9.
అత్ తౌబా
ఆయతులు
: 129 అవతరణ
: మదీనాలో
9.
అత్ తౌబా
1 - 2 అల్లాహ్ తరఫు నుండి, ఆయన ప్రవక్త తరఫు నుండి మీరు ఒడంబడికలు చేసుకున్న ముష్రిక్కు లకు విముక్తి ప్రకటించబడుతోంది. కనుక మీరు దేశంలో స్వేచ్ఛగా ఇంకా నాలుగు నెలలు తిరగండి. మీరు అల్లాహ్ ను అశక్తుడుగా చెయ్యలేరని తెలుసుకోండి. అల్లాహ్ సత్యతిరస్కారులను పరాభవంపాలు చేస్తాడు.
9.
అత్ తౌబా
3 - 4 పెద్ద హజ్ రోజున సమస్త ప్రజలకు అల్లాహ్ తరఫు నుండీ ఆయన ప్రవక్త తరఫు నుండీ చెయ్యబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు అలాగే ఆయన ప్రవక్త కూడా. ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాహ్ ను అశక్తుడుగా చెయ్యలేరు అని బాగా అర్థం చేసుకోండి. ప్రవక్తా! తిరస్కరించేవారికి కఠినశిక్షను గురించిన శుభవార్తను వినిపించు, మీరు ఒడంబడికలు కుదుర్చుకున్న ముష్రిక్కులకు తప్ప. ఎందుకంటే వారు తమ ఒడంబడికలు నెరవేర్చటంలో మీపట్ల ఏ లోపమూ చేయలేదు, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు
అటువంటి వారితోపాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే, అల్లాహ్ భయభక్తులు గలవారంటేనే ఇష్టపడతాడు.
9.
అత్ తౌబా
5 - 6 కనుక, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటువద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే, వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను. ఒకవేళ ముష్రిక్కులలో ఏ వ్యక్తి అయినా శరణుగోరి మీ వద్దకు రాదలిస్తే (అల్లాహ్ గ్రంథాన్ని వినటానికీ), అతనికి శరణు ఇవ్వండి, అతడు అల్లాహ్ గ్రంథాన్ని వినే అంతవరకు. తరువాత అతనిని అతని భద్రతాస్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చెయ్యాలంటే, వారికి గ్రంథ జ్ఞానము లేదు కాబట్టి.
9.
అత్ తౌబా
7 - 12 ఈ ముష్రిక్కులకు అల్లాహ్ వద్ద ఆయన సందేశహరునివద్ద ఒడంబడిక అనేది అసలు ఎలా సాధ్యం? - మీరు ‘మస్జిదె హరామ్’ వద్ద ఒడంబడిక చేసుకున్నవారితో తప్ప. వారు మీతో సరిగ్గా ఉన్నంతవరకు మీరూ వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే అల్లాహ్ భయభక్తులు కలవారంటే ఇష్టపడతాడు - కానీ వారితో తప్ప, ఇతర ముష్రిక్కులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యం, వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు? అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్నీ లెక్కచెయ్యరు, ఏ ఒడంబడిక బాధ్యతనూ ఖాతరుచెయ్యరు, వారు నోటిమాటలతో మిమ్మల్ని సమాధానపరచటానికి ప్రయత్నిస్తారు. కాని వారి మనస్సులు మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలామంది దుర్మార్గులు. వారు అల్లాహ్ ఆయతులను అల్పధరకు విక్రయించారు. అంతేకాదు, అల్లాహ్ మార్గంలో అవరోధమై నిల్చున్నారు. వారు చేసినవి బహుచెడ్డచేష్టలు. ఏ విశ్వాసి విషయం లోనైనా వారు బంధుత్వాన్నిగానీ, ఒడంబడిక బాధ్యతనుగానీ లెక్కచెయ్యరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపునుండే జరిగింది. కనుక ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే, వారు మీ ధార్మిక సోదరులే. విజ్ఞుల కొరకు మేము మా ఆజ్ఞలను ఇలా స్పష్టం చేస్తాము. ఒకవేళ ఒడంబడిక కుదుర్చుకున్న తరువాత, వారు మళ్ళీ తమ ప్రమాణాలను భగ్నంచేస్తే, మీ ధర్మంపై దాడులు చెయ్యటం ప్రారంభిస్తే, అవిశ్వాస పతాకధారులతో యుద్ధం చెయ్యండి
ఎందుకంటే, వారి ప్రమాణాలు ఏమాత్రం నమ్మదగ్గవి కావు. బహుశా (కరవాల శక్తివల్లనే) వారు మానుకోవచ్చు.
9.
అత్ తౌబా
13 - 16 తమ వాగ్దానాలను భంగంచేస్తూ ఉన్నవారితో, సందేశహరుణ్ణి దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్నవారితో మీరు యుద్ధం చెయ్యరా? అతిక్రమణను ప్రారంభించింది వారే. మీరు వారికి భయపడుతున్నారా? మీరు గనక విశ్వాసులే అయితే మీరు భయపడటానికి అల్లాహ్ యే ఎక్కువ అర్హుడు. కనుక వారితో యుద్ధం చెయ్యండి
అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు. వారిని హీనులుగా, నీచులుగా చేసి అవమానంపాలుచేస్తాడు. ఇంకా వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. చాలామంది విశ్వాసుల హృదయాలను చల్లబరుస్తాడు. వారి గుండెల మంటను దూరం చేస్తాడు. ఇంకా తాను కోరినవారికి పశ్చాత్తాప భాగ్యం కలుగజేస్తాడు. అల్లాహ్ అంతా తెలిసినవాడూ వివేకవంతుడూను. మీరు ఊరికే వదలిపెట్టబడతారని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో (తనమార్గంలో) ప్రాణాలొడ్డి పోరాడిన వారు ఎవరో, ఇంకా, అల్లాహ్నూ సందేశహరుణ్ణీ విశ్వాసులనూ తప్ప మరెవరినీ ఆప్తమిత్రులుగా చేసుకోనివారు ఎవరో ఇంకా అల్లాహ్ చూడనేలేదు. మీరు ఏది చేస్తారో అది అల్లాహ్ కు తెలుసు.
9.
