34 సూరహ్ సబా

 

34. సబా

ఆయతులు : 54                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

34. సబా  1 - 2 కేవలం అల్లాహ్ యే స్తుతికిపాత్రుడు. ఆయన ఆకాశాలలోనూ, భూమి లోనూ ఉన్న ప్రతి వస్తువుకూ స్వామి. పరలోకంలో కూడా ఆయనే స్తోత్రానికి పాత్రుడు. ఆయన వివేచనకలవాడు, అన్నీ ఎరిగినవాడు, భూమిలోకి ప్రవేశిం చేదీ, దానినుండి వెలికి వచ్చేదీ, ఆకాశం నుండి దిగేదీ, దానిలోకి ఎక్కేదీ, ఇదంతా ఆయనకు తెలుసు. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడూను.

34. సబా  3 - 6 ఏదీ,  ప్రళయం  ఇంకా మా మీదకు రావటం లేదేమిటి? అని అవిశ్వాసులు అంటారు. వారితో ఇలా అను, ‘‘అగోచర విషయజ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీ మీదకు తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువైనా సరే ఆయనకు ఆకాశాలలోనూ గోప్యంగా లేదు, భూమిపైనా గోప్యంగా లేదు. రవ్వకంటే పెద్దదైనా సరే దానికంటె చిన్నదైనా సరే అంతా ఒక స్పష్టమైన దస్త్రములో వ్రాయబడి ఉన్నది.’’ విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్ మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ప్రళయం వస్తుంది, వారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి సిద్ధిస్తుంది. మా వాక్యాలను అగౌరవ పరచటానికి విశ్వప్రయత్నాలు చేసినవారికి తీవ్రమైన, బాధాకరమైన శిక్షపడు తుంది. ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుండి ఏదైతే నీపై అవతరించిందో, అది పూర్తిగా సత్యమనీ, శక్తిమంతుడూ, స్తవనీయుడూ అయిన దేవుని మార్గం చూపుతుందనీ జ్ఞానులు బాగా గ్రహిస్తారు.

34. సబా  7 - 8 ... అవిశ్వాసులు ప్రజలతో  ఇలా  అంటారు: ‘‘మీ శరీరంలోని అణువణువు చెల్లాచెదరై పోయినప్పుడు మీరు మళ్లీ కొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? వ్యక్తి అల్లాహ్ పేరుతో అబద్ధాలు కల్పిస్తున్నాడో లేక ఇతనికి పిచ్చి ఏమైనా పట్టిందో తెలియటం లేదు.’’

34. సబా  ... 8 - 9 కాదు. వాస్తవానికి పరలోకాన్ని విశ్వసించినవారే యాతనకు గురి అయ్యేవారు, వారే ఘోరంగా మార్గం తప్పినవారు. వారిని ముందునుంచీ, వెనకనుంచీ చుట్టుముట్టి ఉన్న భూమ్యాకాశాలను వారు ఎన్నడూ చూడలేదా? మేము కోరితే వారిని భూమిలోకి కూరుకుపోయేలా చేయగలము లేదా ఆకాశ ఖండాలను కొన్నింటిని వారి మీద పడవేయగలము. నిజంగానే దేవుని వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఇందులో ఒక సూచన ఉన్నది.

34. సబా  10 - 11 మేము దావూద్కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదిం చాము. (మేము ఇలా ఆజ్ఞాపించాము) పర్వతములారా! ఇతనితో కలిసి కీర్తన చేయండి. (ఇదే ఆజ్ఞను మేము) పక్షులకు కూడా ఇచ్చాము. మేము ఇనుమును అతని కొరకు మెత్తపడేటట్లుగా చేశాము. ఇలా ఆదేశిస్తూ ‘‘కవచాలు తయారు చెయ్యి, వాటి వలయాలను సరిగ్గా లెక్క ప్రకారం పేర్చు.’’ (దావూద్ప్రజలారా!) మంచి పనులు చెయ్యండి. మీరు చేస్తున్నదల్లా నేను చూస్తున్నాను.

