10 సూరహ్ యూనుస్‌

 

10. యూనుస్

ఆయతులు : 109        అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

10. యూనుస్1 - 2 అలిఫ్లామ్రా. ఆయతులు వివేకంతోనూ విజ్ఞానంతోనూ నిండివున్న గ్రంథంలోనివి. (ఏమరుపాటులో పడివున్న) ప్రజలను హెచ్చరించు అనీ, విశ్వసించిన వారికి తమ ప్రభువువద్ద నిజమైన గౌరవమూ సాఫల్యమూ ఉన్నాయనే శుభవార్త తెలుపు అనీ మేము స్వయంగా వారిలోని ఒక మనిషిపైకి వహీని పంపించటం ప్రజలకు చోద్యమైన విషయంగా కన్పిస్తోందా? (దానికి) తిరస్కారులు ‘‘ మనిషి పచ్చి మాంత్రికుడు’’ అని అన్నారు.

10. యూనుస్3 యథార్థం ఏమిటంటే ఆకాశాలనూ, భూమినీ ఆరు రోజులలో సృష్టించి, తరువాత రాజ్యపీఠాన్ని అలంకరించి సృష్టివ్యవహారాలను నడుపుతూవున్న దేవుడే మీ ప్రభువు. ఆయన అనుమతి ఇస్తే తప్ప ఎవడూ సిఫారసు చేయలేడు. అల్లాహ్ యే మీ ప్రభువు. కనుక మీరు ఆయననే ఆరాధించండి. మీరు ఇక స్పృహలోకి రారా?

10. యూనుస్4 ఆయన వైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది. ఇది అల్లాహ్ యొక్క తిరుగులేని వాగ్దానం. నిస్సందేహంగా సృష్టిని ఆయనే ప్రారంభిస్తాడు. తరువాత రెండోసారి మళ్ళీ ఆయనే సృష్టిస్తాడు. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలం న్యాయంగా ఇవ్వటానికి - అవిశ్వాసవైఖరిని అవలంబించిన వారు సల సల కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్షను అనుభవించటానికి, వారు ఒడిగట్టిన సత్యతిరస్కారానికి ఫలితంగా.

10. యూనుస్5 - 6 సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడూ ఆయనే. చంద్రుని తరిగే పెరిగే దశలను కచ్చితంగా నిర్ణయించినవాడూ ఆయనే. తద్వారా మీరు సంవత్సరాల, తేదీల లెక్కను తెలుసుకోవాలని. అల్లాహ్ ఇదంతా సత్యబద్ధంగానే పుట్టించాడు. జ్ఞానం కల ప్రజలకు ఆయన తన సూచనలను తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా రేయింబవళ్ళ నిరంతర పరిభ్రమణంలో భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువులో (తప్పుడు దృష్టికోణం నుండి తప్పుడు ప్రవర్తన నుండి) తప్పించుకోగోరే వారికొరకు సూచనలు ఉన్నాయి.

10. యూనుస్7 - 8 యథార్థం ఏమిటంటే మమ్మల్ని కలుసుకోవాలని ఆశించనివారూ ప్రాపంచిక జీవితమునే వరించి దానితోనే తృప్తి చెందినవారూ మా సూచనల పట్ల నిర్లక్ష్య భావం కలిగివున్నవారూ - అటువంటి వారి అంతిమ నివాస స్థలం నరకమే అవుతుంది. వారు (తమ తప్పుడు విశ్వాసం, తప్పుడు ప్రవర్తనలు కారణంగా) చేస్తూ వచ్చిన చెడులకు ఫలితంగా.

10. యూనుస్9 - 10 ఇదీ యథార్థమే. విశ్వసించి (అంటే గ్రంథంలో తెలుపబడిన సత్యాలను స్వీకరించి), మంచి పనులు చేస్తూ ఉండినవారిని వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా సరిjైున మార్గంపై నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు ప్రవహిస్తాయి. అక్కడ వారు దైవమా! నీవు పవిత్రుడవు అని స్తుతిస్తారు, శాంతికలుగుగాక అని ప్రార్థిస్తారు. వారి ప్రతి మాటకు ముగింపు ఇలా ఉంటుంది : స్తోత్రమంతా సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే.

10. యూనుస్11 - 14 ప్రజలు ప్రాపంచిక ప్రయోజనాలను కోరడంలో ఎంత తొందరపడతారో అల్లాహ్ వారిపట్ల చెడుగా వ్యవహరించడంలో కూడా అంతే తొందరపడితే వారి కర్మాచరణ వ్యవధి ఎప్పుడో అంతం చెయ్యబడి ఉండేది. (కాని మేము అలా చెయ్యము). అందువల్ల మేము మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారికి తమ తలబిరుసుతనంతో భ్రష్టులై తిరిగే స్వేచ్ఛను ఇస్తాము. మానవుడి స్థితి ఎలాంటిదంటే  అతడికి కష్టకాలం దాపురించినప్పుడు నిలబడీ, కూర్చుండీ, పరుండీ మాకు మొరపెట్టుకుంటాడు. కాని మేము అతడి ఆపదను తొలగించినప్పుడు అతడు ఎప్పుడూ తనకు కలిగిన గడ్డు కాలంలోనూ మాకు మొరపెట్టుకోనేలేదు అనేవిధంగా ప్రవర్తిస్తాడు. విధంగా మితిమీరి ప్రవర్తించేవారికి వారి చేష్టలు ఆకర్షకములుగా చెయ్యబడ్డాయి. ప్రజలారా! మీకు పూర్వం ఉన్న జాతులను మేము నాశనం చేశాము ఎందుకంటే, వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు. వారి ప్రవక్తలు వారివద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకొని వచ్చినప్పుడు వారు విశ్వసించనే లేదు. విధంగా మేము దోషులకు వారు చేసిన దోషాలకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. ఇప్పుడు వారి తరువాత మేము మీకు భూమిపై వారి స్థానాన్ని ఇచ్చాము, మీరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దామని.

