24 సూరహ్ అన్‌ నూర్‌

 

24. అన్నూర్

ఆయతులు : 64                                  అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

24. అన్నూర్   1 ఇది మేము అవతరింపజేసిన ఒక సూరా. మేము దానిని విధిగా జేశాము, మీరు గుణపాఠం నేర్చుకుంటారేమో అని, అందులో మేము స్పష్టమైన ఉపదేశాలను అవతరింపచేశాము.

24. అన్నూర్   2 వ్యభిచారిణి, వ్యభిచారి - ఇద్దరిలో ప్రతి ఒక్కరినీ నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్ పై, అంతిమదినంపై విశ్వాసం ఉన్నవారే అయితే, వారి మీద కనికరం చూపే తలంపు అల్లాహ్ ప్రసాదించిన ధర్మ (నిర్వహణ) విషయంలో మిమ్మల్ని అడ్డుకోరాదు. వారిని శిక్షించేటప్పుడు విశ్వాసుల వర్గం ఒకటి అక్కడ ఉండాలి.

24. అన్నూర్   3 ఒక వ్యభిచారి, వ్యభిచారిణిని లేక ముష్రిక్స్త్రీని తప్ప మరెవరినీ వివాహం చేసుకోకూడదు. వ్యభిచారిణిని ఒక వ్యభిచారి లేక ఒక ముష్రిక్కు పురుషుడు తప్ప మరెవ్వరూ వివాహం చేసుకోకూడదు. అటువంటి వివాహాలు విశ్వాసు లకు నిషేధించబడ్డాయి.

24. అన్నూర్   4 - 5 ఎవరైనా శీలవతులైన స్త్రీలపై నిందమోపి తరువాత నలుగురు సాక్షులను తీసుకురాకపోతే, వారిని ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి, వారి సాక్ష్యాన్ని ఇక ఎన్నడూ అంగీకరించకండి. వారే దుర్మార్గులు- చేష్ట తరువాత పశ్చాత్తాపపడి తమను తాము సంస్కరించుకునేవారు తప్ప. అల్లాహ్ వారి విషయంలో తప్పకుండా క్షమించేవాడు, కరుణామయుడూను.

24. అన్నూర్   6 - 10 ఎవరైనా తమ భార్యలపై నింద మోపినప్పుడు వారిద్దరూ తప్ప ఇతరులెవ్వరూ సాక్షులుగా వారి వద్ద లేనిపక్షంలో వారిలో  ఒక వ్యక్తి సాక్ష్యం (ఏమిటంటే, తాను) నాలుగుసార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి (తన నిందా రోపణ) సత్యమని తాను సాక్ష్యం చెప్పాలి. ఐదోసారి, ఒకవేళ తాను (తన నిందారోపణలో) అబద్ధం చెప్పి ఉంటే, తనపై అల్లాహ్ శాపం అవతరించుగాక! అని అనాలి, భార్యకు శిక్ష ఎలా తప్పుతుందంటే, ఆమె నాలుగుసార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి, వ్యక్తి (తన నిందా రోపణలో) అబద్ధం చెపుతున్నాడని సాక్ష్యమివ్వాలి. ఐదోసారి, ఒకవేళ అతడు (తన నిందారోపణలో) సత్యవంతుడే అయితే, తనపై అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడుగాక! అని ఆమె అనాలి. మీపై అల్లాహ్ అనుగ్రహం, కరుణ లేకపోతే, అల్లాహ్ క్షమించేవాడూ, వివేకవంతుడూ అయి ఉండకపోతే (భార్యలపై నిందమోపే వ్యవహారం మిమ్మల్ని పెద్ద చిక్కులో పడవేసి ఉండేదే).

