20 సూరహ్ తాహా

 

20. తాహా

ఆయతులు : 135                    అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

20. తాహా   1 - 8 తాహా, మేము ఖుర్ఆన్ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురిచేయటానికి మాత్రం కాదు. ఇది భయపడే ప్రతి వ్యక్తికీ ఒక జ్ఞాపిక. భూమినీ, ఎత్తైన ఆకాశాలనూ సృష్టించిన వాని తరఫు నుండి ఇది అవతరింప జేయబడిరది.   కరుణామయుడు (సృష్టి) సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఆకాశాలలో, భూమిలో మరియు భూమ్యాకాశాల మధ్య, ఇంకా నేలక్రింద ఉన్న వాటినన్నింటికీ ఆయన యజమాని. నీవు నీ మాటను బిగ్గరగా పలికినా పరవాలేదు. ఆయన మెల్లగా పలికిన మాటను మాత్రమే కాదు, దానికంటే అతి గోప్యమైన మాటను సైతమూ ఎరుగును. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరొక దేవుడే లేడు. ఆయనకు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి.

20. తాహా   9 - 10 మూసా వృత్తాంతం కూడ నీకేమైనా అందిందా? అప్పుడు అతను ఒక మంటను చూసి తన ఆలుబిడ్డలతో ఇలా అన్నాడు, ‘‘కొంచెం ఆగండి, నేను ఒక మంటను చూశాను. బహుశా మీ కోసం కాస్త నిప్పును తీసుకురాగల నేమో లేదా మంట వద్ద నాకేదైనా (దారికి సంబంధించిన) మార్గదర్శకత్వం లభిస్తుందేమో.’’

20. తాహా   11 - 39 ... అక్కడకు చేరగానే, ఒక వాణి ఇలా పిలిచింది, ‘‘మూసా! నేనే నీ ప్రభువును, చెప్పులు విడు.  నీవు  పవిత్రమైన తువా లోయలో ఉన్నావు. నేను నిన్ను ఎన్నుకున్నాను.  వహీ  ద్వారా చెప్పబడే దానిని విను. నేనే అల్లాహ్ ను, నేను తప్ప మరొక దేవుడు లేడు. కనుక నీవు నాకు దాస్యం చెయ్యి. నా జ్ఞాపకం కోసం నమాజును స్థాపించు. ప్రళయ ఘడియ తప్పని సరిగా వస్తుంది.  నేను  దాని సమయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నాను. ప్రతి వ్యక్తీ తన కృషి ప్రకారం ప్రతిఫలం పొందగలగటానికి. కనుక దానిని విశ్వసించకుండా తన మనోవాంఛలకు దాసుడైపోయిన వ్యక్తి ఎవడైనా, నిన్ను ఘడియను గురించిన చింతన నుండి మరల్చకూడదు  మరల్చితే నీవు వినాశానికి గురిఅవుతావు - మూసా! నీ చేతిలో ఉన్నది ఏమిటి?’’ దానికి మూసా, ‘‘ఇది నా చేతికర్ర దాని ఆధారంగా నడుస్తాను. దానితో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను. ఇంకా ఎన్నో పనులు దానితో నెరవేర్చుకుంటాను’’ అని సమాధానం చెప్పాడు. ‘‘మూసా! దానిని విసరివెయ్యి’’ అని దేవుడు సెలవిచ్చాడు. అతను విసరివేశాడు.  అకస్మాత్తుగా అది పరుగెత్తుతున్న ఒక పాముగా మారిపోయింది. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, ‘‘దాన్ని పట్టుకో, భయపడకు. మేము దానిని మళ్ళీ అది పూర్వం ఉన్న మాదిరిగానే చేసివేస్తాము. నీ చేతిని కొంచెం నీ చంకలోకి నొక్కు, అది మెరుస్తూ బయటకు వస్తుంది, ఎలాంటి బాధలేకుండానే. ఇది రెండో సూచన. ఎందుకంటే, మేము నీకు మా పెద్ద సూచనలను చూపబోతున్నాము. ఇక నీవు ఫిరౌను వద్దకు వెళ్లు, అతడు ధిక్కారి అయిపోయాడు.’’ మూసా ఇలా మనవి చేసుకున్నాడు, ‘‘ప్రభూ! నా హృదయాన్ని తెరువు. నా కార్యాన్ని నా కొరకు సులభతరం చెయ్యి. ప్రజలు నా మాటలు అర్థం చేసుకోగలగటానికి, నా నాలుక ముడిని విప్పు. ఇంకా నా కొరకు నా కుటుంబం నుండే ఒక సహాయకుణ్ణి నియమించు - నా సోదరుడు హారూన్ని -  అతని ద్వారా నా చేతులను పటిష్ఠం చెయ్యి. అతనిని నా కార్యంలో నాకు సహాయపడేలా చెయ్యి. మేము నీ పరిశుద్ధతను అత్యధికంగా ప్రకటించేటందుకు, నిన్ను అమితంగా స్మరించేటందుకు. నీవు నిత్యమూ మా స్థితిని కనిపెట్టే ఉన్నావు.’’ ఇలా సెలవిచ్చాడు  ‘‘మూసా! నీవు కోరినది ఇవ్వబడిరది. మేము మరొకసారి నీకు ఉపకారం చేశాము. మేము నీ తల్లికి సూచన ఇచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అది వహీ ద్వారా మాత్రమే ఇవ్వబడే సూచన. అది ఏమిటంటే  బాలుణ్ణి పెట్టెలో పెట్టి, పెట్టెను నదిలోకి వదలివెయ్యి. నది దానిని ఒడ్డున పడవేస్తుంది. నాకూ, బాలుడికి శత్రువు అయిన వాడు దానిని పట్టుకువెళతాడు.’’

