27 సూరహ్ అన్‌ నమ్ల్‌

 

27. అన్నమ్ల్

ఆయతులు : 93                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

27. అన్నమ్ల్   1 - 6 తా. సీన్‌. ఇవి ఖురాన్కు, స్పష్టమైన గ్రంథానికి చెందిన వాక్యాలు  విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వం, శుభవార్తలూను. వారు నమాజును స్థాపిస్తారు, జకాత్ను ఇస్తారు ఇంకా వారు పరలోకాన్ని పూర్తిగా నమ్ముతారు. యథార్థం ఏమిటంటే, పరలోకాన్ని విశ్వసించని వారి కొరకు మేము వారి చేష్టలను ఆకర్షవంతమైనవిగా చేశాము. అందువల్ల వారు దారితప్పి తిరుగుతూ ఉంటారు. నీచమైన శిక్షకు గురిఅయ్యేది వారే. పరలోకంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది కూడా వారే. ( ప్రవక్తా!) నిస్సందేహంగా నీవు ఖురాన్ను వివేకవంతుడూ, జ్ఞానసంపన్నుడూ అయిన వానివైపు నుండి పొందుతున్నావు.

27. అన్నమ్ల్   7 - 12 (వారికి అప్పటి గాధను వినిపించు) అప్పుడు మూసా తన ఇంటి వారితో ఇలా అన్నాడు, ‘‘నాకు అగ్నిలాంటిదొకటి కనిపించింది. నేను ఇప్పుడే అక్కడకు పోయి ఏదైనా వార్తను తీసుకువస్తాను లేదా మీరు కాచుకోవటానికి అగ్ని కణాన్నయినా తీసుకువస్తాను.’’ అతను అక్కడకు చేరినప్పుడు, ఒక ధ్వని ఇలా వినిపించింది, ‘‘ అగ్నిలోనూ, దాని పరిసరాలలోనూ ఉన్నవాడు శుభాలు కలవాడు. అల్లాహ్ పరిశుద్ధుడు, సకల లోకాలకు ప్రభువు. మూసా! ఇదిగో, నేను, అల్లాహ్ ను, సర్వశక్తిమంతుడను, వివేకవంతుడను. ఏదీ, నీవు కొంచెం నీ చేతికర్రను విసరివెయ్యి.’’ చేతికర్ర పాము మాదిరిగా కదలాడుతూ ఉండటం చూడగానే, మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనుకకు తిరిగి అయినా చూడలేదు. ‘‘మూసా! భయపడకు. నా సన్నిధిలో ప్రవక్తలు భయపడరు, తప్పు చేసినవారు తప్ప. దుష్కార్యం చేసిన తరువాత అతను గనక దాన్ని సత్కార్యంగా మార్చుకుంటే, అప్పుడు నేను క్షమించే కరుణామయుణ్ణి.  కొంచెం నీ చేతిని చొక్కాలోకి దూర్చు. అది మెరిసిపోతూ ఎలాంటి బాధాలేకుండానే బయటికి వస్తుంది. ఇవి ( రెండు సూచనలు) తొమ్మిది సూచనలలోనివి, ఫిరౌను వద్దకూ అతడి జాతి ప్రజల వద్దకూ (తీసుకు పోయేందుకు ఇవ్వబడినవి) వారు పరమ దుర్మార్గులు.’’

27. అన్నమ్ల్   13 - 14 కాని, స్పష్టమైన మా సూచనలు వారి ముందుకు వచ్చినప్పుడు, వారు ‘‘ఇది స్పష్టమైన మాయాజాలమే’’ అని అన్నారు. వారు అన్యాయంగా,  అహంకారంతో సూచనలను తిరస్కరించారు. అయితే వారి హృదయాలు మట్టుకు వాటిని అంగీకరించాయి. ఇక చూడు దుర్మార్గులకు ఎలాంటి గతి పట్టిందో.