24. అన్నూర్   11 - 15 అభాండాన్ని సృష్టించి తీసుకువచ్చినవారు, మీలోని ఒక వర్గం వారే సంఘటనను మీ విషయంలో కీడుగా భావించకండి, పైగా ఇది మీకు మేలైనదే. ఎవడు ఇందులో ఎంత పాత్ర వహించాడో, వాడు అంతే పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఇంకా బాధ్యతలో పెద్ద భాగాన్ని తన నెత్తిపై వేసుకున్న వ్యక్తికి పెద్ద శిక్షేపడుతుంది. మీరు దానిని గురించి విన్నప్పుడే విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ తమను గురించి తాము సదభిప్రాయాన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు? ఇది స్పష్టమైన అభాండమని ఎందుకు ఖండిరచలేదు? వారు (తమ నిందారోపణకు రుజువుగా) నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు ఇప్పుడు సాక్షులను తీసుకురాలేదు కాబట్టి, అల్లాహ్ దృష్టిలో వారే అసత్యవాదులు. మీపై ప్రపంచంలోనూ, పరలోకంలోనూ, అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్యం, కృప ఉండకపోతే, మీరు విషయాలలోనైతే పడిపోయారో, విషయాల పర్యవసానంగా, ఒక పెద్ద శిక్ష మిమ్మల్ని పట్టుకొని ఉండేది. (కొంచెం ఆలోచించండి, అపుడు మీరు ఎంత ఘోరమైన తప్పుచేశారో) అప్పుడు మీ నాలుకలు ఒక దానినుండి మరొకటి అబద్ధాన్ని అందుకుంటూ పోయాయి. మీరు మీకు తెలియని దాన్ని మీ నోటితో అంటూ పోయారు. మీరు దానిని మామూలు విషయంగా భావించారు. వాస్తవానికి అల్లాహ్ దృష్టిలో అది చాల పెద్ద విషయం.

24. అన్నూర్   16 - 18 దానిని వినగానే మీరు ఇలా ఎందుకనలేదు, ‘‘ఇటువంటి విషయాన్ని నోటితో అనటం మాకు శోభించదు, అల్లాహ్ పరిశుద్ధుడు. ఇది పెద్ద అభాండం.’’ మీరు విశ్వాసులే అయితే, ఇక ముందు ఎన్నడూ ఇటువంటి చేష్ట చేయకూడదని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. అల్లాహ్ మీకు స్పష్టమైన ఉపదేశాలు ఇస్తున్నాడు  ఆయన జ్ఞాని, వివేకవంతుడూను.

24. అన్నూర్   19 - 20 విశ్వాసుల వర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ప్రపంచం లోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు. అల్లాహ్ ఎరుగును, మీరు ఎరుగరు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహం, ఆయన కృపాకటాక్షాలు మీపైన లేకపోతే, అల్లాహ్ వాత్సల్యం కలవాడు, కరుణామయుడు అయి ఉండకపోతే, (ఇప్పుడు మీ మధ్య వ్యాపింపజేయబడిన విషయం దారుణమైన ఫలితాలకు కారణభూతమై ఉండేది).

24. అన్నూర్   21 విశ్వసించిన ప్రజలారా! షైతాను అడుగుజాడలలో నడవకండి. వాడిని ఎవరైనా అనుసరిస్తే వాడు అతనికి అశ్లీలతనే, చెడునే ఆజ్ఞాపిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహం   ఆయన  కారుణ్యం మీ మీద లేకపోతే, మీలో వ్యక్తీ పరిశుద్ధుడు కాలేడు. కాని అల్లాహ్యే తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడూను.

24. అన్నూర్   22 మీలోని ప్రముఖులు, స్థితిపరులు తమ బంధువులకూ, నిరుపేదలకూ, అల్లాహ్  మార్గంలో  వలస వచ్చిన ప్రజలకూ, సహాయం చేయకూడదని ప్రమాణం చేయరాదు. వారిని క్షమించాలి, వారి(తప్పులను)ని ఉపేక్షించాలి. మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ గుణం ఏమిటంటే, ఆయన క్షమించేవాడు, కరుణించేవాడూను.