10. యూనుస్15 - 17 మమ్మల్ని కలిసే నమ్మకం లేని వారికి స్పష్టమైన మా మాటలను వినిపించినప్పుడు ఇలా అంటారు: ‘‘దీనికి బదులుగా మరొక ఖురాను తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి.’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ఇందులో నా అంతట నేను మార్పులూ చేర్పులూ చెయ్యటం నా పని ఎంతమాత్రం కాదు. నేను నా వద్దకు పంపబడే వహీని మాత్రమే అనుసరిస్తాను. నేను గనుక నా ప్రభువుపట్ల అవిధేయత చూపితే, ఒక పెద్ద భయంకరమైన దినంనాడు పడే శిక్షకు నేను భయపడుతాను.’’ ఇంకా ఇలా అను : ‘‘అల్లాహ్ సంకల్పం ఇదే గనక అయితే నేను ఖురానును మీకు ఎన్నటికీ వినిపించి ఉండేవాణ్ణి కాదు. అల్లాహ్ దానిని గురించి మీకు అసలు తెలిపి ఉండేవాడే కాదు. గ్రంథం అవతరించక పూర్వం నేను మీ మధ్య ఒక జీవిత కాలాన్నంతా గడిపాను. మీరు బుద్ధిని ఉపయోగించరా?’’ ఒక అబద్ధ విషయాన్ని సృష్టించి దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడికంటే లేదా అల్లాహ్ యొక్క నిజమైన ఆయతులను అబద్ధాలుగా నిర్థారించే వాడికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? నిశ్చయంగా దోషులు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు.

10. యూనుస్18 ప్రజలు అల్లాహ్ ను కాదని తమకు నష్టాన్నిగానీ లాభాన్నిగానీ కలిగించలేనివారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారు : ‘‘వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు.’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ఆకాశాలలోగానీ, భూమిలోగానీ అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?’’ ఆయన పరిశుద్ధుడు. ప్రజలు చేసే షిర్కుకు అతీతుడూ, ఉన్నతుడూను.

10. యూనుస్19 ప్రారంభంలో సర్వమానవులూ ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను, ఆచారాలను సృష్టించుకున్నారు. నీ ప్రభువు తరఫునుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకుంటున్నటువంటి విషయాన్ని గురించి తీర్పు ఎప్పుడో చెయ్యబడి ఉండేది.

10. యూనుస్20 ఇక ‘‘ ప్రవక్తపై ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజెయ్య బడలేదు?’’ అని వారు అన్నదానికి నీవు ఇలా బదులు చెప్పు : అగోచరాలన్నింటికీ యజమానీ, అధికారీ అల్లాహ్ మాత్రమే. మంచిది, నిరీక్షించండి. నేను కూడా మీతోపాటు నిరీక్షిస్తాను.

