15 సూరహ్ అల్‌ హిజ్ర్‌

 

15. అల్హిజ్ర్

ఆయతులు : 99                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

15. అల్హిజ్ర్   1 అలిఫ్లామ్రా. ఇవి దైవ గ్రంథమైనటువంటి స్పష్టమైన ఖురానులోని ఆయతులు.

15. అల్హిజ్ర్   2 - 5 సమయం ఎంతో దూరంలో లేదు, (ఇస్లామ్సందేశాన్ని స్వీకరించ టానికి) తిరస్కరించిన వారే అప్పుడు పశ్చాత్తాపపడుతూ: ‘‘అయ్యో! మేము ముస్లిములము అయివుంటే ఎంత బాగుండేది’’ అని అంటారు. వారిని వదిలి పెట్టు - తినటానికి త్రాగటానికి సుఖాలు అనుభవించటానికీ, లేనిపోని ఆశలు వారిని భ్రమలో పడవేసి ఉంచటానికీ. అతి త్వరలోనే వారు దానిని గ్రహిస్తారు. మేము ఇంతకు పూర్వం నాశనం చేసిన ప్రతి పట్టణానికీ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ వ్యవధి ఇదివరకే వ్రాయబడి ఉన్నది. జాతి అయినా తన నిర్ణీత కాలానికి ముందే నాశనమూ కాదు, తరువాత తప్పించుకోనూ లేదు.

15. అల్హిజ్ర్   6 - 9 ప్రజలు ఇలా అంటారు: ‘‘ జ్ఞాపిక అవతరించిన మనిషీ! నీవు నిజంగానే పిచ్చివాడవు. నీవు చెప్పేది గనక సత్యమే అయితే మా ముందుకు దైవదూతలను ఎందుకు తీసుకురావు?’’ మేము దైవదూతలను ఊరకే అవతరింపజెయ్యము. వారు అవతరించినప్పుడు సత్యంతోపాటు అవతరిస్తారు, తరువాత ప్రజలకు వ్యవధి ఇవ్వటం అనేది జరగదు. ఇక జ్ఞాపిక, దానిని మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము.

15. అల్హిజ్ర్   10 - 15 ప్రవక్తా! మేము నీకు పూర్వం, గతించిన అనేక జాతులవద్దకు ప్రవక్తలను పంపివున్నాము. వారివద్దకు ప్రవక్త రావటమూ, వారు ఆయనను ఎగతాళి చెయ్యకుండా ఉండటమూ అనేది ఎన్నడూ జరగలేదు. దోషుల గుండెలలోకి మేము జ్ఞాపికను (ఊచలా) పోనిచ్చినా వారు దానిని విశ్వసిం చటం అనేది జరగదు. పూర్వకాలం నుండి కూడా ఇటువంటి ప్రజల విధానం ఇలాగే ఉంటూ వచ్చింది. ఒకవేళ మేము వారికొరకు ఏదైనా ఆకాశద్వారాన్ని తెరిచినా, వారు పట్టపగలు అందులోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు కూడా వారు ఇదే అంటారు: ‘‘మా కళ్ళు మోసపోతున్నాయి. మాపై మంత్రజాలం ప్రయో గించారు.’’

15. అల్హిజ్ర్   16 - 18 ఇది మేము చేసిన పని.మేము ఆకాశంలో దృఢతరములైన ఎన్నో కోటలను నిర్మించాము. చూపరుల కోసం వాటిని (నక్షత్రాలతో) అలంకరిం చాము. శాపగ్రస్తుడైన ప్రతి షైతాను నుండి వాటిని సురక్షితం చేశాము. షైతాను ఎవడైనా వాటిలోకి పోలేడు, దొంగచాటుగా ఏదైనా వినటం తప్ప. దొంగచాటుగా వినే ప్రయత్నం వాడు  చేసినప్పుడు  అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది.

15. అల్హిజ్ర్   19 - 25 మేము భూమిని పరిచాము. అందులో కొండలను పాతాము. అందులో అన్ని రకాల చెట్లు చేమలను కచ్చితమైన తగిన పరిమాణంలో సృష్టించాము. ఇంకా అందులో జీవనోపాధికి వనరులను ఏర్పాటు చేశాము- మీకూ మీరు పోషింపని అనేక ఇతర ప్రాణికోటికి కూడా. మావద్ద పుష్కలంగా నిలువలు లేని వస్తువంటూ ఏదీ లేదు.  మేము  వస్తువును అవవతరింప జేసినా, దానిని ఒక నిర్ణీత పరిమాణంలో అవతరింపజేస్తాము. ఉత్పత్తికారకము లైన గాలులను మేమే పంపుతున్నాము. తరువాత ఆకాశం నుండి నీళ్ళను వర్షింపజేస్తున్నాము. నీళ్ళను మీకు తనివితీరా త్రాగటానికి ఇస్తున్నాము. సంపదకు యజమానులు మీరు కాదు. జీవన మరణాలను మేము కలిగిస్తున్నాము. మేమే అందరికీ వారసులము అయ్యే  వారము. మీలో పూర్వం గతించిన వారిని కూడా మేము చూశాము. తరువాత వచ్చేవారు కూడా మా దృష్టిలో ఉన్నారు. నిశ్చయంగా మీ ప్రభువు వారందరినీ సమావేశ పరుస్తాడు. ఆయన వివేకవంతుడూ, అన్నీ తెలిసినవాడూను.