27. అన్నమ్ల్   15 - 19 (మరోవైపు) మేము దావూద్కు, సులైమాన్కు జ్ఞానాన్ని ప్రసాదిం చాము. ‘‘విశ్వాసులైన అనేకమంది తన దాసులకంటే మాకు ఘనతను ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు’’ అని వారు అన్నారు. సులైమాన్, దావూద్కు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు, ‘‘ప్రజలారా! మాకు పక్షుల భాషలు నేర్పబడ్డాయి. ఇంకా మాకు అన్ని రకాల వస్తువులు ఇవ్వ బడ్డాయి. నిస్సందేహంగా ఇది స్పష్టమైన (దేవుని) అనుగ్రహం.’’ సులైమాన్కొరకు జిన్నాతుల, మానవుల, పక్షుల సైన్యాలు సమీకరించబడ్డాయి. అవి గట్టి క్రమశిక్షణలో ఉంచబడేవి. (ఒకసారి అతను వాటిని తీసుకుని దండ యాత్రకు బయలుదేరాడు).  చివరకు వారంతా చీమల లోయకు చేరుకున్న ప్పుడు, ఒక చీమ ఇలా అన్నది, ‘‘చీమలారా! మీరు మీ పుట్టలలోకి దూరిపొండి, లేకపోతే సులైమాన్, అతని సైనికులు మిమ్మల్ని నలిపివేస్తారు. సంగతి వారికి తెలియకపోవచ్చు కూడా.’’ సులైమాన్దాని మాటలకు మందహాసంతో నవ్వి ఇలా అన్నాడు,  ‘‘ప్రభూ!  నన్ను అదుపులో ఉంచు, నీవు నాకూ, నా తల్లిదండ్రులకూ చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేందుకు, నీకు నచ్చిన మంచిపనులు చేస్తూ ఉండేందుకు. నీ కారుణ్యంతో నన్ను సజ్జనులైన నీ దాసులలో చేర్చు.’’

27. అన్నమ్ల్   20 - 26 (మరొక సందర్భంలో) సులైమాన్, పక్షులను పరిశీలించి ఇలా అన్నాడు, ‘‘హుద్  హుద్పక్షి నాకు కనిపించటం లేదేమిటి? అది ఎటైనా అదృశ్యమైపోయిందా?  నేను దానిని కఠినంగా శిక్షిస్తాను లేదా నరికివేస్తాను. అలా కాకపోతే, అది  నాకు సరైన కారణం చూపవలసి ఉంటుంది.’’ తరువాత ఎంతో సేపు గడవలేదు, అది వచ్చి ఇలా అన్నాది, ‘‘మీకు తెలియని సమాచారాన్ని నేను సేకరించాను. నేను సబాను గురించి నమ్మకమైన సమా చారాన్ని తీసుకువచ్చాను. నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె జాతిని ఏలుతోంది. ఆమెకు అన్ని రకాల వస్తుసామగ్రి ప్రసాదించబడిరది. ఆమె సింహాసనం మహోజ్వలంగా ఉంది. నేను చూశాను. ఆమె, ఆమె జాతివారు అల్లాహ్ కు బదులు సూర్యుడి ముందు సాష్టాంగపడుతున్నారు’’ - షైతాన్వారి పనులను వారికి మనోహరమైనవిగా కనిపించేలా చేశాడు. వారిని రాజమార్గంపైకి పోకుండా నిరోధించాడు. అందువల్ల వారు ఋజుమార్గాన్ని పొందలేకపోతున్నారు: ఆకాశాలలోనూ, భూమిలోనూ దాగివున్న వస్తువులను వెలికి తీసేవాడూ, మీరు దాచేదాన్ని, వ్యక్తపరిచే దాన్నీ ఎరిగినవాడూ అయిన దేవునికి సాష్టాంగపడటం అనే ఋజుమార్గం. అల్లాహ్  ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు ఎవ్వడూ లేడు. ఆయన మహోన్నతమైన అధికార పీఠానికి ప్రభువు.

27. అన్నమ్ల్   27 - 28 సులైమాన్ఇలా అన్నాడు, ‘‘ఇప్పుడే మేము చూస్తాము. నీవు నిజం చెప్పావో లేక అబద్ధాలు చెప్పేవారిలోని దానవో. నా ఉత్తరాన్ని తీసుకుపో, దానిని వారి వైపునకు విసరివేయి, తరువాత ఒక వైపునకు తొలగి, వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడు.’’

