102 సూరహ్ అత్ తకాసూర్

 

102 అత్ తకాసూర్

ఆయతులు : 8                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 8 వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. చివరకు మీరు ( వ్యామోహం లోనే) శ్మశానికి చేరుకుంటారు. (మీరనుకునేది) ఎంతమాత్రం కాదు, త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మరొకసారి (వినండి, మీరనుకునేది)  ఎంతమాత్రం నిజం కాదు, అతి  త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఎంతమాత్రం కాదు, మీరు గనక నిశ్చయజ్ఞానంతో (మీ వైఖరి పర్యవసానాన్ని) తెలుసుకుంటే, (మీ నడవడిక ఇలా ఉండదు). మీరు నరకాన్ని చూసితీరుతారు. మరొకసారి (వినండి) మీరు పూర్తి నమ్మకంతో దాన్ని చూస్తారు. తరువాత రోజున మీరు తప్పనిసరిగా సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు.

No comments:

Post a Comment