90 అల్ బలద్
ఆయతులు
: 20 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 20
కాదు, నేను ఈ నగరం (మక్కా)పై ప్రమాణం చేసి చెబుతున్నాను : (ఓ ప్రవక్తా) అసలు విషయం ఏమిటంటే, ఈ నగరంలో నిన్ను హలాల్ చేసుకున్నారు. తండ్రి (అంటే ఆదమ్ అస్సలామ్) సాక్షిగా, ఆయనకు పుట్టిన సంతానం సాక్షిగా! మేము మానవుణ్ణి శ్రమకోసం పుట్టించాము. అతడు తన నెవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా? నేను అపార ధనరాసుల్ని ఖర్చుపెట్టాను అని అంటాడతను.
తనను ఎవరూ గమనించలేదని అతడు భావిస్తున్నాడా? మేము అతనికి రెండు కళ్ళూ, ఒక నాలుకా,
రెండు పెదవులూ ప్రసాదించలేదా? ఇంకా స్పష్టమైన రెండు (మంచీ చెడుల) మార్గాలను అతనికి చూపాము. కాని అతడు కష్టతరమైన కనుమ దాటిపోవటానికి సాహసించలేదు. కష్టతరమైన ఆ కనుమ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరినైనా బానిసపు బంధనాల నుండి విముక్తి గావించటం, లేదా ఆకలిగొన్న రోజున సమీప అనాథుడికి లేదా దిక్కులేని నిరుపేదకు అన్నం పెట్టడం. అంతేకాదు, (వీటితో పాటు) విశ్వసించి, సహనం, సానుభూతుల్ని గురించి ఒకరికొకరు బోధించుకునే వారిలో కూడ మనిషి చేరిపోవాలి. వీరే కుడిపక్షం వారు. మా వాక్యాలను తిరస్కరించిన వారు వామపక్షానికి చెందినవారు. వారిని అగ్నిచుట్టుముట్టి ఉంటుంది.
No comments:
Post a Comment