27. అన్నమ్ల్   29 - 31 రాణి ఇలా పలికింది, ‘‘ఆస్తాన సభ్యులారా! నా వైపునకు అతి ముఖ్యమైన ఒక లేఖ విసరివేయబడిరది. అది సులైమాన్తరఫు నుండి వచ్చింది. కరుణామయుడూ, కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ప్రారం భించబడిరది. అందులోని విషయం ఇలా ఉంది: ‘‘నాకు వ్యతిరేకంగా తిరుగు బాటు వైఖరిని అవలంబించకు. ముస్లిమ్అయి నా వద్దకు వచ్చెయ్యి.’’

27. అన్నమ్ల్   32 - 35 (లేఖ వినిపించిన తరువాత) రాణి ఇలా అన్నది, ‘‘జాతి నాయ కులారా! విషయంలో మీరు నాకు సలహా ఇవ్వండి. నేను విషయం లోనూ మిమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోను.’’ దానికి వారు ఇలా సమాధానం చెప్పారు, ‘‘మేము బలవంతులం, పోరాడగలవారం. అయితే నిర్ణయం మాత్రం మీ చేతులలో ఉన్నది. ఆజ్ఞ ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకొండి.’’ రాణి ఇలా అన్నది, ‘‘రాజులు దేశంలోనైనా జొరబడి నప్పుడు, దానిని వారు నాశనం చేస్తారు. అక్కడి గౌరవనీయులను అవమాని స్తారు.  వారు  చేసేది ఇదే. నేను వారివద్దకు ఒక కానుకను పంపిస్తాను, తరువాత నా దూతలు ఏమి జవాబు తీసుకువస్తారో చూస్తాను.’’

27. అన్నమ్ల్   36 - 37 అతడు (రాణిగారి దూత) సులైమాన్వద్దకు చేరుకున్నాడు. అప్పుడు సులైమాన్ఇలా అన్నాడు, ‘‘ఏమిటి, మీరు ధనం ఇచ్చి నాకు సహాయం చేయదలచుకున్నారా? దేవుడు మీకు ఇచ్చిన దానికంటే నాకు ఇచ్చినది ఎంతో ఎక్కువ. మీ కానుకను మీరే అనుభవించండి. ( దూతా) నిన్ను పంపిన వారి వద్దకు తిరిగి వెళ్లిపో, మేము వారిపైకి వారు ఎదిరించలేని సైన్యాలను తీసుకు వస్తాము. మేము వారిని పరాభవించి అక్కడి నుండి పారద్రోలుతాము. వారు అవమానితులై ఉండిపోతారు.’’

27. అన్నమ్ల్   38 - 40 సులైమాన్ఇలా అన్నాడు, ‘‘ఆస్థాన సభ్యులారా! వారు విధేయులై నా వద్దకు రాకమునుపే, మీలో ఎవరు ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తీసుకురాగలరు?’’ జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా మనవి చేసుకున్నాడు, ‘‘మీరు మీ స్థానం  నుండి లేవకముందే నేను దానిని తీసుకువస్తాను. నాకు శక్తి ఉంది, నమ్మకస్తుణ్ణి కూడా.’’ గ్రంథజ్ఞానం కల ఒకతను ఇలా అన్నాడు, ‘‘మీరు కళ్లుమూసి తెరిచేలోగా నేను దానిని తీసుకువస్తాను.’’ సులైమాన్తనముందు సింహాసనం పెట్టబడటం చూడగానే ఇలా అరిచాడు, ‘‘ఇది నా ప్రభువు అనుగ్రహం, నేను కృతజ్ఞతలు తెలుపుతానో లేక కృతఘ్నుడనై పోతానో పరీక్షించటానికి ఆయన ఇలా చేశాడు. ఎవడైనా కృతజ్ఞతలు తెలుపుకుంటే, అతని కృతజ్ఞతలు అతనికే లాభదాయకమవుతాయి. అలా చేయకుండా ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే, నా ప్రభువు నిరపేక్షాపరుడు, తనంతటతానే ఘనుడైనవాడు.’’

