42 సూరహ్ అష్‌ షూరా

 42. అష్షూరా

ఆయతులు : 53                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

42. అష్షూరా  1 - 6 హా. మీమ్‌. ఐన్‌. సీన్‌. ఖాఫ్‌. ఇదేవిధంగా శక్తిమంతుడూ, వివేకవం తుడూ అయిన అల్లాహ్ నీ వైపునకూ, నీకు పూర్వం గతించిన (దైవప్రవక్తల) వైపునకూ వహీ ద్వారా సందేశం పంపుతూ వచ్చాడు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన మహోన్నతుడు, మహిమాన్వితుడు. త్వరలోనే ఆకాశం పైనుంచి బ్రద్దలైపోతుంది. దైవదూతలు తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు, భూలోక వాసులను మన్నించమని విన్నపాలు చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించే వాడూను అని తెలుసుకో. ఆయనను త్రోసిరాజని ఇతరులను తమ సంరక్ష కులుగా చేసుకున్న వారిని అల్లాహ్ కనిపెట్టే ఉన్నాడు. నీవు వారికి కాపలా దారువు కావు.

42. అష్షూరా  7 అవును, ప్రవక్తా! ఇదేవిధంగా, అరబ్బీ ఖురాన్ను మేము నీ వైపునకు వహీ ద్వారా పంపాము, నీవు జనపదాల కేంద్రం (మక్కా నగరం) లోనూ దాని పరిసరాలలోనూ ఉండే ప్రజలను హెచ్చరించాలనీసమావేశదినం గురించి వారిని భయపెట్టాలనీ  అది వచ్చే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక వర్గం వారు స్వర్గానికిపోతారు, మరొక వర్గం వారు నరకానికి పోతారు.

42. అష్షూరా  8 - 9 అల్లాహ్ కోరి ఉంటే, వారందరినీ ఒకే సంఘంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని తమ కృపకు పాత్రులను చేస్తాడు. దుర్మార్గు లను రక్షించేవాడుగానీ, వారికి సహాయపడే వాడు గానీ ఎవ్వడూ లేడు. వారు (ఎంతటి అవివేకులు) ఆయనను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారు? సంరక్షకుడు ఒక్క అల్లాహ్ మాత్రమే. ఆయనే మృతులను బ్రతికిస్తాడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలవాడు.

42. అష్షూరా  10 - 12 మీ మధ్య విషయంలో అభిప్రాయభేదం తలెత్తినా, దానిని గురించి తీర్పు చెప్పటం అల్లాహ్ పని. అల్లాహ్ యే  నా ప్రభువుఆయననే నేను నమ్ముకున్నాను, ఆయన దెసకే నేను (పశ్చాత్తాపంతో) మరలుతానుఆకాశాలకూ, భూమికీ సృష్టికర్త అయిన ఆయన, స్వయంగా మీ జాతి నుండే మీ కొరకు  జంటలను సృజించాడు  ఇదేవిధంగా పశువులలో కూడా (వాటి జాతి) జంటలను సృష్టించాడు. విధంగా ఆయన మీ సంతతులను వ్యాపింప జేస్తాడు. ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడూను. భూమ్యాకాశాలలోని నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. తాను కోరిన వారికి ఆయన పుష్కలంగా ఉపాధిని ఇస్తాడు  తాను కోరినవారికి ఆయన ఆచితూచి ఉపాధిని ఇస్తాడు. ఆయనకు ప్రతి విషయం గురించీ తెలుసు.

42. అష్షూరా  13 ఆయన నూహ్ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే (ముహమ్మద్‌ (సఅసమ్‌) ఇప్పుడు నీ వైపునకు మేము వహీ ద్వారా పంపాము  దానినే మేము ఇబ్రాహీమ్కు, మూసాకు, ఈసాకు బోధించాము  ధర్మాన్ని స్థాపించండి అనీ, దానిని గురించి విభేదాలకు లోను కాకండి అనీ తాకీదు చేస్తూ. విషయమే బహుదైవారాధకులకు ఎంతో అసహనం కలిగించింది  దాని వైపునకే (ముహమ్మద్‌ (సఅసమ్‌) నీవు వారిని ఆహ్వాని స్తున్నావు. అల్లాహ్ తాను కోరిన వారిని తనవారుగా చేసుకుంటాడు. ఆయన తన వైపునకు మరలేవారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు.

