114 సూరహ్ అన్ నాస్

114 అన్ నాస్

ఆయతులు : 6                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 6 ఇలా అను:  నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం (అయిన అల్లాహ్) శరణుకోరుతున్నాను - దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడునుండి.  వాడు  మాటిమాటికీ  మరలి వస్తూ ప్రజల మనస్సుల్లో దుష్ట భావాలను రేకెత్తిస్తాడు, వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు లేదా మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు. 

No comments:

Post a Comment