104 సూరహ్ అల్ హుమజహ్

 

104 అల్ హుమజహ్

ఆయతులు : 9                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 9 ప్రజలను దెప్పి పొడవటంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచటంలో ఆసక్తి కనబరచేవాడూ, ధనాన్ని కూడబెట్టిన దానిని మాటిమాటికి లెక్కబెట్టి ఉంచేవాడూ అయిన ప్రతి వ్యక్తీ సర్వనాశన మవుతాడు. అతడు తన ధనం తన వద్ద కలకాలం ఉంటుందని అనుకుంటున్నాడు. అలా ఎన్నటికీ జరగదు. అతడు నుజ్జు నుజ్జు చేసే స్థలంలో విసరివేయబడతాడు. అలా నుజ్జు నుజ్జుగా చేసే స్థలం ఏమిటో నీకు తెలుసా? అది తీవ్రంగా ప్రజ్వరిల్లజేయబడిన దైవాగ్ని. అది గుండెల దాక చొచ్చుకు పోతుంది. అందులో వారు పడిన తరువాత అది మూసివేయబడుతుంది. విధంగా వారు పొడుగాటి అగ్ని కీలల మధ్య (చిక్కుకుని ఉంటారు).

No comments:

Post a Comment