42. అష్షూరా  14 ప్రజల వద్దకు జ్ఞానం వచ్చిన తరువాతనే వారిలో విభేదం తల ఎత్తింది, వారు ఒకరికొకరు అన్యాయం చేయదలచుకున్న కారణంగానే తల ఎత్తింది. ఒక నిర్ణీత కాలం వరకు తీర్పు నిలిపివేయ బడిరది అని నీ ప్రభువు మొదట్లోనే సెలవిచ్చి ఉండకపోతే, వారి వ్యవహారం తేల్చివేయబడి ఉండేదే. యథార్థం ఏమిటంటే, వారి తరువాత గ్రంథానికి వారసులుగా చేయబడిన వారు దానిని గురించి ఆందోళనకరమైన సంశయానికి గురిఅయ్యారు.

42. అష్షూరా  15 ( పరిస్థితి ఉత్పన్నమయింది కాబట్టి) కనుక ముహమ్మద్‌! ఇప్పుడు నీవు ధర్మం వైపునకే ప్రజలను ఆహ్వానించు. నీకు ఆజ్ఞాపించబడిన విధంగా, దానిపై స్థిరంగా ఉండు, వారి కోరికలను అనుసరించకు. వారితో ఇలా అను, ‘‘అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నల్లా నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయమని నాకు ఆజ్ఞాపించబడిరది. మా ప్రభువూ అల్లాహ్ యే, మీ ప్రభువు కూడా అల్లాహ్ యే. మా కర్మలు మాకే, మీ కర్మలు మీకే. మీకూ మాకూ మధ్య వివాదమూ లేదు. ఒక రోజున అల్లాహ్ మన అందరినీ సమావేశపరుస్తాడు. అందరూ ఆయన వైపునకే పోవలసి ఉన్నది.’’

42. అష్షూరా  16 అల్లాహ్ సందేశాన్ని స్వీకరించిన తరువాత, (స్వీకరించిన వారితో) అల్లాహ్ ను గురించి వివాదపడే వారి వాదం వారి ప్రభువు దృష్టిలో అసత్య మైనది, వారిపై అల్లాహ్ ఆగ్రహం పడుతుంది, వారికి కఠిన శిక్ష విధించబడు తుంది.

42. అష్షూరా  17 - 18 సత్యసమేతమైన గ్రంథాన్నీ, తరాజునూ అల్లాహ్ యే అవతరింపజేశాడు. మీకేమి తెలుసు, బహుశా తీర్పు గడియ సమీపంలోనే ఉన్నదేమో. దాని రాకను విశ్వసించనివారే, దాని కొరకు తొందరపెడతారు. కాని దానిని విశ్వసించేవారు మాత్రం దానికి భయపడతారు. అది తప్పకుండా వస్తుందని వారికి తెలుసు. బాగా వినండి, గడియను గురించి సందేహం రేకెత్తించే వాదనలు చేసేవారు అపమార్గంలో చాలా దూరం వెళ్లిపోయారు.

42. అష్షూరా  19 - 20 అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో దయకలవాడు  తాను ఎవరికి ఏది ఇవ్వాలని కోరుకుంటాడో, అది వారికి ఇస్తాడు. ఆయన ఎంతో బలవం తుడు, ఎంతో శక్తిమంతుడూను. పరలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో, మేము అతనికై పంటను వృద్ధిపరుస్తాము. ఇహలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో, మేము అతనికి ఇహలోకంలోనిది మాత్రమే ఇస్తాము. కాని అతనికి పరలోకంలో మాత్రం వాటా ఉండదు.

42. అష్షూరా  21 - 23 అల్లాహ్ అనుమతించకుండానే, ధర్మం వంటి స్వభావం గల ఒక విధానాన్ని తమ కొరకు రూపొందించిన దైవ భాగస్వాముల నెవరినైనా వారు కలిగి ఉన్నారా? తీర్పు విషయం నిర్ణయింపబడి ఉండకపోతే, వారి వ్యవహారం ఎప్పుడో తేల్చివేయబడివుండేది. నిశ్చయంగా దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అప్పుడు దుర్మార్గులు తాము చేసిన దాని పరిణామానికి భయ పడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. అది తప్పకుండా వారి మీదకు వచ్చిపడుతుంది. దీనికి భిన్నంగా విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు స్వర్గ వనాలలో ఉంటారు. వారు తాము కోరిన దానిని తమ ప్రభువు వద్ద పొందు తారు. ఇదే గొప్ప అనుగ్రహం. దీని శుభవార్తనే అల్లాహ్ విశ్వసించి, సత్కా ర్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నేను పనికి మీనుండి ప్రతిఫలాన్నీ కోరను. అయితే బంధుప్రేమను తప్పకుండా కోర్తాను.’’ ఎవడు మంచిని సంపాదించుకుంటాడో, మేము అతని మంచిని మరింత పెంచుతాము. నిస్సందేహంగా అల్లాహ్ ఎంతో మన్నించే వాడూ, విలువనిచ్చి గుర్తించేవాడూను.