15. అల్హిజ్ర్   26 - 43 మేము మానవుణ్ణి కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టిం చాము. దీనికి పూర్వం జిన్నాతులను మేము తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించి ఉన్నాము. నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో: ‘‘నేను కుళ్ళిన మట్టియొక్క ఎండినగారతో  ఒక  మానవుణ్ణి సృష్టిస్తున్నాను. నేను అతణ్ణి పూర్తిగా తయారుచేసి, అతనిలో నా ఆత్మను కొద్దిగా ఊదినప్పుడు, మీరంతా అతని ముందు సాష్టాంగపడాలి.’’ అప్పుడు దైవ దూతలందరూ సాష్టాంగపడ్డారు, ఒక్క ఇబ్లీసు తప్ప. అతడు సాష్టాంగపడేవారితో చేరటానికి తిరస్కరించాడు. ప్రభువు ఇలా అడిగాడు: ‘‘ఇబ్లీస్‌! నీకేమయిందని నీవు సాష్టాంగపడేవారితో చేరిపోలేదు?’’ అతడు ఇలా అన్నాడు: ‘‘కుళ్ళిన మట్టియొక్క ఎండినగారతో నీవు సృష్టించిన మనిషికి సాష్టాంగపడటం నాకు తగిన పనికాదు.’’ ప్రభువు ఇలా సెలవిచ్చాడు: ‘‘సరే, అయితే వెళ్ళిపో ఇక్కడినుంచి, ఎందుకంటే, నీవు శాపగ్రస్తుడవయ్యావు. ఇక తీర్పుదినం వరకూ నీపై శాపం ఉంటుంది.’’ అతడు ఇలా విన్నవించుకున్నాడు: ‘‘ప్రభూ! అలాగైతే మానవు లందరూ మళ్ళీ లేపబడే రోజు వరకు నాకు వ్యవధి ప్రసాదించు.’’ ఇలా సెలవిచ్చాడు: ‘‘మంచిది, రోజు వరకు నీకు వ్యవధి ఇవ్వబడుతోంది. రోజు వచ్చే సమయం మాకు తెలుసు.’’ అతడు ఇలా చెప్పాడు: ‘‘ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించినట్లే ఇక నేను వారికొరకు మనస్సును మోహింపజేసే విషయాలను భూమిలో సృష్టించి వారందరినీ అపమార్గం పట్టిస్తాను, వారిలో నీవు ప్రత్యేకం చేసుకున్న నీ దాసులను తప్ప.’’  ఇలా సెలవిచ్చాడు: ‘‘నన్ను చేరే తిన్నని మార్గం ఇదే. నిస్సందేహంగా, నా నిజమైన దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం కేవలం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. వారందరి కొరకు వాగ్దానం చెయ్యబడిన నివాస స్థలం నరకం.’’

15. అల్హిజ్ర్   44 - 48 (ఇబ్లీసు అనుచరులకు వాగ్దానం చెయ్యబడిన) నరకానికి ఏడు ద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం వారిలోని ఒక్కొక్క ప్రత్యేక వర్గానికి కేటాయించబడిరది. దీనికి భిన్నంగా, భయభక్తులు కలవారు తోటలలో చెలమల మధ్య ఉంటారు. వారితో ఇలా అనబడుతుంది : ‘‘ప్రవేశించండి వాటిలోకి, శాంతితోనూ, నిర్భయంగానూ.’’  వారి  హృదయాలలో ఇంకా మిగిలి వున్న మాలిన్యాన్నీ కాపట్యాన్నీ మేము తొలగిస్తాము. వారు పరస్పరం సోదరులై ఎదురెదురుగా పీఠాలపై కూర్చుంటారు. అక్కడ వారు ఎట్టి శ్రమకూ గురికారు. అక్కడి నుండి వారు బహిష్కరింపనూబడరు.