10. యూనుస్21 - 30 ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంటే ఆపదల బారి పడినప్పుడు మేము వారికి కారుణ్యం రుచి చూపిన వెంటనే వారు మా సూచనల విషయంలో ఎత్తులు వేయటం ప్రారంభిస్తారు. వారితో ఇలా అను : ‘‘అల్లాహ్ ఎత్తులు వేయటంలో మీకంటే శీఘ్రగామి. ఆయన దూతలు మీ పన్నాగాలను వ్రాస్తూపోతున్నారు.’’ మిమ్మల్ని నేలపైనా నీటిపైనా నడిపేవాడు అల్లాహ్ యే. కాబట్టి మీరు ఓడలపై ఎక్కి వాయువులు అనుకూలంగా వీస్తూ ఉండగా ఆనందంగా, ఆహ్లాదంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. తరువాత అకస్మాత్తుగా ఎదురుగాలి ఉధృతమై అన్ని దిశలనుండి అలల దెబ్బలు తగలగా ప్రయాణీకులు తాము తుఫానులో చిక్కుకుపోయామని తెలుసుకుంటారు. సమయంలో అందరూ తమ ధర్మాన్ని కేవలం అల్లాహ్కే ప్రత్యేకం చేసుకొని ఆయనను ఇలా వేడుకుంటారు : ‘‘నీవు గనక మాకు ఆపద నుండి విముక్తి కలిగిస్తే మేము కృతజ్ఞతలు తెలుపుకునే దాసులమవుతాము.’’ కాని ఆయన వారిని రక్షించిన తరువాత వారే సత్యానికి విముఖులై భూతలంపై తిరుగుబాటు చేస్తారు. ప్రజలారా! మీరు చేసే తిరుగుబాటు మీకే హాని కలిగిస్తుంది. ఇహలోక జీవిత సుఖాలు కొన్ని రోజుల సుఖాలు మాత్రమే. (వాటిని అనుభవించండి). తరువాత మా వైపునకే మీరు మరలి రావలసి ఉన్నది. అప్పుడు మేము మీకు తెలుపుతాము, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో. ప్రాపంచిక జీవితాన్ని (దాని నిషాలోపడి మీరు మా సూచనల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు) ఇలా పోల్చవచ్చు - మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా మనుషులూ పశువులూ అందరూ తినే భూఉత్పత్తులు బాగా దట్టంగా తయారయ్యాయి. ఆపై భూమి మంచి స్థితిలో ఉన్నప్పుడు పొలాలు బాగా పండి శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజమానులు, ‘‘ఇక మేము వాటివల్ల లాభం పొందగలము’’ అని అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా రాత్రి వేళనో పగటిపూటనో మా ఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఏమీ లేనట్లు దానిని సర్వనాశనం చేశాము. ఇలా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము. ఆలోచించే వారి కొరకూ అర్థం చేసుకునే వారికొరకు. (మీరు అశాశ్వతమైన జీవితం యొక్క మోసానికి గురి అవుతున్నారు). అల్లాహ్ మిమ్మల్ని దారుస్సలామ్వైపునకు ఆహ్వానిస్తున్నాడు. (మార్గదర్శకత్వం ఆయన చేతుల్లో ఉంది) ఆయన తాను కోరుకున్న వారికి సరిjైున మార్గం చూపుతాడు. మంచి పనులు చేసినవారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను నల్లదనం గానీ, అవమానంగానీ కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడనే శాశ్వతంగా ఉంటారు. చెడులు సంపాదించుకున్నవారు తమ చెడులాంటి ప్రతిఫలాన్నే పొందుతారు  అవమానం వారిని కప్పివేస్తుంది  అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవడూ ఉండడు. వారి ముఖాలను చీకటి కప్పివేస్తుంది, రాత్రి యొక్క నల్లని తెరలు వారిపై పడి ఉన్నట్లు. వారు నరకానికి అర్హులు. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. మేము వారందరినీ ఒకేసారి (మా న్యాయస్థానంలో) సమావేశపరిచే రోజున షిర్కు చేసిన వారితో ఇలా అంటాము : ‘‘ఆగండి మీరూ, మాకు మీరు భాగస్వాములుగా కల్పించినవారూ!’’ తరువాత మేము వారి మధ్య ఉన్నటువంటి అపరిచయపు తెరను తొలగిస్తాము. వారు కల్పించిన భాగస్వాములు ఇలా అంటారు : ‘‘మీరు మమ్మల్ని ఆరాధించలేదు. మీకూ మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. (ఒకవేళ మీరు మమ్మల్ని ఆరాధించి ఉండినా) మీరు చేసిన ఆరాధనను గురించి మాకు ఏమాత్రమూ తెలియదు.’’ అప్పుడు ప్రతి మనిషీ తాను చేసిన దానిని రుచి చూస్తాడు. అందరూ తమ నిజమైన ప్రభువు వైపునకు మరలింపబడతారు. వారు కల్పించిన అబద్ధాలన్నీ మటుమాయమైపోతాయి.

10. యూనుస్31 - 33 వారిని అడుగు : ఆకాశం నుండీ భూమి నుండీ మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినేశక్తీ చూసే శక్తీ ఎవడి అధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దానినుండి ప్రాణమున్నదానినీ ప్రాణమున్న దానినుండి ప్రాణము లేని దానినీ వెలికితీసేవాడు ఎవడు? విశ్వవ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు? వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు. ఇలా అను : ‘‘అలాంటప్పుడు మీరు (సత్యానికి వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి? అల్లాహ్ యే మీ నిజమైన ప్రభువు. కనుక సత్యాన్ని తృణీకరిస్తే మార్గభ్రష్టత్వం తప్ప ఇక మిగిలేదేమిటి? అసలు మీరు ఎటు మరలింపబడుతున్నారు? (ప్రవక్తా చూడు) విధంగా అవిధేయతకు పాల్పడేవారి విషయంలో వారు విశ్వసించరు అని నీ ప్రభువు అన్నమాట ఇలా రూఢ అయింది.

10. యూనుస్34 వారిని అడుగు : మీరు దేవునికి భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో సృష్టిని ప్రారంభించేవాడూ, దానిని తిరిగి సృష్టించేవాడూ ఎవడైనా ఉన్నాడా? అని. ఇలా అను : సృష్టిని ప్రారంభించేవాడూ, దానిని తిరిగి సృష్టించేవాడూ కేవలం అల్లాహ్ మాత్రమే. అయినా, మీరు ఎలా త్రోవ తప్పించబడు తున్నారు?