42. అష్షూరా  24 - 26 అతను అల్లాహ్ ను గురించి అభాండాన్ని కల్పించాడని వారు అంటున్నారా? అల్లాహ్ కోరితే నీ హృదయానికి సీలువేస్తాడు. ఆయన అసత్యాన్ని రూపుమాపుతాడు, సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిరూపి స్తాడు. ఆయన, గుండెలలో దాగివున్న రహస్యాలను సైతం ఎరుగును. ఆయనే తన దాసుల నుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి చెడులను ఉపేక్షిస్తాడు. వాస్తవానికి మీ చేష్టలన్నీ ఆయనకు తెలుసు. ఆయన, విశ్వసించి మంచిపనులు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు. తన కృపనుండి వారికి ఇంకా ఎక్కువగా ఇస్తాడు. ఇక తిరస్కరించే వారి విషయం  వారికైతే కఠిన శిక్షపడుతుంది.

42. అష్షూరా  27 - 35 ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధి ఇచ్చిన ట్లయితే, వారు ధరణిపై తిరుగుబాటు తుఫాను రేపి ఉండేవారు. కాని ఆయన ఒక లెక్క ప్రకారం తాను కోరినంత దానిని అవతరింపజేస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగునుఆయన వారిని కనిపెట్టే ఉంటాడు. ప్రజలు నిరాశకు గురిఅయినప్పుడు  ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు, తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు. ఆయనే సకల ప్రశంసలకూ అర్హుడైన సంరక్షకుడు. భూమ్యాకాశాల సృష్టీ, రెండు చోట్లా ఆయన వ్యాపింప జేసిన జీవరాసులూ ఆయన సూచనలలోనివే. ఆయన తాను కోరినప్పుడు వాటిని సమీకరించగలడు. మీపైకి వచ్చిన ఆపద, మీరు మీ చేజేతులా చేసు కున్న దానివల్లనే వచ్చింది. చాలా పొరపాట్లను ఆయన ఇట్టే మన్నించివేస్తాడు. మీరు భూమిలో దేవుణ్ణి అశక్తుడుగా చేయలేరు  అల్లాహ్ కు వ్యతిరేకంగా మీకు సహాయపడేవాడూ, మిమ్మల్ని రక్షించేవాడూ ఎవ్వడూ లేడు. సముద్రంలో కొండలు మాదిరిగా కనిపించే ఓడలు ఆయన సూచనలలోనివే. అల్లాహ్ తాను కోరినప్పుడు గాలిని స్తంభింపజేస్తాడు, అప్పుడు అవి సముద్రం వీపుపై నిలిచి ఉన్నవి నిలిచి ఉన్నట్లుగానే ఉండిపోతాయి - అత్యున్నత శ్రేణికి చెందిన సహనమూ కృతజ్ఞతా కల ప్రతి వ్యక్తికీ ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. - లేదా (వాటిపై ప్రయాణం చేసేవారి) అనేక పాపాలను క్షమిస్తూనే, వారు చేసిన కొన్ని అకృత్యాల ఫలితంగానే వారిని ముంచివేయవచ్చు. అప్పుడు మా వాక్యాలను గురించి వివాదాలకు దిగే వారికి, తమకు ఆశ్రయం లభించే స్థలం ఏదీ లేదని తెలిసిపోతుంది.

42. అష్షూరా  36 - 43 మీకు ఇవ్వబడినదంతా కేవలం కొన్ని రోజుల ప్రాపంచిక జీవితపు సామగ్రిమాత్రమే. కాని అల్లాహ్ వద్ద ఉన్నది శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది కూడా. అది ఎవరికోసమంటే  విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్నవారి కోసం, పెద్ద పెద్ద పాపాలకూ, సిగ్గుమాలిన పనులకూ దూరంగా ఉండేవారి కోసం, కోపం వచ్చినప్పుడు కూడా క్షమించేవారి కోసం, తమ ప్రభువు ఆజ్ఞను పాలించేవారికోసం, నమాజ్ను స్థాపించేవారికోసం, తమ వ్యవహారా లను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపుకునే వారి కోసం, మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చుచేసేవారి కోసం, తమపై దౌర్జన్యం జరిగినప్పుడు దానిని ఎదుర్కొనేవారి కోసం - చెడుకు ప్రతిక్రియ అదేరకమైన చెడు. కాని ఎవడైనా క్షమించి, రాజీపడితే దానికి ప్రతిఫలం ఇవ్వటం అల్లాహ్ బాధ్యత. అల్లాహ్ దుర్మార్గులంటే ఇష్టపడడు. తమకు అపకారం జరిగినప్పుడు ఎవరైనా ప్రతీకారం చేస్తే, వారిని నిందించటానికి వీలులేదు. అసలు నిందార్హులు ఇతరులకు అన్యాయం చేసేవారే, భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు చేసేవారే. అటువంటి వారికి వ్యధాభరితమైన శిక్షపడుతుంది. అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తేఅది  పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని.