15. అల్హిజ్ర్   49 - 50 ప్రవక్తా! నేను చాలా క్షమించేవాణ్ణి అనీ, కరుణించేవాణ్ణి అనీ, దీనితోపాటు, నా శిక్షకూడా చాలా బాధాకరమైన శిక్షే అనీ నా దాసులకు చెప్పు.

15. అల్హిజ్ర్   51 - 60 వారికి ఇబ్రాహీము అతిధుల గాధను కొంచెం వినిపించు. వారు అతని వద్దకు వచ్చి, ‘‘మీకు శాంతి కలుగుగాక’’ అని అన్నప్పుడు, అతను ఇలా అన్నాడు: ‘‘మేము మిమ్మల్ని చూచి భయపడుతున్నాము.’’ వారు ఇలా సమాధానం పలికారు: ‘‘భయపడకండి, మేము మహావివేకవంతుడైన  ఒక కుమారుడు మీకు కలుగుతాడు అనే శుభవార్తను మీకు అందజేస్తున్నాము.’’ ఇబ్రాహీము ఇలా అన్నాడు: ‘‘ఏమిటి, ముసలితనంలో మీరు నాకు సంతాన శుభవార్తను అందజేస్తున్నారా? కొంచెం  ఆలోచించండి, మీరు ఎటువంటి శుభవార్తను నాకు అందజేస్తున్నారో?’’  వారు ఇలా జవాబు ఇచ్చారు: ‘‘మేము మీకు సత్యమైన శుభవార్తను అందజేస్తున్నాము. మీరు నిరాశపడకండి.’’ ఇబ్రాహీము ఇలా అన్నాడు: ‘‘తమ ప్రభువు కారుణ్యంపట్ల మార్గం తప్పినవారు మాత్రమే నిరాశపడతారు.’’ ఇబ్రాహీము ఇలా అడిగాడు: ‘‘అల్లాహ్ దూతలారా! కార్యం నిమిత్తం తమరు వేంచేశారు?’’ వారు ఇలా చెప్పారు: ‘‘మేము ఒక నేరస్థజాతి వైపునకు పంపబడ్డాము. కేవలం లూత్ఇంటివారే మినహాయించబడ్డారు. వారందరినీ మేము రక్షిస్తాము, ఒక్క అతని భార్యను తప్ప. ఎందుకంటే వెనుక ఉండిపోయేవారిలో ఆమె చేరిపోతుందని మేము నిర్ణయించాము’’ (అని అల్లాహ్ అన్నాడు).

15. అల్హిజ్ర్   61 - 66 తరువాత దైవదూతలు లూత్వద్దకు వెళ్ళినప్పుడు, అతను, ‘‘మీరు కొత్తవారుగా కనిపిస్తున్నారు’’ అని అన్నాడు. వారు ఇలా సమాధానం చెప్పారు: ‘‘కాదు, కాని ప్రజలు దేనిరాకనైతే శంకిస్తున్నారో దాన్ని మేము తీసుకువచ్చాము. మేము నీతో నిజం చెబుతున్నాము. మేము సత్యంతో నీ వద్దకు వచ్చామని. కనుక ఇప్పుడు, నీవు కొంచెం రాత్రి ఉండగానే నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు. స్వయంగా నీవూ వారి వెనుక నడువు. మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు, ‘పొండిఅని మిమ్మల్ని ఆజ్ఞాపించే వైపు నకే మీరు నేరుగా పొండి.’’ ఉదయం అవుతూ ఉండగానే వారు సమూలంగా నాశనం చెయ్యబడతారని మేము అతనికి మా నిర్ణయాన్ని తెలియజేశాము.

15. అల్హిజ్ర్   67 - 71 ఇంతలోనే నగరవాసులు సంతోషం పట్టలేక లూత్ఇంటిమీదికి వచ్చారు. లూత్ఇలా అన్నాడు: ‘‘సోదరులారా! వీరు నా అతిథులు. నన్ను నవ్వులపాలు చెయ్యకండి. అల్లాహ్ కు భయపడండి. నన్ను అవమాన పరచ కండి.’’ వారు ఇలా చెప్పారు: ‘‘ప్రపంచంలోని ప్రతివాణ్ణి వెనకేసుకు రావద్దని మేము నిన్ను  ఎన్నోసార్లు వారించలేదా?’’ లూత్‌ (బ్రతిమాలుతూ) ఇలా అన్నాడు: ‘‘మీకు ఏదన్నా చెయ్యాలనే ఉంటే, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు.’’

