11 సూరహ్ హూద్‌

 

11. హూద్

ఆయతులు : 123             అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

11. హూద్1 - 4 అలిఫ్లామ్రా. ఇది ఒక ఫర్మానా. ఇందులోని ఆయతులు నిర్దుష్టమైనవీ, సవివరంగా చెప్ప బడినవీ - వివేకవంతుడూ అన్నీ ఎరిగినవాడూ అయిన వాని తరఫు నుండి. ( ఫర్మానా ఏమిటంటే) నీవు అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకు - నేను ఆయన తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాణ్ణి శుభవార్తలు అందజేసేవాణ్ణి కూడా. ఇంకా మీరు మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు మరలిరండి. అప్పుడు ఆయన ఒక నిర్ణీత కాలం వరకూ మీకు మంచి జీవిత సామగ్రిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహాలకు అర్హుడైన ప్రతివానికీ ఆయన తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కాని మీరు గనక విముఖులైతే, ఒక అతి భయంకరమైన దినంనాటి యాతనకు మీరు గురి అవుతారేమో అని నేను భయపడుతున్నాను. మీరందరూ అల్లాహ్ వైపునకే మరలవలసివున్నది. ఆయన సర్వమూ చెయ్యగల సమర్థుడు.

11. హూద్5 - 6 చూడండి వారు తమ వక్షములను తిప్పుకుంటారు,  అతని నుండి దాక్కుందామని. జాగ్రత్త! వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పటికీ,  అల్లాహ్ వారి గుప్త విషయాలనూ ఎరుగును, వారి బహిరంగ విషయాలనూ ఎరుగును. ఆయన హృదయాలలో ఉన్న రహస్యాలను కూడా ఎరుగును. ధరణిపై సంచరించే ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ బాధ్యతలో లేకుండా లేదు. ప్రాణి ఎక్కడ నివసిస్తుందో అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తమూ ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.

11. హూద్7 - 8 ఆకాశాలనూ,  భూమినీ ఆరు దినాలలో సృష్టించినవాడు ఆయనే - దానికి పూర్వం ఆయన సింహాసనం  నీళ్ళపై  ఉండేది - మీలో ఎవడు మంచిపనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ప్రవక్తా! ఇప్పుడు నీవు గనక వారితో ‘‘ప్రజలారా! మరణించిన తరువాత మీరు మళ్ళీ లేపబడతారు’’ అని అంటే అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు : ‘‘ఇది స్పష్టమైన ఇంద్రజాలం’’. ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి వరకు వాయిదా వేస్తే వారు, అసలు దానిని వస్తువు పట్టి ఆపుతోంది? అని అనటం ప్రారంభిస్తారు. వినండి, శిక్షా సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేరు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని చుట్టుముట్టుతుంది.

11. హూద్9 - 11 ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి, తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు. కృతఘ్నత చూపుతాడు. అతనిపై పడిన ఆపద (తొలగిన) తరువాత, ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే, ‘‘కష్టాలన్నీ తొలగి పోయాయి’’ అని అంటాడు. అతడు తరువాత ఉబ్బితబ్బిబ్బౌతాడు, విర్రవీగుతాడు. సహనశీలురూ, సత్కార్యపరులూ అయినవారు మాత్రమే దోషానికి అతీతులు. వారికే మన్నింపూ, పెద్ద బహుమానమూను.

11. హూద్12 ప్రవక్తా! వహీ ద్వారా నీకు తెలుపబడుతూవున్న విషయాలలో దేనినైనా (ప్రకటించకుండా) వదలిపెట్టబోకుము సుమా! వారు ‘‘ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దింపబడలేదు?’’ లేదా ‘‘ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు?’’ అని అంటారని నీ మనస్సు బాధ పడకూడదు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు. ఆపై అన్నింటికీ అల్లాహ్ యే బాధ్యుడు.

11. హూద్13 - 14 ప్రవక్తయే స్వయంగా గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా? ఇలా అను : ‘‘సరే విషయం గనక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన పది సూరాలను మీరు రచించి తీసుకురండి. అల్లాహ్ ను తప్ప, (మీ ఆరాధ్య దైవాలలో) ఎవరినైనా సరే సహాయం కొరకు పిలువ గలిగితే పిలుచుకొండి, మీరేగనక (వారిని ఆరాధ్య దైవాలుగా భావించటంలో) సత్యవంతులే అయితే. ఇప్పుడు ఒకవేళ వారు (మీ ఆరాధ్యదైవాలు) మీ సహాయం కొరకు రాలేకపోతే, తెలుసుకోండి, గ్రంథం అల్లాహ్ ఎరుకతోనే అవతరించిందని, అల్లాహ్ తప్ప నిజమైన దేవుడు మరొకడు లేడని. ఇప్పుడైనా మీరు ( సత్యవిషయాన్ని) శిరసావహిస్తారా?’’

11. హూద్15 - 16 కేవలం ప్రాపంచిక జీవితాన్నీ, దాని ఆకర్షకాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కువచెయ్యటం అంటూ జరుగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. (అక్కడ తెలిసిపోతుంది) వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలసిపోయింది అనీ, వారు చేసినదంతా కేవలం మిథ్యఅనీ.

