45 సూరహ్ అల్‌ జాసియహ్

 

45. అల్జాసియహ్

ఆయతులు : 37                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 2 హా. మీమ్‌. గ్రంథం శక్తిమంతుడూ, వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది.

3 - 6 వాస్తవంగానే విశ్వాసుల కొరకు ఆకాశాలలోనూ, భూమిలోనూ అసంఖ్యాకమైన సూచనలు ఉన్నాయి. మిమ్మల్ని సృష్టించటంలోనూ, అల్లాహ్ (భూమిలో) వ్యాపింపజేస్తూ ఉన్నటువంటి జంతువులలోనూ, నమ్మేవారి కొరకు గొప్ప సూచనలు ఉన్నాయి. రేయింబవళ్ల మధ్య ఉన్న వ్యత్యా సంలో, వ్యతిరేక తలో, ఆకాశంనుండి అల్లాహ్ అవతరింపజేస్తున్న ఆహారంలో - దాని ద్వారా ఆయన మృతభూమిని బ్రతికిస్తాడు - వాయువుల పరిభ్రమణంలో, బుద్ధిని ఉపయోగించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. ఇవన్నీ అల్లాహ్ సూచనలు, మేము వాటిని నీకు యథాతథంగా వివరిస్తున్నాము. ఇక అసలు వారు అల్లాహ్నూ, ఆయన వాక్యాలనూ కాక మరే విషయాన్ని విశ్వసిస్తారు?

7 - 10 అసత్యవాది, దుష్కార్యపరుడు అయిన ప్రతివ్యక్తి సర్వనాశనమవుతాడు. అతడి ముందు అల్లాహ్ వాక్యాలు పఠించబడతాయి, వాటిని అతడు వింటాడు. తరువాత అతడు వాటిని ఎన్నడూ విననివాని మాదిరిగా అహంభావంతో తన తిరస్కార వైఖరిపై మొండిగా ఉండిపోతాడు. అటువంటి వ్యక్తికి అత్యంత బాధాకరమైన శిక్షపడుతుందనే శుభవార్తను వినిపించు. మా వాక్యాలకు సంబంధించిన విషయం ఏదైనా అతడికి తెలిసినప్పుడు, దానిని అతడు ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్షపడుతుంది. వారి ముందు నరకం ఉన్నది. వారు ప్రపంచంలో సముపార్జించుకున్న దానిలో ఏదీ వారికి విధంగానూ పనికిరాదు. అల్లాహ్ ను కాదని వారు తమ సంరక్షకులుగా చేసు కున్న వారు సైతం, వారికొరకు ఏమీ చేయలేరు. వారి కొరకు పెద్దయాతన ఉన్నది.

11 ఖురాను పూర్తిగా మార్గదర్శకత్వమే. తమ ప్రభువు వాక్యాలను విశ్వసించకుండా తిరస్కరించిన వారికి వ్యధాభరితమైన పెద్ద శిక్ష పడుతుంది.

12 - 13 సముద్రాన్ని మీకు వశపరచినవాడు అల్లాహ్ యే కదా! ఆయన ఆదేశానుసారం అందులో ఓడలు ప్రయాణం చేయటానికి  మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి  కృతజ్ఞులు కావటానికి : భూమిలోని, ఆకాశాలలోని సకల వస్తువులనూ ఆయన మీకు వశపరచాడు. ఇదంతా తన వద్దనుండే - ఆలోచనాపరులకు ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి.

14 - 15 ప్రవక్తా! విశ్వాసులతో ఇలా అను : ‘‘అల్లాహ్ తరఫు నుండి చెడ్డరోజులు వస్తాయని భయపడని వారి చేష్టలను క్షమించండి  స్వయంగా అల్లాహ్ ఒక వర్గం వారికి వారి సంపాదనకు ప్రతిఫలం ఇవ్వటానికి. సత్కార్యం చేసేవాడు దానిని తన కొరకే చేసుకుంటాడు. దుష్కార్యం చేసేవాడు తానే దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. తరువాత అందరూ తమ ప్రభువు వైపునకే మరలిపోతారు.

16 - 20 పూర్వం మేము ఇస్రాయీల్సంతతి వారికి గ్రంథాన్నీ, ఆజ్ఞనూ, ప్రవక్త పదవినీ ప్రసాదించాము. వారికి మేము మంచి జీవన సామగ్రిని అనుగ్రహించాము. ప్రపంచంలోని ప్రజలందరిపై వారికి ఘనతను దయ చేశాము. ధర్మం విషయంలో వారికి స్పష్టమైన ఉపదేశాలను ఇచ్చాము. తరువాత వారి మధ్య తలెత్తిన విభేదాలు (తెలియకపోవటం వల్లకాదు కాని) జ్ఞానం వచ్చిన తరువాతనే తలెత్తాయి, వారు ఒకరికొకరు అన్యాయం చేయ దలచుకున్న కారణంగానే తలెత్తాయి. ప్రళయం నాడు అల్లాహ్ వారు విభేదిస్తూ ఉన్న వ్యవహారాలను గురించి తీర్పు చెబుతాడు. ఇప్పుడు ప్రవక్తా! మేము నిన్ను ధర్మం విషయంలో ఒక స్పష్టమైన రాజమార్గంపై (షరియత్‌) స్థిరపరి చాము. కనుక నీవు దానిపై మాత్రమే నడువు. జ్ఞానహీనుల కోరికలను అనుసరించకు. అల్లాహ్ కు ప్రతిగా వారు నీకు ఏమాత్రం ఉపయోగపడరు. దుర్మార్గులు ఒకరికొకరు సహాయకులు. భయభక్తులు కలవారి సహాయకుడు అల్లాహ్. దూరదృష్టితో నిండివున్న కాంతులు ప్రజలందరికొరకు  నమ్మే వారికి ఇవి మార్గదర్శకత్వం, కారుణ్యమూను.