24. అన్నూర్   23 - 25 శీలవతులు, అమాయికలు అయిన విశ్వాసం గల స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ, పరలోకంలోనూ శపించబడ్డారు. వారికి పెద్ద శిక్షపడుతుంది.  వారి  నోళ్లూ, వారి కాళ్లూ, చేతులూ వారి చేష్టలను గురించి స్వయంగా సాక్ష్యం పలికేరోజును వారు మరచిపోకూడదు. రోజు అల్లాహ్ వారికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా ఇస్తాడు. ఇంకా సత్యాన్ని సత్యంగా చేసి చూపే అల్లాహ్యే సత్యమని, వారికి తెలిసిపోతుంది.

24. అన్నూర్   26 అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషుల కొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకే.  పవిత్ర  స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకే. నిందలు మోపే వారి నిందల నుండి వారు పరిశుద్ధులు. వారికై క్షమాభిక్ష గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి.

24. అన్నూర్   27 - 29 విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి ప్రవేశించకండి, ఇంటి వారి అంగీకారం పొందనంత వరకు, ఇంటి వారికి సలామ్చేయనంతవరకు.  పద్ధతి మీకు ఎంతో ఉత్తమమైనది. దీనిని మీరు పాటిస్తారని ఆశించబడుతోంది. ఇంకా ఒకవేళ అక్కడ మీరు ఎవరినీ కనుగొనకపోతే, మీకు అనుమతి ఈయబడనంత వరకు ప్రవేశించకూడదు. ఒకవేళ,  తిరిగి  వెళ్లిపొమ్మని మీతో అంటే, తిరిగి వెళ్ళిపోండి. ఇది మీకు ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. మీరు ఏది చేస్తారో, అది అల్లాహ్ కు బాగా తెలుసు. అయితే ఎవరికీ నివాస స్థలం కానటువంటి మీకు ప్రయోజనకరమైన (లేక పనికివచ్చే) వస్తువేదైనా ఉన్నటువంటి ఇళ్లల్లోకి ప్రవేశిస్తే అది మీకు దోషమేమీ కాదు. మీరు బహిరంగపరచేది, దాచేదీ అంతా అల్లాహ్ కు తెలుసు.

24. అన్నూర్   30 ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధ మైన పద్ధతి. వారు చేసే దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.

24. అన్నూర్   31 ... ప్రవక్తా!  విశ్వసించిన  మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకర ణను ప్రదర్శించవలదని - దానంతట అదే కనిపించేది తప్ప - తమ వక్షస్థలా లను ఓణీ అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని: భర్త, తండ్రి, భర్తల తండ్రులు, తమ కుమారులు, భర్తల కుమారులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల కుమారులు, అక్కా చెల్లెళ్ల కుమారులు తమతో కలసీ మెలసీ ఉండే స్త్రీలు. తమ స్త్రీ పురుష బానిసలు,  వేరే  ఉద్దేశ్యమూ లేని వారి కింద పనిచేసే పురుష సేవకులు. స్త్రీల గుప్త విషయాలను గురించి ఇంకా తెలియని బాలురు. తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని కూడ వారికి చెప్పు.

24. అన్నూర్   ... 31 విశ్వసించిన ప్రజలారా! మీరంతా కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమాభిక్షను వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు.

24. అన్నూర్   32 - 33 ... మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో  మీ స్త్రీ పురుష బానిసలలో ఎవరు గుణవంతులో, వారి వివాహాలు చేసివేయండి. వారు గనక పేదవారయితే, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అంతులేని వనరులు కలవాడు. సర్వమూ తెలిసినవాడు. వివాహ అవకాశాన్ని ఇంకా పొందనివారు శీల శుద్ధతను పాటించాలి. అల్లాహ్ తన అనుగ్రహం ద్వారా వారికి కలిమి ఇచ్చేవరకు.

24. అన్నూర్   ... 33 ... మీ అధీనంలో ఉన్న వారిలో ఎవరైనా ముకాతబత్‌ (షరతుల పత్రం) కొరకు విజ్ఞప్తి చేస్తే, వారిలో మంచితనం ఉందని మీరు గ్రహిస్తే, వారితో ముకాతబత్ను కుదుర్చుకోండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి మీరు వారికి ఇవ్వండి.

