78. సూరహ్ అన్‌ నబా

 

78. అన్నబా

ఆయతులు : 40                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5 విషయాన్ని గురించి వీరు అడుగుతున్నారు? మహావార్తను గురించేనా? దానిని గురించి వారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కాదు (వారు అనుకునేది) ఎంతమాత్రం కాదు. త్వరలోనే వారికి తెలిసిపోతుంది. అవును అది ఎంతమాత్రం నిజం కాదు. (అదేమిటో) త్వరలోనే వారికి తెలిసిపోతుంది.

6 - 16 మేము భూమిని పాన్పుగా చేశాము  అందులో పర్వతాలను మేకులుగా పాతాము  మిమ్మల్ని (స్త్రీ, పురుషుల) జంటలుగా సృష్టించాము  మీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాము  రేయిని తెరగా, పగటిని ఉపాధి సమయంగా చేశాము  మీపైన దృఢమైన ఏడు ఆకాశాలను నిర్మించాము  దేదీప్యమానంగా వెలిగే వెచ్చని దీపాన్ని సృష్టించాము  ధాన్యం, కూరగాయలు పండేందుకు, దట్టమైన తోటలు పెరిగేందుకు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాము - ఇదంతా వాస్తవం కాదా?

17 - 20 నిస్సందేహంగా తీర్పుదినం ఒక నిర్ణీత సమయం. శంఖం పూరించబడేరోజున మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు. ఆకాశం తెరువబడుతుంది. అది ద్వారాలు ద్వారాలుగా మారిపోతుంది. పర్వతాలు నడిపింపబడతాయి, ఎండమావులుగా మారిపోతాయి.

21 - 30 నిశ్చయంగా నరకం ఒక మాటు. ధిక్కారులకు అది నివాసస్థలం. యుగాల తరబడి వారు అక్కడే పడివుంటారు. అందులో ఎలాంటి చల్లదనాన్నీ, పానీయాన్నీ వారు చవిచూడలేరు. ఒకవేళ ఏదైనా దొరికితే, అది సల సల కాగే నీరు, గాయాల కడుగు మాత్రమే. అది  (వారి కర్మలకు) పరిపూర్ణ ప్రతిఫలం. లెక్క అడగబడుతుందని వారు ఆశించలేదు. మా వాక్యాలను వారు అసత్యాలుగా చిత్రించి పూర్తిగా తిరస్కరించారు. కాని అసలు పరిస్థితి ఏమిటంటే, మేము ప్రతి విషయాన్నీ పొల్లుపోకుండా లెక్క పెట్టి ఉంచాము. ఇక (మీరు కూడబెట్టిన దాని ఫలితాన్ని) చవిచూడండి. మేము మీ బాధను తప్ప దేన్నీ అధికం చెయ్యం.

31 - 37 నిశ్చయంగా భయభక్తులు కలవారి కొరకు ఒక సాఫల్యస్థానం ఉంది  ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ, సమ వయస్సు గల సుకన్యలూ, మద్యంతో నిండిన మధుపాత్రలూ ఉన్నాయి. విధమైన వ్యర్థ విషయాలనూ, అసత్యాలనూ వారు అక్కడ వినరు. (ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం- దయామయుడైన దేవుని తరఫు నుండి. ఆయన భూమ్యాకాశాలకూ, రెంటికీ మధ్య ఉన్న ప్రతి వస్తువుకూ యజమాని. ఆయన ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు.

38 - 39 ఆత్మ, దూతలు బారులు తీరి నిలబడే రోజున, కరుణామయుడు అనుమతించినవారు తప్ప మరెవ్వరూ మాట్లాడలేరు. అదికూడా సవ్యమైన మాట పలికేవారు మాత్రమే మాట్లాడుతారు. రోజు రావటం తథ్యం. ఇక ఎవరైనాసరే, ఇష్టమైతే, తమ ప్రభువు వైపునకు మరలేమార్గాన్ని అవలంబిం చవచ్చు.

40 సమీపంలోనే ఉన్న శిక్షను గురించి మేము మిమ్మల్ని హెచ్చరించాము. రోజున మనిషి తన చేజేతులా చేసుకుని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూస్తాడు. (అప్పుడు) సత్యతిరస్కారి ‘‘అయ్యో! నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది’’ అని గగ్గోలు పెడతాడు.

No comments:

Post a Comment