48 సూరహ్ అల్‌ ఫతహ్

 

48.అల్ఫతహ్

ఆయతులు : 29                                   అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 7 ప్రవక్తా! మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము, అల్లాహ్ నీ పూర్వపు పొరపాట్లను, భావికాలపు పొరపాట్లను మన్నించాలని, నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయాలని,  నీకు ఋజుమార్గం చూపాలని, నీకు గొప్ప సహాయం చేయాలని. ఆయనే విశ్వాసుల హృదయాలపై సకీనత్‌ (శాంతి సంతృప్తుల)ను అవతరింపజేశాడు, తమ విశ్వాసానికి వారు అదనంగా మరొక విశ్వాసాన్ని కలుపుకోవాలని.  భూమిలోని,  ఆకాశాలలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన జ్ఞానీ మరియు వివేకి. (ఆయన ఇలా ఎందుకు చేశాడంటే) విశ్వాసులైన పురుషులూ, స్త్రీలూ శాశ్వతంగా ఉండేటందుకు ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేయాలని  వారి పాపాలను వారి నుండి దూరం చేయాలని- అల్లాహ్ దృష్టిలో ఇది గొప్ప విజయం - అల్లాహ్ విషయంలో కుశంకలు గల కపటులైన పురుషులను, స్త్రీలను మరియు బహుదైవోపాసకులైన పురుషులను, స్త్రీలను శిక్షించాలని. చెడుల వలయంలోకి స్వయంగా వారే వచ్చిపడ్డారు. అల్లాహ్ ఆగ్రహం వారిపై పడిరది, ఆయన వారిని శపించాడు, వారికై నరకాన్ని సిద్ధం చేశాడు. అది మహాచెడ్డ నివాసం. భూమ్యాకాశాలలోని సైన్యాలు అన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడూను.

8 - 9 ప్రవక్తా! మేము నిన్ను సాక్షి (షాహిద్‌) గాను, శుభవార్త అందజేసేవాని గానూ, హెచ్చరిక చేసేవానిగానూ చేసి పంపాము. ఎందుకంటే, ప్రజలారా! మీరు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించాలని, (ప్రవక్తకు) సహకరిం చాలని, అతనిని గౌరవించాలని  ఉదయం, సాయంత్రం అల్లాహ్ ను స్తుతించా లని.

10 ప్రవక్తా! నీతో విధేయతా ప్రమాణం చేసినవారు నిజానికి అల్లాహ్తో విధేయతా ప్రమాణం చేశారు. వారి చేతులపై అల్లాహ్ హస్తం ఉన్నది. ఇప్పుడిక ఎవడు ప్రమాణాన్ని భంగపరుస్తాడో, అతడి ప్రమాణభంగం వల్ల కలిగే కీడు స్వయంగా అతడినే చుట్టుకుంటుంది. ఎవడు తాను అల్లాహ్తో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడో, అతనికి అల్లాహ్ త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

11 - 12 ప్రవక్తా! పల్లెటూరి అరబ్బులలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ వద్దకు వచ్చి తప్పకుండా ఇలా అంటారు, ‘‘మా ఆస్తిపాస్తులూ, మా ఆలు బిడ్డలను గురించిన చింతనా మాకు తీరిక లేకుండా చేశాయి. మీరు మాకై క్షమాభిక్ష ప్రార్థన చేయండి.’’ వారు తమ మనస్సులలో లేని విషయాలను తమ నోటితో అంటారు.వారితో ఇలా అను: ‘‘మంచిది, అలాగైతే, అల్లాహ్ మీకు ఏదైనా నష్టాన్ని కలుగజేయదలిస్తే లేదా ఏదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే, అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికైనా కాస్తయినా ఉందా? మీ కర్మలను గురించి అల్లాహ్ కే బాగా తెలుసు. (కాని అసలు విషయం మీరు చెప్పేది కాదు) కాని, ప్రవక్త మరియు విశ్వాసులు తమ ఇంటి వారివద్దకు తిరిగి రానేరారు అని మీరు భావించారు. ఆలోచన మీ మనస్సులకు బాగా నచ్చింది. మీరు చాలా చెడ్డగా అనుమానిం చారు, మీరు చాలా చెడ్డ ఆంతర్యం కలవారు.’’