34. సబా  12 - 13 మేము సులేమాన్కు గాలిని వశపరచాము. అది ఉదయం పూట ఒక నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేయగలిగేది. సాయంకాలం పూట కూడా ఒక నెల రోజుల పాటి ప్రయాణాన్ని చేయగలిగేది. మేము ఆయనకు కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. తమ ప్రభువు ఆదేశానుసారం అతని సన్నిధిలో సేవలు చేసే జిన్నాతులను మేము అతనికి వశవర్తులుగా చేశాము. వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి మేము జ్వలించే అగ్నిని రుచిచూపేవారము. వారు అతనికి అతను కోరినవన్నీ చేసేవారు, ఎత్తైన కట్టడాలు, చిత్రాలు, కోనేరులవంటి పెద్ద పళ్లాలు, తమస్థానం నుండి కదలని భారీ డేగిసాలు - దావూద్ప్రజలారా! కృతజ్ఞతతో పనిచేయండి, నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు తక్కువే.

34. సబా  14 తరువాత సులేమాన్పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపి నప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చీడపురుగే తప్ప మరొకటేదీ కాదు, విధంగా సులేమాన్పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన బాధకు గురిఅయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది.

34. సబా  15 - 17 సబా కొరకు స్వయంగా వారి స్వస్థలంలోనే ఒక సూచన ఉండేది  కుడిప్రక్కా ఎడమ ప్రక్కా రెండు వైపులా రెండు తోటలు  మీ ప్రభువు ప్రసా దించిన దానిని తినండి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి: దేశమేమో మంచిది, పవిత్రమైనది. ప్రభువేమో మన్నించేవాడు, అయినప్పటికీ వారు విముఖత చూపారు. చివరకు మేము వారిపైకి కట్ట తెంచే వరదను పంపాము, వారి పూర్వపు రెండుతోటల స్థానంలో మరో రెండు తోటలను వారికి ఇచ్చాము. వాటిలో చేదుపండ్లు, aావుక వృక్షాలు ఉండేవి, కొన్ని రేగిచెట్లు కూడా ఉండేవి.  ఇది వారి అవిశ్వాసానికి మేము వారికిచ్చిన ప్రతిఫలం. కృతఘ్నుడైన మానవుడికి తప్ప ఇటువంటి ప్రతిఫలాన్ని మేము మరెవ్వరికీ ఇవ్వము.

34. సబా  18 - 21  మేము వారికీ, మేము శుభాలు ప్రసాదించిన పట్టణాలకూ మధ్య స్పష్టంగా కనిపించే జనపదాలు స్థాపించాము. వాటిలో ప్రయాణ దూరాలను ఒక అంచనా ప్రకారం ఏర్పాటు చేశాము. ‘‘ మార్గాలలో రేయింబవళ్లు సురక్షితంగా ప్రయాణం చేయండి.’’ కాని వారు, ‘‘మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు’’ అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు. చివరకు మేము వారిని ఒక కధగా మిగిల్చాము, చెల్లాచెదరు చేసివేశాము. నిశ్చయంగా ఇందులో సహనశీలుడూ, కృతజ్ఞుడూ అయిన ప్రతి వ్యక్తికీ సూచనలు ఉన్నాయి. వారి విషయంలో షైతాన్తన అనుమానం నిజమైందని తెలుసుకున్నాడు. వారు అతడినే అనుసరించారు, విశ్వాసులైన ఒక చిన్న వర్గం వారు తప్ప. షైతానుకు వారిపై ఎలాంటి అధికారమూ లభించి ఉండలేదు. కాని ఇదంతా ఎందుకు జరిగిందంటే, పరలోకాన్ని విశ్వసించినవాడు ఎవడో, దానిని గురించి సంశయపడినవాడు ఎవడో మేము చూడదలచాము. నీ ప్రభువు ప్రతి విషయాన్నీ కనిపెట్టి ఉన్నాడు.

