72 సూరహ్ అల్‌ జిన్న్

 

72. అల్జిన్న్

ఆయతులు : 28                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 15 ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి శ్రద్ధగా విని, తరువాత (తన జాతి ప్రజల వద్దకు పోయి) ఇలా అన్నట్లు నాకు వహీద్వారా తెలియజేయబడిరదని చెప్పు  ‘‘మేము ఒక అద్భుతమైన ఖురాన్విన్నాము, అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది, కనుక మేము దానిని విశ్వసిం చాము. ఇక ఎన్నడూ మేము మా ప్రభువునకు భాగస్వాములుగా మరెవ్వరినీ చేయము.’’  ఇంకా ఇలా అన్నారు,  ‘‘మా ప్రభువు వైభవం చాలా గొప్పది, ఘనమైనది. ఆయన ఎవరినీ భార్యగాగాని, కుమారునిగా గాని చేసుకోలేదు.’’ ఇంకా ఇలా అన్నారు,  ‘‘మనలోని అవివేకులు కొందరు అల్లాహ్ విషయంలో ఎన్నో సత్యవిరుద్ధమైన విషయాలు పలుకుతున్నారు.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘మానవులు, జిన్నాతులు దేవుని గురించి ఎన్నడూ అబద్ధం పలుకరని మేము భావించాము.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుతుండేవారు.  విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు.’’  ఇంకా  ఇలా అన్నారు, ‘‘అల్లాహ్ ఎవరినీ సందేశహరుడుగా నియమించి పంపడని మీరు భావించినట్లుగానే, మానవులు కూడ భావించారు.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘మేము ఆకాశంలో వెతికితే, అది పహరాదారులతో, ఉల్కాపాతంతో నిండిపోయి ఉన్నట్లు కనిపించింది.’’ ఇంకా ఇలా అన్నారు,  ‘‘మొదట్లో మేము దొంగతనంగా వినటానికి పోయి నప్పుడు, ఆకాశంలో మాకు కూర్చోవటానికి స్థలం దొరికేది. కాని ఇప్పుడు ఎవడైనా దొంగతనంగా వినే ప్రయత్నం చేస్తే,  అతడి  కొరకు ఒక అగ్ని జ్వాల మాటుకాసి ఉంటుంది.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘భూలోక వాసులకేదైనా కీడు చెయ్యాలనే నిర్ణయం జరిగిందా లేక వారి ప్రభువు వారికి సన్మార్గం చూపగోరు తున్నాడా అనే విషయం మాకు అర్థమయ్యేది కాదు.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘మనలో కొందరు సజ్జనులు ఉన్నారు, మరికొందరు దీనికి భిన్నంగా ఉన్నారు. మనం విభిన్న పద్ధతులలో విభజింపబడి ఉన్నాము.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘అల్లాహ్ ను మనం భూమిపై కూడ అశక్తునిగా చేయ లేము, తప్పించుకుని పారిపోయి ఆయనను ఓడిరచలేము అని మేము భావించే వారము.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘మేము సన్మార్గబోధను విని దానిని విశ్వసిం చాము. ఇప్పుడిక ఎవడైనా  సరే,  తన ప్రభువును విశ్వసిస్తే అతనికి అన్యాయంగానీ, అతనిపై దౌర్జన్యంగాని జరుగుతుందన్న భయం ఉండదు.’’ ఇంకా ఇలా అన్నారు, ‘‘మనలో కొందరు ముస్లిమ్లు (దేవుని విధేయులు) ఉన్నారు  మరికొందరు సత్యానికి దూరమై ఉన్నవారు ఉన్నారు. కనుక ఇస్లామ్‌ (విధేయతా మార్గం)ను అవలంబించిన వారు ముక్తిమార్గాన్ని కనుగొన్నారు. ఇక సత్యానికి దూరమయిన వారు నరకానికి ఇంధనమవుతారు.’’

16 - 23 మరియు (ప్రవక్తా! నాకు ఇలా కూడ సందేశం అందజేయబడిరదని చెప్పు) ప్రజలు గనక ఋజుమార్గంలో స్థిరంగా నడుచుకుంటే, మేము వారికి త్రాగటానికి పుష్కలంగా నీటిని ప్రసాదిస్తాము  వరము ద్వారా వారిని పరీక్షిస్తాము. తన ప్రభువు స్మరణ పట్ల విముఖుడయ్యే అతణ్ణి అతని ప్రభువు కఠిన శిక్షకు గురిచేస్తాడు. ఇంకా ఏమిటంటే, మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థిం చకండి. అల్లాహ్ దాసుడు ఆయన్ని ప్రార్థించటానికి  నిలబడినప్పుడు,  ప్రజలు అతనిపై విరుచుకుపడటానికి సిద్ధమయ్యారు. ప్రవక్తా! ఇలా చెప్పు, ‘‘నేనైతే నా ప్రభువునే ప్రార్థిస్తాను, ఆయనకు భాగస్వాములుగా మరెవ్వరినీ నిలబెట్టను.’’ ఇంకా ఇలా నొక్కి చెప్పు, ‘‘మీకు నష్టం కలిగించటం లేదా మీకు మేలు చెయ్యటం అనేది నా వశంలో లేదు.’’ ఇలా చెప్పు, ‘‘నన్ను అల్లాహ్ పట్టునుండి ఎవ్వరూ కాపాడలేరు. నాకు ఆయన తప్ప మరొక ఆశ్రయం కూడ లేదు. అయితే అల్లాహ్ మాటలను,  ఆయన  సందేశాలను అందజెయ్యటమే నా పని.’’ ఇక ఎవరైనా సరే, అల్లాహ్,  ఆయన ప్రవక్తల మాటలను విశ్వసించక పోతే,  వారు  నరకాగ్నికి గురిఅవుతారు. అటువంటి వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు.

24 - 28 వారు తమకు వాగ్దానం చేయబడుతున్నదానిని కళ్లారా చూడనం తవరకు (తమ వైఖరిని విడనాడరు).  అప్పుడు  వారికి తెలిసిపోతుంది, ఎవరి సహాయకులు బలహీనులో,  మరెవరి  వర్గం సంఖ్యాపరంగా తక్కువో. ఇలా చెప్పు, ‘‘మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం ఏదైనా దీర్ఘకాలిక వ్యవధి నిర్ణయించాడో, నాకైతే తెలియదు. ఆయన అతీంద్రియ జ్ఞానం కలవాడు, తన అతీంద్రియ విషయా లను తాను ఎంచుకున్న ప్రవక్తకు తప్ప మరెవ్వరికీ తెలియజేయడు. అయితే ఆయన ప్రవక్తకు ముందూ, వెనుకా రక్షకభటులను నియమిస్తాడు, ఎందు కంటే వారు తమ ప్రభువు సందేశాలను యధాతథంగా అందజేసిన విషయాన్ని ఆయన తెలుసుకోవటానికి. ఆయన వారి పరిసరాలు అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు, ఆయన ఒక్కొక్క విషయాన్ని లెక్కపెట్టి ఉంచాడు.’’

No comments:

Post a Comment