29 సూరహ్ అల్‌ అన్‌ కబూత్‌

 

29. అల్అన్కబూత్

ఆయతులు : 69                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

29. అల్అన్కబూత్   1 - 3 అలిఫ్, లామ్, మీమ్‌. కేవలం ‘‘మేము విశ్వసించాము’’ అని అన్నంత మాత్రాన్నే వారిని వదలివేయటం జరుగుతుందనీ,  వారిని పరీక్షించటం జరగదనీ ప్రజలు భావిస్తున్నారా? వాస్తవానికి మేము వారికి పూర్వం గతించిన వారందరినీ పరీక్షించాము, అల్లాహ్ కు సత్యవాదులెవరో, అసత్యవాదులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉన్నది.

29. అల్అన్కబూత్   4 చెడు చేష్టలు చేస్తున్నవారు మమ్మల్ని  మీరి  పోగలమని అనుకుంటున్నారా? వారి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం.

29. అల్అన్కబూత్   5 - 7 ఎవడైనా అల్లాహ్ ను కలిసే ఆశను కలిగి ఉంటే, (అతడు తెలుసు కోవాలి) అల్లాహ్ నిర్ణయించిన సమయం త్వరలోనే రానున్నదనీ, అల్లాహ్ అన్నీ వింటాడనీ, అన్నీ ఎరుగుననీ. వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో తీవ్రంగా పరిశ్రమిస్తే అతడు తన మేలు కొరకే అలా చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సకల లోకాలలోని వారి అక్కర ఎంతమాత్రం లేనివాడు. విశ్వసించి మంచి పనులు చేసేవారి పాపాలను మేము వారినుండి తొలగిస్తాము, వారికి తాము చేసిన ఉత్తమ కర్మలకు ప్రతిఫలం ఇస్తాము.

29. అల్అన్కబూత్   8 - 9 తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగుమని మేము మానవునికి ఉపదేశించాము. కాని ఒకవేళ వారు నా భాగస్వామిగా నీవు ఎరుగని వానిని (ఆరాధ్యుణ్ణి) నాకు భాగస్వామిగా చేయమని నిన్ను బలవంతపెడితే, అప్పుడు వారి యెడల విధేయత చూపకు. నా వైపునకే మీరందరూ మరలిరావలసి ఉంది. అప్పుడు నేను మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాము. ఎవరైనా విశ్వసించి మంచిపనులు చేసి  ఉన్నట్లయితే,  వారిని మేము తప్పకుండా సజ్జనులలో కలుపుతాము.

29. అల్అన్కబూత్   10 - 11 ప్రజలలో, ‘‘మేము అల్లాహ్ ను విశ్వసించాము’’ అని అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, కాని అతడు అల్లాహ్ మార్గంలో హింసించబడినప్పుడు, లోకులు పెట్టిన పరీక్షను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తాడు, ఇప్పుడు ఒకవేళ నీ ప్రభువు తరఫు నుండి సహాయం, విజయం వచ్చినట్లయితే, వ్యక్తియే, ‘‘మేము మీతోనే ఉన్నాము’’ అని అంటాడు. భూలోకవాసుల హృద యాల స్థితి అల్లాహ్ కు బాగా తెలియదా? అల్లాహ్ కు విశ్వాసులెవరో, కపటు లెవరో తప్పనిసరిగా చూడవలసి ఉంది.

29. అల్అన్కబూత్   12 - 13 అవిశ్వాసులు విశ్వాసులతో, ‘‘మీరు మా విధానాన్ని అనుస రించండి. అప్పుడు మేము మీ పాపాలను మాపైన వేసుకుంటాము’’ అని అంటారు. నిజానికి వారు వారి పాపాలలోని పాపాన్నీ తమపై వేసుకోరు. వారు పూర్తిగా అబద్ధం చెపుతున్నారు, ఔను, వారు తప్పకుండా తమ బరువు లనూ మోస్తారు, తమ బరువులతో పాటు అనేక ఇతర బరువులను కూడా మోస్తారు. ప్రళయంనాడు నిశ్చయంగా వారిని వారి అభూత కల్పనలను గురించి అడగటం జరుగుతుంది.

29. అల్అన్కబూత్   14 - 15 మేము నూహ్ ను అతని జాతి వైపునకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు ఉన్నాడు.  చివరకు తుఫాను వచ్చి వారు  దుర్మార్గులుగా ఉన్న స్థితిలో వారిని చుట్టుముట్టింది. తరువాత నూహ్నూ,  నావలోని వారినీ మేము రక్షించాము, దానిని మేము ప్రపంచ వాసులకు ఒక గుణపాఠం వంటి సూచనగా చేశాము.