15. అల్హిజ్ర్   72 - 74 ప్రవక్తా! నీ ప్రాణం సాక్షిగా! సమయంలో వారికి ఒక కైపులాంటిది ఎక్కింది. దానితో వారు స్వాధీనత కోల్పోయారు. చివరకు తెల్లవారగానే ఒక భయంకరమైన  ప్రేలుడు  వారిపైకి వచ్చిపడిరది. మేము నగరాన్ని తల్లక్రిందులు చేసేశాము. వారిపై కాల్చిన మట్టి రాళ్ళ వర్షాన్ని కురిపించాము.

15. అల్హిజ్ర్   75 - 77 దూరదృష్టిగల వారికి సంఘటనలో గొప్ప సూచనలు ఉన్నాయి. ( సంఘటన జరిగిన) ప్రాంతం రహదారిపై ఉన్నది. ఇందులో విశ్వాసులకు గుణపాఠం నేర్పే విషయాలు ఉన్నాయి.

15. అల్హిజ్ర్   78 - 79 ‘‘అయికహ్ జాతీయులు’’ దుర్మార్గులు. కనుక, చూడండి, మేము కూడా వారికి ప్రతీకారం చేశాము. రెండు జాతుల శిథిలమైన ప్రాంతాలు రహదారులపై ఉన్నాయి.

15. అల్హిజ్ర్   80 - 84 హిజ్ర్ప్రజలు కూడా ప్రవక్తలను నిరాకరించారు. మేము మా ఆయతులను వారికడకు పంపాము. మా సూచనలను వారికి చూపాము. కాని వారు వాటన్నింటినీ విస్మరిస్తూనే వచ్చారు. వారు కొండలను తొలిచి గృహాలను నిర్మిస్తూ ఉండేవారు. వారు తమ స్థానంలో నిర్భయంగా, నిశ్చింతగా ఉండేవారు. తుదకు ఉదయం వేళ ఒక తీవ్రమైన ప్రేలుడు వారిపై వచ్చిపడిరది. వారి సంపాదన వారికి మాత్రం పనికిరాకుండా పోయింది.

15. అల్హిజ్ర్   85 - 93  మేము భూమినీ, ఆకాశాలనూ వాటిలో ఉన్న సమస్తాన్నీ సత్యం పునాదిగా తప్ప మరొకటేదీ పునాదిగా సృష్టించలేదు. తీర్పు గడియ నిశ్చయముగా రానున్నది. కనుక ప్రవక్తా! నీవు (వారి కుచేష్టలను) పెద్దమనిషి తరహాలో మన్నించు. నిశ్చయంగా నీ ప్రభువు అందిరినీ సృష్టించిన వాడూ అంతా తెలిసినవాడూను. మేము నీకు ఏడు ఆయతులను ఇచ్చాము. అవి మాటిమాటికీ పఠింపదగినవి. ఇంకా నీకు మహత్తరమైన ఖురానును ప్రసా దించాము. వారిలోని విభిన్న వర్గాల వారికి మేము ఇచ్చిన ఐహిక సంపద వైపు నీవు కన్నెత్తి కూడా చూడకు. వారి స్థితికి బాధపడకు. వారిని విడిచిపెట్టి విశ్వాసుల వైపునకు మొగ్గు.  ఇంకా (అవిశ్వాసులతో)  ‘‘నేను  స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే’’ అని అను. ఇది తమ ఖురానును తుత్తునియలుగా చేసిన విభేదకారకుల వైపునకు మేము పంపిన హెచ్చరిక వంటిదే. కనుక నీ ప్రభువు సాక్షిగా మేము తప్పకుండా వారందరినీ ‘‘మీరేమి చేస్తూ ఉండేవారు?’’ అని అడుగుతాము.

15. అల్హిజ్ర్   94 - 96 కనుక ప్రవక్తా! నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు. షిర్కు చేసేవారిని ఏమాత్రం లెక్కచేయకు.  నిన్ను  ఎగతాళి చేసేవారికీ, అల్లాహ్తోపాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా నిర్ణయించేవారికీ నీ  తరఫున బుద్ధి చెప్పటానికి మేము చాలు.  త్వరలోనే వారికి తెలిసిపోతుంది.

15. అల్హిజ్ర్   97 - 99  వారు  నిన్ను గురించి కల్పిస్తున్న మాటలవల్ల నీ మనస్సుకు మిక్కిలి కష్టం కలుగుతోందని మాకు తెలుసు.  (దానికి చికిత్స ఏమిటంటే)  నీ ప్రభువు స్తోత్రం చేస్తూ ఆయన పవిత్ర నామాన్ని స్మరించు. ఆయన సన్నిధానంలో సాష్టాంగపడు. తప్పకుండా వచ్చే చివరి గడియవరకూ నీ ప్రభువు దాస్యం చేస్తూ వుండు.




No comments:

Post a Comment