11. హూద్17 ఒక వ్యక్తి తన ప్రభువు తరఫునుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆపై ప్రభువు తరఫు నుండి ( నిదర్శనాన్ని బలపరుస్తూ) ఒక సాక్షి కూడా వచ్చింది. వ్యక్తికి పూర్వం మార్గదర్శకంగా, కారుణ్యంగా వచ్చిన మూసా గ్రంథం కూడా ఉన్నది. (అటువంటి వ్యక్తి కూడా ప్రపంచ పూజారులు మాదిరిగా సందేశాన్ని తిరస్కరించగలుగుతాడా?) అటువంటి ప్రజలు దానిని తప్పకుండా విశ్వసిస్తారు.  మానవ వర్గాలలో వర్గమైనా సరే దానిని తిరస్కరిస్తే, దానికి వాగ్దానం చెయ్యబడిన  నివాస స్థానం నరకము. కనుక ప్రవక్తా! దాని విషయంలో నీవు సంశయానికీ లోనుకావద్దు. అది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యము. కాని చాలామంది నమ్మరు.

11. హూద్18 - 24 అల్లాహ్ కు అబద్ధం అంటగట్టే వాడికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు అల్లాహ్ సమక్షంలో హాజరవుతారు. తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టినవారు వారే అని అపుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను!  దుర్మార్గుల  మీద దేవుని శాపం పడుతుంది. దేవుని మార్గం నుండి ప్రజలను ఆపే దుర్మార్గుల మీద, ఆయన మార్గాన్ని వక్రీకరించగోరే దుర్మార్గుల మీద, పరలోకాన్ని తిరస్కరించే దుర్మార్గులమీద-వారు భూమిపై అల్లాహ్ ను నిస్సహాయునిగా చేయలేక పోయారు. అల్లాహ్ కు వ్యతిరేకంగా వారిని రక్షించేవాడు కూడా లేకుండా పోయాడు. వారికి ఇప్పుడు రెట్టింపు శిక్షపడుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాటనూ వినేవారూ కాదు, స్వయంగా వారికి విషయమూ తట్టేదీ కాదు. తమను తాము స్వయంగా నష్టానికి గురిచేసుకున్నవారూ, తాము కల్పించిన దానినంతా కోల్పోయినవారూ వారే. వారు పరలోకంలో అందరికంటే అధికంగా నష్టపోవటం అనివార్యం. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసినవారూ, తమ ప్రభువుకే అంకితమై పోయినవారూ నిశ్చయంగా స్వర్గానికి పోతారు. స్వర్గంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. ఉభయపక్షాల పోలిక ఇలా ఉంది : ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు. రెండోవాడు చూడగలిగేవాడు, వినగలిగేవాడూ. వారు ఉభయులూ సమానులౌతారా? మీరు ( పోలిక ద్వారా) గుణపాఠాన్ని గ్రహించరా?

11. హూద్25 - 31 మేము నూహ్ను అతని జాతి వైపునకు పంపాము (అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి). (అతను ఇలా ప్రకటించాడు):  ‘‘నేను స్పష్టంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకండి. అలా చేస్తే మీపై ఒక రోజున బాధాకరమైన శిక్ష వచ్చిపడుతుందని నేను భయపడుతున్నాను.’’ సమాధానంగా, అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు : ‘‘మా దృష్టిలో నీవు కేవలం మావంటి ఒక మానవుడు తప్ప మరేమీ కావు. అదీగాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించ టాన్ని మేము చూస్తూనే ఉన్నాము. విషయంలో కూడా మీరు మా కంటే మెరుగుగా ఉన్నట్లు మాకు కనిపించదు. పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము.’’ అతను ఇలా అన్నాడు : ‘‘నా జాతి సోదరులారా! కొంచెం ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే,  తరువాత  ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్యభాగ్యాన్ని కూడా కలుగజేస్తే - కాని అది మీకు కనిపించకపోతే, మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా, మేము దానిని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలము? నా జాతి సోదరులారా! పనికి నేను మీ నుండి ధనమేమీ కోరటం లేదు. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది అల్లాహ్ బాధ్యత. నా మాటను విశ్వసించిన వారిని నేను గెంటివెయ్యలేను. స్వయంగా వారే తమ ప్రభువు సన్నిధానానికి వెళ్ళనున్నారు. అయితే, నేను చూస్తున్నాను. మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలారా! ఒకవేళ నేను వారిని తరిమివేస్తే,  అల్లాహ్ శిక్ష నుండి నన్ను రక్షించటానికి ఎవడు వస్తాడు? మీకు చిన్న విషయం కూడా అర్థం కాదా?  నా  వద్ద అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో చెప్పటంలేదే. నాకు అగోచర జ్ఞానం ఉందని కూడా అనటం లేదే. నేను దైవదూతనని కూడా ప్రకటించలేదు కదా! మీ కళ్ళు అసహ్యతతో చూస్తున్న వారికి అల్లాహ్ శుభాన్నీ ఇవ్వలేదని కూడా నేను అనలేదు. వారి మనస్సులలో ఏమి ఉన్నదో అల్లాహ్కే బాగా తెలుసు. ఒకవేళ అలా అంటే నేను దుర్మార్గుడనే.’’

11. హూద్32 - 34 చివరకు వారు ఇలా అన్నారు:  ‘‘నూహ్! నీవు మాతో వాదించావు. ఎన్నోసార్లు వాదించావు. ఇక చాలు. నీవు గనక సత్యవంతుడవే అయితే శిక్షను తీసుకురా, దానిని గురించి నీవు మమ్మల్ని బెదిరిస్తున్నావు.’’ నూహ్ ఇలా జవాబు పలికాడు : దానిని అల్లాహ్ యే తీసుకువస్తాడు, ఆయన గనక కోరితే. దానిని నిరోధించే సామర్థ్యం మీకు లేదు. అల్లాహ్ యే మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు, నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయోభిలాష మీకు లాభాన్నీ చేకూర్చలేదు. ఆయనే మీ ప్రభువు. ఆయన వైపునకే మీరు మరలవలసి ఉన్నది.’’

