61. అస్ సఫ్
ఆయతులు
: 14 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్నే స్తుతిస్తోంది. ఆయన ఆధిక్యత కలవాడు, వివేకవంతుడూను.
2 - 4 విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెం దుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లాహ్ దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం. అసలు అల్లాహ్ కు ఆయన మార్గంలో సీసంతో పోసిన గోడవలె దృఢమైనబారులు తీరి నిలబడి పోరాడే వారంటేనే ఇష్టం.
5 మూసా తన జాతివారితో అన్న ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో
‘‘ఓ నాజాతి ప్రజలారా! మీరు నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నేను మీ వద్దకు అల్లాహ్చే పంపబడిన ప్రవక్తనని మీకు తెలుసుకదా!’’ ఆ తరువాత వారు వక్రమార్గాన్ని అవలంబించినప్పుడు, అల్లాహ్ కూడా వారి హృదయాలను వక్రీకరించాడు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
6 ... మర్యమ్ కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో, ‘‘ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీ వద్దకు అల్లాహ్చే పంపబడిన సందేశహరుణ్ణి
నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను.
... 6 - 9 అయితే ఆయన (ముహమ్మద్ - సఅసమ్) వారి వద్దకు స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు, వారు ఇది పూర్తిగా మోసమే అని అన్నారు, ఇక ఇస్లామ్ (అల్లాహ్ కు తనను తాను సమర్పించుకోవటం) సందేశం అందజేయబడుతున్నప్పటికీ, అల్లాహ్ పై అపనిందలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పగోరుతున్నారు. కాని అవిశ్వాసు లకు ఎంత అనిష్టంగా ఉన్నాసరే అల్లాహ్ తన జ్యోతిని పూర్తిగా వ్యాపింపజేయ టానికే నిర్ణయించుకున్నాడు. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు.
దానిని సకల ధర్మాలపై ఆధిక్యం వహించే ధర్మంగా చేయటానికి
ఇది బహుదైవారాధకులకు ఎంత అనిష్టమైనాసరే.
10 - 13 విశ్వసించిన ఓ ప్రజలారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వ్యాపారమేమిటో నేను మీకు తెలుపనా? విశ్వసించండి అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను
పోరాడండి అల్లాహ్ మార్గంలో మీ సంపదలను, మీ ప్రాణాలను ధారపోసి. మీరు
గనక గ్రహిస్తే, ఇదే మీకు మేలైనది. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని సెలయేళ్లు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాడు. అంతేకాదు శాశ్వతమైన ఆ స్వర్గవనాలలో మీకు ఎంతో అందమైన గృహాలను ప్రసాదిస్తాడు. ఇదే గొప్ప సాఫల్యం. మీరు కోరుకుంటున్న ఇతర వస్తువులు కూడా మీకు అనుగ్రహిస్తాడు- అవి అల్లాహ్ నుండి పొందే సహాయం
మరియు త్వరలో లభించబోయే విజయం. ఓ ప్రవక్తా! ఈ శుభవార్తను విశ్వాసులకు అందజెయ్యి.
14 విశ్వసించిన ఓ ప్రజలారా! మర్యమ్ కుమారుడు ఈసా, హవారీలతో అన్నట్లు మీరు అల్లాహ్ కు సహాయకులుకండి. వారితో ఈసా ఇలా అన్నాడు, ‘‘అల్లాహ్ వైపునకు (పిలిచే పనిలో) నాకు సహాయపడేవారు ఎవరైనా ఉన్నారా?’’ దానికి హవారీలు,
‘‘మేము ఉన్నాము అల్లాహ్ కు సహాయకులం’’ అని సమాధానమిచ్చారు. అప్పుడు ఇస్రాయీల్ సంతతిలోని ఒక వర్గం విశ్వ సించింది, మరొక వర్గం తిరస్కరించింది. తరువాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకంగా బలపరిచాము. వారే ఆధిక్యం వహించారు.
No comments:
Post a Comment