33 సూరహ్ అల్‌ అహ్జాబ్‌

 

33. అల్అహ్జాబ్

ఆయతులు : 73                                  అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

33. అల్అహ్జాబ్  1 - 3 ప్రవక్తా! అల్లాహ్ కు భయపడు. అవిశ్వాసులకూ, కపటులకూ విధేయత చూపకు. వాస్తవానికి అల్లాహ్ యే జ్ఞాని మరియు వివేకి. నీ ప్రభువు తరఫు నుండి నీకు సూచింపబడే విషయాన్ని మాత్రమే అనుసరించు. అల్లాహ్ కు నీవు చేసే ప్రతిపనీ తెలుసు. అల్లాహ్ పై నమ్మకం ఉంచు, సంరక్షకుడుగా అల్లాహ్ మాత్రమే సరిపోతాడు.

33. అల్అహ్జాబ్  4 - 5 అల్లాహ్ వ్యక్తి శరీరంలోనూ రెండు హృదయాలను పెట్టలేదు  మీరు జిహార్చేసే  మీ భార్యలనూ ఆయన మీకు తల్లులుగా చేయలేదు  ఇంకా ఆయన మీ దత్త పుత్రులనూ మీ సొంత పుత్రులుగా చేయలేదు  ఇవి మీరు పలికే మీ నోటిమాటలు మాత్రమే. కాని అల్లాహ్ మాత్రం సత్యం పునాదిగా ఉన్నమాటనే అంటున్నాడు. ఆయనే సరిjైున విధానం వైపునకు మార్గం చూపుతున్నాడు. దత్తపుత్రులను వారి తండ్రులతో ఉన్న సంబంధం ప్రకారం పిలవండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో న్యాయసమ్మతమైన విషయం. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియకపోతే, అప్పుడు వారు మీకు ధార్మిక సోదరులు మరియు సహచరులు. పొరపాటు వల్ల మీరు ఏదైనా మాట అంటే, దానికి మిమ్మల్ని పట్టుకోవటం జరగదు.  కాని మీరు బుద్ధి పూర్వకంగా అనే మాటకు తప్పనిసరిగా మిమ్మల్ని పట్టుకోవటం జరుగుతుంది. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడూను.

33. అల్అహ్జాబ్  6  నిస్సందేహంగా విశ్వాసులకు దైవప్రవక్త స్వయంగా తమకంటే కూడా ముఖ్యుడు. దైవప్రవక్త భార్యలు వారికి తల్లులు. కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం సాధారణ  విశ్వాసులు మరియు వలస వచ్చిన వారికంటె రక్తసంబంధీకులు ఒకరిపై ఒకరు ఎక్కువ హక్కులు కలిగి ఉంటారు. అయితే, మీ సహచరులకు మీరు ఏదైనా మేలు (చేయదలిస్తే) చేయవచ్చు. ఆజ్ఞ దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది.

33. అల్అహ్జాబ్  7 - 8 ( ప్రవక్తా!) మేము దైవప్రవక్తలందరి చేత చేయించిన వాగ్దానాన్ని జ్ఞాపకముంచుకో. నీతో కూడ (చేయించాము) మరియు నూహ్, ఇబ్రాహీమ్, మూసా, మర్యమ్కుమారుడు ఈసాలతో కూడా (చేయించాము), అందరితో మేము గట్టి  వాగ్దానం చేయించాము   నిజాయితీపరులను (వారి ప్రభువు) వారి నిజాయితీని గురించి ప్రశ్నించేందుకు. అవిశ్వాసులకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధంచేసే ఉంచాడు.

33. అల్అహ్జాబ్  9 - 11 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ మీకు ( మధ్యనే) చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. సైన్యాలు మీపైకి దండెత్తి వచ్చినప్పుడు, మేము వాటి మీదకు ఒక పెను గాలిని పంపాము  మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు సమయంలో చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. శత్రువులు మీ మీదకు పై నుండి, క్రిందనుండీ దండెత్తి వచ్చినప్పుడు, భయం వల్ల మీ కళ్లు తేలగిల్లి నప్పుడు మీ గుండెకాయలు  గొంతులల్లోనికి వచ్చి నప్పుడు, మీరు అల్లాహ్ ను గురించి రకరకాలుగా అనుమానిస్తున్నప్పుడు, సమయంలో విశ్వాసులు కఠిన పరీక్షకు గురిఅయ్యారు, తీవ్రంగా ఊపి వేయబడ్డారు.

