98 అల్ బయ్యినహ్
ఆయతులు
: 8 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 3
గ్రంథ ప్రజలలోని, బహుదైవారాధకులలోని అవిశ్వాసులు తమ వద్దకు స్పష్టమైన ప్రమాణం వచ్చేవరకు (తమ అవిశ్వాస వైఖరి నుండి) వెనక్కి మరలరు.
(స్పష్టమైన ప్రమాణం అంటే) అల్లాహ్ తరఫు నుండి ఒక ప్రవక్త వచ్చి సత్యమైన సవ్యమైన రచనలు గల పరిశుద్ధమైన సహీఫాలను చదివి వినిపించటం.
4 - 5 పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజలలో చీలికలు ఏర్పడిరది వారి వద్దకు (ఋజుమార్గానికి సంబంధించిన) స్పష్టమైన బోధవచ్చిన తరువాతనే. వారు అల్లాహ్ కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించటం జరిగింది. ఇదే ఎంతో సరిjైున, సవ్యమైన ధర్మం.
6 - 8 గ్రంథ ప్రజలలో, బహుదైవారాధకులలో సత్యాన్ని తిరస్కరించినవారు తప్పనిసరిగా నరకాగ్నిలోకే పోతారు, అందులోనే శాశ్వతంగా ఉండిపోతారు. వారు సృష్టిలోకెల్లా పరమ నీచులు. కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు నిస్సందేహంగా సృష్టిలో అత్యంత శ్రేష్ఠులు. వారికి వారి ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం - శాశ్వత నివాస స్థలాలైన స్వర్గవనాలు, వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి
వారు వాటిలో కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారు కూడ అల్లాహ్ పట్ల సంతృప్తిచెందారు. ఇదీ తన ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండే వ్యక్తికి లభించే మహాభాగ్యం.
No comments:
Post a Comment