34. సబా  22 - 23 (ప్రవక్తా! ముష్రిక్కులతో) ఇలా అను, ‘‘అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి.  వారు ఆకాశాలలో గాని, భూమిలోగాని, రవ్వంత వస్తువుకు కూడా యజమానులుకారు.  ఇంకా వారు భూమ్యాకాశాల ఆధిపత్యంలో భాగస్వాములునూ కారు. వారిలో ఎవ్వడూ అల్లాహ్ కు సహాయకుడూ కాడు, అల్లాహ్ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతి ఇచ్చాడో, వ్యక్తికి తప్ప మరెవరికినీ  సిఫారసూ అల్లాహ్ సమక్షంలో లాభదాయకం కాదు, చివరకు ప్రజల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు (సిఫారసు చేసే వారిని) ‘‘మీ ప్రభువు ఏమని సమాధానం పలికాడు?’’ అని అడుగుతారు. వారు, ‘‘సరైన సమాధానమే దొరికింది, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూను’’ అని చెబుతారు.

34. సబా  24 - 27 (ప్రవక్తా!) వారిని ఇలా అడుగు, ‘‘ఆకాశాల నుండీ, భూమినుండీ మీకు ఉపాధిని ఎవడు ఇస్తున్నాడు?’’ ఇలా అను, ‘‘అల్లాహ్ యే. ఇప్పుడు నిశ్చయంగా మేమో, మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.’’ ఇంకా వారితో ఇలా అను, ‘‘మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ఏమాత్రం ప్రశ్నించటం జరగదు, మీరు చేస్తూ ఉన్న దానిని గురించి మమ్మల్నీ అడగటం జరగదు.’’ ఇలా అను, ‘‘మన ప్రభువు మనల్ని సమావేశ పరుస్తాడు: తరువాత మన మధ్య సరైన తీర్పు చేస్తాడు. ఆయన సర్వజ్ఞుడైన న్యాయాధిపతి.’’ వారితో ఇలా అను, ‘‘ఆయనకు భాగస్వాములుగా మీరు కలిపిన శక్తులేవో నాకూ కొంచెం చూపించండి.’’ ఎంతమాత్రం కాదు అల్లాహ్ మాత్రమే శక్తిమంతుడు వివేకవంతుడూను.

34. సబా  28 (ప్రవక్తా!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తను ఇచ్చేవాడుగా, హెచ్చరిక చేసేవాడుగా నియమించి పంపాము. కాని చాలామంది మానవులు దీనిని ఎరుగరు.

34. సబా  29 - 30 వారు నీతో ఇలా అంటారు, ‘‘నీవు నిజాయితీపరుడవే అయితే, (ప్రళయ) వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది?’’ ఇలా అను, ‘‘మీ కొఱకు రోజు యొక్క గడువు నిర్ణయమయ్యే ఉన్నది.  దాని రాకను మీరు ఒక గంట ఆలస్యమూ చేయలేరు, ఒక గంట శీఘ్రతరమూ చేయలేరు.’’

