88 అల్ గాషియాహ్
ఆయతులు
: 26 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 16 ముంచుకు వచ్చే ముప్పు (అంటే ప్రళయం)ను గురించిన సమాచారం నీకేమైనా అందిందా? కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి, ఎక్కువ శ్రమపడుతూ, అలసిపోతారు, తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు. త్రాగేందుకు వారికి సలసల కాగే చెలమ నీరు ఇవ్వబడుతుంది. వారి కొరకు ఎండిన ముళ్ల గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు, అది బలమూ నీయదు, ఆకలినీ తీర్చదు. ఆ రోజున కొందరి ముఖాలు కళ కళలాడుతూ ఉంటాయి, తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు, అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు. అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలను వినరు, అందులో సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి, పాత్రలు పెట్టబడి ఉంటాయి, పెద్ద పెద్ద దిండ్లు వరుసలు వరుసలుగా అమర్చ బడి ఉంటాయి, అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి.
17 - 20 అయితే వీరు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిరదో? కొండలను చూడరా అవి ఎలా పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా అది ఎలా పరచబడిరదో?
21 - 26 సరే అయితే, (ప్రవక్తా) హితబోధచేస్తూ ఉండు, నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే, వారిని ఏ విధంగానూ బలవంతంచేసే వాడవు కావు. కాని ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో,(సత్యాన్ని) తిరస్కరిస్తారో, అల్లాహ్ అతనికి భారీ శిక్ష విధిస్తాడు. వీరు (చివరికి) మా వైపునకే మరలి రావలసి ఉంది. ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మా మీదనే ఉంది.
No comments:
Post a Comment