95 అత్ తీన్
ఆయతులు
: 8 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 8
అత్తి, ఆలివ్లు సాక్షిగా! సీనా పర్వతం సాక్షిగా! ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా, మేము మానవుణ్ణి
అద్భుతమైన ఆకృతిలో సృజించాము.
తరువాత మేము
అతన్ని వెనక్కి త్రిప్పి నీచాతి నీచుడుగా మార్చివేశాము, విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప. అలాంటి వారికి అనంత ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి (ప్రవక్తా) దీని తరువాత శిక్షా బహుమానాల విషయంలో నిన్ను ఎవరు తిరస్క రించగలరు? అధికారులందరికన్నా అల్లాహ్ గొప్ప అధికారి కాదా?
No comments:
Post a Comment