11. హూద్35 ప్రవక్తా! ఇదంతా స్వయంగా అతనే కల్పించాడని వారు అంటున్నారా? వారికి ఇలా చెప్పు: ‘‘ఒకవేళ నేనే స్వయంగా దీనిని కల్పించి ఉన్నట్లయితే నేరము యొక్క బాధ్యత నాపై ఉన్నది. మీరు చేస్తూవున్న నేరం బాధ్యతతో నాకు సంబంధమూ లేదు.’’

11. హూద్36 - 37 నూహ్కు వహీద్వారా ఇలా తెలుపబడిరది : నీ జాతిలో విశ్వసించే వారెవరూ లేరు.  వారి అకృత్యాలకు బాధపడటం మానుకో. మా పర్యవేక్షణలో మా వహీకి అనుగుణంగా ఒక పడవను తయారుచెయ్యి. చూడు! దుర్మార్గం చేసిన వారిని గురించి నాకు సిఫారసు చెయ్యకు. వారందరూ ఇప్పుడు మునిగిపోయేవారే.

11. హూద్38 - 39 నూహ్ పడవను తయారుచేస్తున్నాడు. అతని జాతి సర్దారులలో అతనివైపుగా పోయే ప్రతివాడూ అతనిని ఎగతాళి చేసేవాడు. అతను ఇలా అన్నాడు : ‘‘మీరు గనక మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతున్నాము. అతి త్వరలో స్వయంగా మీకే తెలుస్తుంది. అవమానం పాలుచేసే శిక్ష ఎవరిపై పడుతుందో, తొలగించినా తొలగని ఆపద ఎవరిపై విరుచుకుపడుతుందో.’’

11. హూద్40 - 41 చివరకు మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు, పొయ్యి పొంగింది. అప్పుడు మేము ఇలా అన్నాము : ‘‘ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలో ఎక్కించు. నీ ఇంటివారిని కూడా - ఇదివరకే సూచింపబడిన వ్యక్తులు తప్ప. ఇందులో ఎక్కించు. ఇంకా విశ్వాసులను కూడా ఎక్కించుకో. నూహ్తో పాటు విశ్వసించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. నూహ్ ఇలా అన్నాడు: ‘‘ఇందులో ఎక్కండి. అల్లాహ్ పేరుతోనే దాని పయనం కూడా, దాని ఆగటం కూడా. నా ప్రభువు క్షమించేవాడూ, కనికరించే వాడూనూ.’’

11. హూద్42 - 43 పడవ వారిని తీసుకుని తరలిపోతోంది. ఒక్కొక్క కెరటం పర్వతం మాదిరిగా లేస్తూ ఉంది. నూహ్ కుమారుడు చాలా దూరాన ఉన్నాడు. నూహ్ ఎలుగెత్తి పిలిచాడు: ‘‘బాబూ! మాతోపాటు ఎక్కెయ్యి. అవిశ్వాసులతో ఉండకు.’’ అతడు తిరిగి సమాధానం పలికాడు: ‘‘నేను ఇప్పుడే ఒక కొండపైకి ఎక్కుతాను. అది నన్ను నీళ్ళనుండి కాపాడుతుంది.’’ నూహ్ ఇలా అన్నాడు : ‘‘అల్లాహ్ తీర్పునుండి ఈనాడు రక్షించే వస్తువు ఏదీ లేదు, అల్లాహ్ యే ఎవరినైనా కరుణిస్తే తప్ప.’’ ఇంతలోనే ఒక కెరటం వారిద్దరికీ మధ్య అడ్డుగా వచ్చింది. అతడు కూడా మునిగిపోయే వారిలో కలసిపోయాడు.

11. హూద్44 ఆజ్ఞ జారీ అయింది : ‘‘భూమీ! నీ నీళ్ళన్నీ మింగివెయ్యి. ఆకాశమా! కురవటం మానివెయ్యి.’’ అప్పుడు నీరు భూమిలో ఇంకిపోయింది. తీర్పు జరిగిపోయింది. పడవ జూదీపై ఆగిపోయింది. ‘‘దుర్మార్గుల జాతి తొలగిపోయింది’’ అని చెప్పబడిరది.

11. హూద్45 - 47 నూహ్ తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు. ‘‘ప్రభూ! నా కుమారుడు నా కుటుంబం లోని వాడు.  నీ  వాగ్దానం నిజమైనటువంటిది, నీవు పాలకులలోకెల్లా గొప్పవాడవు, ఉత్తముడవు.’’ సమాధానంగా ఇలా అనబడిరది :  ‘‘నూహ్! అతడు నీ కుటుంబంలోనివాడు కాదు. అతడు ఒక చెడిపోయిన పని. కనుక విషయం యొక్క యథార్థం నీకు తెలియదో విషయం గురించి నన్ను వేడుకోకు. నిన్ను నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోకు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను.’’ నూహ్ వెంటనే ఇలా విన్నవించుకున్నాడు: ‘‘నా ప్రభూ! నాకు తెలియనిదానిని గురించి నిన్ను అడగటం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. నీవు గనక నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను.’’