33. అల్అహ్జాబ్  12 - 15 కపటులూ, రోగగ్రస్త హృదయులూ అందరూ, ‘‘అల్లాహ్, ఆయన ప్రవక్త మనతో చేసిన వాగ్దానాలన్నీ భ్రమలు తప్ప మరేమీ కావు’’ అని స్పష్టంగా ప్రకటించినప్పటి సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు వారిలోని ఒక వర్గం, ‘‘ యస్రిబ్ప్రజలారా! ఇక మీకు ఇక్కడ ఉండే అవకాశమేదీ లేదు, వెనక్కి వెళ్ళిపొండి’’ అని అన్నది. అప్పుడు వారిలోని మరొక వర్గం ‘‘మా గృహాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి’’ అని దైవప్రవక్తకు చెప్పి సెలవు కోరింది. వాస్తవానికి వాటికి ప్రమాదమూ లేదు. అసలు వారు (యుద్ధ మైదానం నుండి) పారిపోదలచారు. ఒకవేళ నగరం చుట్టుపక్కల నుండి శత్రువులు లోపలకు జొరబడి వారిని విద్రోహ చర్యకు పాల్పడమని పిలుపు ఇస్తే, అప్పుడు వారు తప్పకుండా అలా చేస్తారు  విద్రోహ చర్యలో పాల్గొన టానికి వారు చాలా తక్కువగా సంకోచిస్తారు. వారు ఇదివరకు తాము వెన్ను చూపము అని అల్లాహ్ కు వాగ్దానం చేసి ఉన్నారు. అల్లాహ్ కు చేసిన వాగ్దానం గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

33. అల్అహ్జాబ్  16 - 17 ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘ఒకవేళ మీరు మృత్యువు బారి నుండి లేదా హత్యబారి నుండి తప్పించుకోవాలని పారిపోతే, పారిపోవటం మీకు ఏమాత్రం లాభదాయకం కాబోదు. దీని తరువాత జీవిత సుఖాలను అనుభవించటానికి కొద్దిపాటి అవకాశం మాత్రమే మీకు లభిస్తుంది.’’ వారిని ఇలా అడుగు, ‘‘ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం కలిగించదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలిగేవాడెవడు? ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని కరుణించదలిస్తే, ఆయన కరుణను ఆపగల వాడెవడు? అల్లాహ్ కు ప్రతిగా వారు సంరక్షకుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు.’’

33. అల్అహ్జాబ్  18 - 20 మీలో (యుద్ధకార్యంలో) ప్రతిబంధకాలు సృష్టించేవారినీ, తమ సోదరులను  ‘‘మా  వైపునకు రండి’’ అని పిలిచేవారినీ, లెక్కకు మాత్రమే యుద్ధంలో పాల్గొనేవారినీ, నీకు తోడ్పడే విషయంలో పరమ లోభులైన వారినీ అల్లాహ్ బాగా ఎరుగును. మరణ సమయంలో అపస్మారక స్థితికి గురిఅయిన వానివలె వారు ప్రమాదం సంభవించినప్పుడు గుడ్లు తిప్పుతూ నీ వైపు చూస్తారు. కాని ప్రమాదం తొలగిపోగానే, వారే లాభాలను పొందాలని దురాశా పరులై కత్తెరలవలె ఆడే నాలుకలతో నీకు స్వాగతం చెప్పటానికి వస్తారు. వారు ఏమాత్రం విశ్వసించినవారు కారు. కనుకనే అల్లాహ్ వారి కర్మలను అన్నింటినీ నిరర్థకం చేశాడు.  అల్లాహ్ కు  అలా చెయ్యటం చాలా సులభం. దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళిపోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ వర్గాలు మళ్లీ దాడిచేస్తే, ఎడారిలో ఎక్కడికైనా పోయి పల్లెలలో అరబ్బుల మధ్య కూర్చుందామనీ, అక్కడ నుండే మీ పరిస్థితులను గురించి తెలుసు కుందామనీ వారి మనస్సు కోరుతోంది. ఒకవేళ వారు మీ మధ్య ఉన్నా, యుద్ధంలో చాలా తక్కువగానే పాల్గొంటారు.