10. యూనుస్35 వారిని ఇలా అడుగు : మీరు అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో సత్యం వైపునకు మార్గం చూపేవాడు కూడా ఎవడైనా ఉన్నాడా? ఇలా అను : కేవలం అల్లాహ్ యే సత్యం వైపునకు మార్గం చూపుతాడు. అలాంటప్పుడు మీరే చెప్పండి, సత్యం వైపునకు మార్గం చూపేవాడా విధేయతకు ఎక్కువ అర్హుడు? లేక తనకు ఎవడైనా మార్గం చూపితే తప్ప స్వయంగా మార్గాన్ని పొందలేనివాడా? అసలు మీకేమయింది, ఇటువంటి తలకిందులు నిర్ణయాలు చేస్తున్నారు?

10. యూనుస్36 వాస్తవం ఏమిటంటే వారిలో చాలామంది కేవలం ఊహ, అనుమానాల వెనుక నడుస్తూ పోతున్నారు. నిజానికి సత్యం అవసరాన్ని అనుమానం ఎంతమాత్రం తీర్చలేదు. వారు చేస్తూ ఉన్నదానినంతా అల్లాహ్ బాగా ఎరుగును.

10. యూనుస్37 అల్లాహ్ పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువుకాదు ఖురాను. ఇది పూర్వం వచ్చిన దానికి ధ్రువీకరణ, ‘‘అల్కితాబ్’’కు వివరణ. ఇది విశ్వపాలకుని తరఫునుండి వచ్చిందనే విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు.

10. యూనుస్38 - 41 ప్రవక్తయే దీనిని స్వయంగా రచించాడని ప్రజలు అంటున్నారా ఏమిటి? ఇలా అను : ‘‘మీరు గనక మీ ఆరోపణలో సత్యవంతులే అయితే ఇటువంటి సూరా ఒకదానిని రచించి తీసుకురండి. ఒక్క అల్లాహ్ ను వదలి ఎవరెవరిని పిలువగలరో సహాయం కొరకు పిలవండి.’’ అసలు విషయం ఏమిటంటే వారి జ్ఞానపరిధికి విషయం రాలేదు కాబట్టి ఇంకా దాని పర్యవసానం వారి ముందుకు రాలేదు. కాబట్టి దానిని వారు (ఆధారం లేకుండా ఇట్టే) తిరస్కరించారు. ఇలాగే వారి పూర్వీకులు కూడా తిరస్కరించారు. చూడు, తరువాత దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో? వారిలో కొందరు విశ్వసిస్తారు, కొందరు విశ్వసించరు. నీ ప్రభువు కల్లోలకారులను బాగా ఎరుగును. వారు గనక నిన్ను తిరస్కరిస్తే వారితో ఇలా అను: ‘‘నా పనులు నావే, మీ పనులు మీవే. నేను చేసే పని బాధ్యత మీపై లేదు. మీరు చేసే పని బాధ్యత నాపై లేదు.’’

10. యూనుస్42 - 46 వారిలో చాలా మంది నీ మాటలను వింటారు. కాని నీవు చెవిటి వారికి వినిపించగలవా, వారు ఏమీ అర్థం చేసుకోకపోయినప్పటికీ? వారిలో చాలామంది నిన్ను చూస్తారు. కాని నీవు గుడ్డివారికి మార్గం చూపగలవా వారికి ఏమీ కనిపించనప్పటికీ? యథార్థమేమిటంటే అల్లాహ్ ప్రజలకు అన్యాయం చెయ్యడు. ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. ( రోజు వారు ఇహలోక జీవితంలో మునిగి ఉన్నారు) అల్లాహ్ వారిని సమావేశపరిచే రోజున (ఇహలోక జీవితం వారికి ఎలా అనిపిస్తుం దంటే) వారు కేవలం ఒక గడియకాలం వరకు ఒకరినొకరు గుర్తు పట్టటానికి మాత్రమే ఆగారా అన్నట్లు. అల్లాహ్తో సమావేశాన్ని తిరస్కరించినవారు వాస్తవానికి తీవ్రమైన నష్టానికి గురిఅయ్యారు అనీ, వారు సన్మార్గంపై ఎంతమాత్రం లేరు అనీ. (అప్పుడు నిర్ధారణ అవుతుంది) దుష్ఫలితాలను గురించి మేము వారిని భయపెడుతున్నామో వాటిలో ఒకటో అరో మేము నీవు బ్రతికి ఉండగానే చూపినా, లేదా దానికి ముందే మేము నిన్ను లేపుకున్నా, ఎలా అయినా సరే వారు రావలసింది మా వైపునకే కదా. వారు చేస్తున్న దానికల్లా అల్లాహ్ యే సాక్షి.

10. యూనుస్47 ప్రతి సంఘానికి ఒక ప్రవక్త ఉంటాడు. కనుక ఒక సంఘం వద్దకు దాని ప్రవక్త వచ్చినప్పుడు సంఘం విషయంలో పూర్తి న్యాయంతో కూడుకున్న తీర్పు చెయ్యబడుతుంది. దానికి రవ్వంత అన్యాయం కూడా జరగదు.