11. హూద్48 ఇలా ఆజ్ఞ ఇవ్వబడిరది : ‘‘నూహ్!  దిగిపో.  నీపై నీతో పాటు ఉన్న వర్గాలపై మా తరఫు నుండి శాంతీ శుభాలూ కలుగుగాక. కొన్ని వర్గాలకు మేము కొంతకాలం వరకు జీవన సామగ్రిని ప్రసాదిస్తాము. తరువాత మా తరఫు నుండి వ్యధాభరితమైన శిక్ష వారిపై పడుతుంది.’’

11. హూద్49 ప్రవక్తా!  ఇవి  అగోచర సమాచారములు. వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. ఇంతకు పూర్వం నీవుగానీ నీ జాతివారుగానీ వాటిని ఎరుగరు. కనుక ఓర్పు వహించు. ఫలితం భయభక్తులుగలవారినే వరిస్తుంది.

11. హూద్50 - 52 ఆద్జాతి వైపునకు మేము వారి సోదరుడైన హూద్ను పంపాము. అతను ఇలా అన్నాడు: ‘‘నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీరు సృష్టించినటువంటిది కేవలం అబద్ధమే. నా జాతి సోదరులారా! పనికై మీ నుండి ప్రతిఫలాన్నీ కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం నన్ను సృష్టించిన వాని బాధ్యత - మీరు తెలివిని ఏమాత్రం ఉపయోగించరా? నా జాతి ప్రజలారా! మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీకై ఆకాశం ద్వారాలను తెరిచేస్తాడు. ఇప్పుడు మీకున్న శక్తిని మరింత శక్తి ఇచ్చి పెంచుతాడు. దోషులై (ఆరాధనకు) విముఖులు కాకండి.’’

11. హూద్53 - 54 వారు ఇలా జవాబు చెప్పారు : హూద్‌! నీవు మా వద్దకు స్పష్టమైన సాక్ష్యాన్నీ తీసుకురాలేదు. నీవు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించ బోవటం లేదు. నీపై మా ఆరాధ్యదైవాలలో ఎవరి దెబ్బ అయినా పడిరదని మేము అనుకుంటున్నాము.

11. హూద్54 - 57 హూద్ఇలా అన్నాడు : ‘‘నేను అల్లాహ్ ను సాక్షిగా నిలబెడ్తున్నాను. మీరు కూడా సాక్షులుగా ఉండండి, అల్లాహ్తో పాటు మీరు ఇతరులను దైవత్వంలో భాగస్వాములుగా చేసిన విషయంతో నాకు ఏవిధమైన సంబంధం లేదు అనేదానికి. మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా చెయ్యవలసినదంతా చేయండి. ఏవిధమైన లోటూ రానివ్వకండి. నాకు కొద్దిపాటి వ్యవధికూడా ఇవ్వకండి. నా నమ్మకం అల్లాహ్ మీదనే. ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. ప్రాణి జుట్టు అయినా ఆయన చేతులలో లేకుండా లేదు. నిశ్చయంగా నా ప్రభువు మార్గమే సరిjైున మార్గం. మీరు గనక మీ ముఖాలను తిప్పుకోదలిస్తే తిప్పుకోండి. సందేశంతో నేను మీ వద్దకు పంపబడ్డానో, సందేశాన్ని నేను మీకు అందజేశాను. ఇక నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని ప్రభవింపజేస్తాడు. ఆయనకు మీరు ఏమాత్రం హానిచెయ్యలేరు. నిశ్చయంగా నా ప్రభువు ప్రతి వస్తువునూ కనిపెట్టి ఉంటాడు.

11. హూద్58 తరువాత మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు, మేము మా కారుణ్యం ద్వారా హూద్కూ, అతనితో పాటు విశ్వసించిన ప్రజలకూ విముక్తిని ప్రసాదించాము. ఒక కఠిన శిక్ష నుండి వారిని రక్షించాము.

11. హూద్59 - 60 వీరే ఆద్జాతివారు. వారు తమ ప్రభువు ఆయతులను తిరస్కరించారు. ఆయన పంపిన ప్రవక్తల మాటలను వారు పాటించలేదు. అధికారంకల నిరంకుశుడైన ప్రతి సత్యవిరోధికి విధేయత చూపారు. చివరకు లోకంలో కూడా వారిపై శాపం పడిరది. ప్రళయం నాడు కూడా పడుతుంది. విను! ఆద్జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. విను! ఆద్, హూద్జాతుల ప్రజలు దూరంగా విసరివేయబడ్డారు.

11. హూద్61 సమూద్జాతి వద్దకు మేము వారి సోదరుడైన సాలిహ్ను పంపాము. అతను ఇలా హితోపదేశం చేశాడు: ‘‘నా జాతి ప్రజలారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఇక్కడ మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలిరండి. నిశ్చయంగా నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు.

11. హూద్62 వారు ఇలా అన్నారు : ‘‘సాలిహ్! నిన్నటివరకు మా మధ్య ఉన్న నీమీద మేము పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నాము. మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళను పూజించకుండా మమ్మల్ని ఆపదలచు కున్నావా? నీవు మార్గం వైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో, మార్గాన్ని గురించి మాకు పెద్ద అనుమానం ఉన్నది. అది మమ్మల్ని కలతకు గురిచేసింది.’’