29. అల్అన్కబూత్   16 - 18 ఇబ్రాహీమ్ను పంపాము,  అప్పుడు  అతను తన జాతివారితో ఇలా అన్నాడు, ‘‘అల్లాహ్ ను ఆరాధించండి, ఆయనకు భయపడండి. మీరు అర్థం చేసుకుంటే, ఇదే మీకు మేలైనది. అల్లాహ్ ను కాకుండా మీరు పూజిస్తూ ఉన్నవి కేవలం విగ్రహాలు మాత్రమే. మీరు ఒక అభూత కల్పన చేస్తున్నారు. యథార్థానికి అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి మీకు ఉపాధినీ ఇచ్చే అధికారం కలిగి లేవు, ఉపాధి కొరకు అల్లాహ్ ను అడగండి, ఆయనకే దాస్యం చేయండి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఒకవేళ మీరు తిరస్కరిస్తే, మీకు పూర్వం ఎన్నో జాతులు తిరస్కరించాయి. స్పష్టంగా సందేశాన్ని అందజేయటం తప్ప దైవప్రవక్తపై మరొక బాధ్యత ఏదీ లేదు.’’

29. అల్అన్కబూత్   19 - 23 అల్లాహ్ విధంగా సృష్టిని ప్రారంభిస్తాడో తిరిగి దాని పున్ణసృష్టి ఎలా చేస్తాడో వారు ఎన్నడూ గమనించలేదా? నిశ్చయంగా ఇది (పున్ణసృష్టి) అల్లాహ్ కు ఎంతో సులువైనది. వారితో ఇలా అను, ‘‘భూమిపై తిరగండి, ఆయన, సృష్టిని విధంగా ప్రారంభించాడో చూడండి. అల్లాహ్ పునరుజ్జీవ నాన్ని కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఆయన తనకు ఇష్టమైన వారిని శిక్షిస్తాడు, తనకు ఇష్టమైన వారిని కరుణిస్తాడు. ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. మీరు (ఆయనను) భూమిలోనూ లొంగదీయలేరు, ఆకాశంలోనూ లొంగదీయలేరు. అల్లాహ్ నుండి రక్షించ డానికి మీకు సంరక్షకుడూ లేడు, సహాయకుడూ లేడు. అల్లాహ్ ఆయతు లనూ, ఆయన సందర్శనాన్నీ తిరస్కరించిన వారు నా కరుణపట్ల నిరాశ చెందుతారు, వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.

29. అల్అన్కబూత్   24 - 27 ఇబ్రాహీమ్జాతివారు ఇలా సమాధానం పలకటం తప్ప మరొక విషయమేదీ అనలేదు, ‘‘ఇతనిని చంపండి, లేదా కాల్చివేయండి.’’ చివరకు అల్లాహ్ అతనిని అగ్ని జ్వాలల నుండి రక్షించాడు. నిశ్చయంగా విశ్వాసులకు ఇందులో సూచనలు ఉన్నాయి. అతను ఇలా అన్నాడు, ‘‘మీరు ప్రపంచ జీవితంలో అల్లాహ్ ను కాదని విగ్రహాలను మీ మధ్య, ప్రేమకు సాధనంగా చేసుకున్నారు, కాని ప్రళయం నాడు మీరు ఒకరినొకరు తిరస్కరించుకుంటారు, ఒకరి నొకరు శపించుకుంటారు.  అగ్ని  మీ నివాసస్థలమవుతుంది, మీకు సహాయం చేసేవాడెవ్వడూ ఉండడు.’’ అప్పుడు లూత్అతనిని విశ్వసించాడు. ఇబ్రాహీమ్ఇలా అన్నాడు,  ‘‘నేను  నా ప్రభువు వైపునకు వలసపోతాను. ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు.’’ మేము అతనికి ఇస్హాఖ్, యాఖూబ్‌ (వంటి సంతానం)లను ప్రసాదించాము  అతని వంశంలో ప్రవక్త పదవినీ, గ్రంథాన్నీ ఉంచాము. ప్రపంచంలో అతనికి అతని ప్రతిఫలం ఇచ్చాము. పరలోకంలో అతను నిశ్చయంగా సజ్జనులలో చేర్చుకోబడతాడు.