10. యూనుస్48 - 52 వారు ఇలా అడుగుతారు : ‘‘నీ బెదరింపే నిజమైతే అది ఎప్పుడు నెరవేరుతుంది?’’ ఇలా అను : ‘‘నా అధీనంలో స్వయంగా నా లాభనష్టాలు సైతమూ లేవు. అంతా అల్లాహ్ సంకల్పం మీద ఆధారపడి ఉంది. ప్రతి సంఘానికి గడువుకాలం ఒకటి ఉంది. గడువు పూర్తి అయినప్పుడు ఒక్క గడియకాలం కూడా ముందూ వెనుకా కావటం జరగదు. వారితో ఇలా అను : ‘‘ఎప్పుడైనా మీరు విషయం గురించి ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ శిక్ష హఠాత్తుగా రాత్రిగాని పగలుగాని వస్తే (అప్పుడు మీరేమి చెయ్యగలరు?)’’ అసలు అది ఎలాంటి విషయమని, దాని కొరకు నేరస్తులు తొందరపెడుతున్నారు, అది మీపై వచ్చిపడినప్పుడే మీరు దానిని నమ్ముతారా? - ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నారా? వాస్తవానికి స్వయంగా మీరే అది తొందరగా రావాలని కోరుతూ ఉండేవారు. తరువాత దుష్టులతో ఇలా అనడం జరుగుతుంది : ‘‘ఇక శాశ్వతంగా ఉండే శిక్షను రుచి చూడండి! మీరు సంపాదించిన దానికి అనుగుణమైన ప్రతిఫలం తప్ప మరొక ప్రతిఫలం మీకు ఎలా ఇవ్వబడుతుంది?’’

10. యూనుస్53 - 56 ఇంకా ఇలా అడుగుతారు: ‘‘నిజంగా మీరు చెప్పేది సత్యమేనా?’’ ఇలా అను : ‘‘నా ప్రభువు సాక్షిగా అది పూర్తిగా సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు.’’ దుర్మార్గం చేసిన ప్రతి మనిషి వద్ద ఒకవేళ భూమిపై ఉన్న మొత్తం ధనం ఉంటే బాధనుండి రక్షింపబడేందుకు అతడు దానినంతా కూడా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు. వారు బాధను చూసినప్పుడు లోలోన పశ్చాత్తాపపడతారు  అయినా వారిమధ్య పూర్తి న్యాయంతో తీర్పు చెయ్యబడుతుంది. వారికి విధమైన అన్యాయం జరుగదు. వినండి! ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తం అల్లాహ్దే. తెలుసుకోండి! అల్లాహ్ వాగ్దానం నిజమైనది కాని చాలామందికి తెలియదు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మరణాన్ని కలుగజేస్తాడు. ఆయన వైపునకే మీరంతా మరలిపోవాలి.

10. యూనుస్57 - 60 మానవులారా! మీవద్దకు మీ ప్రభువు తరఫునుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత. దానిని స్వీకరించేవారికి అది మార్గదర్శకత్వం, కారుణ్యం. ప్రవక్తా ఇలా అను : ‘‘అల్లాహ్ తన అనుగ్రహం వల్ల తన కారుణ్యం వల్ల దానిని పంపాడు. దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నింటికంటే అది ఉత్తమమైనది.’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘మీరెప్పుడైనా విషయం గురించి కూడా ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన (రిజ్ఖ్‌) ఆహార పదార్థాలలో కొన్నింటిని స్వయంగా మీరే నిషిద్ధం చేసుకున్నారు. మరికొన్నింటిని ధర్మసమ్మతం చేసుకున్నారు?’’ వారిని ఇలా అడుగు :  ‘‘అల్లాహ్ మీకు దానికి అనుమతి ఇచ్చాడా? లేక అబద్ధాన్ని మీరు అల్లాహ్ కు ఆపాదిస్తున్నారా? అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదించేవారు ప్రళయం నాడు ఆయన తమతో ఎలా వ్యవహరిస్తాడని అనుకుంటున్నారు? అల్లాహ్ మానవులను దయాదృష్టితో చూస్తాడు. కాని చాలామంది మానవులు కృతజ్ఞతలు చూపరు.

10. యూనుస్61 - 65 ప్రవక్తా! నీవు స్థితిలో ఉన్నా, ఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా! మీరు ఏది చేసినా, అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్ని చూస్తూనే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే, అది చిన్నదిగానీ పెద్దదిగానీ దాని అణువు కూడా నీ ప్రభువు దృష్టికి గోప్యంగా లేదు. ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండానూ లేదు. విను, అల్లాహ్ కు స్నేహితులైనవారికీ ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించినవారికీ  విధమైన భయం కానీ, విషాదం కానీ కలిగే అవకాశం లేదు. ఇహపరజీవితాలు రెండిరటిలో కూడా వారికి శుభవార్తలే శుభవార్తలు. అల్లాహ్ మాటలు మారవు. ఇదే ఘన విజయం. ప్రవక్తా! నిన్ను గురించి వారు కల్పించే మాటల వల్ల నీవు శోకానికి గురి కాకూడదు. గౌరవం అంతా అల్లాహ్ అధీనంలోనే ఉంది. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ తెలిసినవాడూను.

10. యూనుస్66 - 67 తెలుసుకో! ఆకాశాలలో ఉండేవారైనా, భూమిలో ఉండేవారైనా సర్వులూ అల్లాహ్ పాలితులే. అల్లాహ్ ను కాదని (తాము కల్పించిన) కొందరు భాగస్వాములను వేడుకుంటున్న వారు కేవలం భ్రమనూ, అనుమానాన్నీ అనుసరిస్తున్నారు. కేవలం ఊహాగానాలు చేస్తున్నారు. మీరు ప్రశాంతిని పొందేటందుకు మీకొరకు రాత్రిని సృష్టించినవాడూ, పగలును కాంతిమంతం చేసినవాడూ అల్లాహ్ యే. (చెవియొగ్గి ప్రవక్త సందేశాన్ని) వినేవారికి ఇందులో సూచనలు ఉన్నాయి.