అత్ తౌబా
17 - 22 ముష్రిక్కులు అల్లాహ్ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికిరారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమైపోయాయి. నరకంలో వారు కలకాలం ఉండాలి. అల్లాహ్నూ, అంతిమదినాన్నీ విశ్వసించి, నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు అల్లాహ్ కు తప్ప మరెవరికీ భయపడనివారు మాత్రమే అల్లాహ్ మసీదులకు సంరక్షకులూ, సేవకులూ కాగలగుతారు. వారే సరిjైున మార్గంలో నడుస్తారని ఆశించవచ్చు. అల్లాహ్నూ, అంతిమదినాన్నీ విశ్వసించి అల్లాహ్ మార్గంలో ప్రాణాలొడ్డి కృషిచేసే మనిషి పనితో హాజీలకు మంచినీళ్లు త్రాపటాన్ని, మస్జిదె హరామ్కు సేవలు చెయ్యటాన్ని మీరు సమానంగా భావించారా? అల్లాహ్ దగ్గర వారిద్దరూ సమానులు కారు. అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు. విశ్వసించి అల్లాహ్ మార్గంలో ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి తమ ప్రాణాలతో, తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది. అట్టివారే సఫలీకృతులు. వారి ప్రభువు వారికి తన కారుణ్యం, తన సంతోషాల శుభవార్తనూ, శాశ్వత భోగాల సామగ్రిగల స్వర్గవనాల శుభవార్తనూ ఇస్తున్నాడు. వాటిలో వారు సదా ఉంటారు. నిశ్చయంగా సేవలకు ప్రతిఫలం ఇవ్వటానికి అల్లాహ్ వద్ద ఎంతో ఉంది.
9.
అత్ తౌబా
23 - 24 విశ్వసించిన ప్రజలారా! మీ తండ్రులను, మీ సోదరులను కూడా మీ సహచరులుగా చేసుకోకండి, ఒకవేళ వారు విశ్వాసం కంటె అవిశ్వాసానికి ప్రాధాన్యం ఇస్తే. మీలో వారిని సహచరులుగా చేసుకునే వారే దుర్మార్గులు. ప్రవక్తా! ఇలా అను : ‘‘ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగి స్తాయేమో
అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో శ్రమించటం కంటే మీకు గనక ఎక్కువ ప్రియతరమైతే, అల్లాహ్ తన తీర్పును మీముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు మార్గం చూపడు.’’
9.
అత్ తౌబా
25 - 27 అల్లాహ్
ఇదివరకు చాలా సందర్భాలలో మీకు సహాయం చేసి ఉన్నాడు, ఇటీవలనే హునైన్ సంగ్రామం రోజున ఆయన సహాయం యొక్క మహిమను మీరు చూసి ఉన్నారు. ఆ రోజు మీరు మీ సంఖ్యాబలాన్ని చూసి గర్వపడ్డారు. కాని అది మీకు ఏవిధంగానూ పనికిరాలేదు. భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. మీరు వెన్నుచూపి పారిపోయారు. తరువాత అల్లాహ్ తన (తరఫు నుండి) ప్రశాంతస్థితిని తన ప్రవక్తపై విశ్వాసులపై అవతరింపజేశాడు ఇంకా మీకు కనిపించని దళాలను దించాడు. సత్యతిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించే ప్రతిఫలం ఇదే. తరువాత (మీరు దీనిని కూడా చూశారు) ఇలా శిక్షించిన తరువాత, అల్లాహ్ తాను కోరినవారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించే వాడూను.
9.
అత్ తౌబా
28 విశ్వసించిన ప్రజలారా! ముష్రిక్కులు అపరిశుద్ధులు. కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదె హరామ్
దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు లేమి భయం కలిగితే, అల్లాహ్ కోరితే మిమ్మల్ని తన అనుగ్రహంతో సంపన్నులుగా చెయ్యటం అసంభవం కాదు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ వివేకవంతుడూను.
9.
అత్ తౌబా
29 - 35 గ్రంథ ప్రజలలో అల్లాహ్నూ, అంతిమదినాన్నీ విశ్వసించనివారునూ, అల్లాహ్, ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించినదానిని నిషిద్ధంగా భావించనివారునూ, ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోనివారునూ అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి. వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చేవరకూ, లోబడి ఉండేవరకూ (వారితో పోరాడండి). ‘‘ఉజైర్ అల్లాహ్ కుమారుడు’’ అని యూదులు అంటారు. ‘‘మసీప్ా అల్లాహ్ కుమారుడు’’ అని క్రైస్తవులు అంటారు. వారికి పూర్వం అవిశ్వాసంలో పడివున్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి. దేవుని దెబ్బ వారిపై పడుగాక! వారెలా మోసపోతున్నారు! వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఇంకా ఇదేవిధంగా మర్యమ్ కుమారుడైన మసీప్ాను కూడా. వాస్తవానికి, ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి ద్యాస్యాన్నీ చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు.
ఆయన తప్ప
ఆరాధనకు అర్హుడైన వాడెవడూ లేడు. ఆయన పరిశుద్ధుడు. వారు అనే షిర్కు మాటలకు అతీతుడు. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని అనుకుంటున్నారు. కాని అల్లాహ్ తన జ్యోతిని పరిపూర్ణం చెయ్యకుండా వదిలిపెట్ట టానికి అంగీకరించడు, అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే. తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపినవాడు అల్లాహ్ యే. దానిని ఇతర అన్ని జీవన వ్యవస్థలపై ప్రబలింపజెయ్యా లని, ముష్రిక్కులకు ఇది ఎంత సహించరానిదైనా సరే. విశ్వసించిన ప్రజలారా! ఈ గ్రంథ ప్రజల యొక్క చాలామంది పండితుల స్థితీ, సన్యాసుల స్థితీ ఎటువంటిదంటే, వారు ప్రజల సొమ్మును అక్రమపద్ధతుల ద్వారా తినేస్తారు. వారిని అల్లాహ్ మార్గం అనుసరించకుండా ఆపుతారు. వెండి బంగారాలను పోగుచేసి వాటిని దైవమార్గంలో ఖర్చుపెట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజెయ్యండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పార్శ్వాలపై, వీపులపై వాతలు వెయ్యబడతాయి - ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నది, ఇదిగో, ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచిచూడండి.
9.
అత్ తౌబా
36 - 37 యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ భూమినీ అల్లాహ్ సృష్టించినప్పటినుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరిjైున గణనపద్ధతి. కనుక ఈ నాలుగు మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులతో అందరూ కలసి పోరాడండి, వారందరూ కలసి మీతో పోరాడేవిధంగా. తెలుసుకోండి, అల్లాహ్ భయభక్తులు కలవారితోనే ఉంటాడని. ‘నసీ’ అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. దానిద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురిచెయ్యబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు,
మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేసేస్తారు, అల్లాహ్ నిషిద్ధం చేసిన మాసాల సంఖ్యను
పూర్తిచెయ్యాలనీ,
అల్లాహ్ నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా - వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి
అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.
9.
అత్ తౌబా
38 - 40 విశ్వసించిన ప్రజలారా! మీకు ఏమైనది, మీతో అల్లాహ్ మార్గంలో బయలుదేరండి అని చెప్పినప్పుడు, మీరు నేలకు అతుక్కుపోయారు? మీరు పరలోకానికి మారుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాలి, ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోక సుఖాల ముందు స్వల్పాతి స్వల్పమైనదిగా తేలుతుందని. మీరు గనక లేవకపోతే, దేవుడు మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు.
