99 అజ్ జిల్ జాల్
ఆయతులు
: 8 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 8
భూమి తన పూర్తి తీవ్రతతో ఊపి వేయబడినప్పుడు, భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయటవేసినప్పుడు, మానవుడు, ‘‘దీనికే మయింది (ఇలా ఊగిపోతోంది)’’ అని అంటాడు. ఆ రోజున అది తన (పైన సంభవించిన)
విశేషాలను వివరిస్తుంది.
ఎందుకంటే, నీ ప్రభువు దాన్ని (అలా చెయ్యిఅని) ఆజ్ఞాపించి ఉంటాడు. ప్రజలు తమ కర్మలను చూసుకునేం దుకుగాను, ఆ రోజున భిన్న పరిస్థితుల్లో దేవుని వైపునకు మరలుతారు. ఆ తరువాత ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నాసరే దాన్ని అతను చూసుకుం టాడు. అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసివున్నాసరే దాన్నీ అతను చూసుకుంటాడు.
No comments:
Post a Comment