10. యూనుస్68 - 70 అల్లాహ్ ఎవరినో కొడుకుగా చేసుకున్నాడు అని ప్రజలు అన్నారు. సుబ్హానల్లాహ్! (అల్లాహ్ అత్యంత పవిత్రుడు) ఆయన అక్కరా లేనివాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయన ఆస్తియే. మాటకు అసలు మీవద్ద ఉన్న నిదర్శనమేమిటి? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా? ప్రవక్తా! ఇలా ప్రకటించు: అల్లాహ్ కు అబద్ధాలను అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు. కొన్ని రోజుల ఇహలోక జీవితంలో సుఖాలను అనుభవించవచ్చుకానీ తరువాత మా వైపునకే వారు మరలి రావాలి. అప్పుడు మేము వారి అవిశ్వాసానికి ప్రతిఫలంగా వారికి కఠిన బాధను రుచి చూపిస్తాము.

10. యూనుస్71 - 73 వారికి నూప్ గాధను వినిపించు. అతను తన జాతి వారితో ఇలా అన్నప్పటి గాధను : ‘‘నా జాతి సోదరులారా! నేను మీ మధ్య ఉండటం, అల్లాహ్ ఆయతులను మాటిమాటికి వినిపించి మిమ్మల్ని ఏమరుపాటునుండి మేల్కొలపటం మీకు సహింపశక్యం కాకపోతే సరే, నేను మాత్రం అల్లాహ్నే నమ్ముకున్నాను. మీరు నిలబెట్టిన భాగస్వాములను తోడుగా తీసుకొని మీరు ఒక ఏకగ్రీవ నిర్ణయానికి రండి. మీ దృష్టిలో ఉన్న పథకం గురించి సావధానంగా ఆలోచించి అర్థం చేసుకోండి, దానికి సంబంధించిన కోణమూ మీ దృష్టికి గోప్యంగా ఉండకుండా ఉండేందుకు. తరువాత దానిని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి. నాకు ఏమాత్రం వ్యవధి నివ్వకండి. మీరు నా హితోపదేశానికి వైముఖ్యం వ్యక్తం చేసి (నాకేమి నష్టం కలిగించారు) నేను మీ నుండి ప్రతిఫలాన్నీ కోరి ఉండలేదే! నాకు ప్రతిఫలాన్నివ్వటం అనేది అల్లాహ్ బాధ్యత. (ఎవరు విశ్వసించినా, విశ్వసించకపోయినా) స్వయంగా నేను మాత్రం ముస్లిము అయివుండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడిరది.’’ - వారు అతనిని తిరస్కరించారు. దానికి ఫలితంగా మేము అతనినీ, అతనితో పాటు ఓడలో ఉన్నవారినీ కాపాడాము. వారినే భూమిపై వారసులుగా చేశాము. మా ఆయతులను తిరస్కరించిన వారందరినీ ముంచివేశాము. కనుక, హెచ్చరిక చెయ్యబడినా (విశ్వసించని) వారి ముగింపు ఎలా జరిగిందో చూడు!

10. యూనుస్74 నూప్ తరువాత మేము అనేకమంది ప్రవక్తలను వారి వారి జాతుల వైపునకు పంపాము. వారు వారివద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని వారు మొదట తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించలేదు. విధంగా మేము హద్దులను అతిక్రమించే వారి హృదయాలపై ముద్రవేస్తాము.

10. యూనుస్75 - 82 వారి తరువాత మేము మూసానూ, హారూనునూ మా సూచనలతో ఫిరౌను వద్దకూ అతని సర్దారుల వద్దకూ పంపాము. కాని వారు తమ పెద్దరికపు అహంభావానికి గురి అయ్యారు. వారు అపరాధులైన ప్రజలు. కనుక మా వద్దనుండి వారి ముందుకు సత్యం వచ్చినప్పుడు వారు : ‘‘ఇది స్పష్టమైన మంత్రజాలమే’’ అని అన్నారు. మూసా ఇలా అన్నాడు : ‘‘సత్యం మీ ముందుకు వచ్చినప్పుడు ఇలా అంటారా? ఇది ఇంద్రజాలమా? వాస్తవానికి ఇంద్రజాలికులు సాఫల్యం పొందలేరు.’’ సమాధానంగా వారు ఇలా అన్నారు: ‘‘మా పూర్వీకులు నడచిన మార్గం నుండి మమ్మల్ని మళ్లించటానికా నీవు వచ్చినది!  మీ ఇద్దరి పెద్దరికాన్ని భువిలో స్థాపించటానికా నీవు వచ్చినది? నీ మాటను మేము విశ్వసించము.’’ ఫిరౌను (తన మనుషులతో) ‘‘ఆరితేరిన ప్రతి మాంత్రికుణ్ణీ నా ముందు హాజరు పరచండి’’-అని అన్నాడు. మాంత్రికులు వచ్చినప్పుడు మూసా వారితో ‘‘మీరు విసరదలచుకున్న దాన్ని విసరండి’’ అని అన్నాడు. వారు తమ మంత్రసాధనాలను విసరగానే, మూసా ఇలా అన్నాడు : ‘‘మీరు విసరినది మంత్రజాలం. అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. దుర్మార్గుల పనిని అల్లాహ్ చక్కబడనివ్వడు. అల్లాహ్ తన ఆజ్ఞల ద్వారా సత్యాన్ని సత్యంగా చేసి చూపుతాడు, అది దోషులకు ఎంత సహించరానిదైనా సరే.’’

