘‘మాపై గనక గ్రంథాన్ని అవతరింపజేసి ఉండినట్లయితే, మేము వారిని మించిన రుజువర్తనులముగా నిరూపించుకునేవారము’’ అని సాకులుచెప్పే ఆస్కారం  కూడా లేదు. మీ వద్దకు  మీ ప్రభువు  తరఫు  నుండి ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం, కారుణ్యం వచ్చేసింది. ఇక అల్లాహ్ ఆయతులు అసత్యాలు అని పలికేవాడికంటే, వాటిపట్ల వైముఖ్యం ప్రదర్శించే వాడికంటే మించిన దుర్మార్గుడెవడు? మా ఆయతులపట్ల విముఖులయ్యే వారికి, వారి వైముఖ్యం ఫలితంగా మేము నీచాతినీచమైన శిక్షను విధించితీరుతాము. దైవదూతలు వచ్చి వారిముందు నిలబడాలనీ లేదా నీ ప్రభువే స్వయంగా రావాలనీ లేదా నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు ప్రత్యక్షం కావాలనీ, ప్రజలు నిరీక్షిస్తున్నారా? నీ ప్రభువు యొక్క ప్రత్యేకమైన సూచనలు కొన్ని ప్రత్యక్షమయ్యే రోజున పూర్వం విశ్వసించకుండా రోజున విశ్వసించిన వ్యక్తికీ, లేదా విశ్వసించి కూడా మంచినీ సంపాదించుకోని వ్యక్తికీ తమ విశ్వాసంవల్ల ప్రయోజనమూ చేకూరదు. ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘సరే, మంచిది. మీరూ నిరీక్షించండి. మేమూ నిరీక్షిస్తున్నాము.’’

6. అల్అన్ఆమ్ 159 - 160 తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ముఠాలుగా చీలిపోయిన వారితో నిశ్చయంగా నీకు సంబంధమూ లేదు. వారి వ్యవహారం అల్లాహ్ అధీనంలో ఉంది. ఆయనే వారికి తెలుపుతాడు, వారు ఏమేమి చేశారో. అల్లాహ్ వద్దకు సత్కార్యాన్ని తీసుకువచ్చే వానికొరకు పదింతలు ప్రతిఫలం ఉంది. దుష్కార్యాన్ని తీసుకువచ్చే వానికి, అతడు ఎంత తప్పు చేశాడో అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ అన్యాయం మట్టుకు జరగదు.

6. అల్అన్ఆమ్ 161 - 165 ప్రవక్తా! ఇలా ప్రకటించు : నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గాన్ని చూపించాడు. అది పూర్తిగా సరియైన ధర్మం. వక్రతా లేనిది, ఇబ్రాహీమ్విధానం, దానిని అతను ఏకాగ్రతతో అవలంబించాడు. అతను ముష్రిక్కులలోని వాడు కాదు. ఇలా అను : ‘‘నా నమాజ్నా సకల ఉపాసనారీతులు, నా జీవనం, నా మరణం-సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వామీ లేడు. ఆజ్ఞయే నాకు ఇవ్వబడిరది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి నేనే.’’ ఇలా అను : నేను అల్లాహ్ను కాదని వేరే ప్రభువును అన్వేషించాలా, ఆయనే ప్రతిదానికీ ప్రభువైనప్పుడు? ప్రతి వ్యక్తీ తాను సంపాదించే దానికి తానే బాధ్యుడు. బరువు మోసేవాడెవడూ ఇతరుని బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీ విభేదాల యథార్థాన్ని మీకు విశదం చేస్తాడు. ఆయనే మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా చేశాడు, మీలో కొందరికి కొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు, మీకు ఇచ్చిన దానితోనే మిమ్మల్ని పరీక్షించాలని. నిస్సందేహంగా మీ ప్రభువు శిక్షించటంలో కూడ వడిగలవాడు. ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడు కూడా.





No comments:

Post a Comment