ఇంకా మీ స్థానంలో మరొక సంఘాన్ని దేనినయినా లేపుతాడు. మీరు దేవునికి ఏమాత్రం నష్టం కలిగించలేరు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగివున్నాడు. మీరు ఒకవేళ ప్రవక్తకు సహాయం చెయ్యకపోతే, ఏమీ ఫర్వాలేదు. అవిశ్వాసులు అతనిని బహిష్కరించినపుడూ అతను కేవలం ఇద్దరిలో రెండోవాడుగా ఉన్నప్పుడూ, వారిద్దరూ గుహలో ఉన్నప్పుడూ అతడు తన స్నేహితునితో, ‘‘విచారపడకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు’’ అని అన్నప్పుడూ అల్లాహ్ అతనికి సహాయం చేశాడు. ఆ సమయంలో అల్లాహ్ అతనిపై తన తరఫునుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనికి మీకు కానరాని దళాలతో సహాయపడ్డాడు. అవిశ్వాసుల మాటను కించపరిచాడు.
అల్లాహ్ మాట సర్వదా సర్వోత్కృష్టమైనదే! అల్లాహ్ మహాశక్తి సంపన్నుడూ, మహావివేకవంతుడూనూ.
9.
అత్ తౌబా
41 బయలుదేరండి, తేలికగానైనా సరే, బరువుగానైనా సరే.
అల్లాహ్ మార్గంలో పోరాడండి మీ సంపద లనూ, మీ ప్రాణాలనూ ఒడ్డి. ఇది మీకు శ్రేయస్కరమైనది, మీరు గనక తెలుసుకుంటే.
9.
అత్ తౌబా
42 ప్రవక్తా! లాభాలు గనక తేలికగా లభిస్తే, ప్రయాణం సులభతరమైతే వారు తప్పకుండా మీ వెంట రావటానికి సిద్ధపడేవారు. కాని వారికి ఈ మార్గం ఎంతో శ్రమతో కూడినదిగా కనిపించింది. ఇప్పుడు వారు దేవునిపై మాటిమాటికీ ప్రమాణం చేసి మరీ అంటారు : మేము గనక రాగల స్థితిలో ఉన్నట్లయితే, నిశ్చయంగా మీవెంట వచ్చి ఉండేవారమని. వారు తమను తాము వినాశంలో పడవేసుకుంటున్నారు. వారు అబద్ధం చెప్పేవారని అల్లాహ్ కు బాగా తెలుసు.
9.
అత్ తౌబా
43 - 45 ప్రవక్తా! అల్లాహ్ నిన్ను క్షమించుగాక! నీవు వారికి అనుజ్ఞ ఎందుకు ఇచ్చావు? (వారికి నీవై అనుజ్ఞ ఇవ్వకుండా ఉండవలసింది) ఎవరు సత్యవంతులో నీకు స్పష్టమై ఉండేది. ఇంకా అబద్ధం చెప్పేవారిని కూడా నీవు తెలుసుకొని ఉండేవాడవు. అల్లాహ్ పై, అంతిమదినంపై విశ్వాసం కలిగి ఉండే వారు, తమ ప్రాణాలనూ, తమ సంపదలనూ ఒడ్డి పోరాడే విషయంలో తమను మన్నించ వలసినదని
నిన్ను ఎన్నటికీ అభ్యర్థించరు. భయభక్తులు కలవారిని అల్లాహ్ బాగా ఎరుగును. అల్లాహ్నూ, అంతిమదినాన్ని విశ్వసించనివారు తమ మనస్సులో సంశయాలు
ఉండి వాటిలోనే ఊగిసలాడేవారు మాత్రమే అటువంటి అభ్యర్థనలను చేస్తారు.
9.
అత్ తౌబా
46 - 48 ఒకవేళ నిజంగానే వారికి బయలుదేరాలనే ఉద్దేశం ఉంటే, దాని కొరకు వారు ఏవైనా సన్నాహాలు చేసివుండేవారు. కాని అల్లాహ్ కు వారు బయలుదేరటం అసలు ఇష్టం లేదు. కనుక ఆయన వారికి బద్ధకం కలుగజేశాడు. ఇంకా, ‘‘వెనుక ఉండిపోయేవారితోనే ఉండిపోండి’’ అని వారికి చెప్పబడిరది. వారు గనక మీతో బయలుదేరి ఉండినట్లయితే, మీకు కీడు తప్ప మరి దేనినీ అధికం చేసివుండేవారు కాదు. వారు మీ మధ్య విభేదాల్ని సృష్టించే నిమిత్తం తీవ్రప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ వర్గం వారిలో వారి మాటలను చెవియొగ్గి వినేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అల్లాహ్ ఆ దుర్మార్గులను బాగా ఎరుగును. ఇంతకుముందు కూడా వారు విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని ఓడిరచటానికి, వారు అన్ని రకాల వ్యూహాలను మార్చి మార్చి ప్రయోగించారు. చివరకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది. అల్లాహ్ కార్యం నెరవేరిపోయింది.
9.
అత్ తౌబా
49 వారిలో ఒకడు ఇలా అంటాడు: ‘‘నాకు అనుజ్ఞ ఇవ్వండి. నన్ను పరీక్షకు గురిచెయ్యకండి’’ - వినండి! వారు పరీక్షకే గురిఅయివున్నారు. నరకం ఈ అవిశ్వాసులను చుట్టుముట్టి ఉన్నది.
9.
అత్ తౌబా
50 - 51 మీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. ఏదైనా ఆపద మీమీదకు వచ్చిపడినప్పుడు వారు ముఖాన్ని త్రిప్పుకొని సంతోషంతో పొంగిపోతూ మరలిపోతారు. ఇలా అంటూ పోతారు : ‘‘మేము ముందే మా వ్యవహారాన్ని సరిచేసుకోవటం మంచిదయింది’’. వారితో ఇలా అనండి : ‘‘అల్లాహ్ మా కొరకు వ్రాసి ఉంచింది తప్ప మాకు ఏదీ (చెడుగానీ మంచిగానీ) ఏమాత్రం కలగదు. అల్లాహ్ యే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి.’’
9.
అత్ తౌబా
52 వారితో ఇలా అనండి : ‘‘మీరు మా విషయంలో దేనికొరకు నిరీక్షిస్తున్నారో అది, రెండు మేళ్లలో ఒకటితప్ప మరొకటేముంది? ఇక మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నది ఏమిటంటే, అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష ఇస్తాడా లేక మా చేతుల ద్వారా ఇప్పిస్తాడా అనేది. మంచిది, అయితే ఇక మీరు కూడా నిరీక్షించండి. మేము కూడా మీతోపాటే నిరీక్షిస్తాము.’’
9.
