51 సూరహ్ అజ్‌ జారియాత్

 

51. అజ్జారియాత్

ఆయతులు : 60                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 6 దుమారాన్ని లేపే గాలుల సాక్షిగా! గాలులు నీటితో నిండి ఉన్న మేఘాలను లేపుతాయి. తరువాత అవి మెల్లగా సాగిపోతాయి, తరువాత అవి ఒక పెద్ద కార్యాన్ని (వర్షాన్ని) పంచుతాయి. వాస్తవం ఏమిటంటే, మిమ్మల్ని విషయం గురించి భయపెట్టటం జరుగుతోందో, విషయం సత్యం. కర్మలకు ప్రతిఫలం లభించటం అనే పని తప్పకుండా జరగవలసి ఉన్నది.

7 - 19 విభిన్న ఆకారాలు గల ఆకాశం సాక్షిగా! (పరలోక విషయం గురించి) మీ మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. సత్యం నుండి ముఖం తిప్పుకున్నవాడే దానినుండి విముఖుడవుతాడు. ఊహ, అనుమానాలు ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమవుదురు గాక! వారు అజ్ఞానంలో కూరుకుపోయారు. మరియు ఏమరుపాటు మైకంలో పడి ఉన్నారు. అసలు తీర్పు దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అది వారు అగ్నిలో దహింపజేయబడే రోజున వస్తుంది. (వారితో ఇలా అనబడుతుంది) ఇక చవి చూడండి మీ ఆగడాల రుచిని  మీరు తొందరపెడుతూ ఉన్న విషయం ఇదే. అయితే భయభక్తులు కలవారు రోజున ఉద్యానవనాలలో, నీటి బుగ్గల మధ్య ఉంటారు. వారు తమ ప్రభువు తమకు ఇచ్చిన దానిని అమితమైన సంతోషంతో తీసుకుంటారు. దినం రాకపూర్వం, వారు సత్కార్యాలు చేసే వారుగా,  రాత్రి  వేళలలో చాలా తక్కువ నిదురపోయేవారుగా, అదే రాత్రి చివరి గడియలలో క్షమాపణ వేడుకునేవారుగా ఉండేవారు. వారి సంపదలో యాచకులకూ, అగత్యం కలవారికీ హక్కు ఉండేది.

20 - 23 (నమ్మేవారి కొరకు) భూమిలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, స్వయంగా మీలోనూ ఉన్నాయి. మీరు ఆలోచించరా? ఆకాశంలోనే ఉంది మీ ఉపాధి కూడా, మీకు వాగ్దానం చేయబడుతున్నది కూడా. కనుక భూమ్యా కాశాల ప్రభువు సాక్షిగా!  ఇది  సత్యం, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నంత నమ్మకమైనది.

24 - 37 ప్రవక్తా! ఇబ్రాహీమ్యొక్క గౌరవనీయులైన అతిధుల గాధ కూడా నీకు చేరిందా? వారు అతని వద్దకు వచ్చి, ‘‘మీకు సలామ్’’ అని అన్నారు. అతను, ‘‘మీకు కూడ సలామ్‌ - ఎవరో కొత్తవారులాగా ఉన్నారే?’’ అని అన్నాడు. తరువాత అతను మౌనంగా తన ఇంటి వారి దగ్గరకు వెళ్లి, ఒక (వేపబడిన) బలిసిన మంచి ఆవు దూడను తెచ్చి అతిధుల ముందు పెట్టాడు. అతను ‘‘మీరు తినరా?’’ అని అడిగాడు. తరువాత అతను తన మనస్సులో వారంటే భయపడ్డాడు. వారు ‘‘భయపడకండి’’ అని అన్నారు. వారు అతనికి ఒక జ్ఞాన సంపన్నుడైన కుమారుడు జన్మిస్తాడని శుభవార్త వినిపించారు. ఇది విన్నంతనే అతని భార్య అరుస్తూ బయటికి వచ్చి, నెత్తీనోరూ బాదుకుంటూ, ‘‘ముసలిదానికా, గొడ్రాలికా’’ అని అన్నది. అప్పుడు వారు, ‘‘నీ ప్రభువు ఇదే అన్నాడు. ఆయన వివేకవంతుడూ, అన్నీ తెలిసిన వాడూను’’ అని అన్నారు. ఇబ్రాహీమ్, ‘‘దైవదూతలారా! మీరు మహాకార్యం నిమిత్తం వచ్చారు’’ అని అడిగాడు. వారు ఇలా అన్నారు, ‘‘మేము ఒక నేరస్తుల జాతి వైపునకు పంపబడ్డాము, దాని మీద కాల్చబడిన మట్టి రాళ్లను వర్షింపజేయ టానికి. అవి నీ ప్రభువు దృష్టిలో హద్దులు మీరిన వారి కొరకు గుర్తు వేయబడిన రాళ్లు. తరువాత మేము విశ్వాసులు  అందరినీ జనపదం నుండి బయటకు తీసుకువచ్చాము.  అక్కడ మేము ఒకే ఒక గృహాన్ని తప్ప మరే ముస్లిమ్గృహాన్ని  చూడలేదు.  తరువాత అక్కడ మేము వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కొరకు కేవలం ఒకే ఒక సూచనను వదలిపెట్టాము.

