105 అల్ ఫీల్
ఆయతులు
: 5 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 5 ఏనుగుల వారిపట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఆయన వారి కుట్రను భగ్నం చెయ్యలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారయిన కంకర రాళ్ళను వారిపైకి విసరివేస్తూండేవి. చివరికి వారి స్థితిని (పశువులు) తినేసిన పొట్టు మాదిరిగా మార్చివేశాడు.
No comments:
Post a Comment