29. అల్అన్కబూత్   28 - 30 మేము లూత్ను పంపాము  అప్పుడు అతను తన జాతివారితో ఇలా అన్నాడు, ‘‘మీకు పూర్వం ప్రపంచ మానవులలో ఎవ్వరూ చేయని అశ్లీల కార్యాన్ని మీరు చేస్తున్నారు, ఇదేమిటి, మీరు పురుషుల వద్దకుపోతారు, దారి దోపిడీలు చేస్తారు.మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తారు?’’ అప్పుడు అతని జాతివారు ఇలా సమాధానం ఇవ్వటం తప్ప మరొక విషయమేదీ పలుకలేదు. ‘‘నీవు నిజాయితీపరుడవే అయితే, తీసుకురా అల్లాహ్ శిక్షను.’’ లూత్ఇలా అన్నాడు, ‘‘నా ప్రభూ! దుష్టులకు వ్యతిరేకంగా నాకు సహాయ పడు.’’

29. అల్అన్కబూత్   31 - 32 మా దూతలు ఇబ్రాహీమ్వద్దకు శుభవార్తను తీసుకువెళ్ళినప్పుడు, అతనితో వారు ఇలా అన్నారు, ‘‘మేము పట్టణవాసులను నాశనం చేయ బోతున్నాము. దాని ప్రజలు పరమ దుర్మార్గులైపోయారు.’’ ఇబ్రాహీమ్, ‘‘అక్కడ లూత్ఉన్నాడు కదా!’’ అని అన్నాడు. వారు ఇలా అన్నారు, ‘‘అక్కడ ఎవరె వరున్నారో మాకు బాగా తెలుసు. అతని భార్యను తప్ప, అతనినీ, మిగిలిన అతని ఇంటిల్లిపాదినీ రక్షిస్తాము.’’ అతని భార్య వెనుక ఉండిపోయేవారిలో ఉండిపోయింది.

29. అల్అన్కబూత్   33 - 35 తరువాత మా దూతలు లూత్వద్దకు వెళ్లినప్పుడు, వారి రాకను చూచి అతను ఎంతో ఆందోళన చెందాడు, మనస్సులో కుమిలిపోయాడు. వారు ఇలా అన్నారు, ‘‘భయపడకు, బాధపడకు, మేము నిన్నూ నీ ఇంటివారినీ రక్షిస్తాము, ఒక్క నీ భార్యను తప్ప. ఆమె వెనుక ఉండిపోయేవారిలోనిది. మేము పట్టణ వాసులపై ఆకాశం నుండి శిక్షను అవతరింపజేయ బోతున్నాము. వారు చేస్తూ వచ్చిన ఘోర పాతకం కారణంగా.’’ మేము పట్టణానికి చెందిన ఒక స్పష్టమైన సూచనను వదలిపెట్టాము. బుద్ధీ విజ్ఞతలను ఉపయోగించే ప్రజలకొరకు.

29. అల్అన్కబూత్   36 - 37 మద్యన్వైపునకు మేము వారి సోదరుడు షుఐబ్ను పంపాము. అతను ఇలా అన్నాడు, ‘‘నా జాతి ప్రజలారా! అల్లాహ్ కు దాస్యం చేయండి. అంతిమ దినము కొరకు ఎదురు చూడండి. దుర్మార్గులై భూమిపై అత్యాచారాలు చేస్తూ తిరగకండి.’’ కాని, వారు అతనిని తిరస్కరించారు. చివరకు ఒక తీవ్ర మైన భూకంపం వారిని పట్టుకుంది  వారు తమ ఇళ్ళల్లో ఎక్కడ పడిపోయిన వారు అక్కడనే ఉండిపోయారు.

29. అల్అన్కబూత్   38 - 40 ఆద్, సమూద్జాతులను మేము నాశనం చేశాము. వారు నివసించిన ప్రదేశాలను నీవు చూసే ఉన్నావు. వారి పనులను షైతాను వారి కొరకు చక్కనివిగా తీర్చిదిద్దాడు  వారిని సన్మార్గం నుండి తప్పించాడు. వాస్తవా నికి వారు తెలివిగలవారే. ఖారూన్, ఫిరౌన్, హామాన్లను మేము నాశనం చేశాము. మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలతో వచ్చాడు. కాని వారు తమ పెద్దరికం గురించి విర్రవీగారు. యథార్థానికి వారు మమ్మల్ని దాటి పోగలిగే వారేమీ కాదు. చివరికి ప్రతివాణ్ణీ మేము అతని పాపానికిగాను పట్టుకున్నాము. తరువాత వారిలోని కొందరిపైకి మేము రాళ్లు విసిరే పెనుగాలిని పంపాము, మరికొందరిని ఒక భయంకరమైన ప్రేలుడు కబళిం చింది, ఇంకా కొందరిని మేము భూమిలో కూరుకుపోయేలా చేశాము. మరికొందరిని ముంచివేశాము. అల్లాహ్ వారికి అన్యాయం చేయలేదు, వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