27. అన్నమ్ల్   41 - 43 సులైమాన్ఇలా అన్నాడు, ‘‘మెదలకుండా ఆమె సింహాసనాన్ని ఆమె ముందు పెట్టండి. సరైన విషయానికి చేరుతుందో లేక ఋజుమార్గం పొందని వారిలోనే ఉండిపోతుందో చూద్దాము. రాణి వచ్చినప్పుడు, ఆమెను, ‘‘నీ సింహాసనం ఇలాంటిదేనా?’’  అని అడగబడిరది. దానికి ఆమె, ‘‘ఇది అచ్చంగా అలాంటిదే.  మేము ఇంతకు ముందే విషయం తెలుసుకుని విధేయులమైపోయాము. (లేక ముస్లిములమైపోయాము) అని అన్నది. (విశ్వసించకుండా) ఆమెను ఆపి ఉంచిన విషయం, అల్లాహ్ ను వదలి ఆమె పూజిస్తూ ఉండిన దైవాల ఆరాధనే. ఎందుకంటే, ఆమె అవిశ్వాస జాతికి చెందిన స్త్రీ.

27. అన్నమ్ల్   44 రాజగృహంలో ప్రవేశించు అని ఆమెకు చెప్పటం జరిగింది. ఆమె దానిని చూచి, అది నీటికొలను అని అనుకున్నది. అందులో దిగటానికి ఆమె తన కాళ్ల మీద వస్త్రాన్ని పైకి ఎత్తిపట్టుకున్నది. అప్పుడు సులైమాన్, ‘‘ఇది గాజుతో చేయబడిన నున్నని నేల మాత్రమే’’ అని అన్నాడు. అప్పుడు ఆమె ఎలుగెత్తి ఇలా అన్నది, ‘‘నా ప్రభూ! (ఈనాటి వరకు) నేను నా ఆత్మకు అన్యాయం చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు నేను సులైమాన్తోపాటు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ పట్ల విధేయతను స్వీకరిస్తున్నాను.’’

27. అన్నమ్ల్   45 - 47 సమూద్జాతి వైపునకు మేము వారి సోదరుడు సాలిహ్ ను, ‘‘అల్లాహ్ ను ఆరాధించండి’’ అనే (సందేశాన్ని ఇచ్చి) పంపాము. అప్పుడు వారు ఒక్కసారిగా ఘర్షించుకునే రెండు వర్గాలుగా చీలిపోయారు. సాలిహ్ ఇలా అన్నాడు, ‘‘నా జాతి ప్రజలారా! మేలుకు బదులు కీడు కోసం ఎందుకు తొందరపెడుతున్నారు? అల్లాహ్ ను క్షమాభిక్ష కోసం ఎందుకు అర్థించరు? మీరు కనికరించబడ వచ్చుకదా!’’ వారు ఇలా అన్నారు, ‘‘మేము నిన్నూ, నీ సహచరులనూ అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము.’’ సాలిహ్ ఇలా జవాబు చెప్పాడు, ‘‘మీ మంచిశకునాలు మీ చెడ్డ శకునాలు అన్నీ అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే, మీరు పరీక్షింపబడుతున్నారు.’’

27. అన్నమ్ల్   48 - 53 నగరంలో తొమ్మిదిమంది ముఠానాయకులు ఉన్నారు. వారు దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు, ఎలాంటి సంస్కరణ కార్యాన్నీ చేసేవారు కాదు. వారు పరస్పరం ఇలా అనుకున్నారు, ‘‘దేవునిపై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చెయ్యండి  మేము సాలిహ్ పై, అతని కుటుంబ సభ్యులపై దాడి చేస్తాము. తరువాత అతని సంరక్షకునితో, అతని కుటుంబం హత్య చేయబడి నప్పుడు మేము అక్కడ లేము. మేము నిజమే పలుకుతున్నాము అని చెబుదాము.’’ వారు విధంగా పన్నాగం పన్నారు. ఒక పన్నాగాన్ని మేము కూడ పన్నాము. దానిని గురించి వారికి తెలియనే తెలియదు. ఇక చూడండి, వారి పన్నాగం పర్యవసానం ఏమయిందో! మేము వారినీ, వారి జాతి మొత్తాన్ని సర్వనాశనం చేసివేశాము. అవిగో వారి గృహాలు, ఎలా ఖాళీగా పడి ఉన్నాయో చూడండి, వారు చేస్తూ ఉన్న దుర్మార్గానికి ఫలితంగా. జ్ఞానులకు ఇందులో ఒక గుణపాఠం ఉంది. విశ్వసించి, అవిధేయతకు దూరంగా ఉన్న వారిని మేము కాపాడాము.