21 - 22 చెడులకు పాల్పడినవారు, తమనూ, విశ్వసించి మంచిపనులు చేసేవారినీ మేము సమానంగా చేస్తామనీ, వారి జీవన్మరణాలు ఒకేవిధంగా ఉండేలా చేస్తామనీ అనుకుంటున్నారా? వారు చేసే నిర్ణయాలు చాల చెడ్డవి. అల్లాహ్ ఆకాశాలనూ, భూమినీ సత్యంతో సృజించాడు, ప్రతి ప్రాణికీ దాని సంపాదన ప్రకారం ప్రతిఫలం ఇవ్వాలని సృజించాడు. ప్రజలకు అన్యాయం ఎంతమాత్రం జరగదు.

23 తన మనోవాంఛలను తన దేవుడుగా చేసుకున్న వ్యక్తి స్థితిని గురించి కూడా నీవు ఎప్పుడైనా ఆలోచించావా? జ్ఞానం ఉన్నప్పటికీ,  అతనిని  అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరివేశాడు, అతని హృదయం మీదా, చెవుల మీదా ముద్రవేశాడు, అతని కళ్లకు తెరవేశాడు. ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గం చూపేవాడెవడున్నాడు? మీరు గుణపాఠాన్ని నేర్చుకోరా?

24 - 27 వారు ఇలా అంటారు, ‘‘జీవితం అంటే కేవలం మన ప్రాపంచిక జీవితం మాత్రమే. ఇక్కడే మన మరణం, ఇక్కడే మన జీవనం. కాల పరిభ్ర మణం తప్ప, మనలను ఏదీ చంపలేదు.’’ వాస్తవంగా విషయానికి సంబం ధించిన జ్ఞానమేదీ వారివద్ద లేదు. వారు కేవలం ఊహ ఆధారంగా మాటలు అంటున్నారు. స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, ‘‘నీవు సత్యవంతుడవే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురా’’ అనేది తప్ప వారివద్ద మరొక తర్కం ఏదీ ఉండదు. ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘అల్లాహ్ యే మీకు జీవితం ప్రసాదిస్తున్నాడు, తరువాత ఆయనే మీకు మరణం కలుగజేస్తున్నాడు, ఆపైన ఆయనే మిమ్మల్ని ప్రళయం నాడు సమావేశపరు స్తాడు  అది వచ్చే విషయం గురించి ఏమాత్రం సందేహం లేదు. కాని చాలా మందికి విషయం తెలియదు. భూమి, ఆకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్దే. ప్రళయగడియ వచ్చిపడే ఆనాడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.

28 - 35 అప్పుడు నీవు ప్రతి వర్గమూ మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. వచ్చి, తన కర్మల పత్రాన్ని చూడవలసినదిగా ప్రతి వర్గాన్నీ పిలవటం జరుగు తుంది. వారితో ఇలా అనబడుతుంది, ‘‘ఈనాడు మీకు మీరు చేసిన కర్మలకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఇది మేము తయారు చేయించిన కర్మల పత్రం. అది మీ విషయంలో జరిగింది జరిగినట్లుగా సాక్ష్యమిస్తుంది. మీరు చేస్తూ ఉండినదంతా మేము వ్రాయిస్తూపోయాము.’’ విశ్వసించి, మంచిపనులు చేస్తూ ఉండిన వారిని వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింపజేస్తాడు. అసలు స్పష్టమైన సాఫల్యం అంటే ఇదే. అవిశ్వాసులైపోయిన వారితో (ఇలా అనబడు తుంది), ‘‘నా వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉండలేదా? కాని మీరు అహంభావానికి వశులై అపరాధులైపోయారు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనదనీ, ప్రళయం వచ్చే విషయం గురించి ఏమాత్రం సందేహం లేదనీ అనబడినప్పుడు, మీరు, ప్రళయం అంటే ఏమిటో మాకు తెలియదు. మేము కేవలం అనుమానా స్పదమైన విషయంగానే తలుస్తాము. మాకు నమ్మకం లేదు’’ అని అనేవారు. అప్పుడు వారికి తమ కర్మల కీడులు ఏమిటో ప్రస్ఫుటమవుతాయి. వారు తాము ఎగతాళి చేసిన దాని యొక్క వలయంలోనే చిక్కుకుపోతారు. వారితో ఇలా అనటం జరుగుతుంది, ‘‘మీరు ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన విధంగానే, మేము కూడ ఈనాడు మిమ్మల్ని మరచిపోతాము. మీ నివాసం ఇక నరకమే. మీకు సహాయం చేసేవాడెవడూ లేడు. మీరు అల్లాహ్ వాక్యాలను పరిహాసంగా తీసుకోవటంవల్లా, ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయటం వల్లా మీ గతి ఇలా అయింది. కనుక ఈనాడు వారిని నరకం నుండి బయటకు తీయటమూ జరగదు, క్షమాభిక్షను అనుగ్రహించు అని వేడుకొని మీ ప్రభువును ప్రసన్నుడుగా చేసుకోండి అని వారికి చెప్పటమూ జరగదు.’’

36 - 37 కనుక అల్లాహ్ మాత్రమే స్తుతిపాత్రుడు. ఆయన భూమికీ, ఆకాశా లకూ ప్రభువు  సకల లోకాలకూ ప్రభువు. భూమ్యాకాశాలలో ఘనత ఆయనకు మాత్రమే చెందుతుంది. శక్తిమంతుడూ, వివేకవంతుడూ ఆయన మాత్రమే.

No comments:

Post a Comment