13 - 14 అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించని అవిశ్వాసుల కొరకు మేము భగ భగమండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యానికి యజమాని అల్లాహ్ యే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించే వాడూను.

15 - 17 నీవు విజయ ధనాన్ని పొందటానికి వెళ్లేటప్పుడు, వెనుక ఉండి పోయినవారు నీతో, ‘‘మమ్మల్ని కూడా మీ వెంట రానీయండి’’ అని తప్పకుండా అంటారు. వారు అల్లాహ్ ఉత్తరువును మార్చ గోరుతున్నారు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు, ‘‘మీరు మాతో రావటానికి ఎంతమాత్రం వీలులేదు. అల్లాహ్ విషయాన్ని ముందే చెప్పేశాడు.’’ వారు, ‘‘అది కాదు, మీరు మేమంటే అసూయ పడుతున్నారు’’ అని అంటారు. (అసలు ఇక్కడ విషయం అసూయకు సంబంధించింది కాదు). కాని వారు సరిjైున మాటను చాలా తక్కువగానే అర్థం చేసుకుంటారు. వెనుక ఉండిపోయిన గ్రామీణ అరబ్బులతో ఇలా అను, ‘‘త్వరలోనే, ఎంతో బలాఢ్యులైన ప్రజలతో పోరాడేందుకు మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది లేదా వారు లొంగిపోతారు. అప్పుడు మీరు జిహాద్ఆజ్ఞను శిరసావహిస్తే, అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు పూర్వం విముఖు లైనట్లు మళ్లీ విముఖులైతే, అల్లాహ్ మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. అయితే ఒకవేళ అంధుడూ, కుంటివాడూ, వ్యాధిగ్రస్తుడూ జిహాద్కొరకు రాకపోతే, అందులో ఎలాంటి దోషమూ లేదు. అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపేవానిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. విముఖుడయ్యే వానికి ఆయన వ్యధాభరిత మైన శిక్ష విధిస్తాడు.’’

18 - 21 విశ్వాసులు వృక్షం క్రింద నీతో విధేయతా ప్రమాణం చేస్తున్నప్పుడు, అల్లాహ్ వారిని చూసి ఆనందించాడు. వారి హృదయాల స్థితి ఆయనకు తెలుసు. కనుక ఆయన వారిపై సకీనత్’ (శాంతి సంతృప్తుల)ను అవతరింప జేశాడు, వారికి బహుమానంగా సమీపంలోని విజయాన్ని ప్రసాదించాడు  అపార విజయ ధనాన్ని వారికి అనుగ్రహించాడు. దానిని వారు (త్వరలోనే) పొందుతారు. అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను. అల్లాహ్ మీకు అమితమైన విజయ ధనాలను వాగ్దానం చేస్తున్నాడు. వాటిని మీరు పొందుతారు. వెంటనే ఆయన  మీకు విజయాన్ని ప్రసాదించాడు, ప్రజల చేతులు మీ పైకి లేపకుండా నిరోధించాడు,  ఇది విశ్వాసుల కొరకు ఒక సూచన కావాలని, అల్లాహ్ మిమ్మల్ని ఋజుమార్గం వైపునకు నడపాలని. ఇదేకాకుండా, ఇతర విజయ ధనాలను గురించి కూడ ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు. వాటిపై మీరు ఇంకా అదుపు సాధించలేదు. అల్లాహ్ వాటిని చుట్టుముట్టి ఉన్నాడు. అల్లాహ్ కు ప్రతిదానిపై అధికారం ఉన్నది.