34. సబా  31 - 33 అవిశ్వాసులు ఇలా అంటున్నారు, ‘‘మేము ఖురానును ఎన్నటికీ విశ్వసించము. దీనికి పూర్వం వచ్చిన గ్రంథాన్నీ అంగీకరించము.’’ దుర్మార్గులు తమ ప్రభువు సమక్షంలో నిలబడునప్పటి స్థితిని నీవు చూస్తే ఎంత బాగుండును!  అప్పుడు  వారు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసు కుంటూ ఉంటారు.  ప్రపంచంలో అణగద్రొక్కబడిన వారు పెద్దలమనుకున్న వారితో, ‘‘మీరు లేకపోయినట్లయితే మేము విశ్వాసులమై ఉండేవారము’’ అని అంటారు.  పెద్దలమనుకున్న వారు, అణగద్రొక్కబడిన వారికి ఇలా జవాబు ఇస్తారు, ‘‘మీ వద్దకు వచ్చిన సన్మార్గాన్ని అవలంబిం చకుండా మేము మిమ్మల్ని ఆపామా? లేదు. మీరు స్వయంకృతాపరాధులు.’’ అణగ ద్రొక్కబడిన వారు పెద్దలమనుకున్న  వారితో ఇలా అంటారు, ‘‘కాదు, ఇది మీరు అహోరాత్రాలు పన్నిన కుట్ర. అల్లాహ్ ను తిరస్కరించండి అనీ ఇతరులను ఆయనకు సహవర్తులుగా చెయ్యండి అనీ మీరు మాకు బోధించారు.’’ చివరకు వారు శిక్షను చూసినప్పుడు, తమ మనస్సులలో పశ్చాత్తాప పడతారు. మేము అవిశ్వాసుల మెడలకు గుదిబండలు వేస్తాము. ప్రజలకు వారి కర్మలు ఎలాంటివో అలాంటి ప్రతిఫలమే దొరుకుతుంది. దానికి భిన్నమైన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వటం సాధ్యమా?

34. సబా  34 - 38 మేము హెచ్చరిక చేసే వానిని ఏదైనా పట్టణానికి పంపినపుడు, పట్టణంలోని సంపన్నులు, ‘‘నీవు తీసుకొనివచ్చిన సందేశాన్ని మేము విశ్వసించము’’ అని అనకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు. వారు ఎల్లప్పుడు ఇలానే అన్నారు, ‘‘మేము నీకంటె ఎక్కువ సంపదనూ, ఎక్కువ సంతానాన్నీ కలిగి ఉన్నాము. మేము ఎంతమాత్రం శిక్షింపబడే వారము కాము.’’ ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నా ప్రభువు తనకు ఇష్టమైన వారికి విస్తారంగా ఉపాధిని ప్రసాదిస్తాడు, తనకు ఇష్టమైనవారికి ఆచితూచి ఇస్తాడు. కాని చాలామంది దీని యథార్థాన్ని గ్రహించరు.’’ మిమ్మల్ని మాకు దగ్గర చేసేది, మీ సంపదకానీ, మీ సంతానం కానీ కాదు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే (మాకు దగ్గరవుతారు). ఇటువంటి వారికే తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభించేది, వారు ఎత్తైన భవనాలలో సురక్షితంగా ఉంటారు, ఇక మా వాక్యాలను చులకన పరచటానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు, వారు యాతనకు గురిఅవుతారు.

34. సబా  39 ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నా ప్రభువు తన దాసులలో తన కిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తనకిష్టమైన వారికి ఆచి తూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు, ఉపాధి ప్రదాతలందరికంటె ఆయనే శ్రేష్ఠుడైన ఉపాధి దాత.’’

34. సబా  40 - 42 ఆయన మానవులందరినీ సమావేశపరచే రోజున దైవదూతలను, ‘‘వీరు మిమ్మల్నే ఆరాధిస్తూ ఉండేవారా?’’ అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా జవాబు చెబుతారు, ‘‘నీవు పరిశుద్ధుడవు. మా సంబంధం నీతోనేగాని వీరితో మాత్రం కాదు, అసలు వీరు మమ్మల్ని కాదు, జిన్నాతులను ఆరాధించే వారు, వీరిలో చాలామంది వారినే విశ్వసించారు.’’ (అప్పుడు మేము ఇలా అంటాము) రోజున మీలో ఎవరూ ఎవరికీ లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ కలిగించలేరు. మేము దుర్మార్గులతో, ‘‘ఇక రుచి చూడండి మీరు తిరస్కరిస్తూ ఉండే నరకబాధను’’ అని అంటాము.

