56 సూరహ్ అల్‌ వాఖిఅహ్

 56. అల్వాఖిఅహ్

ఆయతులు : 96                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 26 జరుగవలసి ఉన్న సంఘటన సంభవించినప్పుడు, దాని సంభవాన్ని ఇక ఎవరూ తిరస్కరించలేరు. అది తారుమారు చేసివేసే ఆపద అవుతుంది. భూమి మొత్తం అప్పుడు ఒక్కసారిగా తీవ్రంగా ఊపివేయబడుతుంది, పర్వ తాలు చెదరిపోయిన ధూళిరేణువుల మాదిరిగా తుత్తునియలై పోతాయిమీరు  అప్పుడు  మూడు వర్గాలుగా విడిపోతారు: కుడిపక్షంవారు  కుడిపక్షం వారి (అదృష్టాన్ని)ని గురించి ఏమనాలిఎడమ  పక్షంవారు  ఎడమ పక్షంవారి (దురదృష్టాన్ని)ని గురించి ఏమనాలి. ముందు వారైతే ముందున్నవారే. వారే సాన్నిధ్యులు, సకల భోగభాగ్యాలతో నిండి వున్న స్వర్గవనాలలో ఉంటారు. వారిలో ముందువారి నుండి చాలా మంది ఉంటారువెనుక వారి నుండి తక్కువ మంది ఉంటారు. బంగారు జలతారుతో  అల్లిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చుండి ఉంటారువారి సమావేశాలలో నిత్య బాల్యం కల బాలురు, మధువు ప్రవహించే చెలమ నుండి నింపిన మధు పాత్రలు, గిన్నెలు, గాజుపాత్రలు కూజాలు తీసుకొని పరుగుతో తిరుగుతూ ఉంటారు. దానిని  త్రాగటం వల్ల వారి తల తిరగటం కాని, వారికి బుద్ధి మాంద్యం కలగటం గాని జరగదు. వారు వారి ముందు రకరకాల రుచికరమైన పండ్లను ఉంచుతారు, ఇష్టమైన దానిని తీసుకోవటానికి  పక్షుల మాంసాన్ని ఉంచుతారు, పక్షిమాంసం ఇష్టమైతే అది తినాలని. వారి కొరకు అందమైన కళ్లుగల హూర్లు (రమణీమణులు) ఉంటారు. వారు దాచిపెట్టిన ఆణి ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు. ఇదంతా వారు ప్రపంచంలో చేస్తూ వచ్చిన కర్మలకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది. అక్కడ వారు పనికి మాలిన విషయాలు గానీ, పాప విషయాలు గానీ వినరు. మాట అయినా సరే, సరిగానే, సవ్యముగానే ఉంటుంది.

27 - 40 ఇక కుడిపక్షం వారు, కుడిపక్షం వారి (అదృష్టాన్ని)ని గురించి ఏమనాలి. వారు ముళ్లులేని రేగుచెట్లు, అరటి పండ్లగెలలు, దూరంగా వ్యాపించి ఉండే నీడలు, ఎల్లప్పుడూ ప్రవహించే నీరు, ఎన్నటికీ అంతంకాని, నిరాటం కంగా లభించే అసంఖ్యాకమైన పండ్లు మరియు ఎత్తైన ఆసనాలు వీటి మధ్య ఉంటారు. వారి భార్యలను మేము ప్రత్యేకంగా సరిక్రొత్త పంథాలో సృష్టిస్తాము, వారిని కన్యలుగా చేస్తాము. వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు, వయస్సులో సమంగా ఉంటారు. ఇదంతా కుడిపక్షం వారికొరకు. వారిలో ముందువారు చాలామంది ఉంటారు, వెనుక వారు కూడా చాలామంది ఉంటారు.

41 - 56 వామపక్షంవారు  వామపక్షం వారి (దౌర్భాగ్యాన్ని)ని గురించి ఏమని చెప్పాలివారు వడగాలి మధ్య సలసల కాగే నీటిలో, నల్లని పొగల నీడలో ఉంటారు. అది చల్లగానూ ఉండదు, సుఖంగానూ ఉండదు. గతి పట్టకముందు వారు సంపన్నులుగా ఉండేవారు, చెప్పినా వినకుండా మూర్ఖంగా మహా పాపాలు చేస్తూ ఉండేవారు. వారు ఇలా అనేవారు, ‘‘మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు, అస్థిపంజరంగా అయి పోయినప్పుడు, మళ్లీ లేపబడతామా? పూర్వం గతించిన మా తాతముత్తాతలు కూడా లేపబడ తారా?’’ ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నిశ్చయంగా గతించినవారు, తరువాత వారు, అందరూ ఒక రోజున తప్పకుండా సమావేశపరచబడతారు. దాని కాలం కూడ నిర్ణయమైపోయింది.’’ మార్గభ్రష్టులారా! తిరస్కారులారా! మీరు జఖ్ఖూమ్చెట్టును ఆహారంగా తింటారు. దానితోనే మీరు మీ కడుపులను నింపుకుంటారు. ఆపై సలసల కాగే నీటిని దప్పిక గొన్న ఒంటెల మాదిరిగా త్రాగుతారు. తీర్పు దినంనాడు ( వామపక్షంవారికి లభించే) ఆతిధ్యపు పదార్థాలు ఇవి.