20. తాహా   ... 39 - 44 నేను నా తరఫు నుండి నీపై ప్రేమను ఆవరింపజేశాను, నీవు నా పర్యవేక్షణలో పెంచబడే ఏర్పాటు చేశాను.  జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు నీ సోదరి అనుసరిస్తూ అక్కడకు వెళ్లి, ‘‘ బాలుణ్ణి చక్కగా పెంచి పోషించే ఆమెను గురించి మీకు తెలుపనా?’’ అని అంటుంది. ఇలా మేము నిన్ను మళ్లీ నీ తల్లి వద్దకే చేర్చాము, ఆమె కళ్లు చల్లబడేందుకు, ఆమె ద్ణుఖించకుండా ఉండేందుకు. ఇంకా ( విషయం కూడ జ్ఞాపకం తెచ్చుకో) నీవు ఒక వ్యక్తిని హత్య చేశావు. మేము ఉచ్చు నుండి నీకు విముక్తి కలిగించాము, తరువాత నిన్ను విభిన్న పరీక్షలకు గురిచేశాము. నీవు మద్యన్ప్రజల మధ్య ఎన్నో సంవత్సరాలు గడిపావు.  మూసా!  ఇప్పుడు నీవు సరిగ్గా సమయానికి వచ్చేశావు. నేను నిన్ను నా కొరకు తీర్చిదిద్దుకున్నాను.  వెళ్ళండి, నీవూ, నీ సోదరుడూ,  నా సూచనలతో.  చూడండి, మీరు నన్ను స్మరించే విషయంలో అశ్రద్ధ చెయ్యకండి. మీరు ఇద్దరూ కలసి ఫిరౌన్వద్దకు వెళ్లండి, అతడు ధిక్కారి అయిపోయాడు. అతనితో మృదువుగా మాట్లాడండి, బహుశా అతడు హితబోధను స్వీకరిస్తాడేమో లేదా (దేవునికి) భయపడతాడేమో.’’

20. తాహా   45 - 48 ఉభయులూ ఇలా మనవి చేసుకున్నారు, ‘‘ప్రభూ! అతడు మాపై దౌర్జన్యం  చేస్తాడేమో  అని లేక మాపై విరుచుకుపడతాడేమో  అని  మేము భయపడుతున్నాము.’’ ఇలా సెలవిచ్చాడు, ‘‘భయపడకండి,  మీతో పాటు నేనూ ఉన్నాను, అంతా వింటూ ఉన్నాను. చూస్తూ ఉన్నాను. అతని వద్దకు వెళ్లి ఇలా అనండి, ‘మేము నీ ప్రభువు సందేశహరులము. ఇస్రాయీల్సంతతివారు మాతో రావటానికి అనుమతించు. వారిని బాధపెట్టకు. మేము నీ వద్దకు నీ ప్రభువు సూచనలు తీసుకుని వచ్చాము. ఋజుమార్గం అనుస రించే వానికి శాంతి ఉంది. తిరస్కరించి విముఖుడయ్యే వానికి శిక్ష ఉందిఅని మాకు వహీ ద్వారా తెలుపబడిరది.’’