27. అన్నమ్ల్   54 - 58 మేము లూత్ను పంపాము. అతను తన జాతి వారితో, ఇలా అనిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ‘‘మీరు చూస్తూ అశ్లీల కార్యం చేస్తా రేమిటీ? ఇదేనా మీ నడవడిక, కామతృష్ణను తీర్చుకోవటానికి స్త్రీలను వదలి పెట్టి పురుషుల  వద్దకు పోతారేమిటి?  వాస్తవానికి మీరు చాల అజ్ఞానపు పని చేస్తున్నారు.’’ కానీ, సమాధానం తప్ప మరొకటి అతని జాతివారు ఇవ్వలేదు. వారు ఇలా అన్నారు, ‘‘లూత్కుటుంబాన్ని మీ పట్టణం నుంచి వెళ్లగొట్టండి. వారు మహాపవిత్రులట!’’ చివరకు మేము అతనినీ అతని కుటుం బాన్నీ రక్షించాము, అతని భార్యను తప్ప. ఆమె, వెనుక ఉండిపోవాలని మేము నిర్ణయించాము. మేము వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది హెచ్చరించబడిన వారి విషయంలో అత్యంత ఘోరమైన వర్షం.

27. అన్నమ్ల్   59.... ప్రవక్తా! ఇలా అను: ‘‘స్తోత్రం అల్లాహ్ కు మాత్రమే తగినది. ఆయన ఎన్నుకున్న ఆయన దాసులకు శాంతి కలుగుగాక!

27. అన్నమ్ల్   ... 59 - 60 (వారిని ఇలా అడగండి) అల్లాహ్ శ్రేష్ఠుడా లేక ఆయనకు సాటిగా వారు కల్పించే దేవుళ్లు శ్రేష్ఠులా? సరే, ఆకాశాలనూ, భూమినీ, ఎవరు సృష్టించారు? మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించి, తద్వారా మనోహరమైన తోటలను ఎవరు పండిరచారు? వాటిలోని చెట్లను మొలిపిం చటం మీకు సాధ్యమయ్యేపనికాదు. అల్లాహ్తోపాటు మరొకదేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా ( పనులలో పాలుపంచుకోవటానికి)? (లేడు) కాని వారే ఋజుమార్గం నుండి తొలగిపోతున్నారు.

27. అన్నమ్ల్   61 భూమిని నివాస స్థలంగా చేసినవాడు ఎవడు? అందులో నదులను ప్రవహింపజేసినవాడు ఎవడు? దానిమీద (పర్వతాల) మేకులను పాతినవాడు ఎవడు? రెండు  రకాల జలధుల మధ్య అడ్డు తెరలను పెట్టినవాడు ఎవడు? అల్లాహ్తోపాటు మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా ( పనులలో పాలుపంచుకోవటానికి)? లేడు. కాని వారిలో అనేకమందికి తెలియదు.

27. అన్నమ్ల్   62 బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసిన వాడు ఎవడు? అల్లాహ్తో పాటు ( పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తారు.

27. అన్నమ్ల్   63 నేలపై, సముద్రంపై అంధకారంలో మీకు దారిచూపే వాడు ఎవడు? తన కారుణ్యానికి ముందు గాలులలను శుభవార్తతో పంపేవాడు ఎవడు? అల్లాహ్తో పాటు మరొకదేవుడు ఎవడైనా ఉన్నాడా ( పనులు చేయటానికి)? వారు చేస్తూ ఉన్న షిర్క్కు అల్లాహ్ ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు.

27. అన్నమ్ల్   64 సృష్టిని మొదటిసారిగా చేసినవాడు ఎవడు? దానిని పున్ణసృష్టించేవాడు ఎవడు? నింగినుండి, నేల నుండీ మీకు ఉపాధినిచ్చే వాడు ఎవడు? అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా ( పనులలో పాలు పంచుకోవటా నికి)? ‘‘మీరు సత్యవంతులే అయితే మీ ఆధారాన్ని తీసుకురండి’’ అని అడుగు.