24. అన్నూర్  ... 33 మీ లౌకిక ప్రయోజనాల నిమిత్తం మీ బానిస స్త్రీలను వేశ్యావృత్తికై బలవంతపెట్టకండి.  వారే  శీలవతులుగా ఉండగోరినపుడు ఎవరైనా వారిని బలవంతపెడితే, బలత్కారం తరువాత అల్లాహ్ వారి (బానిస స్త్రీల)ని క్షమించేవాడు, కరుణించేవాడూను.

24. అన్నూర్   34  మేము స్పష్టమైన మార్గదర్శకత్వాన్నిచ్చే ఆయత్లను మీ వద్దకు పంపాము. మీకు పూర్వం గతించిన జాతుల గుణపాఠం నేర్పే ఉదాహరణలను కూడ మేము మీ ముందు పెట్టాము. భయభక్తులు కలవారికి అవసరమైన ఉపదేశా లను కూడ మేము చేశాము.

24. అన్నూర్   35 - 40 అల్లాహ్ ఆకాశములకూ, భూమికీ వెలుగు. (సృష్టిలో) ఆయన వెలుగు ఉపమానం ఇలా ఉంది: ఒక గూటిలో దీపం ఉన్నది, దీపం ఒక గాజు చిమ్నీలో ఉన్నది,     గాజు కుప్పె ఆణిముత్యం మాదిరిగా మెరిసే నక్షత్రంలా ఉన్నది. దీపం శుభవంతమైన ఒక జైతూన్వృక్షపు నూనెతో ప్రకాశింపజేయబడుతోంది. వృక్షం తూర్పుకూ చెందదు, పడమరకూ చెందదు  దాని నూనె నిప్పు తగలకపోయినా దానంతట అదే మండుతుంది. ( విధంగా) వెలుగుపై వెలుగు (ద్విగుణీకృతమయ్యే కారణాలన్నీ ఏక మయ్యాయి) అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గం చూపుతాడు. ఆయన ప్రజలకు దృష్టాంతాల ద్వారా విషయాన్ని బోధిస్తాడు. ఆయన ప్రతి విషయాన్నీ బాగా ఎరుగును. (ఆయన వెలుగు వైపునకు పోయేమార్గం పొందినవారు) గృహాలను మహోన్నతం చేయటానికీ, గృహాలలో తన నామాన్ని స్మరించటానికీ అల్లాహ్ అనుమతించాడో, గృహాలలో ఉంటారు.  వ్యాపారంగానీ, క్రయవిక్రయాలుగానీ, అల్లాహ్ సంస్మరణ విషయంలో నమాజు సంస్థాపనం, జకాత్ఇవ్వడం వంటి విషయా లలో, ఎవరినైతే అశ్రద్ధ వహించేలా చేయవో, అటువంటి వారు ఉదయం, సాయంత్రం ఆయన స్తోత్రం చేస్తారు. హృదయాలు తలక్రిందులై, కనుగ్రుడ్లు తేలిపోయే పరిస్థితి ఏర్పడబోయే రోజును గురించి వారు భయపడుతూ ఉంటారు. (వారు ఇదంతా ఎందుకు చేస్తారంటే)  అల్లాహ్  వారి  ఉత్తమ కర్మల ప్రతిఫలాన్ని వారికి ఇవ్వాలనీ, అదనంగా తన అనుగ్రహం నుండి ఇంకా ప్రసాదించాలనీ  అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేకుండా ఇస్తాడు. (దానికి వ్యతిరేకంగా) అవిశ్వాసానికి పాల్పడిన వారి కర్మలకు ఉపమానంగా ఎడారిలోని ఎండమావిని చెప్పవచ్చు. దప్పిక గొన్నవాడు దానిని చూసి నీరు అనుకున్నాడు  కాని అక్కడకు చేరి ఏమీ పొందలేకపోయాడు. అయితే అతడు అక్కడ అల్లాహ్  ఉన్నట్లు  కనుగొన్నాడు. ఆయన అతని లెక్కను పూర్తిగా తేల్చివేశాడు. లెక్క తేల్చడంలో అల్లాహ్ కు ఏమాత్రం ఆలస్యం కాదు. లేదా (వారి కర్మలకు) ఒక లోతైన సముద్రంలోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు. దాని ( చీకటి) పై ఒక  అల  వ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల, దానిపై మేఘం, చీకటిపై చీకటి. మనిషి తన చేతిని బయటకు సాచితే, దానిని కూడ చూడలేడు. ఎవరికి అల్లాహ్ తన వెలుగును ప్రసాదించడో, అతనికి మరే వెలుగూ లేదు.