20. తాహా   49 - 55 ఫిరౌను ‘‘సరే, అయితే మూసా! మీ ఇద్దరి ప్రభువు ఎవడు?’’ అని అడిగాడు. దానికి మూసా ‘‘ప్రతి వస్తువుకూ దాని స్వరూపాన్ని ప్రసాదించి, తరువాత దానికి మార్గం చూపినవాడే మా ప్రభువు’’ అని జవాబు చెప్పాడు. అప్పుడు ఫిరౌను, ‘‘అయితే పూర్వం గతించిన తరాల వారి స్థితి ఏమిటి?’’ అని అన్నాడు. మూసా, ‘‘దానికి సంబంధించిన జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో సురక్షితంగా ఉంది. నా ప్రభువు పొరపాటూ చెయ్యడు, మరవడు కూడాను’’ అని సమాధానం పలికాడు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా పరిచాడు, దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు  పై నుండి నీటిని కురిపించాడు. తరువాత దాని ద్వారా రకరకాల పంటలను పండిర చాడు. వాటిని తినండి, మీ పశువులను కూడ మేపండి. నిశ్చయంగా అర్థం చేసుకోగల వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము, దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకు పోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము.

20. తాహా   56 - 61 మేము ఫిరౌనుకు మా సమస్త సూచనలనూ చూపాము.  కాని అతడు నిరాకరించాడు, విశ్వసించలేదు. ఇలా అన్నాడు,  ‘‘మూసా! నీవు నీ మంత్రజాల శక్తితో మమ్మల్ని మా దేశం నుండి వెళ్లగొట్టటానికి మా వద్దకు వచ్చావా? సరే మేము కూడ నీకు పోటీగా అటువంటి మంత్రజాలాన్నే తీసుకువస్తాము. ఎప్పుడు, ఎక్కడ ఎదుర్కోవాలో నిర్ణయించుకో. మేమూ ఒప్పందం నుండి మళ్లిపోము, నీవూ మళ్ళిపోకూడదు. బహిరంగ మైదానం లోనికి రా.’’ మూసా, ‘‘ఉత్సవ దినం నిర్ణయమైంది. పొద్దెక్కిన తరువాత ప్రజలు సమావేశం కావాలి’’ అని చెప్పాడు. ఫిరౌను మరలిపోయి, తన కుతంత్ర సామగ్రిని సమీకరించుకుని పోటీకి వచ్చాడు. (పోటీ ప్రారంభంలోనే ప్రత్యర్థి వర్గాన్ని సంబోధిస్తూ)  మూసా ఇలా అన్నాడు, ‘‘దౌర్భాగ్యులారా  అల్లాహ్ పై అపనిందలు మోపకండి. అలా చేస్తే ఆయన మిమ్మల్ని ఒక కఠిన శిక్ష ద్వారా సర్వనాశనం చేస్తాడు. అబద్ధాన్ని ఎవడు కల్పించినా, వాడు విఫలుడే అయ్యాడు.’’

20. తాహా   62 - 64 ఇది విన్న తరువాత వారి మధ్య అభిప్రాయ భేదం తలెత్తింది. వారు తమలో తాము రహస్యంగా సంప్రదించుకోసాగారు. చివరకు కొందరు ఇలా అన్నారు,  ‘‘ ఇద్దరు కేవలం మాంత్రికులే. వారి ఉద్దేశ్యం తమ మంత్రబలం ద్వారా మిమ్మల్ని మీ దేశం నుండి తరిమివేయటం. అంతేకాదు మీ ఆదర్శ జీవన విధానాన్ని అంతమొందించటం. కావున మీరు ఈనాడు మీ శక్తియుక్తులను సమీకరించుకోండి, సమైక్యంగా రంగంలోకి దిగండి. ఈనాడు ప్రాబల్యం వహించిన వాడే గెలిచాడు అనే విషయం తెలుసుకోండి.’’