38 - 40 మరియు మూసా గాధలో (మీ కొరకు సూచన ఉన్నది) మేము అతనిని స్పష్టమైన ప్రమాణంతో ఫిరౌన్వద్దకు పంపాము. అతడు తన బలాన్ని చూసుకొని విర్రవీగాడు. ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు అని అన్నాడు. చివరకు మేము అతడినీ, అతడి సైన్యాలనూ పట్టుకున్నాము. వారందరినీ సముద్రంలోనికి విసరివేశాము. అతడు నిందింపదగినవాడుగా మిగిలిపోయాడు.

41 - 42 ఆద్జాతిలో (మీ కొరకు ఒక సూచన ఉన్నది) అప్పుడు మేము వారి మీదకు ఒక వినాశకరమైన గాలిని పంపాము.  అది  దేనిపై వీచినా, దానిని నాశనం చేసి వదలిపెట్టింది.

43 - 45 సమూద్జాతిలో (మీ కొరకు సూచన ఉన్నది) అప్పుడు వారికి ఒక నిర్ణీత కాలం వరకు సుఖాలను అనుభవిస్తూ ఉండండి అని చెప్పటం జరిగింది. కాని ఇలా హెచ్చరిక చేసినప్పటికీ వారు తమ ప్రభువు ఆదేశాన్ని ధిక్కరించారు. చివరకు వారు చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా విరుచుకుపడే ఒక ఆపద వారిని చుట్టుముట్టింది. తరువాత వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకుండాపోయింది  వారు తమను తాము రక్షించుకోనూ లేకపోయారు.

46 వారందరికంటే ముందు మేము నూహ్ జాతిని నాశనం చేశాము. ఎందుకంటే, వారు కడు దుర్మార్గులు.

47 - 51 మేము ఆకాశాన్ని స్వశక్తితో నిర్మించాము. మేము అలా చేసే సామర్థ్యం కలిగి ఉన్నాము. మేము భూమిని పరిచాము. మేము ఎంతో చక్కగా పరిచేవారము. ప్రతి వస్తువునూ మేము జంటలుగా సృష్టించాము, బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని,  కనుక పరుగెత్తండి అల్లాహ్ వైపునకు నేను ఆయన తరఫున మీకు  స్పష్టంగా  హెచ్చరిక చేసేవాడుగా వచ్చాను. అల్లాహ్తో పాటు మరెవరినీ ఆరాధ్యులుగా చేసుకోకండి. నేను ఆయన తరఫున మీకు స్పష్టంగా హెచ్చరించేవానిగా వచ్చాను.

52 - 55 ఇలాగే జరుగుతూ వచ్చింది  వారికి పూర్వపు జాతుల వద్దకు కూడా, ‘‘ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు’’ అని నిందింపబడనటువంటి ప్రవక్తా రాలేదు.    విషయం గురించి వారంతా పరస్పరం కూడబలుక్కు న్నారా ఏమిటి? అది కాదు, అసలు వారంతా హద్దులు మీరినవారు. కనుక ప్రవక్తా! వారి నుండి ముఖం మరల్చుకో. నీపై ఎలాంటి ఆక్షేపణా ఉండదు. అయితే ఉపదేశిస్తూ ఉండు. ఎందుకంటే, ఉపదేశం, విశ్వాసులకు ప్రయోజన కరమైనది.

56 - 60 నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరదిదేని  కొరకూ సృష్టించలేదు.  నేను  వారి నుండి ఎలాంటి ఉపాధినీ కోరను  వారు నాకు అన్నం పెట్టాలనీ నేను కోరను. అల్లాహ్ స్వయంగా ఉపాధి ప్రదాత, గొప్ప శక్తిసంపన్నుడు, అత్యంత దృఢమైనవాడూను. కనుక అన్యాయానికి పాల్పడిన వారి భాగానికి కూడా అటువంటి శిక్షయే సిద్ధంగా ఉంది, ఎటువంటిది వారి వంటి ప్రజల వంతుకు లభించిందో, దానికై వారు నన్ను తొందరపెట్టకూడదు. చివరకు రోజున అవిశ్వాసానికి పాల్పడిన వారికి వినాశం కలుగుతుంది. రోజును గురించే వారిని భయపెట్టటం జరుగుతోంది.

No comments:

Post a Comment