91 సూరహ్ అష్సమ్స్

 

91 అష్సమ్స్

ఆయతులు : 15                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 10  సూర్యుడు సాక్షిగా,  అతని ఎండ సాక్షిగా, సూర్యుని తరువాత వచ్చేటప్పటి చంద్రుడు సాక్షిగా, (సూర్యుణ్ణి) దేదీప్యమానం చేసేటప్పటి పగలు సాక్షిగా, (సూర్యుణ్ణి) మరుగుపరచేటప్పటి రాత్రి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, దాన్ని నెలకొల్పినవాడు సాక్షిగా, నేలసాక్షిగా, దాన్ని పరచినవాడు సాక్షిగా, మానవాత్మ సాక్షిగా,   ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసినవాడు సాక్షిగా,  నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణచివేసినవాడు విఫలు డయ్యాడు.

11 - 15 సమూద్జాతి తన దుర్మార్గపు వైఖరి కారణంగా ధిక్కరించింది. జాతికి చెందిన పరమ దుర్మార్గుడొకడు దిగ్గున లేచాడు, అప్పుడు దైవప్రవక్త ప్రజల్ని, ‘‘జాగ్రత్త! దేవుని ఒంటె జోలికి పోకండి, దాన్ని నీళ్ళు త్రాగకుండా ఆటంకపరచకండి’’ అని హెచ్చరించాడు. కాని వారు ఆయన మాటను ధిక్కరించి ఒంటెను చంపేశారు. చివరకు వారి పాపాల పర్యవసానంగా వారి ప్రభువు వారందరినీ ఒకేసారి సర్వనాశనం చేసే మహావిపత్తును వారిపైకి పంపాడు. ( చర్యవల్ల) ఏదైనా దుష్పరిణామం సంభవిస్తుందన్న ఎలాంటి భయమూ ఆయనకు లేదు.

No comments:

Post a Comment