50. ఖాఫ్
ఆయతులు
: 45 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 4 ఖాఫ్. మహోన్నతమైన ఖురాన్ సాక్షిగా- అయితే, హెచ్చరిక చేసేవాడు స్వయంగా వారిలో నుండే వారివద్దకు వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది. తరువాత
సత్య తిరస్కారులు
ఇలా అనసాగారు, ‘‘మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ, (మళ్లీ బ్రతికింపబడతామా?) ఇది చాల విచిత్రంగా ఉంది.ఈ తిరుగు ప్రయాణం అనేది బుద్ధికి అందని విషయం. (వాస్తవానికి) వారి శరీరాలలో నుండి భూమి తినేదంతా మాకు తెలుసు. మా వద్ద ఒక గ్రంథం ఉన్నది, అందులో అంతా సురక్షితంగా ఉన్నది.
5 కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినప్పుడే దానిని బాహాటంగా తిరస్క రించారు. ఈ కారణంవల్లనే వారు ఇప్పుడు చిక్కులలో పడిపోయారు.
6 - 11 సరే, అయితే వారు తమపై ఉన్న ఆకాశం వైపు ఎన్నడూ చూడలేదా? మేము దానిని ఎలా నిర్మించి, అలంకరించామో? అందులో ఎలాంటి పగుళ్లూ లేవు. మేము భూమిని పరిచాము, అందులో పర్వతాలను స్థిరపరచాము. అందులో మనోహరమైన అన్నిరకాల వృక్షజాతులను మొలకెత్తించాము. (సత్యం వైపునకు) మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్లు తెరిపించేవీ, గుణపాఠం నేర్పేవీ అయిన విషయాలు. ఆకాశం నుండి మేము శుభవంతమైన నీటిని అవతరింపజేశాము.
తరువాత దానిద్వారా తోటలనూ, పంట ధాన్యాలనూ, ఎంతో పొడవైన ఖర్జూరపు వృక్షాలనూ పుట్టించాము. వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇది దాసులకు ఉపాధినిచ్చే ఏర్పాటు. ఈ నీటితో మేము మృత భూమికి ప్రాణం పోస్తాము. (మరణించిన మానవులు భూమినుండి) లేవటం కూడ ఈ విధంగానే జరుగుతుంది.
12 - 14 వారికి పూర్వం నూహ్ జాతి, అర్రస్ వాసులు మరియు సమూద్, ఆద్, ఫిరౌన్ జాతులు,
లూత్ సోదరులు, అయ్కా వారు మరియు తుబ్బా జాతి ప్రజలు కూడా తిరస్కరించారు. చివరకు నా హెచ్చరిక వారి విషయంలో యదార్థమని నిరూపితమైపోయింది.
15 మొదటిసారి సృష్టితోనే మేము అశక్తులమైపోయామా? అయినా వారు కొత్త సృష్టిని గురించి అనుమానంలో పడిపోయారు.
16 - 29 మేము మానవుణ్ణి సృష్టించాము, అతని మనస్సులో మెదిలే ఊహలను సైతం మేము ఎరుగుదుము. మేము అతని కంఠరక్తనాళం కంటే కూడా అతనికి చాలా దగ్గరగా ఉన్నాము. అంతేకాదు (మా ఈ ప్రత్యక్ష సమాచారం కాక) ఇద్దరు లేఖకులు అతనికి కుడి ఎడమ ప్రక్కల కూర్చుండి ప్రతి విషయాన్నీ నమోదు చేస్తూ ఉన్నారు. అతని నోటి నుండి వెడలే ప్రతి మాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు. ఇదిగో, చూడండి, మరణయాతన సత్యంతో వచ్చేసింది. నీవు తప్పించుకోవ టానికి ప్రయత్నం చేసిన విషయం ఇదే. తరువాత శంఖం ఊదబడిరది
ఈ దినాన్ని గురించే నిన్ను భయపెట్టటం జరుగుతూ ఉండేది. ప్రతి వ్యక్తీ తన వెంట ఒక తోలేవాడూ, ఒక సాక్ష్యం చెప్పేవాడూ ఉన్న స్థితిలో వస్తాడు. ఈ విషయం గురించి నీవు అశ్రద్ధలో పడి ఉన్నావు. మేము నీ ముందు పడి ఉన్న తెరను తొలగించాము, ఈనాడు నీ దృష్టి చాలా సునిశితంగా ఉన్నది. అతని సహచరుడు, ‘‘ఇదిగో, నా అధీనంలో ఉన్న ఇతనిని హాజరుపరుస్తు న్నాను’’ అని విన్నవించుకున్నాడు. ఇలా ఆజ్ఞాపించడుతుంది ‘‘కరుడుకట్టిన ప్రతి అవిశ్వాసిని నరకంలో విసరివేయండి. అతడు సత్యం పట్ల ద్వేషభావం కలిగి ఉండేవాడు,
మంచిని నిరోధిస్తూ ఉండేవాడు, హద్దులు అతిక్రమిస్తూ ఉండేవాడు, అనుమానంలో పడి ఉండేవాడు,
అల్లాహ్తోపాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా చేసుకున్నవాడు. కనుక అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేయండి.’’ అతని సహచరుడు ఇలా మనవి చేసుకున్నాడు, ‘‘స్వామీ! నేను ఇతనిని తిరుగుబాటుదారుగా చేయలేదు. కాని ఇతడే స్వయంగా మార్గం తప్పి చాలా దూరం పోయాడు.’’