20. తాహా   65 - 76 మాంత్రికులు, ‘‘మూసా! మొదట నీవు విసురుతావా లేక మేము విసరమా?’’ అని అడిగారు. దానికి మూసా, ‘‘లేదు, మీరే విసరండి’’ అని అన్నాడు. అపుడు అకస్మాత్తుగా వారి త్రాళ్లూ, వారి కర్రలూ వారి మంత్రశక్తి వల్ల పరుగెత్తుతూ ఉన్నట్లు మూసాకు అనిపించింది. మూసా తన మనస్సులో భయపడ్డాడు. మేము ఇలా అన్నాము, ‘‘భయపడకు, నీవే ఆధిక్యం వహిస్తావు. నీ చేతిలో ఉన్న దానిని విసరివెయ్యి. ఇప్పుడే అది వారు కల్పించిన వాటి నన్నింటినీ మింగివేస్తుంది. వారు కల్పించి తీసుకువచ్చింది కేవలం మాంత్రి కుని తంత్రమే. మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కాలేడు, వాడు ఎంత నేర్పరి అయినాసరే. చివరకు జరిగిందేమిటంటే, మాంత్రికులందరూ సజ్దా (సాష్టాంగపడటం)లో పడవేయబడ్డారు. వారు ఎలుగెత్తి, ‘‘మేము హారూన్, మూసాల ప్రభువును విశ్వసించాము’’ అని ప్రకటించారు.  ఫిరౌను ఇలా అన్నాడు, ‘‘నేను మిమ్మల్ని అనుమతించకముందే మీరు ఇతన్ని విశ్వసించారా? ఇతడు మీకు మంత్ర విద్య నేర్పిన గురువని తెలిసిపోయింది. సరే, ఇప్పుడు నేను మీ చేతులను, మీ కాళ్ళను వ్యతిరేక పార్శ్వాల నుండి (కుడిచెయ్యి, ఎడమకాలు, ఎడమ చెయ్యి కుడి కాలు) నరికిస్తాను. ఖర్జూరపు దూలాలపై శిలువ వేయిస్తాను. అప్పుడు మా ఇద్దరి శిక్షలలో ఏది ఎక్కువ కఠినమైనదో, ఏది దీర్ఘకాలికమైనదో మీకు తెలుస్తుంది. (అంటే మీకు నేను ఎక్కువ కఠినమైన శిక్ష విధించగలనా లేక మూసా విధించగలడా అని). మాంత్రికులు ఇలా జవాబు పలికారు, ‘‘మమ్మల్ని సృష్టించిన శక్తి సాక్షిగా! స్పష్టమైన సూచనలు ముందుకు వచ్చిన తరువాత కూడ (సత్యంపై) నీకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది జరగని పని. నీవు చెయ్యదలచుకున్నది చేసుకో, మహాఅయితే నీవు ప్రపంచ జీవితం గురించి మాత్రమే నిర్ణయం చెయ్యగలవు. మేము మా ప్రభువును విశ్వసించాము. మా తప్పులను ఆయన క్షమించాలని, నీవు బలవం తంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలకు మమ్మల్ని మన్నించాలని. అల్లాహ్ యే మంచివాడు, కలకాలం ఉండేవాడు.’’  -  యథార్థం ఏమిటంటే, దోషిగా తన ప్రభువు ముందు హాజరయ్యే వాడికి నరకం తప్పదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు. ఆయన సాన్నిధ్యంలో విశ్వాసిగా హాజరు అయి, సత్కార్యాలు చేసి ఉన్నవాడు, - అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి.  నిత్యం  పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే.

20. తాహా   77 మేము మూసాకు వహీద్వారా ఇలా తెలిపాము, ‘‘ఇక రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని బయలుదేరు, వారి కొరకు సముద్రంలో పొడిబాటను ఏర్పాటు చెయ్యి, ఎవరైనా వెంటాడుతారేమో అనే భయం నీకు ఏమాత్రం వద్దు, (సముద్రం మధ్యగా పోతున్నప్పుడు) భయపడనూవద్దు.’’

20. తాహా   78 - 79 వెనుక నుండి ఫిరౌను తన సేనలతో అక్కడకు చేరాడు. తరువాత సముద్రం  వారిని క్రమ్ముకుంది,  క్రమ్ముకోవలసిన విధంగా, ఫిరౌను తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగానే చేశాడు, వారికి సరిjైున మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేదు.