29. అల్అన్కబూత్   41 - 44 అల్లాహ్ ను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు సాలె పురుగును పోలి ఉన్నారు. అది తన కొరకు ఒక ఇల్లు కట్టుకుంటుంది. అన్ని ఇళ్ళకంటే అతి బలహీనమైన ఇల్లు సాలెపురుగు ఇల్లే అవుతుంది. అయ్యో! వారికి విషయం తెలిస్తే ఎంత బాగుంటుంది! వారు అల్లాహ్ ను కాదని దేనిని వేడుకున్నా, అల్లాహ్ దానిని బాగా ఎరుగును. ఆయనే సర్వ శక్తిమంతుడు, వివేచనాపరుడునూ. మేము దృష్టాంతాలను ప్రజల అవగాహన నిమిత్తం వివరిస్తాము. కాని జ్ఞానసంపన్నులే వాటిని అర్థం చేసు కుంటారు. అల్లాహ్ ఆకాశాలనూ, భూమినీ సత్యంతో సృష్టించాడు. యథార్థం గానే విశ్వాసులకు ఇందులో ఒక సూచన ఉంది.

29. అల్అన్కబూత్   45 (ప్రవక్తా!)  వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చెయ్యి, నమాజును స్థాపించు నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది. అల్లాహ్ సంస్మరణ దీనికంటె కూడా చాలా గొప్ప విషయం, నీవు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.

29. అల్అన్కబూత్   46 - 47 గ్రంథ ప్రజలతో వాదించకు, ఉత్తమమైన రీతిలో తప్ప - అయితే వారిలోని దుర్మార్గులతో మాత్రం కాదు - వారితో ఇలా అను, ‘‘మేము మా వద్దకు పంపబడిన దానినీ విశ్వసించాము, మీ వద్దకు పంపబడిన దానినీ విశ్వసించాము. మా దేవుడూ, మీ దేవుడూ ఒక్కడే, మేము ఆయనకే విధే యులం.’’ ( ప్రవక్తా!) ఇదే విధంగా మేము నీపై గ్రంథాన్ని అవతరింప జేశాము. అందువల్ల పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చినవారు దీనిని విశ్వసిస్తారు. ప్రజలలోని వారు కూడ చాలామంది దీనిని విశ్వసిస్తున్నారు. మా ఆయతు లను కేవలం అవిశ్వాసులు మాత్రమే తిరస్కరిస్తారు.

29. అల్అన్కబూత్   48 - 52 (ప్రవక్తా!) నీవు ఇంతకు పూర్వం గ్రంథాన్నీ చదివేవాడవు కావు  నీ చేతితో వ్రాసేవాడవూ కావు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అసత్య వాదులు అనుమానానికి లోనై ఉండేవారు. అసలు ఇవి జ్ఞానం ప్రసాదించబడిన వారి హృదయాలకు స్పష్టమైన సూచనలు. మా ఆయతులను దుర్మార్గపు ప్రజలు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. వారు ఇలా అంటారు, ‘‘ఇతని ప్రభువు తరఫు నుండి ఇతనిపై సూచనలు ఎందుకు దించబడలేదు?’’ ఇలా అను, ‘‘సూచనలు అల్లాహ్ వద్ద ఉన్నాయి. నేను కేవలం స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.’’ మేము నీపై అవతరింపజేసిన గ్రంథం వారి ముందు చదివి వినిపించబడుతోంది - ఇది ( సూచన) వారికొరకు సరిపోదా?  వాస్తవానికి ఇందులో కారుణ్యం ఉన్నది. విశ్వాసులకు హితబోధ ఉన్నది. (ప్రవక్తా!) ఇలా అను, ‘‘నాకూ మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ యే సరిపోతాడు. ఆయన ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తాన్నీ ఎరిగినవాడు, అసత్యాన్ని విశ్వసించి, అల్లాహ్ ను తిరస్కరించేవారే అసలు నష్టానికి గురి అయ్యేవారు.