57 - 62 మేము మిమ్మల్ని సృష్టించాము, మరెందుకు మీరు విషయాన్ని ధ్రువీకరించరు? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా: మీరు విడిచే రేతస్సుతో బిడ్డను మీరు తయారు చేస్తారా లేక దానిని సృష్టించేవారము మేమా? మేము మీ మధ్య మరణాన్ని విభజించాము, మీ రూపాలను మార్చివేసి, మీరు ఎరుగని మరేదైనా రూపంలో మిమ్మల్ని సృష్టించే విషయంలో మేము అశక్తులము కాము. మీ మొదటి పుట్టుకను గురించి మీకు తెలిసే ఉంది. మరెందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు?

63 - 67 ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా  మీరు నాటే విత్తనాలతో పొలాలను మీరు పండిస్తారా లేక వాటిని పండిరచేవారము మేమా? మేము తలచుకుంటే పంట పొలాలను పొట్టుగా చేసి వేస్తాము. అప్పుడు మీరు, ‘‘మేము చాలా నష్టంలో పడిపోయామని, అసలు మా అదృష్టమే కాలిపోయిం దని’’ రకరకాలుగా మాటలు చెప్పుకుంటారు.

68 - 70 ఎప్పుడైనా మీరు కళ్లు తెరచి చూశారా  మీరు త్రాగే నీటిని మేఘాలనుండి మీరు కురిపించారా లేక దానిని కురిపించే వారము మేమా? మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పగా ఉండేలా చేయగలము. అలాం టప్పుడు మీరు కృతజ్ఞులై ఎందుకు ఉండరు?

71 - 74 మీరు రాజేసే అగ్నిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన వృక్షాన్ని మీరు సృష్టించారా లేక దానిని సృష్టించిన వారము మేమా? మేము దానిని జ్ఞాపక సాధనంగాను, అవసరం ఉన్న వారికొరకు ప్రయోజనకారిగాను చేశాము. కనుక ప్రవక్తా! మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.

75 - 82 కనుక (అది) కాదు, నక్షత్రాల స్థానాలు, కక్ష్యలు సాక్షిగా చెబు తున్నాము: మీరు తెలుసుకుంటే, ఇది చాలా పెద్ద ప్రమాణం: ఇది ఒక మహోన్నతమైన ఖురాన్‌  ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటువంటిది. అయినా మీరు వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా? మహాభాగ్యాన్ని తిరస్కరించటమే మీరు మీ జీవనోపాధిగా చేసుకున్నారా?

83 - 94  ఇక మీరు గనక ఎవరికీ బానిస కాకపోతే, అభిప్రాయంలో మీరు గనక సత్యవంతులే అయితే, చనిపోయే వాడి ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు, అతడు చనిపోతున్నాడని మీరు కళ్లారా చూస్తూ ఉంటారు, సమయంలో పోయే ప్రాణాన్ని మీరు తిరిగి ఎందుకు తీసుకురాలేరు? అప్పుడు మీకంటే మేము అతనికి చాల దగ్గరలో ఉంటాము, కాని మీకు కనిపించము. తరువాత చనిపోయే మనిషి సాన్నిధ్యులలోని వాడైతే, అతని కొరకు సుఖం, మంచి ఆహారం, మహా భాగ్యాలతో నిండి ఉన్న స్వర్గం ఉంటాయి. ఒకవేళ అతడు కుడిపక్షంలోనివాడై ఉంటే, ‘‘నీకు శాంతి కలుగుగాక! నీవు కుడిపక్షంలోని వాడవు’’ అని అతనికి స్వాగతం చెప్పబడుతుంది. ఒకవేళ అతడు తిరస్కరించే మార్గభ్రష్టులలోని వాడై ఉంటే, అతనికి ఇవ్వబడే ఆతిధ్యం సల సల కాగే నీరు మరియు నరకంలోకి విసరివేయటం.

95 - 96 ఇదంతా తిరుగులేని సత్యం, కనుక ప్రవక్తా! మహోన్నతుడైన నీ ప్రభువు పేరును స్తుతించు.

No comments:

Post a Comment