44. అద్ దుఖాన్
ఆయతులు
: 59 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
44. అద్ దుఖాన్ 1 - 9 హా. మీమ్. స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా! మేము దానిని ఎంతో మేలైన, అత్యంత శుభవంతమైన రాత్రివేళ అవతరింపజేశాము. ఎందుకంటే మేము ప్రజలను హెచ్చరించదలచాము. ఈ రాత్రే ప్రతి విషయానికీ సంబం ధించిన వివేకవంతమైన నిర్ణయం మా ఆజ్ఞానుసారం జారీ అవుతుంది. మేము ఒక ప్రవక్తను నీ ప్రభువు కారుణ్యంగా పంపాలనుకున్నాము. నిశ్చ యంగా ఆయన మాత్రమే అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడు, ఆకాశాలకూ భూమికీ ప్రభువు, భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి వస్తువునకూ ప్రభువు - మీరు నిజంగా విశ్వాసులే అయితే (ఈ విషయాన్ని గ్రహించండి). ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మరణాన్నీ ఇస్తాడు. ఆయనే మీ ప్రభువు, గతించిన మీ పూర్వికుల ప్రభువు. (కాని వాస్తవంగా వారికి నమ్మకం లేదు) అయితే వారు శంకతో ఆడుకుం టున్నారు.
44. అద్ దుఖాన్ 10 - 16 సరే, స్పష్టమైన పొగను ఆకాశం తీసుకుని వచ్చే దినం కొరకు నిరీక్షించండి. అది ప్రజలను కమ్ముకుంటుంది. ఇదే, వ్యధాభరితమైన శిక్ష. (అప్పుడు వారు ఇలా అంటారు) ‘‘ప్రభూ! ఈ శిక్షను మాపై నుండి తొలగించు. మేము విశ్వసిస్తున్నాము.’’ వారి అశ్రద్ధ ఎలా దూరం అవుతుంది? వారి వద్దకు సాక్షాత్తుగా ఒక ప్రవక్త వచ్చినప్పటికీ, వారు అతని పట్ల శ్రద్ధ చూపలేదు సరికదా పైగా, ‘‘ఇతను ఒక పిచ్చివాడు, ఇతరుల నుండి నేర్చుకున్నాడు’’ అని అన్నారు. ఇలా ఉంది వారి పరిస్థితి. మేము శిక్షను కొంచెం తొలగిస్తే, మీరు పూర్వం చేస్తూ ఉన్నదానినే మళ్లీ చేస్తారు. మేము గట్టిదెబ్బకొట్టే ఆ రోజు, మేము మీకు ప్రతీకారం చేసేరోజు అవుతుంది.
44. అద్ దుఖాన్ 17 - 33 మేము వారికి పూర్వం, ఫిరౌన్ జాతి వారిని ఇటువంటి పరీక్షకే గురిచేశాము. వారివద్దకు ఎంతో మర్యాదస్తుడైన ఒక ప్రవక్త వచ్చాడు. అతను ఇలా అన్నాడు, ‘‘అల్లాహ్ సేవకులను నాకు అప్పగించండి. నేను మీ కొరకు వచ్చిన ఒక నమ్మకస్తుడనైన ప్రవక్తను. అల్లాహ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి. నేను మీ ముందు (నా నియామకానికి సంబంధించిన) స్పష్టమైన ప్రమాణాన్ని ఉంచుతున్నాను. మీరు నా మీద దాడిచేయకుండా నేను మన ప్రభువు
యొక్క శరణుపొందాను. ఒకవేళ మీరు నా మాట నమ్మకపోతే సరే, నా జోలికి మట్టుకు రాకండి.’’ చివరకు అతను, ‘‘ఈ ప్రజలు అపరాధులు’’ అని తన ప్రభువుతో చెప్పుకున్నాడు. (ఇలా జవాబు ఇవ్వబడిరది), ‘‘మంచిది. రాత్రికి రాత్రే నా సేవకులను తీసుకుని బయలుదేరు. మిమ్మల్ని వెంటాడటం జరుగుతుంది. సముద్రాన్ని అది ఉన్న స్థితిలోనే విడిచిపెట్టు. అప్పుడు ఈ సైన్యం అంతా మునిగిపోతుంది.’’ వారు ఎన్ని తోటలను, ఎన్ని నీటి బుగ్గలను, ఎన్ని పొలాలను, ఎన్ని అందమైన సౌధాలను వదలివెళ్లారు! వారు అనుభవిస్తూ ఉన్న విలాస వస్తువులు ఎన్నో వారి వెనుకనే ఉండిపోయాయి! ఇలా జరిగింది వారి ముగింపు. మేము ఇతరులను ఈ వస్తువులకు వారసులుగా చేశాము. తరువాత వారి కొరకు ఆకాశమూ విలపించలేదు, భూమీ విలపించలేదు. వారికి కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు. ఈ విధంగా మేము ఇస్రాయీల్ సంతతి వారికి అత్యంత అవమానకరమైన శిక్ష నుండి, ఫిరౌన్ నుండి విమోచనం కలిగించాము. అతడు హద్దులు మీరిన వారిలో నిజంగానే అగ్రశ్రేణికి చెందినవాడు. వారి పరిస్థితిని ఎరిగి ఉండి కూడా వారికి ప్రపం చంలోని ఇతర జాతులపై ప్రాధాన్యం ఇచ్చాము. వారి కొరకు స్పష్టమైన పరీక్షగా సూచనలను వారికి చూపించాము.