22 - 26 అవిశ్వాసులు సమయంలో మీతో యుద్ధానికి దిగి ఉన్న ట్లయితే,  నిశ్చయంగా  వెన్నుచూపి పారిపోయేవారు. ఇక సహాయకుణ్ణీ, రక్షకుణ్ణీ పొంది ఉండేవారు కాదు. ఇది అల్లాహ్ సంప్రదాయం  మొదటి నుండే వస్తూ ఉన్నది.  మీరు  అల్లాహ్  సంప్రదాయంలో మార్పునూ చూడలేరు. మక్కా లోయలో వారి చేతులను మీనుండి, మీ చేతులను వారినుండి ఆపినవాడు ఆయనే. వాస్తవానికి ఆయన మీకు వారిపై ఆధిక్యం ఇచ్చాడు. మీరు చేస్తూ  ఉన్నదంతా  అల్లాహ్ చూస్తూ ఉండినాడు. సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిదే హరామ్కు రాకుండా నిరోధించి, ఖుర్బానీ ఒంటెలను వాటి వధ్య స్థలాల దగ్గరకు చేరనీయకుండా చేసినది వారేకదా! (మక్కాలో) నీవు ఎరుగని విశ్వాసులైన స్త్రీ పురుషులు లేకుండా ఉన్నట్లయితే, తెలియకపోవటం వల్ల నీవు వారిని కాలరాస్తావనే ప్రమాదం, దానివల్ల నీపై అపవాదు వస్తుందనే భయం లేకపోయి ఉంటే (యుద్ధాన్ని ఆపటం జరిగేది కాదు. దానిని ఎందువల్ల ఆపటం జరిగిందంటే) అల్లాహ్ తన కారుణ్యంలోకి తాను కోరిన వారిని ప్రవేశింపజేసేటందుకు. విశ్వాసులు వేరుగా పోయి ఉంటే, (మక్కా వాసులలోని) అవిశ్వాసులను తప్పకుండా మేము కఠినంగా శిక్షించి ఉండేవారము. ( కారణం వల్లనే) అవిశ్వాసులు తమ హృదయా లలో మూఢాభిమానాన్ని పెంచుకున్నప్పుడు, అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసు లపై సకీనత్’ (శాంతి సంతృప్తుల)ను అవతరింపజేశాడు, విశ్వాసులను భయభక్తుల మాటపై స్థిరంగా ఉంచాడు. వారే దానికి ఎక్కువ హక్కుదారులును, అర్హులూను. అల్లాహ్ కు ప్రతి విషయం గురించి తెలుసు.

27 నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యమైన స్వప్నాన్ని చూపించాడు. అది పూర్తిగా సత్యానికి అనుగుణంగా ఉన్నది. అల్లాహ్ సంకల్పిస్తే, మీరు తప్పకుండా మస్జిదే హరామ్లో పూర్తి శాంతితో ప్రవేశిస్తారు, మీరు శిరో ముండనం చేయించుకొంటారు, వెండ్రుకలను కత్తిరించుకొంటారు. మీకు భయమూ ఉండదు. మీకు తెలియని విషయం ఆయనకు తెలుసు. కనుక స్వప్నం నిజం కాకముందే, ఆయన సమీప విజయాన్ని మీకు ప్రసాదించాడు.

28 - 29 అల్లాహ్ యే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు, అది అన్ని ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండేలా చేయటానికి. వాస్తవానికి అల్లాహ్ సాక్ష్యమే చాలు. ముహమ్మద్అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి, వాటివల్ల వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. వారి గుణగణాలు తౌరాత్లో ఇలా ఉన్నాయి. ఇక ఇన్జీల్లో వారు ఒక పంటపొలంతో పోల్చబడ్డారు. పొలం మొదట్లో మొలకను అంకురింపజేసింది, తరువాత దానికి బలం చేకూర్చింది, తరువాత అది లావుగా ఏపుగా పెరిగింది, ఆపై తన కాండంపై నిలబడిరది. రైతులను అది ఆనందపరుస్తుంది, అవిశ్వాసులు వారి వృద్ధీవికాసాలను చూచి అసూయపడాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే వర్గం వారికి క్షమాభిక్షనూ, గొప్ప ప్రతిఫలాన్నీ ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు.

No comments:

Post a Comment