110 అన్ నస్ర్
ఆయతులు
: 3 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 3 అల్లాహ్ సహాయం వచ్చినప్పుడు, విజయ భాగ్యం లభించినప్పుడు, ప్రజలు తండోప తండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసి నప్పుడు (ప్రవక్తా) నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా ఆయన మన్నింపును వేడుకో.
నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు.
No comments:
Post a Comment