11. హూద్63 - 64 సాలిహ్ ఇలా అన్నాడు : ‘‘నా జాతి సోదరులారా! కొంచెం విషయాన్ని గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగివుంటే, ఇంకా ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉంటే, తరువాత ఒకవేళ నేను అల్లాహ్ కు అవిధేయత చూపితే ఆయన  పట్టునుండి  నన్ను ఎవడు రక్షిస్తాడు? మీరు నాకు విధంగా ఉపయోగపడతారు, నన్ను ఇంకా నష్టంలోకి నెట్టటానికి తప్ప? నా జాతి ప్రజలారా! చూడండి! అల్లాహ్ యొక్క ఒంటె మీకు ఒక నిదర్శనంగా ఉంది. దానిని అల్లాహ్ భూమిపై మేయటానికి స్వేచ్ఛగా వదలిపెట్టండి. దాని జోలికి ఏమాత్రం పోకండి. ఒకవేళ అలాచేస్తే దైవశిక్ష మీపై పడటానికి ఎంతోసేపు పట్టదు.’’

11. హూద్65 కాని వారు ఒంటెను చంపివేశారు. అప్పుడు సాలిహ్ వారిని ఇలా హెచ్చరించాడు : ‘‘ఇంకా మూడు రోజులు మాత్రం మీరు మీ ఇళ్ళల్లో హాయిగా గడపండి. గడువు అబద్ధం కాబోదు.’’

11. హూద్66 - 68 చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు, మేము మా కారుణ్యంతో సాలిహ్నూ, అతనితో పాటు విశ్వసించిన వారినీ రక్షించాము. దినపు పరాభవం నుండి వారిని కాపాడాము. నిస్సంశయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిమంతుడూ ప్రాబల్యం కలవాడూను. ఇక దుర్మార్గానికి పాల్పడిన వారు, వారిపై ఒక పెద్ద ప్రేలుడు విరుచుకుపడిరది. అప్పుడు వారు తమ గృహాలలో చలనమూ  చైతన్యమూ  లేకుండా పడిపోయారు, అసలు వారు ఎప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. విను! సమూద్జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. విను! సమూద్జాతివారు దూరంగా విసరివెయ్యబడ్డారు!

11. హూద్69 - 73 చూడు! ఇబ్రాహీమ్వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. ‘‘మీకు సలామ్’’ అని వారు అన్నారు. ‘‘మీకూ సలామ్’’ అని ఇబ్రాహీమ్బదులుపలికాడు. తరువాత కొద్దిసేపటికే ఇబ్రాహీమ్వేపిన ఆవుదూడను (వారి ఆతిధ్యానికి) తీసుకొని వచ్చాడు. కాని వారి చేతులు భోజనం మీదకు పోకుండా ఉండటాన్ని  చూసి  ఆయన వారిని శంకించాడు. మనస్సులో వారంటే భయ పడసాగాడు. వారు ఇలా అన్నారు: ‘‘భయపడకు, మేము లూత్జాతి వైపునకు పంపబడ్డాము.’’ ఇబ్రాహీము  భార్య  కూడా అక్కడ నిలబడి ఉన్నది. ఆమె ఇది విని నవ్వింది. అప్పుడు మేము ఆమెకు ఇస్హాఖ్శుభవార్తనూ, ఇస్హాఖ్తరువాత యాఖూబ్శుభవార్తను అందజేశాము. ఆమె ఇలా అన్నది :  ‘‘అయ్యో నా దౌర్భాగ్యం! నాకు ఇప్పుడా పిల్లలు పుట్టేది? నేనూ ముసలిదాన్నే! నా భర్తకూడా ముసలివారే. ఇది చాలా విచిత్రమైన విషయం. దైవదూతలు ఇలా అన్నారు : ‘‘అల్లాహ్ ఆజ్ఞ పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీము కుటుంబ సభ్యులారా! అల్లాహ్ కారుణ్యమూ, ఆయన శుభాశీస్సులూ మీపై ఉన్నాయి. నిశ్చయంగా అల్లాహ్ స్తోత్రానికి ఎంతో అర్హుడూ, మహాఘనత కలవాడూ.’’

11. హూద్74 - 76 తరువాత ఇబ్రాహీము యొక్క భయం తొలగిపోయినప్పుడు (సంతానం శుభవార్తవల్ల) అతని మనస్సు ఆనందపడినప్పుడు, అతను లూత్జాతి వారి వ్యవహారం గురించి నాతో పోట్లాడ సాగాడు. యథార్థంగా ఇబ్రాహీము సహనశీలుడూ, మృదుహృదయుడూ అయిన మనిషి. అన్ని పరిస్థితులలోనూ మా వైపునకు మరలేవాడు. (చివరకు మా దూతలు అతనితో అన్నారు): ఇబ్రాహీమూ! దీన్ని మానుకో, నీ ప్రభువు ఆజ్ఞ ప్రకటించబడిరది. ఇక వారిపై శిక్ష వచ్చిపడటం తథ్యం. అది ఎవరు మరలించినా మరలదు.’’