24. అన్నూర్   41 - 42 ఆకాశాలలోను, భూమిపైనా ఉన్న సమస్తమూ, రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతమూ అల్లాహ్ స్తోత్రం చేయటాన్ని నీవు చూడటం లేదా? ప్రతి ఒక్కటీ తన నమాజును, తన స్తోత్రం చేసే పద్ధతిని ఎరుగును. అవి చేసే వాటినన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును. ఆకాశముల మీద, భూమి మీద సామ్రాజ్యాధికారం అల్లాహ్దే. ఆయన వైపునకే అంతా మరలవలసి ఉన్నది.

24. అన్నూర్   43 - 44 అల్లాహ్ మేఘాన్ని మెల్లమెల్లగా నడపటాన్నీ, దాని తునకలను ఒకదానితో ఒకటి కలపటాన్నీ, తరువాత దానిని పోగుచేసి ఒక దట్టమైన మబ్బుగా మలచటాన్నీ నీవు చూడవా? తరువాత దాని పైపొరనుండి వర్షపు చినుకులు రాలుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆయన ఆకాశం నుండి, దానిలోని ఎత్తైన పర్వతాలు కారణంగా, వడగండ్లను కురిపిస్తాడు. తాను తలచిన వారికి వాటి ద్వారా నష్టం కలిగిస్తాడు, తాను తలచిన వారిని వాటి నుండి రక్షిస్తాడు. దాని పిడుగు యొక్క మెరుపు చూపులను చెదరగొడుతుంది. రేయింబవళ్ల పరిభ్రమణను ఆయనే చేస్తున్నాడు. కళ్లున్నవారికి ఇందులో గుణపాఠం ఉంది.

24. అన్నూర్   45 అల్లాహ్ ప్రతి ప్రాణిని ఒక విధమైన నీటితో సృష్టించాడు. ఒకటి పొట్టపై నడుస్తుంటే, మరొకటి రెండు కాళ్లపై, ఇంకొకటి నాలుగు కాళ్ళపై నడుస్తోంది. ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు. ఆయనకు ప్రతిదానిపై అధికారం ఉన్నది.

24. అన్నూర్   46 మేము నిజాన్ని స్పష్టంగా తెలిపే  వాక్యాలను అవతరింపజేశాము. ఇక ఋజుమార్గం వైపునకు అల్లాహ్యే తనకు ఇష్టమైన వారికి దారి చూపుతాడు.

24. అన్నూర్   47 - 52 మేము అల్లాహ్ ను, దైవప్రవక్తను విశ్వసించాము, విధేయతను అంగీకరించాము, అని వారు అంటారు. కాని దాని తరువాత వారిలోని ఒక వర్గం (విధేయతపట్ల) విముఖతను చూపింది. అటువంటి వారు ఎంతమాత్రం విశ్వాసులు కారు. దైవప్రవక్త వారి మధ్య ఉన్న వ్యాజ్యం విషయంలో తీర్పు చెప్పటానికి వారిని అల్లాహ్ వైపునకూ, ప్రవక్త వైపునకూ రమ్మని పిలిచినప్పుడు, వారిలోని ఒక ప్రత్యర్థి వర్గం విముఖత చూపుతుంది. కాని ఒకవేళ సత్యం వారికి అనుకూలంగా ఉంటే, దైవప్రవక్త వద్దకు పెద్ద విధేయులు మాదిరిగా వచ్చేస్తారు.  వారి హృదయాలకు (కపట) రోగమేదైనా తగిలిందా? లేదా వారు సంశయంలో పడిపోయారా? లేదా అల్లాహ్, మరియు ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయమా? అసలు విషయమేమిటంటే, అన్యాయపరులు స్వయంగా వారే. విశ్వసించే వారి పని ఏమిటంటే, తమ వ్యాజ్యాన్ని దైవప్రవక్త పరిష్కరించే విషయంలో వారు అల్లాహ్ వైపునకూ, ప్రవక్త వైపునకూ పిలువబడితే, ‘‘మేము విన్నాము, విధేయత చూపాము’’ అని అనాలి. అటువంటి వారే సాఫల్యం పొందుతారు. అల్లాహ్కూ, ప్రవక్తకూ విధేయత చూపేవారు, అల్లాహ్ కు భయపడేవారు, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉండేవారు మాత్రమే విజయం పొందుతారు.