20. తాహా   80 - 82 ఇస్రాయీల్సంతానమా! మేము మీకు మీ శత్రువు నుండి విముక్తి కలిగించాము. తూర్పర్వతం కుడి ప్రక్కన మీరు హాజరయ్యేందుకు గడువు నిర్ణయించాము. ఇంకా మీపై మన్న్ను, సల్వాను అవతరింపజేశాము - మేము ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. దానిని తిని తిరుగుబాటు చెయ్యకండి. చేస్తే నా ఆగ్రహం మీపై విరుచుకుపడుతుంది. ఎవడి మీద నా ఆగ్రహం విరుచుకుపడుతుందో, అతడు పతనం కావటం తథ్యం. అయితే ఎవడు పశ్చాత్తాపపడతాడో మరియు విశ్వసించి మంచిపనులు చేస్తాడో, తరువాత సక్రమంగా నడుచుకుంటాడో, అతనిని నేను అమితంగా మన్నిస్తాను.

20. తాహా   83 - 85 మూసా! విషయం నిన్ను నీ జాతి ప్రజలకంటే, ముందుగానే ఇక్కడకు తీసుకువచ్చింది?  అతను  ఇలా మనవి చేసుకున్నాడు, ‘‘ఇదిగో వారు నా వెనుక వస్తూనే ఉన్నారు. నేనే త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను, నా ప్రభూ! నీవూ నా పట్ల ప్రసన్నుడవు కావాలని.’’ ఇలా సెలవిచ్చాడు, ‘‘అయితే విను మేము నీ వెనుక (నీవు లేనప్పుడు) నీ జాతి ప్రజలను పరీక్షకు గురిచేశాము. సామిరీవారిని మార్గం తప్పించాడు.

20. తాహా   86 - 91 మూసా ఆగ్రహోదగ్రుడై, ద్ణుఖిస్తూ తన జాతి వారి వైపునకు మరలాడు. అక్కడకు వెళ్లి ఇలా అన్నాడు, ‘‘నా  జాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచి వాగ్దానాలు చేయలేదా? అప్పుడే మీకు ఎన్నో రోజులు గడిచినట్లు అనిపించిందా? లేక మీరు మీ ప్రభువు ఆగ్రహాన్ని మీపైకి కొనితెచ్చుకోవాలని కోరుకున్నందువల్లనే మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగం చేశారా?’’ దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు, ‘‘మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. జరిగిందేమిటంటే, ప్రజల ఆభరణాల బరువు మాపై పడగా మేము వాటిని క్రింద పడవేశాము, అంతే - తరువాత ఇలానే సామిరీ కూడ ఏదో కొంత వేశాడు,  వారికై ఒక ఆవుదూడ విగ్రహాన్ని చేసి వెలికి తీశాడు, దానిలో నుండి ఎద్దు అరుపువంటి శబ్దం వచ్చేది. ప్రజలు అరుస్తూ  ‘‘ఇదే మీ దైవమూ, మూసా దైవము కూడా. మూసా దీనిని మరచిపోయాడు’’ అని అన్నారు. అది వారు అడిగిన దానికి సమాధానం చెప్పజాలదనే విషయాన్నీ, వారి లాభనష్టాలపై దానికి అధికారమూ లేదు అనే విషయాన్నీ వారు గమనించటం లేదా? హారూన్‌ (మూసా రాకకు) ముందే వారితో ఇలా అన్నాడు, ‘‘ప్రజలారా! దీనివలన మీరు పెద్ద విపత్తులోనే పడిపోయారు. రహ్మానే (కరుణామయుడు) మీ ప్రభువు. కనుక మీరు నన్ను అనుసరించండి, నా మాట వినండి.’’ కాని వారు అతనితో ఇలా అననే అన్నారు, ‘‘మావద్దకు మూసా తిరిగి వచ్చేవరకు, మేము దీనినే పూజిస్తూ ఉంటాము.’’