33. అల్అహ్జాబ్  21 - 24  వాస్తవంగానే  అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది  అల్లాహ్ పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకుని అత్యధికంగా అల్లాహ్ ను స్మరించే ప్రతి వ్యక్తికి. సత్య  విశ్వాసుల (స్థితి అప్పుడు ఇలా ఉంది), వారు దాడి చేసిన సైన్యాలను చూసినప్పుడు, ఇలా పలికారు, ‘‘అల్లాహ్, ఆయన ప్రవక్త  మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే, అల్లాహ్, ఆయన ప్రవక్త నిజమే పలికారు.’’ సంఘటన వారి విశ్వాసాన్నీ, వారి ఆత్మ సమర్పణనూ మరింత అధికం చేసింది. విశ్వాసులలో, అల్లాహ్ కు తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపినవారు ఉన్నారు, వారిలో కొందరు తమ మొక్కుబడిని తీర్చుకున్నారు, మరికొందరు సమయం కోసం నిరీక్షిస్తున్నారు. వారు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. (ఇదంతా ఎందుకు జరిగిం దంటే) నిజాయితీ పరులకు అల్లాహ్ వారి నిజాయితీకి ప్రతిఫలం ఇవ్వటానికి, కపటులకు తనకు ఇష్టమైతే శిక్ష విధించటానికి లేదా తనకు ఇష్టమైతే  వారి  పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి.  నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించే వాడూను.

33. అల్అహ్జాబ్  25 - 27  అల్లాహ్ అవిశ్వాసులను వెనక్కి తరిమాడు  వారు లాభాన్నీ పొందకుండానే, కడుపు మంటతో మరలిపోయారు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహ్ యే సరిపోయాడు. అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, సర్వ సమర్థుడూను. దాడి చేసిన వారికి తోడ్పడిన గ్రంథ ప్రజలను తమ దుర్గాల నుండి అల్లాహ్ క్రిందికి తీసుకువచ్చాడు, వారి హృదయాలను భయంతో నింపాడు. ఈనాడు వారిలోని ఒక వర్గం వారిని మీరు చంపు తున్నారు, మరొక వర్గం వారిని మీరు ఖైదీలుగా చేస్తున్నారు. ఆయన మిమ్మల్ని వారి భూమికీ, వారి గృహాలకూ, వారి ఆస్తులకూ వారసులుగా చేశాడు  మీరు ఎన్నడూ అడుగుమోపని ప్రాంతాన్ని ఆయన మీకు ఇచ్చాడు. అల్లాహ్ అన్నీ చేయగల సమర్థుడు.

33. అల్అహ్జాబ్  28 - 29    ప్రవక్తా! నీ భార్యలతో ఇలా అను  ‘‘ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్నీ, దాని శోభనూ  కోరుతూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చివేసి మంచి పద్ధతి ప్రకారం సాగనంపుతాను. కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, పరలోక నివాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే, తెలుసుకోండి, మీలోని పుణ్యవతుల నిమిత్తం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.’’

33. అల్అహ్జాబ్  30 - 31 ప్రవక్త భార్యలారా! మీలో ఎవరైనా ఏదైనా స్పష్టమైన నీతి బాహ్యమైన పని చేస్తే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. అల్లాహ్ కు ఇది చాల సులభమైన పని.  మీలో ఎవరు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, సత్కార్యాలు చేస్తారో, ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫలం ఇస్తాము. మేము ఆమెకు గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధపరచి ఉంచాము.

33. అల్అహ్జాబ్  32 - 34 ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు అల్లాహ్ కు భయపడేవారు అయితే, తగ్గు స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు. కాబట్టి స్పష్టంగా, సూటిగా మాట్లాడండి. ఇళ్లల్లోనే ఉండిపొండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. నమాజును స్థాపిం చండి, జకాత్ఇవ్వండి.  అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. దైవప్రవక్త కుటుంబీకులైన మీ నుండి కల్మషాన్ని తొలగించాలని, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలని అల్లాహ్ కోరుతున్నాడు. మీ ఇళ్లల్లో వినిపించబడే అల్లాహ్ వాక్యాలనూ, వివేకంతో కూడుకున్న విషయాలనూ జ్ఞాపకముంచు కోండి. నిస్సందేహంగా అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, అన్నీ తెలిసినవాడు.

33. అల్అహ్జాబ్  35  నిశ్చయంగా ముస్లిములూ, విశ్వాసులూ, విధేయులూ, నిజాయితీపరులూ, సహనశీలురూ, అల్లాహ్ ముందు వినమ్రులయ్యేవారూ, దానధర్మాలు చేసే వారూ, ఉపవాసం  ఉండేవారూ,  తమ మర్మాంగాలను కాపాడుకునేవారూ, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించేవారూ అయిన స్త్రీ పురుషుల నిమిత్తం అల్లాహ్ క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.