అత్ తౌబా
53 - 55 వారికి ఇలా చెప్పండి : ‘‘మీరు మీ సంపదలను ఇష్టంతో ఖర్చుచేసినా లేదా ఇష్టం లేకుండా ఖర్చుచేసినా అవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు. ఎందుకంటే, మీరు దుర్మార్గులు. వారు ఇచ్చిన సంపద స్వీకరించబడక పోవటానికి దీనికంటే మరొక కారణమేదీలేదు. వారు అల్లాహ్నూ ఆయన ప్రవక్తనూ తిరస్కరించారు. నమాజుకు వస్తే బద్ధకంతో వస్తారు. దేవుని మార్గంలో ఖర్చుపెడితే అయిష్టంగానే ఖర్చుపెడతారు. వారి సిరిసంపదలనూ, వారి అధిక సంతానాన్ని చూసి మోసపోవద్దు. అల్లాహ్ మాత్రం ఈ వస్తువుల ద్వారానే వారిని ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురిచెయ్యాలనీ, వారు ప్రాణత్యాగం చేసినా సత్యతిరస్కార స్థితిలోనే చెయ్యాలనీ కోరుతున్నాడు.
9.
అత్ తౌబా
56 - 57 వారు దేవునిమీద మాటిమాటికీ ప్రమాణం చేసి, మేము మీ వారమే అని అంటారు. వాస్తవానికి వారు ఎంతమాత్రం మీవారు కారు. అసలు వారు మీరంటే భయపడతారు. వారికి గనక ఏదైనా ఆశ్రయంగానీ, గుహగానీ, దూరి కూర్చుండేస్థలం గానీ దొరికితే గబగబా పరుగెత్తి అందులో దాక్కుంటారు.
9.
అత్ తౌబా
58 - 60 ప్రవక్తా! వారిలో కొందరు సదఖాత్ పంపకం విషయంలో నీపట్ల ఆక్షేపణలు తెలుపుతారు. ఒకవేళ ఈ నిధుల నుండి ఏదైనా వారికిస్తే సంతోషిస్తారు. ఇవ్వకపోతే ఆగ్రహిస్తారు. అల్లాహ్, ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో తృప్తిపడి ఇలా అనివుంటే ఎంత బాగుండేది: ‘‘అల్లాహ్ మాకు చాలు. ఆయన తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాపై దయచూపుతాడు. మేము అల్లాహ్ వైపునకే దృష్టిని నిలిపివున్నాము.’’ ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికీ, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, రుణగ్రస్తుల సహాయానికీ, దేవుని మార్గంలోనూ బాటసారుల ఆతిథ్యానికీ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూను.
9.
అత్ తౌబా
61 వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో నొప్పించేవారు ఉన్నారు. ‘‘ఈ మనిషి ఎప్పుడూ చెప్పుడు మాటలు వింటాడు’’ అని అంటారు. ఇలా చెప్పండి : ‘‘ఆయన మీ మేలుకొరకే అలా ఉన్నాడు. అల్లాహ్ ను విశ్వసిస్తాడు. విశ్వసించినవారిని నమ్ముతాడు. మీలో విశ్వాసులైన వారికొరకు పూర్తిగా కారుణ్యమూర్తి. అల్లాహ్ ప్రవక్తను నొప్పించే వారికి వ్యధాభరితమైన శిక్షపడుతుంది.’’
9.
అత్ తౌబా
62 - 63 వారు మీ ముందు ప్రమాణాలు చేస్తారు, మిమ్మల్ని సంతోష పెట్టటానికి. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాహ్నూ ఆయన ప్రవక్తనూ సంతోషపెట్టటానికి వారు చింతన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కువ హక్కుదారులు. వారికి తెలియదా, అల్లాహ్నూ ఆయన ప్రవక్తనూ ఎదుర్కొనేవాడి కొరకు నరకాగ్ని ఉందనీ, అందులోనే కలకాలం ఉంటాడనీ? ఇది పెద్ద అవమానం.
9.
అత్ తౌబా
64 - 66 ఈ కపటులు భయపడుతున్నారు, వారి హృదయాలలో ఉన్న రహస్యాలను బయటపెట్టే సూరా ఏదైనా ముస్లిములపై అవతరిస్తుందేమో అని. ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ఇంకా ఎగతాళి చెయ్యండి. బయటపడుతుందని మీరు భయపడుతూ ఉన్న ఆ విషయాన్నే అల్లాహ్ బయటపెట్ట బోతున్నాడు.’’ మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని
ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం
బదులు చెబుతారు.
వారితో ఇలా అను : ‘‘మీ వేళాకోళం, అల్లాహ్తోనా ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఒకవేళ మేము మీలో ఒక వర్గాన్ని క్షమించినా, రెండో వర్గానికి మాత్రం తప్పనిసరిగా శిక్ష విధిస్తాము. ఎందుకంటే వారు అపరాధులు.’’
9.
అత్ తౌబా
67 - 70 కపటులైన పురుషులూ, కపటులైన స్త్రీలూ అందరూ ఒకే కోవకు చెందినవారు
వారు చెడును చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. మంచిని చెయ్యవద్దు అని వారిస్తారు. ఇంకా తమ చేతులను మేలుచేయకుండా ఆపుతారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు. కనుక అల్లాహ్ కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా ఈ కపటులే ద్రోహులు. కపటులైన ఈ పురుషులకూ, స్త్రీలకూ అవిశ్వా సులకూ అల్లాహ్ నరకాగ్నిని వాగ్దానం చేశాడు. అందులో వారు కలకాలం ఉంటారు. అదే వారికి యోగ్యమైనది. వారిపై అల్లాహ్ శాపం పడిరది. వారికొరకు శాశ్వతమైన శిక్ష ఉంది - మీవి కూడ మీకు ముందువారి తీరుతెన్నులే. వారు మీకంటే ఎక్కువ బలాఢ్యులు. ఎక్కువ సంపద, ఎక్కువ సంతానం కలిగివుండేవారు. పైగా వారు ప్రపంచంలో తమ వంతు సుఖాలను జుర్రుకున్నారు. మీరు కూడా మీవంతు సుఖాలను వారు అనుభవించిన మాదిరిగానే అనుభవించారు. ఇంకా వారు పడినటువంటి వాదోపవాదాలలోనే మీరూ పడ్డారు. కనుక వారి ముగింపు ఎలా జరిగిందంటే, వారు చేసినదంతా ప్రపంచంలోనూ వ్యర్థమైపోయింది, పరలోకంలోనూ వ్యర్థమైపోయింది. వారే నష్టానికి గురిఅయ్యారు - వారికి తమ పూర్వీకుల చరిత్ర అందలేదా? నూప్ా జాతి ప్రజలు ఆద్, సమూద్ జాతులు, ఇబ్రాహీమ్ జాతి ప్రజలు మద్యన్ ప్రజలు, తల్లక్రిందులు చేయబడిన పట్టణాలు? వారి ప్రవక్తలు వారివద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అయితే వారికి అల్లాహ్ అన్యాయం చెయ్యలేదు. వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
9.