44. అద్ దుఖాన్ 34 - 42 వారు ఇలా అంటారు, ‘‘మాకు మా మొదటి మరణమే తప్ప తరు వాత మరింకేమీ లేదు. దాని తరువాత మేము లేపబడే వారము కానేకాము. నీవు నిజమే పలుకుతున్నట్లయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురా.’’ వారు మేలైనవారా లేక తుబ్బా జాతివారా, దానికి ముందువారా? వారు అపరాధులై పోయిన కారణంగానే మేము వారిని నాశనం చేశాము. ఈ ఆకాశాన్నీ, ఈ భూమినీ, వాటి మధ్య ఉన్న వస్తువులనూ మేము వినోదం కోసం సృష్టించలేదు సుమా. వాటిని మేము సత్యంతోనే సృష్టించాము. కాని వారిలో అనేకులు ఎరుగరు. వారందరూ లేపబడటానికి నిర్ణయించబడిన సమయం తీర్పు దినమే. ఆనాడు దగ్గరబంధువు అయినాసరే తన దగ్గర బంధువుకి కూడా ఎంతమాత్రం ఉపయోగపడడు
ఎవరి నుండీ వారికి ఏ సహాయమూ లభించదు
అల్లాహ్ యే ఎవరి మీదనయినా కరుణ చూపితే తప్ప. ఆయన శక్తిమంతుడు, కరుణామయుడూను.
44. అద్ దుఖాన్ 43 - 50 జఖ్కూమ్ వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలాగా ఉంటుంది. సల సల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మస లుతూ ఉంటుంది. అతనిని పట్టుకోండి, నరకం మధ్యకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లండి, వాడి తల మీద సల సల కాగే నీటి శిక్షను పొర్లించండి. నీవు గొప్ప బలవంతుడవూ, గౌరవనీయుడవూ అయిన మనిషివి. మీరు ఏ విషయం రాకను గురించి సందేహించేవారో, ఆ విషయం ఇదే.
44. అద్ దుఖాన్ 51 - 57 దైవభీతి గలవారు శాంతి భద్రతల గల ప్రదేశంలో ఉంటారు. ఉద్యానవనాలలో, సెలయేళ్లలో, సన్నని పట్టు వస్త్రాలూ, జరీ పట్టు వస్త్రాలూ ధరించి, ఒకరికొకరు ఎదురుగా కూర్చుండి ఉంటారు. ఇలా ఉంటుంది వారి దర్పం. పసిమి రంగు మేనులూ, అందమైన విశాలమైన కళ్లూ గల స్త్రీలను వారికి ఇచ్చి వివాహం చేస్తాము. అక్కడ వారు రుచికరమైన అన్ని రకాల పదార్థాలనూ నిస్సంకోచంగా అడుగుతారు. అక్కడ వారు మరణాన్ని ఎన్నటికీ రుచి చూడరు. ప్రపంచంలో వచ్చిన మరణమే మరణం. అల్లాహ్ తన కృపతో వారిని నరక శిక్ష నుండి కాపాడుతాడు. ఇదే గొప్ప సాఫల్యం.
44. అద్ దుఖాన్ 58 - 59 ప్రవక్తా! వారు హితబోధ పొందటానికి మేము ఈ గ్రంథాన్ని నీ భాషలో సరళం చేశాము, ఇక నీవు కూడా నిరీక్షించు, వారు కూడా నిరీక్షి స్తున్నారు.
No comments:
Post a Comment