11. హూద్77 - 81 మా దూతలు లూత్వద్దకు వచ్చినప్పుడు, వారి రాకకు అతను చాలా భయపడ్డాడు. అతని హృదయం క్రుంగిపోయింది. ‘‘ రోజు పెద్ద ఆపద రోజు’’ అని అతను అనసాగాడు. ( అతిథులు రాగానే) అతని జాతి ప్రజలు అప్రయత్నంగా అతని ఇంటి వైపునకు పరుగెత్తారు. మొదటి నుండీ వారు ఇటువంటి నీచపు పనులకే అలవాటుపడ్డవారు. లూత్వారితో ఇలా అన్నాడు : ‘‘సోదరులారా! ఇదిగో, నా కూతుళ్ళు ఉన్నారు. వీరు మీకు ఎక్కువ పరిశుద్ధలు అయినవారు. కొంచెమన్నా దేవునికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చెయ్యకండి. మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’’ వారు ఇలా సమాధానం చెప్పారు : ‘‘నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసుకదా! అసలు మేము కోరేది ఏమిటో కూడా నీకు తెలుసు.’’ లూత్ఇలా అన్నాడు : ‘‘మీకు బుద్ధి చెప్పే బలం నాకు ఉంటే ఎంత బాగుండేది! లేదా శరణు పొందటానికి ఏదైనా పటిష్ఠమైన ఆధారం అయినా ఉంటే ఎంత బాగుండేది!’’ అప్పుడు దైవదూతలు అతనితో ఇలా అన్నారు : ‘‘లూత్‌! మేము నీ ప్రభువు పంపిన దూతలము. వారు నీకు ఏమాత్రం కీడు చెయ్యలేరు. కనుక కొంతరాత్రి ఉండగానే నీవు నీ ఇంటివారిని తీసుకుని బయలుదేరు. చూడు! మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు. కాని నీ భార్య (నీతో రాకూడదు). ఎందుకంటే, వారికి ఏది జరుగనున్నదో అదే ఆమెకూ జరుగుతుంది. వారి వినాశానికి ఉదయ సమయం నిర్ణయం అయింది - ఉదయం కావటానికి ఇంకెంత ఆలస్యం ఉందని!’’

11. హూద్82 - 83 తరువాత మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు, మేము పట్టణాన్ని తల్లక్రిందులు చేసేశాము. దానిమీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళు ఎడతెగకుండా కురిపించాము. వాటిలోని ప్రతి రాయికీ గుర్తు నీ ప్రభువు వద్ద చేయబడిరది. శిక్ష దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు.

11. హూద్84 - 86 మద్యన్ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన షుఐబ్ను పంపాము. అతను ఇలా అన్నాడు : ‘‘నా జాతి ప్రజలారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కొలుచుటలో, తూచుటలో తక్కువ చెయ్యకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచిస్థితిలో చూస్తున్నాను. కాని రేపు మీపైకి ఒక దినం రానున్నది అనీ, దాని శిక్ష మీ అందరినీ చుట్టుముట్టుతుంది అనీ నేను భయపడుతున్నాను. నా జాతి సోదరులారా! కచ్చితంగా, న్యాయంగా పూర్తిగా కొలవండి, తూచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువచేసి ఇవ్వకండి. భూమిపై సంక్షోభాన్ని వ్యాపింపజేస్తూ తిరగకండి. అల్లాహ్ ప్రసాదించిన మిగులే (అందరికీ న్యాయంగా ఇచ్చిన తరువాత మిగిలిగినది) మీకు మేలైనది, మీరు విశ్వాసులే అయితే. ఏమైనప్పటికీ, నేను మీపై కావలివాణ్ణి మట్టుకు కాను.’’

11. హూద్87 వారు ఇలా సమాధానం చెప్పారు:  ‘‘షుఐబ్‌!  మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళందరినీ మేము వదిలిపెట్టాలనీ, లేదా మా ధనాన్ని  మా  ఇష్టానుసారం ఖర్చుచేసుకునే అధికారం మాకు ఉండకూడదనీ, నీకు నీ నమాజు నేర్పుతున్నదా? ఇక ఉదాత్త హృదయుడవూ, ఋజువర్తనుడవూ కేవలం నీవు ఒక్కడివే మిగిలిపోయావు!’’

11. హూద్88 - 90 షుఐబ్ఇలా అన్నాడు : ‘‘సోదరులారా! స్వయంగా మీరే ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరఫునుండి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగివుంటే తరువాత ఆయన నాకు తన వద్ద నుండి మంచి ఉపాధిని కూడా ప్రసాదిస్తే (దాని తరువాత నేను మీ భ్రష్ట మార్గాలలో మీ అక్రమ కార్యాలలో మీతో కలసి నేను ఎలా ఉండగలుగుతాను?)  విషయాల నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేనే స్వయంగా చెయ్యటాన్ని నేను సుతరామూ ఇష్టపడను. నేను మాత్రం నా శక్తిమేరకు మిమ్మల్ని సంస్కరించదలచుకున్నాను. నేను చెయ్యదలచుకున్న ఇదంతా పూర్తిగా అల్లాహ్ సహాయంపైనే ఆధారపడివుంది. ఆయననే నేను నమ్ముకున్నాను. ప్రతి వ్యవహారంలో ఆయన వైపునకే మరలుతాను. నా జాతి సోదరులారా! నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండివైఖరి చివరకు నూహ్ జాతిపై లేదా హూద్జాతిపై లేదా సాలిహ్ జాతిపై పడిన శిక్షయే మీపై కూడా పడేవరకు తీసుకునిపోదు కదా! లూత్జాతివారు మీకు ఎంతో దూరంలో కూడా లేరు. చూడండి! మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలిరండి. నిస్సందేహంగా నా ప్రభువు కారుణ్యమూర్తి. తన సృష్టిని ప్రేమిస్తాడు.’’