అత్ తౌబా
71 - 72 విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరులు, వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నమాజును స్థాపిస్తారు. జకాత్ను ఇస్తారు. అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు. వారిమీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అందరికంటే ప్రబలుడు. వివేకవంతుడూ, వివేచనాపరుడూను. విశ్వాసులైన ఈ పురుషులకూ, స్త్రీలకూ అల్లాహ్ వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారికి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. నిత్యమూ కళకళలాడే ఆ ఉద్యాన వనాలలో వారికొరకు పరిశుద్ధమైన నివాసాలు ఉంటాయి. ఇంకా అన్నింటికంటే మించిన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. అదే గొప్ప సాఫల్యం.
9.
అత్ తౌబా
73 - 74 ప్రవక్తా! అవిశ్వాసులూ, కపటులూ ఈ ఉభయులనూ పూర్తి శక్తితో ఎదుర్కో. వారితో కఠినంగా వ్యవహరించు. చివరకు వారి నివాసస్థలం నరకమే, అది అతి చెడ్డ నివాసస్థలం. మేము ఆ మాటను అనలేదు అని వారు మాటిమాటికీ దేవునిపై ప్రమాణంచేసి అంటారు. వాస్తవానికి వారు ఆ అవిశ్వాసపు మాటను అన్నారు. వారు ఇస్లామ్ను స్వీకరించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. వారు దేనిని చెయ్యాలని అనుకున్నారో దానిని చెయ్యలేకపోయారు. అల్లాహ్, ఆయన ప్రవక్తా తమ అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా వారు ఆగ్రహిస్తున్నారు. ఇక వారు తమ ఈ వైఖరిని మానుకుంటే, అది వారికే మేలు. వారు గనక మానుకోకపోతే, అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. ప్రపంచంలోనూ పరలోకంలోనూ వారిని సమర్థించేవాడూ వారికి సహాయం చేసేవాడూ ఇలలో ఎవడూ లేడు.
9.
అత్ తౌబా
75 - 80 ఆయన గనక తన అనుగ్రహం నుండి మాకు ప్రసాదిస్తే మేము దానం చేస్తాము, సజ్జనులమై ఉంటాము అని అల్లాహ్ కు ప్రమాణం చేసినవారు కూడా కొందరు వారిలో ఉన్నారు. కాని, అల్లాహ్ తన అనుగ్రహంవల్ల వారిని సంపన్నులుగా చేసినప్పుడు, వారు పిసినారితనానికి దిగారు. తమ ప్రమాణం నుండి మరలిపోయారు. దానిని ఏమాత్రం లెక్కలేయటం లేదు. ఫలితం ఏమయిందంటే, వారు అల్లాహ్ ఎడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధం కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో వారు హాజరయ్యే రోజు వరకూ వారిని వెంటాడటం మానదు. వారికి తెలియదా, అల్లాహ్ కు వారి గుప్తరహస్యాలూ, వారి రహస్య సమాలోచనలూ సయితం తెలుసని, ఆయనకు సమస్త అగోచర విషయాలు కూడా పూర్తిగా తెలుసని? (ఆ పిసినారి సంపన్నులను ఆయన బాగా ఎరుగును) సంతోషంతో, ఇష్టంతో విశ్వాసులు చేసే ధనత్యాగాలను కించపరుస్తూ వారు మాట్లాడుతారు. (దేవుని మార్గంలో ఇచ్చేందుకు) తాము శ్రమకోర్చి ఇచ్చేది తప్ప మరేదీ తమ వద్ద లేనివారిని వారు హేళన చేస్తారు. ఈ హేళన చేసేవారిని అల్లాహ్ హేళన చేస్తున్నాడు. వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. ప్రవక్తా! నీవు అటువంటి ప్రజలను క్షమించవలసినదిగా విజ్ఞాపన చేసినా, చేయకపోయినా (ఒకటే)
ఒకవేళ నీవు వారిని క్షమించవలసినదిగా డెబ్భైసార్లు విజ్ఞాపన చేసినా, అల్లాహ్ వారిని ఎంతమాత్రం క్షమించడు. ఎందుకంటే, వారు అల్లాహ్నూ ఆయన ప్రవక్తనూ తిరస్కరించారు. అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు మోక్షమార్గం చూపడు.
9.
అత్ తౌబా
81 - 83 వెనుక ఉండిపోవటానికి అనుమతి ఇవ్వబడినవారు అల్లాహ్ ప్రవక్తతో వెళ్ళకపోయినందుకూ, ఇంటివద్దనే కూర్చుండి పోయినందుకూ సంతోషపడ్డారు. అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలనూ, తమ సంపదలనూ ఒడ్డి పోరాడేందుకు వారు ఇష్టపడలేదు. వారు ప్రజలతో, ‘‘ఈ తీవ్రమైన వేడిలో బయల్దేరకండి’’ అని అన్నారు. వారితో ఇలా అను : ‘‘నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది’’. వారికి దానిని గురించి తెలిస్తే ఎంతబాగుండును! ఇప్పుడు వారు నవ్వటం తగ్గించాలి. ఏడ్వటం హెచ్చించాలి. ఎందుకంటే వారు సంపాదిస్తూ ఉండిన చెడులకు లభించే ప్రతిఫలం అటువంటిది గనక (దానికి వారు ఏడ్వ వలసినదే). ఒకవేళ అల్లాహ్
వారి మధ్యకు నిన్ను తిరిగి తీసుకువెళితే, ఇకముందు వారిలో ఏ వర్గమైనా పోరాటం కొరకు బయలుదేరటానికి నిన్ను అనుమతి అడిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పు : ‘‘ఇక మీరు నాతో ఎంతమాత్రమూ రాలేరు. నా పక్షంలో ఉండి ఏ శత్రువుతోనూ పోరాడనూ లేరు. మీరు మొదట కూర్చుండిపోవటానికే ఇష్టపడ్డారు. కనుక ఇప్పుడు ఇంటివద్ద కూర్చుండిపోయేవారితోనే కూర్చుండిపోండి.’’
9.
అత్ తౌబా 84
- 85 ఇక ముందు వారిలో ఎవడైనా మరణిస్తే, అతడి జనాజా నమాజును కూడా నీవు ఎంతమాత్రం చెయ్యకు. ఎన్నడూ అతడి గోరీ వద్ద నిలబడకు. ఎందుకంటే వారు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ తిరస్కరించారు. ఇంకా వారు ద్రోహులుగానే మరణించారు. వారి సంపదా వారి అధిక సంతానమూ నిన్ను మోసానికి గురిచెయ్యకూడదు. ఈ సంపదద్వారా ఈ సంతానం ద్వారా వారిని ఈ ప్రపంచంలోనే శిక్షించాలనీ వారి ప్రాణాలు వారు అవిశ్వాసులుగా ఉన్న స్థితిలోనే పోవాలనీ - అల్లాహ్ సంకల్పించాడు.