34. సబా  43 - 45 స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినపుడు, వారు, ‘‘ వ్యక్తి మీ తాతముత్తాతలు ఆరాధించిన ఆరాధ్యుల నుండి మిమ్మల్ని దూరం చేయాలని కోరుతున్నాడు’’ అని అంటారు. ఇంకా, ‘‘ఇది (ఖురాన్‌) కేవలం కల్పితమైన అబద్ధం మాత్రమే’’ అని అంటారు. అవిశ్వాసుల ముందుకు సత్యం వచ్చినప్పుడు, వారు ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. వాస్తవానికి మేము వారికి ఇదివరకు కూడా గ్రంథాన్నీ ఇవ్వలేదు, దానిని వారు చదివేందుకు. నీకు పూర్వం వారి వైపునకు హెచ్చరిక చేసేవారినెవరినీ పంపలేదు, వారికి పూర్వం గతించినవారు ఇదే విధంగా తిరస్కరించారు, మేము వారికి ఇచ్చిన దానిలో పదోవంతుకు కూడ వీరు చేరలేదు, కాని వారు నా ప్రవక్తలను నిరాకరించినపుడు, చూడండి నేను వారికి విధించిన శిక్ష ఎంత కఠినంగా ఉండినదో.

34. సబా  46 - 50 ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నేను మీకు ఒక విషయాన్ని బోధి స్తున్నాను. అల్లాహ్ కోసం, మీరు ఒక్కరొక్కరూ ఇద్దరిద్దరూ కలిసి మీ మేధను ఉపయోగించి ఆలోచించండి, అసలు మీ సహచరుని మాటలలో పిచ్చితనం ఏముందో అని? అతను,  ఒక  తీవ్రమైన శిక్షరావటానికి ముందు మీకు హెచ్చరిక చేసేవాడు మాత్రమే’’ వారితో ఇలా అను : ‘‘ఒకవేళ నేను మీనుండి ప్రతిఫలమేదైనా కోరి ఉంటే, దానిని మీరే ఉంచుకోండి, ఇక నా ప్రతిఫలం అది అల్లాహ్ బాధ్యత, ఆయన సర్వసాక్షి.’’ వారితో ఇలా అను, ‘‘నా ప్రభువు (నాకు) సత్యస్ఫూర్తిని పంపుతున్నాడు. ఆయన గుప్తములైన యథార్థాలను అన్నింటినీ ఎరిగినవాడు.’’ ఇలా అను, ‘‘సత్యం వచ్చేసింది ఇక అసత్యం ఏమి చేసినా నెగ్గజాలదు.’’ ఇలా అను, ‘‘ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే, నా మార్గభ్రష్టత్వపు పాపఫలం నా మీదనే ఉంటుంది. ఒకవేళ నేను సన్మార్గంపై ఉంటే, నా ప్రభువు నాపై అవతరింపజేసే వహీ ఆధారంగానే ఉన్నాను. ఆయన అన్నీ వింటాడు, దగ్గరలోనే ఉన్నాడు.’’

34. సబా  51 - 54 నీవు సమయంలో వారిని చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు భయకంపితులై తిరుగుతూ ఉంటారు,  ఎటూ  తప్పించుకునిపోలేరు. దగ్గరనుండే పట్టుకోబడతారు, అప్పుడు వారు, ‘‘మేము దానిని విశ్వసించాము’’ అని అంటారు. వాస్తవానికి దూరమైపోయిన వస్తువు ఇప్పుడెలా చేతికందు తుంది. ఇదివరకు వారు అవిశ్వాసానికి పాల్పడి ఉన్నారు  నిజం తెలుసుకో కుండానే, దూరం నుంచే ఊహాపోహలు చేశారు-  అప్పుడు  వారు తాము ఎక్కువగా కోరుకునే దానికి దూరంచేయబడతారు  వారివంటి వారి పూర్వికులు దూరం చేయబడినట్లు. వారు, అపమార్గం పట్టించే పెద్ద సంశయంలో పడిపోయారు.

No comments:

Post a Comment