33. అల్అహ్జాబ్  36 అల్లాహ్, ఆయన ప్రవక్తా, విషయంలోనైనా ఒక తీర్పు చేసినపుడు విశ్వాసి అయిన పురుషునికైనా, విశ్వాసురాలైన స్త్రీకైనా, తరువాత తమ యొక్క విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురిఅయినట్లే.

33. అల్అహ్జాబ్  37 - 39    ప్రవక్తా!  అల్లాహ్,  నీవు, వ్యక్తికి మేలు చేశారో వ్యక్తితో ‘‘నీవు నీ భార్యను విడిచి పెట్టకు,  అల్లాహ్ కు భయపడు’’ అని అంటున్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు అల్లాహ్ బయటపెట్టదలచిన విషయాన్ని మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడు తున్నావు. వాస్తవానికి నీవు భయపడటానికి అల్లాహ్ యే ఎక్కువ హక్కుదారుడు. తరువాత జైద్ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, మేము ఆమె (విడాకులు పొందిన స్త్రీ)తో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో, వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు. అల్లాహ్ ఆదేశం అమలులోకి రావలసిందే. అల్లాహ్ తనకు విధించిన   పనినైనా చేయటంలో దైవప్రవక్తకు ప్రతిబంధకమూ లేదు. గతించిన దైవప్రవక్తలందరి విషయంలోనూ అల్లాహ్ యొక్క సంప్రదాయమే అమలులో ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ పూర్తిగా తిరుగులేని తీర్పు. (ఇది అల్లాహ్ సంప్రదాయం) అల్లాహ్ సందేశాలను అందజేసే వారికి, ఆయనకు మాత్రమే భయపడేవారికి, ఒకే దేవునికి తప్ప మరెవరికీ భయపడని వారికి. లెక్క చూడటానికి కేవలం అల్లాహ్ యే చాలు.

33. అల్అహ్జాబ్  40 (మానవులారా) ముహమ్మద్మీలోని పురుషునికీ తండ్రికారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. అల్లాహ్ సకల విషయాల జ్ఞానం కలవాడు.

33. అల్అహ్జాబ్  41 - 44 విశ్వసించిన మానవులారా! అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి. ఆయనే మీపై కరుణచూపేవాడు. ఆయన దూతలు మీ కొరకు కారుణ్యానికై ప్రార్థనలు చేస్తారు, మిమ్మల్ని ఆయన చీకట్లలో నుండి వెలికి తీసి వెలుగులోకి తీసుకు రావాలని. విశ్వాసుల పట్ల ఆయన అమిత దయకలవాడు, వారు ఆయనను కలిసేరోజున వారికి శాంతి వచనాలతో స్వాగతం లభిస్తుంది. అల్లాహ్ వారికి ఎంతో గౌరవప్రదమైన ప్రతిఫలాన్ని సమకూర్చి ఉంచాడు.

33. అల్అహ్జాబ్  45 - 48 ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా చేసి, శుభవార్తను ఇచ్చేవానిగా, హెచ్చరికచేసేవానిగా చేసి అల్లాహ్ అనుమతితో ఆయన వైపునకు పిలుపు ఇచ్చేవానిగా చేసి, ప్రకాశించే దీపంగా చేసి పంపాము. (నిన్ను)  విశ్వసించిన మానవులకు శుభవార్త ఇవ్వు, వారికి అల్లాహ్ తరఫు నుండి గొప్ప అనుగ్రహాలు ఉన్నాయని. అవిశ్వాసుల కపటుల ఒత్తిడికి ఎంతమాత్రం లొంగకు, వారి వేధింపులను లెక్క చేయకు, అల్లాహ్నే నమ్ముకో. మనిషి తన వ్యవహారాలను అప్పగించటానికి అల్లాహ్ యే చాలు.

33. అల్అహ్జాబ్  49 విశ్వాసులైన మానవులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహం చేసుకుని, తరువాత వారిని ముట్టుకోకమునుపే విడాకులిస్తే, అప్పుడు మీ తరఫు నుండి ‘‘ఇద్దత్’’ ఏదీ వారిపై ఖరారు కాదు  అది పూర్తి అవ్వాలని మీరు కోరలేరు. కనుక  వారికి  కొంత ధనం ఇచ్చి మంచి పద్ధతిలో సాగ నంపండి.