11. హూద్91 వారు ఇలా బదులు చెప్పారు : ‘‘షుఐబ్‌! నీవు చెప్పే చాలా విషయాలు మాకు అర్థమే కావు. మేము చూస్తూ ఉన్నాము - నీవు మాలో ఒక దుర్బలుడవు. నీ వంశం వారే గనక లేకుండా ఉంటే మేము నిన్ను ఎప్పుడో రాళ్ళతో కొట్టి చంపివుండేవాళ్ళం. మాపై ఆధిక్యం పొందగలిగే అంత శక్తి నీకు లేదు.’’

11. హూద్92 - 93 షుఐబ్ఇలా అన్నాడు:  ‘‘సోదరులారా!  మా వంశం వారు మీపై అల్లాహ్కంటె ఎక్కువ ఆధిక్యం కలవారా, మీరు (మా వంశం వారికి భయపడ్డారు కాని) అల్లాహ్ ను మాత్రం పూర్తిగా వెనక్కు నెట్టేశారు? తెలుసుకోండి! మీరు చేస్తున్నదంతా అల్లాహ్ శక్తిపరిధికి అతీతంగా లేదు. నా జాతి జనులారా! మీరు మీ విధానం ప్రకారం పనిచేస్తూ పొండి. నేను నా విధానం ప్రకారం పనిచేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది, అవమానభరితమైన శిక్ష ఎవరిపై పడుతుందో, అసత్యవాది ఎవడో. మీరూ నిరీక్షించండి. మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను.’’

11. హూద్94 చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో షుఐబ్నూ, అతనితోటి విశ్వాసులనూ రక్షించాము. దుర్మార్గం చేసినవారిపై ఒక తీవ్రమైన ప్రేలుడు విరుచుకుపడిరది. వారు తమ నివాసాలలో చలనమూ, చైతన్యమూ లేకుండా పడిపోయారు, అక్కడ వారు ఎప్పుడూ నివసించి ఉండలేదన్నట్లుగా.

11. హూద్95 విను! సమూద్జాతి వారు విసిరివేయబడినట్లు మద్యన్వారు కూడా దూరంగా విసరివేయ బడ్డారు.

11. హూద్96 - 99 ఇంకా మేము మూసాను మా సూచనలతో, స్పష్టమైన నియామకపు ఉత్తరువుతో ఫిరౌను వద్దకు అతని రాజ్యాధికారుల వద్దకు పంపాము. కాని వారు ఫిరౌను ఆజ్ఞను అనుసరించారు. వాస్తవానికి ఫిరౌను ఆజ్ఞ న్యాయమైనది కాదు. ప్రళయం నాడు అతడు తన జాతివారికి ముందు ముందు ఉంటాడు. తన నాయకత్వంలో వారిని నరకం వైపునకు తీసుకుపోతాడు. ఎవరైనా చేరటానికి అది ఎంత నికృష్టమైన గమ్యస్థానం! ప్రపంచంలో కూడా వారిపై శాపం పడిరది. ప్రళయం నాడు కూడా పడుతుంది. ఎవరికైనా దొరికే ప్రతిఫలం ఎంత చెడ్డది!

11. హూద్100 - 101 ఇవి కొన్ని పట్టణాల గాథలు. వాటిని మేము నీకు వినిపిస్తున్నాము. పట్టణాలలో కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. కొన్ని పంటపొలాలు మాదిరిగా కొయ్యబడ్డాయి. మేము వారికి అన్యాయం చెయ్యలేదు. వారు తమను తామే ఆపదలకు గురిచేసుకున్నారు. అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసినప్పుడు, అల్లాహ్ ను వదలి వారు ప్రార్థిస్తూవచ్చిన దేవుళ్ళు వారికి విధంగానూ సాయపడలేదు. దేవుళ్ళు వారికి వినాశం, విధ్వంసం తప్ప ప్రయోజనాన్నీ సమకూర్చలేదు.

11. హూద్102 - 108 నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహుకఠినమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికీ ఇందులో ఒక సూచన ఉంది. అది సర్వమానవులు సమావేశమయ్యే రోజు. రోజు జరిగేదంతా అందరి కళ్ళముందే జరుగుతుంది. మేము దానిని తీసుకురావటంలో అంత ఎక్కువ ఆలస్యం ఏమీ చెయ్యటం లేదు.  దాని  నిమిత్తం ఒక గడువు  నిర్ణయమై ఉంది. అది వచ్చినప్పుడు నోరెత్తటానికి ఎవరికీ గుండెలు ఉండవు. దేవుని అనుమతితో ఏమైనా మనవి చేసుకోవటం తప్ప. రోజున దురదృష్ట వంతులు కొందరు ఉంటారు. అదృష్టవంతులు కొందరు ఉంటారు. అభాగ్యులైన వారు నరకానికి పోతారు. (అక్కడి తీవ్రమైన వేడి, దప్పికల వల్ల) వారు రొప్పుతూ రోజుతూ ఉంటారు. అదేస్థితిలో వారు కలకాలం ఉంటారు, భూమ్యాకాశాలు ఉన్నంతవరకు, నీ ప్రభువు మరొకటి తలిస్తేతప్ప. నిస్సందేహంగా నీ ప్రభువు తాను కోరినది చెయ్యటానికి సంపూర్ణమైన అధికారం కలిగి వున్నాడు. ఇక అదృష్టవంతులుగా తేలినవారు - వారు స్వర్గానికి పోతారు. అక్కడ శాశ్వతంగా ఉంటారు, భూమ్యాకాశాలు ఉన్నంతవరకు, నీ ప్రభువు మరొకటి తలిస్తే తప్ప. ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహం వారికి లభిస్తుంది.

