75 సూరహ్ అల్‌ ఖియామహ్

 

75. అల్ఖియామహ్

ఆయతులు : 40                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 30 కాదు, నేను ప్రళయదినం సాక్షిగా చెబుతున్నాను  కాదు, నేను ప్రబోధించే అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను  మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు అనుకుంటున్నాడా? ఎందుకు జతచేయలేము? మేము అతని వ్రేళ్ల కొసలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులం. కాని మానవుడు ఇక ముందు కూడ దుష్కార్యాలు చేయగోరు తున్నాడు. ‘‘ ప్రళయ దినం అసలు ఎప్పుడు వస్తుంది?’’ అని ప్రశ్నిస్తున్నాడు. తరువాత, కనుగుడ్లు తేలవేయటం జరిగినప్పుడు, చంద్రుడు కాంతిహీనుడై పోయినప్పుడు,  సూర్యచంద్రులు  ఒకటిగా  కలిపివేయబడినప్పుడు, మానవుడే, ‘‘ఎక్కడకు పారిపోవాలి?’’ అని అంటాడు.  ఎన్నటికీ జరగదు, అక్కడ ఎలాంటి ఆశ్రయమూ ఉండదు. రోజున నీ ప్రభువు వద్దకే పోయి ఆగవలసి ఉంటుంది.    రోజున మానవుడికి అతడు ముందూ వెనుకా  చేసిందీ, చేయించిందీ అంతా తెలుపబడుతుంది. అదీగాక, మానవుడు ఎన్ని సాకులు చెప్పినా, స్వయంగా అతనికే తనను గురించి బాగా తెలుసు. - ప్రవక్తా! వహీని (సందేశాన్ని) త్వరత్వరగా జ్ఞాపకం చేసుకోవటానికి నీ నాలుకను ఆడిరచకు   దీనిని జ్ఞాపకం చేయించటం, చదివించటం మా బాధ్యత. కనుక మేము దీనిని పఠిస్తున్నప్పుడు, నీవు పారాయణాన్ని శ్రద్ధగా ఆలకించు. ఇంకా దాని భావం అర్థమయ్యేలా చేయటం కూడ మా బాధ్యతే - ఎంతమాత్రం కాదు, అసలు విషయం ఏమిటంటే, మీరు త్వరగా లభ్యమయ్యే వస్తువుల పట్ల (అంటే ఇహలోకం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు  పరలోకాన్ని విడిచిపెడుతున్నారు. రోజున  కొందరి ముఖాలు కళ కళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు, కొందరి ముఖాలు చిన్నబోయి ఉంటాయి, తమ పట్ల నడుములు విరిగే విధంగా వ్యవహరించవచ్చని వారు అనుకుంటూ ఉంటారు. ఎంతమాత్రం కాదు, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు, మంత్రించి ఊదే వారెవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు, ఇది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలుతో మరొకకాలు కలిసిపోయినప్పుడు, అది నీ ప్రభువు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది.

31 - 35 కాని అతడు సత్యాన్నీ నమ్మలేదు, నమాజునూ చేయలేదు, అంతేకాదు తిరస్కరించి ముఖం తిప్పుకున్నాడు. తరువాత నిక్కుతూ, నీల్గుతూ తన ఇంటివారి దగ్గరకు వెళ్లిపోయాడు. వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది! నీకు మాత్రమే శోభిస్తుంది! అవును, వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది! నీకు మాత్రమే శోభిస్తుంది!

36 - 40 మానవుడు తనను విచ్చలవిడిగా వదిలిపెట్టటం జరుగుతుందని భావిస్తున్నాడా? అతడు (తల్లి గర్భంలో) కార్చబడిన నీచమైన ఒక నీటి బిందువుకాడా? తరువాత అతడు ఒక నెత్తుటి ముద్దగా మారాడు  తరువాత అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు  ఆపై అతని అవయవాలను రూపొందించాడు. అటుపై దానినుండి స్త్రీ పురుషుల రెండు రకాల (జాతుల)ను సృష్టించాడు. అలాంటప్పుడు ఆయన మరణించిన వారిని మళ్లీ బ్రతికిం చలేడా?

No comments:

Post a Comment