10. యూనుస్83 (చూడండి) మూసాను అతని జాతిలోని కొందరు యువకులు తప్ప మరెవ్వరూ విశ్వసించలేదు. ఎందు కంటే వారు ఫిరౌనుకు భయపడ్డారు. స్వయంగా తమ జాతిలో పెద్దలుగా ఉన్నవారికి భయపడ్డారు. ( పెద్దలు) ఫిరౌను తమను యాతనకు గురిచేస్తాడని భయపడ్డారు. యథార్థం ఏమిటంటే ఫిరౌను భూమిపై ప్రాబల్యం కలిగి ఉండేవాడు. అతడు హద్దునూ లెక్కచెయ్యనివారి కోవకు చెందినవాడు.

10. యూనుస్84 - 86 మూసా తన జాతివారితో ఇలా అన్నాడు: ‘‘ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ పై విశ్వాసం ఉంటే, ఆయనను నమ్మండి, మీరు గనక ముస్లిములే అయితే.’’ వారు ఇలా జవాబు పలికారు : ‘‘మేము అల్లాహ్నే నమ్ముకున్నాము. మా ప్రభూ! మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చెయ్యకు. నీ కారుణ్యం ద్వారా మాకు అవిశ్వాసుల నుండి విముక్తి కలుగజెయ్యి.’’

10. యూనుస్87 మేము మూసాకూ, అతని సోదరునికీ ఇలా సూచించావ : ‘‘ఈజిప్టులో మీ జాతి వారి కొరకు కొన్ని గృహాలను సమకూర్చండి. గృహాలను ఖిబ్లాగా నిర్ణయించుకొనండి. నమాజును స్థాపించండి. విశ్వాసులకు శుభవార్తను అందజేయండి.’’

10. యూనుస్88 - 89 మూసా ఇలా ప్రార్థించాడు : ‘‘మా ప్రభూ! నీవు ఫిరౌనుకూ అతని సర్దారులకూ ఇహలోక జీవితంలో వైభవమును సంపదను ప్రసాదించావు. ప్రభూ!  వారు  ప్రజలను నీ మార్గం నుంచి తప్పించటానికా ఇవి? ప్రభూ! వారి సంపదను ధ్వంసం చెయ్యి. వ్యధాభరితమైన శిక్షను చూసేవరకూ వారు విశ్వసించకుండా వారి హృదయాలకు ముద్రవెయ్యి.’’ సమాధానంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ‘‘మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడిరది. ధృఢచిత్తులై ఉండండి. జ్ఞానహీనుల మార్గాన్ని ఎంతమాత్రం అనుసరించకండి.’’

10. యూనుస్90 - 92 మేము ఇస్రాయీలు సంతతిని సముద్రం దాటించాము. తరువాత ఫిరౌనూ, అతని సైన్యాలూ హింసించే ఉద్దేశ్యంతో అణచివేసే ఉద్దేశ్యంతో వారిని వెంబడిరచారు. చివరకు ఫిరౌను మునిగిపోతు న్నప్పుడు ఇలా అరవసాగాడు : ‘‘ఇస్రాయీలు సంతతివారు విశ్వసించిన దేవుడే నిజమైన దేవుడు అనీ, ఆయన తప్ప మరొక దేవుడు ఎవడూ లేడు అనీ నేనూ విశ్వసించాను. నేను కూడా విధేయతతో శిరస్సు వంచేవారిలోని వాడనే.’’ ఇలా (జవాబు ఇవ్వబడిరది) : ‘‘ఇప్పుడు విశ్వసిస్తున్నావా! వాస్తవానికి ఇంతవరకు నీవు అవిధేయత చూపుతూ ఉండేవాడివి. ఇంకా కల్లోలాన్ని రేకెత్తించేవారిలో కూడా ఉన్నావు. ఇప్పుడు మేము కేవలం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము, నీవు వచ్చే తరాల వారికి గుణపాఠం గుర్తుగా ఉండేటందుకు. కాని చాలామంది మానవులు మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు.’’

10. యూనుస్93 మేము ఇస్రాయీలు సంతతివారికి చాలా చక్కని నివాస స్థలాన్ని ఇచ్చాము. ఎంతో శ్రేష్ఠమైన జీవిత వనరులను వారికి ప్రసాదించాము. తరువాత వారి మధ్య విభేదాలు పొడసూపలేదు. కాని జ్ఞానం వారివద్దకు వచ్చేసినప్పుడు మాత్రమే (అవి పొడసూపాయి). నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయం నాడు వారు భిన్నాభిప్రాయములు కలిగివున్న విషయాన్ని గురించి వారిమధ్య తీర్పు చెబుతాడు.