20. తాహా   92 - 98 మూసా (తన జాతివారిని మందలించిన తరువాత హారూన్వైపునకు తిరిగి ఇలా) అన్నాడు, ‘‘హారూన్‌! వారు మార్గం తప్పుతున్నారనే విషయాన్ని నీవు గమనించినప్పుడు నా మార్గాన్ని అనుసరించకుండా నిన్ను వారించిన విషయం ఏమిటి? నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించావా?’’ హారూన్ఇలా జవాబు చెప్పాడు, ‘‘నా తల్లి కుమారుడా! నా గడ్డాన్ని పట్టుకోకు, నా తల వెంట్రుకలను పట్టి లాగకు. ఇస్రాయీలు సంతతిలో నీవు చీలికలు తీసుకువచ్చావు. నా మాటను లక్ష్యపెట్టలేదు  అని నీవు అంటావని నేను భయపడ్డాను.’’ అప్పుడు మూసా, ‘‘అయితే, సామిరీ! నీ సంగతేమిటో చెప్పు’’ అని అడిగాడు. అతడు ఇలా అన్నాడు, ‘‘నేను వారికి కనిపించని దాన్ని ఒక దానిని చూశాను. అప్పుడు నేను సందేశహరుని అడుగుజాడలలో నుండి ఒక పిడికెడు మట్టిని తీసుకున్నాను. దానిని (ఆవు దూడపై) పోశాను.  నా ఆత్మ నాకు అలానే సూచించింది.’’ మూసా ఇలా అన్నాడు, ‘‘సరే, వెళ్లిపో, ఇక జీవితాంతం నీవు నన్ను ముట్టుకోకండిఅనే అరుస్తూ ఉంటావు. నీ విచారణ కొరకు ఒక సమయం నిర్ణయమయ్యే ఉంది. అది నీ విషయంలో ఏమాత్రం తొలగదు. ఇక చూడు, శ్రద్ధాభక్తులతో నీవు ఆరాధించే నీ దైవాన్ని, ఇప్పుడు మేము కాల్చి పారవేస్తాము, భస్మంగా చేసి సముద్రంలో కలిపివేస్తాము. ప్రజలారా! మీ దేవుడు కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక దేవుడు లేనేలేడు. ఆయన జ్ఞానం ప్రతి విషయాన్ని ఆవరించి ఉన్నది.’’

20. తాహా   99 - 112 ప్రవక్తా! ఇలా మేము పూర్వం జరిగిన సంఘటనల చరిత్రను నీకు వినిపిస్తున్నాము. మేము ప్రత్యేకంగా మా వద్దనుండి నీకు ఒక ‘‘జ్ఞాపిక’’ (హితోపదేశం)ను ప్రసాదించాము. దానికి విముఖుడయ్యే వాడు ప్రళయం నాడు పెద్ద పాపభారాన్ని మోస్తాడు. అటువంటి వారందరూ సంకటంలో సదా చిక్కుకుని ఉంటారు. ప్రళయం నాడు ( నేరం యొక్క బాధ్యతా భారం) వారికి ఎంతో బాధాకరమైన బరువుగా ఉంటుంది. శంఖం ఊదబడే రోజున మేము అపరాధులను ఒకచోట చేరుస్తాము. వారి కనుగుడ్లు భయంవల్ల తేలిపోయి ఉంటాయి. అప్పుడు వారు ‘‘ప్రపంచంలో మహాఅయితే మీరు పదిరోజులు గడిపారేమో’’ అని పరస్పరం గుసగుసలాడుకుంటారు - వారు మాట్లాడుకుంటూ ఉండేది ఏమిటో మాకు బాగా తెలుసు. (ఇది కూడ మాకు తెలుసు). అప్పుడు వారిలో అతి జాగ్రత్తగా అంచనావేసేవాడు సైతం ‘‘కాదు, ప్రపంచంలో మీ జీవితం కేవలం ఒక రోజు జీవితం మాత్రమే’’ అనే అంటాడు. వారు నిన్ను, ‘‘ఇంతకూ, రోజున పర్వతాలు ఏమవుతాయి’’ అని అడుగుతారు. ఇలా చెప్పు, ‘‘నా ప్రభువు వాటిని ధూళిగా చేసి ఎగుర వేస్తాడు, భూమిని చదునైన ప్రదేశంగా చేస్తాడు. అందులో మీరు వంకరలు గాని, మిట్టపల్లాలు గాని చూడరు.’’ - రోజున  ప్రజలందరూ పిలిచేవాని పిలుపు వినగానే నేరుగా వచ్చేస్తారు, ఎవ్వడూ తలబిరుసుగా ప్రవర్తించలేడు. కంఠ స్వరాలన్నీ కరుణామయుని ముందు అణగిపోతాయి. ఒక్క చిరుసవ్వడి తప్ప మీరు ఏమీ వినలేరు. రోజున సిఫారసు ఏమాత్రమూ పనిచెయ్యదు. కరుణామయుడు ఎవరికైనా దానికి అనుమతిని ఇచ్చి అతని మాటను ఆలకించటానికి ఇష్టపడితే తప్ప - ఆయన ప్రజల పూర్వోత్తరాలను అన్నింటినీ ఎరుగును. ఇతరులకు వాటిని గురించి పూర్తిగా తెలియదు - సజీవుడు, నిత్యుడు అయిన ఆయన ముందు ప్రజల శిరస్సులు వంగిపోతాయి. ఏదైనా అన్యాయం చేసి దాని పాప భారాన్ని తన నెత్తిపై మోసేవాడు అప్పుడు నష్ట పోతాడు. సత్కార్యాలు చేసినవానికి అతడు విశ్వాసి కూడ అయితే, అన్యా యమూ జరగదు. అతని హక్కులు కాజేయబడే ప్రమాదమూ ఉండదు.