33. అల్అహ్జాబ్  50 - 52 ప్రవక్తా!  మేము ( క్రింది వారిని) నీకు ధర్మసమ్మతం చేశాము  నీవు మహర్చెల్లించిన నీ భార్యలను, అల్లాహ్ ప్రసాదించిన బానిస స్త్రీలనుండి నీ అధీనంలోకి వచ్చిన స్త్రీలను,  నీతోపాటు  వలస వచ్చిన నీ పినతండ్రి కుమార్తెలను, నీ మేనత్తల కుమార్తెలను, నీ మేనమామల కుమార్తెలను, నీ పినతల్లుల కుమార్తెలను, తనను తాను దైవప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని - ఒకవేళ దైవప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే, మినహాయింపు కేవలం నీకే పరిమితం, ఇతర విశ్వాసులకు ఇది లేదు.  సాధారణ విశ్వాసులకు, వారి భార్యల, బానిస స్త్రీల విషయంలో మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. నీకు విధమైన ఇబ్బందీ కలుగకుండా ఉండాలని  (మేము నిన్ను పరిమితుల నుండి మినహా యించాము).  అల్లాహ్  క్షమించేవాడు,  కరుణించేవాడూను. నీ భార్యలలో నీకు ఇష్టమైన వారిని నీ నుండి వేరుగా ఉంచేందుకూ, నీకు ఇష్టమైన వారిని నీతో ఉంచుకునేందుకూ, నీకు ఇష్టమైన వారిని వేరుగా ఉంచిన తరువాత (కూడ) నీ వద్దకు పిలిపించుకునేందుకూ నీకు అధికారం ఇవ్వబడుతోంది. విషయంలో నీపై దోషమూ లేదు. విధంగా వారి కళ్లు చల్లదనం పొందుతాయనీ, వారు బాధపడరనీ,  నీవు వారికి ఏది ఇచ్చినా వారు సంతోషి స్తారనీ ఎక్కువగా ఆశించవచ్చు. మీ మనస్సులలో ఏముందో అల్లాహ్ కు తెలుసు. అల్లాహ్ సర్వమూ తెలిసినవాడు సంయమనం కలవాడూను. వీరుగాక ఇతర స్త్రీలు నీకు ధర్మసమ్మతం కారు: వారి స్థానంలో మరెవరినీ భార్యలుగా తీసుకువచ్చే అనుమతి కూడ నీకు లేదు, వారి అంద చందాలు నీకు ఎంత నచ్చినా సరే. అయితే బానిస స్త్రీల విషయంలో నీకు అనుమతి ఉన్నది. అల్లాహ్ ప్రతి విషయాన్నీ కనిపెడుతూనే ఉంటాడు.

33. అల్అహ్జాబ్  53 - 54 విశ్వాసులైన ప్రజలారా! దైవప్రవక్త ఇళ్లల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజన సమయానికై కాచుకుని కూర్చోకండి. కాని మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, తప్పకుండా వెళ్లండి, అయితే భోజనం చేసిన వెంటనే, బయటికి వెళ్లిపొండి. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోవకండి. మీ చేష్టలు ప్రవక్తకు కష్టం కలిగిస్తాయి. అయినా ఆయన, మొగమాటం వల్ల ఏమీ అనరు. అల్లాహ్ సత్య విషయం చెప్పటానికి మొగమాట పడడు. ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే, తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల, వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్ధతి. దైవప్రవక్తకు కష్టం కలిగించటం మీకు ఏమాత్రం ధర్మసమ్మతం కాదు. ఇంకా, ఆయన తరువాత ఆయన భార్యలను వివాహం చేసుకోవటం కూడ మీకు ధర్మసమ్మతం కాదు. ఇది అల్లాహ్ దృష్టిలో మహాపాపం. మీరు ఏదైనా విషయాన్ని వ్యక్తం చేసినా లేక దానిని గోప్యంగా ఉంచినా, అల్లాహ్ కు ప్రతి విషయమూ తెలుసు.

33. అల్అహ్జాబ్  55 దైవప్రవక్త భార్యలకు    విషయంలో దోషమూ అంటదు. వారి తండ్రులు,  వారి కొడుకులు,   వారి సోదరులు, వారి సోదరుల కొడుకులు, వారి సోదరీమణుల కుమారులు, వారితో కలుపుగోలుగా ఉండే స్త్రీలు, వారి బానిసలు, వారి ఇళ్లల్లోకి రావచ్చు. (మహిళలారా!) మీరు అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడకండి  అల్లాహ్ ప్రతి విషయాన్నీ గమనిస్తున్నాడు.