11. హూద్109 కనుక ప్రవక్తా! వారు ఆరాధిస్తున్న దేవుళ్ళను గురించి నీవు సందేహానికీ గురికాకు. పూర్వం వారి తాత ముత్తాతలు చేసినట్లుగానే వారుకూడా (అంధులై) పూజా పురస్కారాలు చేసుకుంటూ పోతున్నారు, మేము వారికి ఇవ్వవలసిన దానిని వారికి పూర్తిగా ఇస్తాము, ఎలాంటి తగ్గింపు లేకుండా.

11. హూద్110 - 115 మేము ఇదివరకు మూసాకు కూడా గ్రంథాన్ని ఇచ్చివున్నాము. దాని విషయంలో కూడా విభేధించటం జరిగింది. (ఇప్పుడు నీకు ఇవ్వబడిన గ్రంథం విషయంలో విభేదించటం జరుగుతున్నట్లుగా). నీ ప్రభువు తరఫు నుండి ఒక విషయం ముందే గనక నిర్ణయింపబడి ఉండకపోతే, విభేదించే వారి విషయంలో ఎప్పుడో తీర్పు జరిగివుండేది. వారు దీని విషయంలో సంశయానికీ, అయోమయానికీ గురిఅయ్యారు అనేది యథార్థం. నీ ప్రభువు వారికి వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అనేదికూడా యథార్థమే. నిశ్చయంగా ఆయన వారి అన్ని చేష్టలను ఎరిగినవాడు. కనుక ప్రవక్తా! నీవూ, (అవిశ్వాసం తిరుగుబాటుల నుండి విశ్వాసం, విధేయతల వైపునకు) మరలివచ్చిన నీ సహచరులూ నీకు ఆజ్ఞాపించిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి. దైవదాస్యపు హద్దులను అతిక్రమించకండి. మీరు చేస్తున్న దానిని మీ ప్రభువు కనిపెట్టి ఉంటాడు. దుర్మార్గుల వైపునకు కొంచెమైనా మొగ్గకండి. ఒకవేళ మొగ్గినట్లయితే నరకంలో చిక్కుకుపోతారు. మిమ్మల్ని దేవుని నుండి కాపాడగల సహాయకుడూ, సంరక్షకుడూ ఎవ్వడూ మీకు దొరకడు. ఎక్కడి నుండి మీకు సహాయం లభించదు. చూడు! నమాజును స్థాపించు, పగటి యొక్క రెండు సరిహద్దు సమయాలలోనూ, కొంతరాత్రి గడిచిన తరువాతనూ. వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాహ్ ను జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక జ్ఞాపిక. ఓర్మి కలిగి ఉండు. అల్లాహ్ మంచి చేసేవారి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చెయ్యడు.

11. హూద్116 - 119 నీకు ముందు గతించిన జాతులలో ప్రజలను భూమిపై కల్లోలాన్ని రేకెత్తించకుండా నిరోధించే సజ్జనులు ఎందుకు లేరు?  ఒకవేళ  అటువంటివారు ఉండినా, వారు చాలా కొద్దిమంది మాత్రమే! వారిని మేము జాతుల బారినుండి రక్షించాము. దుర్మార్గులు ఐహిక సుఖాల వెంటనే పడ్డారు. సుఖసాధనాలు వారికి పుష్కలంగా ఇవ్వబడ్డాయి. వారు దోషులే అయిపోయారు. నీ ప్రభువు పట్టణాలను అన్యాయంగా నాశనం చేసేవాడు ఎంతమాత్రం కాదు, వాటి ప్రజలు సంస్కరణాకార్యాలు చేసేవారైనప్పటికీ. నీ ప్రభువు సంకల్పిస్తే సర్వ మానవులనూ నిస్సందేహంగా ఒకే వర్గంగా చెయ్యగలిగేవాడే  కాని ఇప్పుడు వారు విభిన్న మార్గాలలోనే నడుస్తారు. కేవలం నీ ప్రభువు కరుణకు నోచుకున్నవారే అపమార్గాలకు లోనుకాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకే (ఎంపిక, ఆచరణల స్వాతంత్య్రాన్నిచ్చి పరీక్షించే నిమిత్తమే) సృష్టించాడు. ‘‘నేను నరకాన్ని జిన్నాతులతో, మానవులతో నింపుతాను’’ అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.

11. హూద్120 - 123 ప్రవక్తా! మేము నీకు వినిపిస్తున్న ప్రవక్తల గాధల ద్వారా నీ హృదయాన్ని శక్తిమంతం చేస్తున్నాము. వాటిద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది. విశ్వాసులకు హితవూ, జాగృతీ పొందే భాగ్యం కలిగింది. పోతే ఇక అవిశ్వాసులు, వారితో ఇలా అను : మీరు మీ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి  మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము. ముగింపు కొరకు మీరూ వేచిచూడండి, మేమూ వేచివుంటాము. ఆకాశాలలో, భూమిలో దాగివున్నదంతా అల్లాహ్ అధీనంలో ఉన్నది. అన్ని విషయాలూ ఆయన వైపునకే మరలింపబడతాయి. కనుక ప్రవక్తా! నీవు ఆయననే సేవించు. ఆయననే నమ్ముకో. మీరు చేస్తున్నదంతా నీ ప్రభువుకు తెలియకుండా లేదు.




No comments:

Post a Comment