20. తాహా   113 ప్రవక్తా! విధంగా మేము దీనిని అరబ్బీ ఖురాన్గా అవతరింప జేశాము, అందులో పలురకాలుగా హెచ్చరికలు చేశాము, బహుశా వారు వక్ర వైఖరిని విడనాడుతారేమో అని,  లేక  దీని కారణంగా వారిలో చేతన కలిగే సూచనలు జనిస్తాయేమో అని.

20. తాహా   114 కనుక అందరికంటే ఉన్నతుడు, గొప్పవాడు అల్లాహ్ యే, ఆయనే నిజమైన చక్రవర్తి. చూడు, ఖుర్ఆన్చదవటంలో తొందరపడకు, నీ వైపునకు దాని వహీ పూర్తికానంత వరకు, ఇలా ప్రార్థించు, ‘‘ ప్రభూ! నాకు మరింత జ్ఞానం ప్రసాదించు.’’

20. తాహా   115 - 127 దీనికి పూర్వం మేము ఆదమ్కు ఒక ఆజ్ఞ ఇచ్చాము. కాని అతను దానిని మరచిపోయాడు. మేము అతనిలో నిలకడను చూడలేదు. మేము దైవదూతలతో ఆదమ్కు సజ్దా చేయండి అని చెప్పిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. వారందరూ సజ్దా చేశారు. కాని ఒక్క ఇబ్లీస్మాత్రం తిరస్కరించాడు. అప్పుడు మేము ఆదమ్తో ఇలా అన్నాము, ‘‘చూడు, ఇతడు నీకూ, నీ భార్యకూ శత్రువు. కనుక జాగ్రత్త. ఇతడు మిమ్మల్ని స్వర్గం నుండి బహిష్కరింపజేస్తాడేమో, మీరు ఆపదల పాలవుతారేమో, ఇక్కడ మీకు చాల సౌకర్యాలు ఉన్నాయి. పస్తులూ ఉండరు, దిగంబరులుగానూ ఉండరు. దప్పికా, ఎండా మిమ్మల్ని వేధించవు.’’ కాని షైతాను అతనిని మోసం చేశాడు, ఇలా అన్నాడు, ‘‘ ఆదమ్‌! శాశ్వత జీవితాన్నీ అంతంకాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపేదా?’’ చివరకు వారు ఉభయులు (భార్యాభర్తలు) వృక్షఫలాన్ని తినేశారు. పర్యవసానంగా వెంటనే వారి మర్మాంగాలు ఒకరివి ఒకరి ముందు బహిర్గతమయ్యాయి. వారిరువురు స్వర్గపు ఆకులతో తమను తాము కప్పుకోసాగారు. ఆదమ్తన ప్రభువు పట్ల అవిధేయత చూపాడు. ఋజుమార్గం తప్పిపొయ్యాడు. దాని తరువాత అతని ప్రభువు అతనిని ఎన్నుకుని, అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. అంతేకాదు, అతనికి మార్గ దర్శకత్వాన్ని ప్రసాదించాడు. ఇంకా ఇలా సెలవిచ్చాడు, ‘‘మీరిద్దరు (ప్రత్యర్థులు అంటే మానవుడు, షైతాన్‌) ఇక్కడి నుండి దిగిపోండి. మీరొకరికొకరు శత్రువు లుగా ఉంటారు. ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం ఏదైనా మీ వద్దకు వస్తే,  ఎవడు  నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో, అతడు మార్గమూ తప్పడు, దౌర్భాగ్యానికీ గురికాడు. నా జ్ఞాపికకు (హితోపదేశం) విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది. ప్రళయం నాడు మేము అతనిని అంధుడుగా లేపుతాము.’’ - అప్పుడు అతడు ‘‘ప్రభూ! ప్రపంచంలో నేను చూడగలవాణ్ణికదా! నన్ను ఇక్కడ అంధునిగా ఎందుకు లేపావు?’’ అని అడుగుతాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, ‘‘మా ఆయతులు, నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వాటిని విస్మరించావు. అదేవిధంగా ఈనాడు నీవు కూడ విస్మరించబడుతున్నావు.’’ - ఈవిధంగా మేము హద్దులు అతిక్రమించేవాడికీ, తన ప్రభువు ఆయత్లను విశ్వసించని వాడికి (ప్రపంచంలో) ప్రతిఫలం ఇస్తాము. ఇక పరలోక శిక్ష అయితే ఎక్కువ కఠినమైనదీ ఎక్కువ కాలం ఉండేదీనూ.