9.
అత్ తౌబా
86 - 89 అల్లాహ్ ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలసి పోరాడండి అనే విషయం కల సూరా ఏదైనా అవతరించినప్పుడల్లా, వారిలో సమర్థులైన వారే తమను పోరాటంలో పాల్గొనటం గురించి మన్నించాలని నీకు విజ్ఞప్తి చేయటాన్ని నీవు గమనించావు. మేము కూర్చుండిపోయేవారితో ఉండిపోతాము, మమ్మల్ని వదలిపెట్టండి అని వారు అన్నారు. వారు ఇంటిలో కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్రవేయబడిరది. అందువల్ల వారికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు. దీనికి భిన్నంగా ప్రవక్తా! ప్రవక్తతోపాటు విశ్వసించినవారూ తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడారు. కనుక ఇప్పుడు అన్ని మేళ్ళూ వారికే. ఇంకా వారే సాఫల్యాన్ని పొందుతారు. అల్లాహ్ వారికొరకు క్రింద కాలువలు ప్రవహించే ఉపవనాలను సిద్ధంచేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం.
9.
అత్ తౌబా
90 ఎడారి అరబ్బులు కూడా చాలామంది వచ్చారు. తాము కూడా వెనుక ఉండిపోవటానికి అనుమతి కోసం సాకులు చెప్పారు. ఈవిధంగా అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విశ్వాస విషయంలో అబద్ధపు వాగ్దానం చేసినవారు వెనుకనే కూర్చుండిపోయారు. ఎడారి అరబ్బులలో అవిశ్వాస వైఖరిని అవలంబించినవారు త్వరలోనే బాధాకరమైన శిక్షకు గురి అవుతారు.
9.
అత్ తౌబా
91 - 93 వృద్ధులూ, వ్యాధిగ్రస్తులూ, పోరాటంలో పాల్గొనటానికి దారిభత్యాలు లేనివారూ, ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు, వారు చిత్తశుద్ధితో అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విశ్వాస పాత్రులుగా ఉన్నంతవరకు. అటువంటి సజ్జనులపట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను. స్వయంగా వచ్చి ‘‘మా కొరకు వాహనాలు సమకూర్చండి’’ అని నీకు విజ్ఞప్తి చేసిన వారిపట్ల కూడా ఇదేవిధంగా ఏ ఆక్షేపణకూ అవకాశం లేదు. నీవు ‘‘నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చెయ్యలేను’’ అని అన్నప్పుడే, గత్యంతరంలేక వారు మరలిపోయారు. వారి కళ్ళనుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు. అయితే ధనవంతుల పట్ల ఆక్షేపణ ఉంది. ఎందుకంటే తమను పోరాటంలో పాల్గొనే విషయంలో మన్నించవలసిందిగా నీకు విజ్ఞప్తి చేశారు. వారు ఇంటివద్ద కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు. అల్లాహ్ వారి హృదయాలపై ముద్రవేశాడు. ఇందువల్ల వారికి ఏమీ తెలియదు. (అల్లాహ్ వద్ద వారి ఈ వైఖరికి ఏ ఫలితం కలుగనున్నదో అనేది).
9.
అత్ తౌబా
94 - 96 మీరు తిరిగి వారివద్దకు పోయినప్పుడు, వారు రకరకాల సాకులు చెబుతారు. కాని మీరు స్పష్టంగా ఇలా చెప్పండి : ‘‘సాకులు చెప్పకండి. మేము మీ ఏ మాటనూ నమ్మం. అల్లాహ్ మాకు మీ పరిస్థితులన్నీ తెలిపాడు. ఇక అల్లాహ్ ఆయన ప్రవక్తా మీ ప్రవర్తనను చూస్తారు. తరువాత మీరు ఆయన వైపునకు మరలింపబడతారు. ఆయన బహిరంగంగా ఉన్నదీ గుప్తంగా ఉన్నదీ, అంతా ఎరిగినవాడు. మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు.’’ నీవు మరలివచ్చిన తరువాత వారు నీ ముందు ప్రమాణాలు చేస్తారు, నీవు వారిని ఉపేక్షించాలని. కనుక నీవు వారిని తప్పకుండా ఉపేక్షించు. ఎందుకంటే, వారొక మాలిన్యం వంటివారు. వారి అసలు స్థానం నరకం. అది వారి సంపాదనకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది. వారు నీ సమక్షంలో ప్రమాణాలు చేస్తారు, వారికి నీవు ప్రసన్నుడవు కావాలని. వాస్తవానికి, ఒకవేళ నీవు వారిపట్ల ప్రసన్నత చూపినా అల్లాహ్ మటుకు అటువంటి
విద్రోహులకు ఎన్నటికీ ప్రసన్నుడు కాడు.
9.
అత్ తౌబా
97 - 99 ఈ ఎడారి అరబ్బులు అవిశ్వాసం విషయంలో, కాపట్యం విషయంలో బహుమూర్ఖులు. కనుక అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మం యొక్క హద్దులు వారికి తెలియకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అల్లాహ్ కు అన్నీ తెలుసు. ఆయన జ్ఞానీ, వివేకవంతుడూను. దేవుని మార్గంలో ఖర్చుపెడుతున్నప్పుడు అది బలవంతంగా తమపై రుద్దబడిరదని భావించేవారు ఈ ఎడారి అరబ్బులలో కొందరు ఉన్నారు. మీ విషయంలో వారు కాలం మార్పుల కోసం నిరీక్షిస్తున్నారు, (మీరు ఏదైనా సంకటంలో చిక్కుకుంటే మీరు వారిని బంధించి ఉంచిన ఈ వ్యవస్థ యొక్క విధేయతా శృంఖలాలను త్రెంచిపారేయాలని) వాస్తవానికి సంకట వలయం స్వయంగా వారినే చుట్టుముట్టి ఉంది. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఈ ఎడారి అరబ్బులలోనే ఇంకా కొంతమంది ఉన్నారు. వారు అల్లాహ్నూ అంతిమదినాన్నీ విశ్వసిస్తారు. తాము ఖర్చుచేసే దానిని అల్లాహ్ సాన్నిహిత్యం పొందటానికీ ప్రవక్తనుండి దేవుని కారుణ్యానికై ప్రార్థనలు పొందటానికీ సాధనంగా చేసుకుంటారు. అవును! అది నిశ్చయంగా అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందటానికి సాధనమే. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడూ కరుణించేవాడూను.
9.
