96 అల్ అలఖ్
ఆయతులు
: 19 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 5 (ఓ ప్రవక్తా) పఠించు సర్వాన్నీ సృష్టించిన
నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు: నీ ప్రభువు పరమదయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.
6 - 19 ఎంతమాత్రం కాదు
మానవుడు తనను
తాను ఎవరి అక్కరలేని వాడననీ, సర్వస్వతంత్రుడననీ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. (అయితే) చివరికి అందరూ నీ ప్రభువు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది. ఒక దాసుడు
నమాజు చేస్తుంటే అతన్ని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా? ఒకవేళ (ఆ దాసుడు)
ఋజుమార్గంలో ఉంటే లేదా భయభక్తుల్ని బోధిస్తూ ఉంటే, అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ (నిరోధిస్తున్న ఈ వ్యక్తి) సత్యాన్ని తిరస్కరిస్తుంటే, (దాన్నుండి) విముఖుడవుతుంటే, అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? అల్లాహ్ చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా? అలా ఎంతమాత్రం జరగదు
అతడు గనక మానకపోతే, మేము అతన్ని, అతని నుదుటి వెండ్రుకలు పట్టుకుని ఈడుస్తాము
అబద్ధానికి, ఘోరపాపానికి పాల్పడిన నుదురు అది. అతడు తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను.
మేము కూడ మా శిక్షించే దూతల్ని పిలుచుకుంటాము. ఎంతమాత్రం కాదు, అతని మాటలు వినకు సజ్దా చెయ్యి (నీ ప్రభువు) సాన్నిధ్యాన్ని పొందు.
No comments:
Post a Comment