93 సూరహ్ అజ్ జుహా

 

93 అజ్ జుహా

ఆయతులు : 11                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 11 వెలుగు విరజిమ్మే పగలు సాక్షిగా! ప్రశాంతంగా ఆవరించే రాత్రి సాక్షిగా! ( ప్రవక్తా!) నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడనాడలేదు, నీ పట్ల ఆయన అసంతృప్తిచెందనూ లేదు. నిశ్చయంగా రాబోయే కాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీకు నీ ప్రభువు నీవు సంతోషపడే అంత అధికంగా ప్రసాదిస్తాడు. నీవు అనాథుడుగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు మార్గమేదో తెలియని వాడవుగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. నీవు నిరుపేదగా ఉన్నప్పుడు, ఆయన నిన్ను ధనవంతుడుగా చేశాడు. కావున నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు. నీ ప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి.

No comments:

Post a Comment