10. యూనుస్94 - 95 ఇప్పుడు ఒకవేళ నీకు, మేము నీపై అవతరింపజేసిన హితబోధను గురించి ఏమాత్రం సందేహం ఉన్నా, నీకు పూర్వం నుండీ గ్రంథాలను చదువుతూ ఉన్న ప్రజలను అడుగు. యథార్థంగా నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు వచ్చినటువంటిది సత్యమే. కనుక నీవు సందేహించే వారిలోని వాడవు కావద్దు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించినవారిలో చేరిపోకు. అలా చేస్తే నీవు నష్టపడే వారిలో చేరిపోతావు.

10. యూనుస్96 - 98 యథార్థం ఏమిటంటే, ఎవరి విషయంలో నీ ప్రభువు వాక్కు నిజమని నిరూపించబడిరదో, వారి ముందుకు నిదర్శనం వచ్చినా వారు ఎన్నటికీ విశ్వసించరు, బాధాకరమైన శిక్ష వారి ముందుకు వస్తూ కనబడితే తప్ప. తరువాత ఒక నగరం శిక్షను చూసి విశ్వసించం అనే విషయమూ, ఇంకా దాని విశ్వాసం దానికి లాభదాయకం కావడం అనే ఉదాహరణా, ఎక్కడైనా ఉందా ఒక్క యూనుస్జాతి తప్ప? (అలాంటి ఉదాహరణ లేదు) జాతి విశ్వసించగానే, మేము దానిపైనుండి ఇహలోక జీవితంలో అవమానకరమైన శిక్షను తొలగించాము. దానికి కొంత కాలం వరకు జీవితాన్ని అనుభవించే అవకాశం కలుగజేశాము.

10. యూనుస్99 - 100 నీ ప్రభువు అభీష్టం గనక ఇదే అయితే (అంటే భూమిపై ఉండేవారంతా విశ్వాసులూ, విధేయులూ అవ్వాలి అనేది) సమస్త భూవాసులూ విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు నీవు ప్రజలను విశ్వాసులుగా మారండి అని బలవంతం చేస్తావా? ప్రాణి అయినాసరే అల్లాహ్ అనుమతి లేకుండా విశ్వసించదు. అల్లాహ్ విధానం ఏమిటంటే, బుద్ధీజ్ఞానాలతో వ్యవహరించని వారిపై ఆయన మాలిన్యాన్ని పడవేస్తాడు.

10. యూనుస్101 - 103 వారితో ఇలా అను:  ‘‘భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్నటువంటి దానిని కళ్ళు తెరచి చూడండి.’’ అసలు విశ్వసించటానికే ఇష్టపడని వారికి సూచనలుగానీ, హెచ్చరికలుగానీ ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు వారు ఇంకా దేనికోసం నిరీక్షిస్తున్నారు, వారికి పూర్వం గతించిన ప్రజలు చూచినటువంటి చెడు దినాలనే చూడటం కోసం తప్ప? వారితో ఇలా అను : ‘‘మంచిది, నిరీక్షించండి. నేను కూడా మీతోపాటు నిరీక్షిస్తాను.’’ తరువాత (అటువంటి సమయం వచ్చినప్పుడు) మేము మా ప్రవక్తలనూ, విశ్వాసులనూ కాపాడుతూ ఉంటాము. మా విధానం ఇదే. విశ్వాసులను రక్షించటం మా విధి.

10. యూనుస్104 - 107 ప్రవక్తా ఇలా అను: ‘‘మానవులారా! మీరు గనక ఇంకా నా ధర్మం గురించి ఏదైనా సంశయం కలిగివుంటే, వినండి, మీరు అల్లాహ్ ను కాదని ఆరాధించే వారిని నేను ఆరాధించను. దేవుని అధీనంలో మీ మరణం ఉన్నదో దేవుడినే నేను ఆరాధిస్తాను. నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని నాకు ఆదేశం ఇవ్వబడిరది. నాతో ఇలా అనబడినది: ఏకాగ్రతతో చిత్తశుద్ధితో నిన్ను నీవు పూర్తిగా ధర్మానికి సమర్పించుకో. ముష్రిక్కులలో ఎంతమాత్రమూ కలిసిపోకు. అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగాని లాభాన్నిగాని కలిగించలేని శక్తినీ వేడుకోకు. ఒకవేళ అలాచేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.’’

10. యూనుస్108 - 109 ముహమ్మద్‌! ఇలా చెప్పు : ‘‘మానవులారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి సత్యం వచ్చేసింది. ఇప్పుడు ఎవడైనా రుజుమార్గాన్ని అవలంబిస్తే అతడి రుజుమార్గ అనుసరణం అతనికే లాభదాయకం. ఎవడైనా మార్గం తప్పితే అతడి మార్గం తప్పటం అతనికే వినాశకరం. నేను మీకు కావలివాణ్ణి మాత్రం కాను.’’  ప్రవక్తా! నీవు నా వద్దకు వహీ ద్వారా పంపబడుతూవున్న హితబోధను అనుసరిస్తూ ఉండు. అల్లాహ్ తీర్పు చేసేవరకు ఓర్పు వహించు. ఆయన మాత్రమే ఉత్తమంగా తీర్పు చేసేవాడు.



No comments:

Post a Comment