అత్ తౌబా
100 అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి ముందంజవేసిన ముహాజిరుల (వలస వచ్చినవారి) పట్లా అన్సారుల (ఆశ్రయమిచ్చినవారి) పట్లా తరువాత నిజాయితీతో వారి వెనుక వచ్చినవారిపట్లా అల్లాహ్ తృప్తి చెందాడు. వారు కూడా అల్లాహ్ పట్ల తృప్తి చెందారు. అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధపరచి ఉంచాడు. వారు వాటిలో సదా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం.
9.
అత్ తౌబా
101 మీ చుట్టుపక్కల ఉండే ఎడారి అరబ్బులలో కపటులు చాలామంది ఉన్నారు. అలాగే స్వయంగా మదీనా పౌరులలో కూడా కపటులు ఉన్నారు. వారు కాపట్యంలో రాటుదేలారు. మీరు వారిని ఎరుగరు. మేము వారిని ఎరుగుదుము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించే సమయం సమీపంలోనే ఉంది. తరువాత వారు మరింత పెద్ద శిక్ష కొరకు తిరిగి తీసుకురాబడతారు.
9.
అత్ తౌబా
102 - 105 తమ తప్పులను ఒప్పుకున్నవారు కొందరు ఉన్నారు. వారి ఆచరణ మిశ్రమమైనది. కొంత మంచీ, కొంత చెడూ. అల్లాహ్ వారిని మళ్ళీ కరుణించటం అనేది అసంభవమేమీ కాదు. ఎందుకంటే, ఆయన మన్నించేవాడూ కరుణించేవాడూను. ప్రవక్తా! నీవు వారి సంపదల నుండి సదఖా తీసుకొని వారిని పరిశుద్ధపరచు. ఇంకా (సన్మార్గంలో) వారిని ముందుకు నడుపు. వారి కొరకు దేవుని కారుణ్యానికై ప్రార్థించు. ఎందుకంటే నీ ప్రార్థనవల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అంతా తెలుసు. వారికి తెలియదా, అల్లాహ్ యే తన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడని, వారి దానధర్మాలకు స్వీకారాన్ని ప్రసాదిస్తాడని, అల్లాహ్ అమితంగా క్షమించేవాడూ కరుణించేవాడూ అని? ప్రవక్తా! ఇంకా వారితో ఇలా అను : ‘‘మీరు ఆచరించండి. అల్లాహ్, ఆయన ప్రవక్తా, విశ్వాసులూ అందరూ మీ ఆచరణ వైఖరి ఇప్పుడు ఎలా ఉంటుందో అని గమనిస్తారు. తరువాత మీరు ఆయన వైపునకు మరలింపబడతారు. ఆయనకు బహిరంగంగా ఉన్నదీ, గుప్తంగా ఉన్నదీ అంతా తెలుసు. మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు.’’
9.
అత్ తౌబా
106 మరి కొందరున్నారు. ఇంకా వారి వ్యవహారం దేవుని ఆజ్ఞకోసం ఆగివున్నది. ఆయన వారికి శిక్షనూ విధించవచ్చు. మళ్ళీ కొత్తగా వారిని కనికరించనూవచ్చు. అల్లాహ్ కు అంతా తెలుసు, ఆయన జ్ఞానీ, వివేకవంతుడూను.
9.
అత్ తౌబా
107 - 110 ఇంకా కొందరువున్నారు. వారు ఒక మసీదును నిర్మించారు, (సత్యసందేశానికి) నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో, ఇంకా (దేవుని ఆరాధన చెయ్యటానికి బదులుగా) అవిశ్వాసాన్ని అనుసరిం చాలని, విశ్వాసులలో చీలిక తీసుకురావాలని, (ఈ బూటకపు ఆరాధనాలయాన్ని) ఇదివరకు అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ వ్యతిరేకంగా పోరాడిన
వ్యక్తికి మాటుగా చెయ్యాలని. వారు మాటిమాటికీ ప్రమాణాలు చేసి, మా ఉద్దేశ్యం మేలు చెయ్యటం తప్ప మరొకటి కాదు అని తప్పకుండా అంటారు. కానీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు, వారు పూర్తి అసత్యవాదులు. నీవు ఎన్నడూ ఆ కట్టడంలో నిలబడకు. మొదటి రోజునుండే భయభక్తులు ఆధారంగా స్థాపించబడిన మసీదే నీవు (ఆరాధన కొరకు) నిలబడ టానికి తగినది. అందులో పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడేవారు ఉన్నారు. అల్లాహ్ కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం. అయితే నీ అభిప్రాయమేమిటి? మంచి మానవుడు ఎవడు? తన కట్టడపు పునాదులను దైవభీతిపై,
దైవ సంతోషాన్ని పొందాలనే కాంక్షపై లేపినవాడా లేదా తన కట్టడాన్ని లోయయొక్క డొల్ల అంచుపై లేపినవాడా? అది అతనిని తీసుకుని నేరుగా నరకాగ్నిలో పడిపోయింది! అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ ఎన్నటికీ రుజుమార్గం చూపడు. వారు నిర్మించిన ఈ కట్టడం ఎల్లప్పుడూ వారి హృదయాలలో అపనమ్మకానికి మూలంగా ఉంటుంది. (ఆ అపనమ్మకం బయటపడే మార్గమేదీ ఇక లేదు) వారి హృదయాలు ముక్కలు ముక్కలు అయితేనే తప్ప. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. వివేకవంతుడూ, మేధావంతుడూను.
9.
అత్ తౌబా
111 - 112 యథార్థం ఏమిటంటే, విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలనూ, వారి సంపదలనూ స్వర్గానికి బదులుగా కొన్నాడు.
వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు, చంపుతారు, చస్తారు. తౌరాతులో, ఇంజీలులో, ఖురానులో
వారికి అల్లాహ్ చేసిన (స్వర్గం యొక్క) వాగ్దానం సత్యమైనది. తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించినవాడెవడు? కనుక సంబరపడండి, మీరు దేవునితో చేసిన ఈ వర్తకానికి
ఇదే అన్నిటికంటే మహత్తరమైన సాఫల్యం. అల్లాహ్ వైపునకు మాటిమాటికీ మరలేవారూ, ఆయనను ఆరాధించేవారూ, ఆయనను స్తుతించేవారూ, ఆయన కొరకు భూమిమీద సంచారం చేసేవారూ, ఆయన సన్నిధిలో రుకూలూ, సజ్దాలూ చేసేవారూ, మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు చెయ్యవద్దు అని నిరోధించేవారూ, అల్లాహ్ విధించిన హద్దులను కాపాడేవారూ (ఇటువంటి గుణవిశేషాలు కల విశ్వాసులు అల్లాహ్తో ఇటువంటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు). ప్రవక్తా! ఇటువంటి విశ్వాసులకు శుభవార్త అందజెయ్యి.
9.