24. అన్నూర్   53 - 54 వారు (కపటులు) అల్లాహ్ పేరుతో గట్టి గట్టి ప్రమాణాలు చేసి, ‘‘మీరు ఆజ్ఞాపిస్తే, మేము ఇళ్లనుండి బయలుదేరుతాము’’ అని అంటారు. వారితో, ‘‘ప్రమాణాలు చేయకండి, మీ విధేయత ఎలాంటిదో తెలుసు, మీ చేష్టలు అల్లాహ్ ఎరుగనివేమీ కావు’’ అని అను. ఇలా బోధించు, ‘‘అల్లాహ్ కు విధేయులు కండి, దైవప్రవక్త ఆదేశాలను పాటించండి. కాని ఒకవేళ మీరు విముఖులైతే, బాగా తెలుసుకొండి, దైవప్రవక్తపై పెట్టబడిన కర్తవ్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై మోపబడిన కర్తవ్య భారానికి మీరు బాధ్యులు. దైవప్రవక్తకు విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు. లేకపోతే స్పష్టంగా ఆజ్ఞను అందజెయ్యటాన్ని మించి ఎక్కువ బాధ్యత దైవప్రవక్తపై లేదు.’’

24. అన్నూర్   55 - 57 మీలో విశ్వసించి మంచిపనులు చేసేవారికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే, ఆయన వారిని,  వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా, భూమిపై ఖలీఫాలు (ప్రతినిధులు)గా చేస్తాడు,  అల్లాహ్ వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారికొరకు పటిష్ఠమైన పునాదులపై స్థాపిస్తాడు. వారి యొక్క (ప్రస్తుత) భయస్థితిని శాంతిభద్రతలతో కూడిన స్థితిగా మారుస్తాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు. దీని తరువాత ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, అటువంటి వారే హద్దులు మీరినవారు.  నమాజును స్థాపించండి, జకాత్ఇవ్వండి, దైవప్రవక్తకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు కరుణింపబడతారని ఆశించవచ్చు. అవిశ్వాసానికి పాల్పడేవారు అల్లాహ్ ను లొంగదీయగలరని భ్రమపడకండి. వారి నివాసం నరకం, అది బహుచెడ్డ నివాసం.

24. అన్నూర్   58 - 59 విశ్వసించిన ప్రజలారా! మీ బానిసలూ, యుక్త వయస్సుకు ఇంకా చేరని మీ పిల్లలు మూడు సమయాలలో తప్పనిసరిగా అనుమతి తీసుకున్న తరువాతనే మీ వద్దకు రావాలి, ఉదయం నమాజుకు ముందు, మధ్యాహ్నం మీరు బట్టలు మార్చుకున్నప్పుడు, ఇషా నమాజు తరువాత. మూడు సమయాలు మీకు పరదా సమయాలు. అవి మినహా వారు అనుమతి లేకుండా వస్తే, అది మీకూ పాపం కాదు, వారికీ పాపం కాదు.  మీరు  ఒకరి వద్దకు ఒకరు మాటిమాటికీ రావలసియే ఉంటుంది. విధంగా అల్లాహ్ మీకు తన సూక్తులను విశదీకరిస్తున్నాడు. ఆయన జ్ఞానీ, వివేకీను. మీ పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు, తమ పెద్దలు అనుమతి తీసుకునే విధంగానే వారు కూడా అనుమతి తీసుకుని మరీ రావాలి. ఇలా అల్లాహ్ తన వాక్యాలను మీ ముందు విశదం చేస్తున్నాడు. ఆయన జ్ఞాని మరియు వివేకి.