33. అల్అహ్జాబ్  56 అల్లాహ్ ఆయన దూతలు దైవప్రవక్తకై దురూద్ను పంపుతారు. విశ్వాసులారా! మీరు కూడ ఆయనకై దురూద్, సలామ్లు పంపండి.

33. అల్అహ్జాబ్  57 - 58 అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ బాధకలిగించిన వారిని అల్లాహ్ ఇహపరాలు రెండిరటిలోనూ శపించాడు  వారికి అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్త్రీ పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక పెద్ద అభాండభారాన్ని ఒక స్పష్టమైన పాపభారాన్ని తమ తలపై మోపుకున్నట్లే.

33. అల్అహ్జాబ్  59 ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్లకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడతీసుకోమని చెప్పు  వారు గుర్తింపబడ టానికీ, వేధింపబడకుండా ఉండేందుకూ ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను.

33. అల్అహ్జాబ్  60 - 62 ఒకవేళ కపటులూ, కలుషిత హృదయులూ మదీనా నగరంలో సంచలనం కలిగించే వదంతులను వ్యాపింపజేసేవారూ  తమ దుశ్చేష్టలను మానుకోకపోతే, వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవటానికి, మేము మిమ్మల్ని నిలబెడతాము. తరువాత వారు నగరంలో మీతో కలసి ఉండటం అనేది కష్టసాధ్యమవుతుంది. అన్ని వైపుల నుండి వారిపై శాపాలు విరుచుకు పడతాయి. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు. దారుణంగా చంపబడతారు.  ఇది అల్లాహ్ సంప్రదాయం  పూర్వం నుంచీ అటువంటి వారి విషయంలో అమలవుతూ వస్తున్నదే. మీరు అల్లాహ్ సంప్రదాయంలో మార్పునూ కానలేరు.

33. అల్అహ్జాబ్  63 - 68  ప్రళయఘడియ ఎప్పుడు వస్తుంది అని ప్రజలు నిన్ను అడుగుతారు. అది అల్లాహ్కే తెలుసు అని చెప్పు. బహుశా అది సమీపంలోనే ఉందో ఏమో, నీకేమి ఎరుక. ఏది ఏమైనా, ఇది మటుకు వాస్తవం: అల్లాహ్ అవిశ్వాసు లను శపించాడు. వారికొరకు మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు  స్నేహితుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు. వారి ముఖాలను నిప్పులపై అటూ ఇటూ త్రిప్పటం జరిగేనాడు వారు ఇలా అంటారు, ‘‘అయ్యో! మేము అల్లాహ్కూ, దైవప్రవక్తకూ విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది!’’ ఇంకా ఇలా అంటారు, ‘‘ మా ప్రభూ! మేము మా నాయకులకూ, మా పెద్దలకూ విధేయత చూపాము. వారు మమ్మల్ని ఋజుమార్గం నుండి తప్పించారు. ప్రభూ! వారికి రెట్టింపు యాతన విధించు, వారిని తీవ్రంగా శపించు.’’

33. అల్అహ్జాబ్  69 - 71 విశ్వాసులారా! మూసాకు మనస్తాపం కలిగించిన ప్రజల మాదిరిగా అయిపోకండి. తరువాత అల్లాహ్, వారు కల్పించిన మాటల బారినుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను అల్లాహ్ దృష్టిలో ఎంతో గౌరవనీయుడు. విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి, రుజువాక్కును పలకండి. అప్పుడు అల్లాహ్ మీ కర్మలను చక్కబరుస్తాడు, మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకూ విధేయత చూపేవాడు గొప్ప సాఫల్యం పొందుతాడు.

33. అల్అహ్జాబ్  72 - 73 మేము అమానతును ఆకాశాల ముందూ, భూమిముందూ, పర్వతాల ముందూ పెట్టాము. అవి దానిని మోయటానికి సిద్ధపడలేదు. దానికి భయపడ్డాయి. కాని మానవుడు దాన్ని తనపై మోపుకున్నాడు. నిస్సందేహంగా, అతడు అన్యాయం చేసుకున్నాడు, మూర్ఖుడు ( అమానతు భారాన్ని పైన వేసుకున్న దాని అనివార్య ఫలితం ఏమిటంటే) కపటులైన స్త్రీ పురుషులనూ, ముష్రిక్కులైన స్త్రీ పురుషులనూ అల్లాహ్ శిక్షించటం, విశ్వాసులైన స్త్రీ పురుషుల పశ్చాత్తాపాన్ని అంగీకరించటం.  అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడూను.

No comments:

Post a Comment