20. తాహా   128 వీరికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేసివేశాము. జాతుల(శిధిలమైన) నివాస స్థలాలలో ఈనాడు వీరు సంచరిస్తున్నారు. అయినా వీరికి (చరిత్ర నేర్పే గుణపాఠం ద్వారా) మార్గదర్శకత్వం లభించలేదా? వాస్తవంగా వివేకవంతులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి.

20. తాహా   129 - 132 నీ ప్రభువు తరఫు నుండి మొదట్లోనే ఒక విషయం నిశ్చయమై ఉండకపోతే, ఒక గడువు కాలం నిర్ణయమై ఉండకపోతే, వీరి తీర్పు కూడ జరిగే ఉండేది. కనుక ప్రవక్తా! వీరు కల్పించే మాటల పట్ల సహనం వహించు  నీ ప్రభువు స్తోత్రంతో పాటు, ఆయన పవిత్రతను కొనియాడు, సూర్యుడు ఉదయించే ముందు, అస్తమించే ముందు, రాత్రి సమయాల్లో కూడ పగటి అంచులలో కూడ ఆయనను స్తుతించు. బహుశా నీవు సంతుష్టు డవౌతావేమో. వీరిలోని రకరకాల ప్రజలకు మేము ఇచ్చిన ప్రపంచ జీవితపు శోభావైభవాలను కన్నెత్తి కూడ చూడకు.  వాటిని  మేము వారిని పరీక్షకు గురిచెయ్యటానికే ఇచ్చాము. నీ ప్రభువు అనుగ్రహించిన హలాల్ఉపాధియే ఉత్తమమైనది, చిరకాలం ఉండేది. నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడ దానిని పాటించు. మేము నీ నుండి ఉపాధినేమీ కోరడం లేదు. ఉపాధిని మేమే నీకు ఇస్తూ ఉన్నాము. చివరకు మేలు జరిగేది భయభక్తులకే.

20. తాహా   133 - 135 వారు, వ్యక్తి తన ప్రభువు దగ్గర నుండి ఏదైనా సూచనను (మహిమను) ఎందుకు తీసుకురాడూ? అని అడుగుతారు. పూర్వ గ్రంథాలలోని సమస్త  బోధలుగల  స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా? ఒకవేళ మేము దాని  రాకకు  పూర్వమే వారిని ఏదైనా శిక్ష ద్వారా నాశనం చేసి ఉంటే, వారే తరువాత ఇలా అని ఉండేవారు, ‘‘ ప్రభూ! నీవు మా వద్దకు ప్రవక్తను ఎవరినైనా ఎందుకు పంపలేదు? అగౌరవ అవమానాల పాలుకాక ముందే మేము నీ ఆయత్లను అనుసరించి ఉండేవారము కదా!’’ ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘ప్రతివాడు అంతిమ ఫలితం కోసం నిరీక్షిస్తున్నాడు. కనుక మీరు కూడ నిరీక్షించండి. త్వరలోనే మీరు తెలుసుకుంటారు. ఋజు మార్గంలో నడిచే వారెవరో, మార్గదర్శకత్వం పొందినవారెవరో.’’


No comments:

Post a Comment