24. అన్నూర్   60 యౌవనం ఉడిగిపోయి, వివాహం పట్ల ఉత్సాహం సన్నగిల్లిన స్త్రీలు తమ దుప్పట్లను తీసివేస్తే, వారు దోషమూ చేసినట్లు కాదు  అయితే వారు తమ అలంకరణను ప్రదర్శించేవారు కాకూడదు. అయినప్పటికీ, వారు సిగ్గునే పాటిస్తే,  అది  వారికే శ్రేయస్కరమైనది. అల్లాహ్ అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు.

24. అన్నూర్   61 ఒకవేళ అంధుడైనా, కుంటివాడైనా, రోగిఅయినా (ఎవరి ఇంట్లోనైనా అన్నం తినివేసి నట్లయితే) అది దోషం కాదు. మీరు మీ ఇంట్లో తిన్నా,  మీ తండ్రీ తాతల ఇళ్లల్లో తిన్నా, మీ తల్లీ నాయనమ్మల ఇళ్లల్లో, మీ సోదరుల ఇళ్లల్లో లేదా మీ సోదరీమణుల ఇళ్లల్లో లేదా మీ తండ్రుల సోదరుల ఇళ్లల్లో లేదా మీ మేనత్తల ఇళ్లల్లో లేదా మేనమామల ఇళ్లల్లో లేదా మీ పిన్నమ్మల, పెద్దమ్మల ఇళ్లల్లో లేదా తాళపు చేతులు మీ అధీనంలో ఉన్న ఇళ్లల్లో లేదా మీ స్నేహితుల ఇళ్లల్లో తిన్నా మీకు ఆక్షేపణా ఉండదు. మీరు కలసి తిన్నా వేర్వేరుగా తిన్నా దోషమేమీ కాదు. అయితే ఇళ్లల్లోకి ప్రవేశించి నప్పుడు, మీ వారికి సలాము చేయండి. ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన. అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిరది. ఎంతో శుభవంతమైనది, పరిశుద్ధ మైనది. ఈవిధంగా అల్లాహ్ తన ఆయతులను మీకు ఉపదేశిస్తున్నాడు, మీరు ఆలోచించి అర్థం చేసుకుని వ్యవహరిస్తారని ఆశించబడుతోంది.

24. అన్నూర్   62 అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ హృదయపూర్వకంగా విశ్వసించేవారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం దైవప్రవక్తతో ఉన్నప్పుడు అతని అనుమతి లేకుండా వెళ్లని వారు మాత్రమే అసలైన విశ్వాసులు. ప్రవక్తా! నిన్ను అనుమతి అడిగేవారే అల్లాహ్ ను, ప్రవక్తను విశ్వసించేవారు. కనుక వారు తమ పనికైనా అనుమతి  అడిగితే నీవు కోరిన వారికి అనుమతి ఇస్తూ ఉండు. అటువంటి వారిని క్షమించు అని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను.

24. అన్నూర్   63 - 64 ముస్లిములారా! దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరు పిలుచుకునే పిలుపుగా భావించ కండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయేవారిని అల్లాహ్ బాగా ఎరుగును. దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి. జాగ్రత్త! ఆకాశాలలోనూ,  భూమిపైనా ఏది ఉన్నదో అది అల్లాహ్దే. మీరు వైఖరి అవలంబించినా  దానిని  అల్లాహ్ ఎరుగును. ప్రజలు ఆయన వైపునకు మరలింపబడేనాడు, వారు ఏమేమి చేసివచ్చారో ఆయన వారికి తెలియజేస్తాడు. ఆయనకు ప్రతి దానిని గురించీ పూర్తిగా తెలుసు.


No comments:

Post a Comment