27. అన్నమ్ల్   65 వారితో ఇలా అను,  ‘‘ఆకాశాలలోనూ,  భూమిలోనూ అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడూ లేడు. వారికి (మీ దేవుళ్ళకు) తాము ఎప్పుడు లేపబడతారో కూడ తెలియదు కదా!

27. అన్నమ్ల్   66 - 75 కాని పరలోకం గురించిన జ్ఞానమే వారి నుండి కనుమరుగై పోయింది. కాదు, దానిని గురించి వారు సంశయంలో పడిపోయారు. కాదు, వారు అసలు   విషయం పట్ల అంధులైపోయారు. సత్యతిరస్కారులు ఇలా అంటారు,  ‘‘మేమూ, మా తాతముత్తాతలూ మట్టిలో కలిసిపోయిన తరువాత  కూడ  నిజంగానే మమ్మల్ని సమాధుల నుండి లేపటం జరుగు తుందా? ఇలాంటి వార్తలు ఎన్నో మాకు కూడ అందించబడ్డాయి, పూర్వం మా తాతముత్తాతలకు కూడ అందించబడుతూ ఉండేవి. కాని ఇవి మేము పూర్వకాలం నుంచి వింటూ వస్తున్న కట్టుకథలు మాత్రమే.’’ ఇలా అను, ‘‘భూమిపై తిరిగి చూడండి, నేరస్తులకు ఎటువంటి గతి పట్టినదో!‘‘ ప్రవక్తా! వారి స్థితిని గురించి బాధపడకు. వారి కుట్రల విషయంలో వ్యధ చెందకు- వారు, ‘‘నీవు చెబుతున్నది నిజమే అయితే బెదిరింపు ఎప్పుడు నెరవేరు తుంది?’’ అని అడుగుతారు. ఇలా అను, ‘‘మీరు శిక్షను గురించి తొందర పెడుతున్నారో, అందులోని  ఒక భాగం మీ సమీపంలోనికే వచ్చి ఉందన్నా, ఆశ్చర్యం లేదు.’’  యథార్థం ఏమిటంటే, నీ ప్రభువు ప్రజల పట్ల ఎంతో అనుగ్రహం కలవాడు. కాని చాలమంది కృతజ్ఞతలు తెలుపరు. వారి హృదయాలు తమలో ఏమి దాచి ఉంచాయో, మరేమి బహిర్గతం చేస్తున్నాయో, నిస్సందేహంగా నీ ప్రభువుకు బాగా తెలుసు. ఆకాశంలో, భూమిలో దాగి ఉన్న   వస్తువు అయినా,  ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా లేదు.

27. అన్నమ్ల్   76 - 81 ఇస్రాయీల్సంతతివారు విభేదిస్తూ ఉన్న విషయాల వాస్తవం ఏమిటో, ఖురాన్వారికి ఎక్కువగా తెలియజేస్తోంది. ఇది విశ్వసించే వారికి మార్గదర్శకత్వం. కారుణ్యమూను. నిశ్చయంగా (ఇలాగే) నీ ప్రభువు వీరి మధ్య కూడ తన ఆజ్ఞ ద్వారా తీర్పు చేస్తాడు. ఆయన ఎంతో శక్తిమంతుడు, అన్నీ ఎరిగినవాడూను. కనుక ప్రవక్తా! అల్లాహ్ మీద భారం వెయ్యి. నిశ్చయంగా నీవు స్పష్టంగా సత్యంపై ఉన్నావు. నీవు మృతులకు వినిపించలేవు.  వీపు త్రిప్పి పరుగెత్తే బధిరులకు కూడ నీ పిలుపును వినిపించలేవు. అంధులకు మార్గం చూపి, వారు తప్పిపోకుండా కాపాడనూలేవు. మా వాక్యాలను విశ్వసించి, విధేయులయ్యే వారికి మాత్రమే నీవు నీ మాటను వినిపించగలవు.