దానికి ఇలా సెలవీయబడిరది, ‘‘నా సమక్షంలో వాదించకండి. నేను ముందుగానే చెడు పర్యవసానం గురించి హెచ్చరికచేసి ఉన్నాను. నా దగ్గర మాట మార్చటం అంటూ జరగదు. నేను నా దాసులపై దౌర్జన్యం చేసేవాడను కాను.’’
30 - 35 ఆనాడు మేము నరకాన్ని, ‘‘నీవు నిండిపోయావా?’’ అని అడిగి నప్పుడు, అది, ‘‘ఇంకేమైనా మిగిలిఉందా?’’ అని అంటుంది.
స్వర్గం భయభక్తులు కలవారికి చాల దగ్గరగా తీసుకురాబడుతుంది, ఏమాత్రం దూరంగా ఉండదు. ఇంకా ఇలా సెలవీయబడుతుంది, ‘‘మీకు వాగ్దానం చేయబడుతూ ఉండిన విషయం ఇదే
ఎక్కువగా అల్లాహ్ వైపునకు మరలే వాడూ, అల్లాహ్ హద్దులను పరిరక్షించే వాడూ, చూడకుండానే కరుణామయు డికి భయపడేవాడూ, ఏకాగ్రహృదయంతో వచ్చినవాడూ అయిన ప్రతి వ్యక్తికీ ఇది లభిస్తుంది. స్వర్గంలో ప్రవేశించండి, శాంతిసౌభాగ్యాలతో.’’ ఆ దినం శాశ్వత జీవిత దినం అవుతుంది.
అక్కడ వారికి వారు కోరుకునేవన్నీ లభి స్తాయి.
అవి కాక మా వద్ద వారికి ఇంకా ఎన్నో లభిస్తాయి. అత్యధికంగానూ లభిస్తాయి.
36 - 37 మేము వారికి పూర్వం ఎన్నో జాతులను నాశనం చేసి ఉన్నాము. వారు వీరికంటే ఎంతో ఎక్కువ శక్తిమంతులు, వారు అనేక ప్రపంచ దేశాలను చుట్టివచ్చారు. అయితే వారు ఎక్కడైనా, ఏదైనా ఆశ్రయం పొందగలిగారా? హృదయం ఉండీ, విషయాన్ని శ్రద్ధగా ఆలకించే ప్రతి వ్యక్తికీ ఈ చరిత్రలో గుణపాఠం ఉన్నది.
38 - 40 మేము భూమినీ, ఆకాశాలనూ, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులనూ ఆరు దినాలలో సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసటా కలుగలేదు. కనుక ప్రవక్తా! వారు కల్పిస్తున్న విషయాల పట్ల సహనం వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి సమ యంలో
కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు, సజ్దాలు చేయటం పూర్తి అయిన తరువాత కూడా.
41 - 44 ఇంకా విను: ఏ రోజు చాటింపువేసేవాడు (ప్రతి మనిషికీ) అతి దగ్గర నుండే కేకవేస్తాడో,
ఏ రోజు ప్రజలందరూ హషర్ కేకను స్పష్టంగా వింటూ ఉంటారో, ఆ రోజు భూమి నుండి మృతులు బయల్పడే రోజు అవు తుంది. మేమే ప్రాణం పోస్తున్నాము, మేమే ప్రాణం తీస్తున్నాము, మా వైపునకే ఆనాడు అందరూ మరలి రావలసి ఉంటుంది. ఆనాడు భూమి బ్రద్దలవుతుంది, మానవులు దాని లోపల నుండి బయల్పడి తొందర తొందరగా పరుగెత్తుతూ ఉంటారు. బ్రతికించి, సమీకరించటం అనే ఈ విషయం మాకు ఎంతో తేలికైన పని.
45 ప్రవక్తా! వారు కల్పిస్తున్న విషయాలు ఏమిటో మేము బాగా ఎరుగుదుము. వారిచేత బలవంతంగా విషయాన్ని ఒప్పించటం నీ పని కాదు. కనుక నీవు ఈ
ఖురాన్ ద్వారా నా హెచ్చరికకు భయపడే ప్రతి వ్యక్తికీ హితోపదేశం చేయి
No comments:
Post a Comment