29. అల్అన్కబూత్   53 - 55 వారు, శిక్షను త్వరగా తీసుకురావాలని నిన్ను కోరుతున్నారు. సమయం ఒకటి నిర్ణయమై ఉండకపోతే, వారి మీదకు శిక్ష ఎప్పుడో వచ్చిపడి ఉండేది. నిశ్చయంగా (సమయం రాగానే) శిక్ష వచ్చి తీరుతుంది, అకస్మా త్తుగా వస్తుంది, వారికి ఏమాత్రం తెలియని స్థితిలో వస్తుంది, వారు శిక్షను త్వరగా తీసుకురమ్మని కోరుతున్నారు. వాస్తవానికి అవిశ్వాసులను నరకం ఎప్పుడో చుట్టుముట్టింది. రోజున (వారికి విషయం తెలిసిపోతుంది)  అప్పుడు శిక్ష వారిని పైనుండి కూడా కప్పివేస్తుంది, పాదాల క్రిందనుంచి కూడా కప్పివేస్తుంది  ‘‘ఇక రుచిచూడండి మీరు చేసిన చేష్టలకు’’ అని అంటుంది.

29. అల్అన్కబూత్   56 - 60 విశ్వసించిన నా దాసులారా! నా భూమి విశాలమైనది. కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి. ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసి ఉన్నది. తరువాత మీరందరూ మా వైపునకే మరలింపబడతారు, విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము స్వర్గంలోని ఎత్తైన భవనాలలో ఉంచుతాము, వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు.  ఎంతమంచి ప్రతిఫలం - ఆచరించేవారికి, సహనం వహించిన వారికి, ఇంకా తమ ప్రభువునే నమ్ముకునే వారికి. తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగని జంతువులు ఎన్నో ఉన్నాయి. అల్లాహ్ వాటికి ఉపాధిని సమకూరుస్తాడు, మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ ఎరిగినవాడూను.

29. అల్అన్కబూత్   61 - 63 భూమినీ, ఆకాశాలనూ ఎవడు సృష్టించాడు, చంద్రుణ్ణీ, సూర్యుణ్ణీ ఎవడు అదుపులో ఉంచాడు, అని నీవు వారిని అడిగితే, అప్పుడు వారు ‘‘అల్లాహ్’’ అని అంటారు. అయితే వారు ఎలా మోసపోతున్నారు? తన దాసులలో తనకు ఇష్టమైన వారి ఉపాధిని విస్తరింపజేసేవాడూ, తనకు ఇష్టమైన వారి ఉపాధిని పరిమితపరిచేవాడూ అల్లాహ్ మాత్రమే. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయాన్నీ ఎరిగినవాడు. ఇంకా నీవు వారిని, ‘‘ఆకాశం నుండి ఎవడు వర్షాన్ని కురిపించాడు, దాని ద్వారా మృతభూమిని ఎవడు బ్రతికించాడు’’ అని అడిగితే అప్పుడు వారు, ‘‘అల్లాహ్’’ అని తప్పకుండా అంటారు. ‘‘అల్హమ్దులిల్లాహ్’’ (అల్లాహ్ యే స్తుతింపదగినవాడు) అని అను. కాని వారిలో చాలామంది అర్థం చేసుకోరు.

29. అల్అన్కబూత్   64 - 69  ప్రాపంచిక జీవితం ఒక క్రీడ, ఒక వినోదం తప్ప మరేమీకాదు, అసలు జీవన గృహం పరలోక గృహమే. అయ్యో! వారు ( విషయాన్ని) తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. వారు పడవలోకి ఎక్కినపుడు తమ ధర్మాన్ని అల్లాహ్కే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు. తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకురాగానే, అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ప్రారంభిస్తారు  అల్లాహ్ కలుగజేసిన విముక్తికి కృతఘ్నత చూపటానికి, (ప్రాపం చిక జీవితపు) భోగాలను అనుభవించటానికి. మంచిది, త్వరలోనే వారికి తెలిసిపోతుంది. వారు విషయాన్ని చూడటం లేదా  మేము శాంతి నిలయ మైన ఒక హరమ్ను నెలకొల్పాము. వాస్తవానికి వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మాయం చేయబడుతున్నారు. అయినా వారు అసత్యాన్నే విశ్వసిస్తారా? అల్లాహ్ కానుకలను తిరస్కరిస్తారా? అల్లాహ్ కు అబద్ధం ఆపాదించేవాణ్ణీ, సత్యం తన ముందుకు వచ్చిన తరువాత కూడా దానిని తిరస్కరించేవాణ్ణీ మించిన దుర్మార్గుడెవడు? అటువంటి అవిశ్వాసుల నివాసం నరకం కాదా? మా కొరకు తీవ్రప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము, నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులతో పాటే ఉంటాడు.


No comments:

Post a Comment