అత్ తౌబా
113 - 114 ముష్రిక్కులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం ప్రవక్తకూ, విశ్వాసులకూ తగనిపని, వారు వారికి బంధువులైనప్పటికీ, ఇంకా వారు నరకానికి అర్హులని వారికి స్పష్టమైనప్పుడు. ఇబ్రాహీము తన తండ్రిని క్షమించవలసినదిగా చేసిన ప్రార్థన అతను తన తండ్రికి చేసిన వాగ్దానం కారణంగా చేసినటువంటిది. కాని అతని తండ్రి దేవునికి శత్రువని అతనికి స్పష్టమైనప్పుడు, అతను అతనివల్ల విసిగిపోయాడు. వాస్తవానికి, ఇబ్రాహీము మెత్తని మనస్సు కలవాడు. దైవభక్తుడూ, సంయమనము కలవాడూను.
9.
అత్ తౌబా
115 - 116 ప్రజలకు సన్మార్గం చూపిన తరువాత మళ్ళీ వారిని మార్గభ్రష్టత్వానికి గురిచెయ్యటం అల్లాహ్ విధానం కాదు, వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంతవరకు. వాస్తవానికి అల్లాహ్ కు ప్రతి విషయం గురించీ తెలుసు. భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్ అధీనంలోనే ఉందనేదీ, ఆయన చేతిలోనే జీవన్మరణాలు ఉన్నాయి అనేదీ, మిమ్మల్ని ఆయన నుండి కాపాడగల సంరక్షకుడూ, సహాయకుడూ మరెవడూ లేడు అనేదీ యథార్థమే.
9.
అత్ తౌబా
117 - 118 అల్లాహ్ క్షమించాడు ప్రవక్తనూ, బహుకష్టకాలంలో ప్రవక్తకు తోడ్పడిన ముహాజిరులనూ, అన్సారులనూ. వారిలో కొందరి హృదయాలు వక్రత్వం వైపునకు మొగ్గినప్పటికీ (కాని వారు ఆ వక్రత్వాన్ని అనుసరించకుండా ప్రవక్తకు తోడ్పడినప్పుడు) అల్లాహ్ వారిని క్షమించాడు. నిస్సందేహంగా ఆయన వారిపట్ల వాత్సల్యంతో, కనికరంతో వ్యవహరించాడు. ఇంకా వ్యవహారం వాయిదా వెయ్యబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండికూడా, భూమి వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను కాపాడు కోవటానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీలేదని వారు
తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు, వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడూ, కరుణించేవాడూను.
9.
అత్ తౌబా
119 - 121 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడ్పడండి. మదీనా పౌరులకూ, చుట్టుపక్కల ఉండే ఎడారి అరబ్బులకూ అల్లాహ్ ప్రవక్తను వదిలిపెట్టి ఇళ్ళల్లో కూర్చోవటం, ఆయనను పట్టించుకోకుండా తమను గురించి మాత్రమే ఆదుర్దాపడటం ఎంతమాత్రం శోభించదు. ఎందుకంటే, అల్లాహ్ మార్గంలో వారు ఆకలిదప్పులనూ, శరీర శ్రమకు సంబంధించిన ఏదైనా బాధను సహించి ఉంటే, సత్యతిరస్కారులు సహించలేని మార్గంపై వారు ఏదైనా అడుగువేస్తే ఏ శత్రువుకైనా (సత్య విరోధానికి) వారు ప్రతీకారం చేస్తే దానికి బదులుగా వారికొరకు ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండటం అనేది ఎన్నటికీ జరగదు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద సజ్జనుల సేవాఫలం హక్కు హరించ బడదు. ఇదేవిధంగా వారు (దైవమార్గంలో) కొద్దో గొప్పో, ఏదైనా ఖర్చును భరిస్తే (జిహాద్ ప్రయత్నంలో) వారు ఏదైనా లోయనుదాటితే, వారికొరకు దానిని వ్రాయకపోవటం అనేది కూడా ఎన్నటికీ జరుగదు, అల్లాహ్ వారి ఈ మంచి కార్యానికి ప్రతిఫలాన్ని వారికి ప్రసాదించటానికి.
9.
అత్ తౌబా
122 విశ్వాసులు అందరికందరూ బయలుదేరవలసిన అవసరం లేదు. కాని వారి జనపదంలోని ప్రతి భాగం నుండి కొందరు బయలుదేరి వచ్చి, ధర్మ అవగాహనను పెంపొందించుకుని, తిరిగి వెళ్ళి తమ ప్రాంతంలోని ప్రజలకు వారు (ఇస్లామ్ వ్యతిరేక వైఖరిని) మానుకోవాలని హెచ్చరిక చెయ్యటం ఎందుకు జరుగలేదు?
9.
అత్ తౌబా
123 - 127 విశ్వసించిన ప్రజలారా! మీ చెంతనున్న సత్య తిరస్కారులతో పోరాడండి. వారు మీలో కాఠిన్యాన్ని చూడాలి. భయభక్తులు కలవారితో అల్లాహ్ ఉంటాడని తెలుసుకోండి. కొత్త సూరా ఏదైనా అవతరించినప్పుడల్లా వారిలోని కొందరు (హేళనగా ముస్లిములను) ఇలా అడుగుతారు : ‘‘మీలో ఎవరి విశ్వాసం దీనివల్ల పెరిగిందో చెప్పండి?’’ విశ్వసించిన వారి విశ్వాసాన్ని వాస్తవంగానే (అవతరించిన ప్రతి సూరా) పెంచింది. వారు దానికి సంతోషపడుతున్నారు. అయితే (కాపట్యం) రోగం తగిలిన హృదయాలుకల వారి పూర్వపు మాలిన్యానికి (ప్రతి కొత్తసూరా) మరింత మాలిన్యాన్ని చేర్చింది. వారు మరణించే వరకు అవిశ్వాసంలోనే పడివున్నారు. తాము ప్రతి సంవత్సరం ఒకటీ రెండుసార్లు పరీక్షకు గురిచెయ్యబడటాన్ని వారు చూడటం లేదా? కాని దీని తరువాత కూడా వారు పశ్చాత్తాపము పడటం లేదు. ఏ గుణపాఠాన్నీ నేర్చుకోవటం లేదు. సూరా ఏదైనా అవతరించినప్పుడు వారు కళ్ళతోనే పరస్పరం మాట్లాడుకుంటారు, ఎవరైనా మిమ్మల్ని చూడటం లేదు కదా అని. తరువాత మెల్లగా అక్కడి నుండి జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (ఖురాను నుండి) మళ్ళించాడు. ఎందుకంటే వారు బుద్ధిహీనులు.
9.
అత్ తౌబా
128 - 129 చూడండి! మీవద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్ని ఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు - ఇక వారు నీకు విముఖులైతే, ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘నాకు అల్లాహ్ యే చాలు. ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయన మహత్తరమైన అధికార పీఠానికి ప్రభువు.’’
No comments:
Post a Comment