27. అన్నమ్ల్   82 - 86 మా మాట నెరవేరే సమయం వారిని సమీపించినప్పుడు, మేము వారి కొరకు భూమినుండి ఒక జంతువును తీస్తాము. అది వారితో ఇలా మాట్లాడుతుంది, ‘‘ప్రజలు మా వాక్యాలను విశ్వసించలేదు.’’ రోజును గురించి కొంచెం ఆలోచించు. అప్పుడు మేము ప్రతి సముదాయం నుండి మా వాక్యాలను తిరస్కరించే ఒక్కొక్క జనసమూహాన్ని సమీకరిస్తాము. ఆపై వారిని (వారి వారి తరగతుల ప్రకారం అంతస్తుల వారీగా) ఒక క్రమపద్ధతిలో ఉంచటం జరుగుతుంది. చివరకు అందరూ వచ్చేసిన తరువాత (వారి ప్రభువు వారిని) ఇలా అడుగుతాడు, ‘‘మీరు నా వాక్యాలను శాస్త్రీయ పరిశీలన చేయకుండానే ఇట్టే తిరస్కరించారు. ఇది కాక మీరు చేసింది ఏమిటి?’’ వారు చేసిన దుర్మార్గం వల్ల శిక్షకు సంబంధించిన వాగ్దానం వారి విషయంలో నెరవేరుతుంది. అప్పుడు వారు ఏమీ మాట్లాడలేరు. వారు విశ్రాంతి పొంద టానికి మేము రాత్రిని సృష్టించాము. మేము పగటిని ప్రకాశవంతంగా చేశాము. వారి బుద్ధికి విషయాలు తట్టేవికావా? విశ్వసించే వారికి ఇందులో అనేక సూచనలు ఉండేవి.

27. అన్నమ్ల్   87 - 90 శంఖం ఊదబడే రోజున ఏమి జరుగుతుందో? రోజున, ఆకాశాలలోని, భూమిలోని సకల సృష్టిరాసులు భయంతో కంపించిపోతాయి. - భయానక పరిస్థితుల నుండి అల్లాహ్ కాపాడ దలచిన వారు తప్ప  -  అందరూ లొంగిపోయి, వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. రోజున నీవు పర్వతాలను చూచి అవి బాగా స్థిరంగా ఉన్నాయని అనుకుంటు న్నావు. కాని అప్పుడు మేఘాల మాదిరిగా అవి ఎగురుతూ ఉంటాయి. ఇది అల్లాహ్ శక్తి సామర్థ్యాల మహిమ.  ఆయన ప్రతి వస్తువునూ వివేకంతో తీర్చిదిద్దాడు. మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు. మంచిని తీసుకువచ్చే వ్యక్తికి అంతకంటే మేలైన ప్రతిఫలం లభిస్తుంది. అటువంటి వారు ఆనాటి భయంకర పరిస్థితినుండి సురక్షితంగా ఉంటారు. చెడును తీసుకువచ్చే వారందరూ బోర్లగా అగ్నిలో విసరివేయబడతారు. మీరు చేసిన కర్మల ప్రకారం తప్ప మీరు మరొక విధమైన ప్రతిఫలాన్ని ఎలా పొందగలుగుతారు?

27. అన్నమ్ల్   91 - 93 ( ప్రవక్తా! వారితో ఇలా అను): ‘‘ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడిరది. ఆయన దానిని పవిత్రమైన క్షేత్రంగా చేశాడు  ఆయన ప్రతిదానికీ యజమాని. నేను విధేయుడనై ఉండా లనీ, ఖురాన్ను చదివి వినిపించాలనీ నాకు ఆజ్ఞ ఇవ్వబడిరది. ఇక సన్మార్గాన్ని అవలంబించేవాడు  తన  మేలు కొరకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మార్గభ్రష్టుడైన వాడితో, ‘‘నేను  కేవలం హెచ్చరించేవాణ్ణి మాత్రమే’’ అని అను.  వారితో ఇంకా ఇలా అను, ‘‘స్తోత్రం కేవలం అల్లాహ్ కు మాత్రమే తగినది, అతి త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు, మీరు వాటిని గుర్తిస్తారు.’’ మీరు చేసే పనులన్నీ నీ ప్రభువునకు తెలియకుండా లేవు.


No comments:

Post a Comment