42. అష్షూరా  44 - 46 అల్లాహ్ యే మార్గం తప్పించిన వాడిని ఆదుకునేవాడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు. దుర్మార్గులు శిక్షను చూచినప్పుడు, వెనక్కి వెళ్లిపోవ టానికి మార్గమేదైనా ఉందా? అని అడగటాన్ని నీవు చూస్తావు. వారిని నరకం ముందుకు తీసుకు వచ్చినప్పుడు వారు అవమానభారంతో క్రుంగిపోవటాన్నీ, దానిని దొంగచూపులతో చూడటాన్నీ నీవు గమనిస్తావు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, ‘‘ప్రళయదినం నాడు తననూ, తన సంబంధీకులనూ నష్టానికి గురిచేసేవాడే అసలు నష్టపోయేవాడు. జాగ్రత్త! దుర్మార్గులు శాశ్వతమైన యాతనకు గురిఅవుతారు. అల్లాహ్ కు వ్యతిరేకంగా వారి సహాయానికి వచ్చే సహాయకులు గానీ, సంరక్షకులుగానీ ఎవ్వరూ ఉండరు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వాడికి దాని నుండి బయటపడే మార్గమేదీ ఉండదు.

42. అష్షూరా  47 - 48  అల్లాహ్ తరఫు నుండి తొలగింపబడే అవకాశం మాత్రం లేనటువంటి రోజు రాక మునుపే, మీరు మీ ప్రభువు మాటను స్వీకరిం చండి. రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు, మీ స్థితిని మార్చటానికి ప్రయత్నం చేసేవాడూ ఎవడూ ఉండడు. ఇప్పుడు ఒకవేళ వారు ముఖం తిప్పుకుంటే, ప్రవక్తా! మేము నిన్ను వారిపై కాపలాదారుగా నియమించి పంపలేదు కదా! కేవలం మాటను అందజేసే బాధ్యత మాత్రమే నీపైన ఉన్నది. మానవుడి స్థితి ఎటువంటిదంటే, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపించినప్పుడు, దానికి అతడు ఆనందంతో పొంగిపోతాడు. ఒకవేళ అతడు తన చేతులతో చేసిందే ఆపద రూపంలో అతడిపైకి వచ్చిపడితే, అతడు కరుడుకట్టిన కృతఘ్నుడైపోతాడు.

42. అష్షూరా  49 - 50 భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అల్లాహ్ ప్రభువు  ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు  తనకు ఇష్టమైన వారికి కూతుళ్ళనూ, తాను కోరినవారికి కొడుకులనూ ఇస్తాడు  తనకు ఇష్టమైన వారికి కొడుకులనూ, కూతుళ్లనూ కలిపి ఇస్తాడు  తాను కోరినవారికి అసలు సంతానమే ఇవ్వడు. ఆయనకు అంతా తెలుసు, ఆయనకు అన్నిటిపైనా అధికారం ఉన్నది.

42. అష్షూరా  51 - 53 అల్లాహ్ ముఖాముఖి మాట్లాడే అంత స్థానం మానవునిది కాదు. ఆయన మాట్లాడటం అనేది వహీ (సంకేతం) ద్వారానైనా జరుగుతుంది లేదా తెర వెనుక నుండి అయినా జరుగుతుంది లేదా ఆయన సందేశహరుణ్ణి (దైవదూత) ఎవరినైనా పంపుతాడు  అతను ఆయన ఆజ్ఞానుసారం ఆయన కోరిన దానిని వహీ చేస్తాడు. ఆయన ఉన్నతుడూ, వివేకవంతుడూనూ. ఇదేవిధంగా ప్రవక్తా! మేము మా ఆజ్ఞ ద్వారా ఒక ఆత్మను నీ వైపునకు వహీ చేశాము. గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం  అంటే ఏమిటో నీవు అసలు ఎరుగవు. కాని మేము ఆత్మను ఒక జ్యోతిగా చేసి దాని ద్వారా మా దాసు లలో మేము కోరిన వారికి మార్గం చూపుతామునిశ్చయంగా నీవు ఋజు మార్గం వైపునకు దారి చూపుతున్నావు, భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి దానికీ ప్రభువైన దేవుని మార్గం వైపునకు దారి చూపుతున్నావు. జాగ్రత్త! వ్యవహారాలన్నీ అల్లాహ్ వైపునకే మరలుతాయి.

No comments:

Post a Comment