71. నూహ్
ఆయతులు
: 28 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 మేము ప్రవక్త నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము, అతని జాతి ప్రజలపైకి బాధాకరమైన శిక్ష రాకమునుపే వారిని హెచ్చరించమని (ఉపదేశిస్తూ).
2 - 4 అతను ఇలా అన్నాడు, ‘‘నా జాతి ప్రజలారా! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించటానికి వచ్చిన (సందేశహరుణ్ణి) వాణ్ణి. కనుక (మిమ్మల్ని హెచ్చ రిస్తున్నాను) అల్లాహ్ దాస్యం చెయ్యండి, ఆయనకు భయపడండి. నాకు విధేయత చూపండి, అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని ఒక నిర్ణీత కాలం వరకు బ్రతుకనిస్తాడు. వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు, దానిని తప్పించటం సాధ్యం కాదు. అయ్యో! ఈ విషయం మీకు తెలిస్తే ఎంత బాగుండును.’’
5 - 20 అతను ఇలా విన్నవించుకున్నాడు, ‘‘ప్రభూ! నేను నా జాతి ప్రజలను రేయింబవళ్లూ పిలిచాను. కాని నా పిలుపు వారి పరుగునే పెంచింది. నేను వారిని నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు చెవులలో వ్రేళ్లు దూర్చు కునేవారు, తమ వస్త్రాలతో ముఖాలను కప్పుకునేవారు
మొండి వైఖరి అవలం బించారు
మరియు అహంభావం ప్రదర్శించారు. అయినా నేను వారిని ఎలుగెత్తి పిలిచి సందేశం అందజేశాను. ఇంకా నేను బహిరంగంగా కూడ వారిలో ప్రచారం చేశాను, రహస్యంగా కూడా వారికి నచ్చజెప్పాను. నేను ఇలా అన్నాను, మీరు మీ ప్రభువును, క్షమించమని వేడుకోండి, నిస్సందేహంగా ఆయన గొప్ప క్షమావంతుడు.
ఆయన మీపై ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపిస్తాడు, మీకు సిరిసంపదలనూ, సంతానాన్నీ ప్రసాదిస్తాడు, మీ కొరకు తోటలను సృష్టిస్తాడు మరియు మీ కొరకు కాలువలను ప్రవహింప జేస్తాడు. మీకేమయింది, అల్లాహ్కై
మీరు ఎలాంటి గౌరవాన్నీ ఎందుకు ఆశించరు? వాస్తవానికి ఆయన మిమ్మల్ని విభిన్న రీతులలో సృజించాడు. అల్లాహ్ ఏవిధంగా ఏడు ఆకాశాలను ఒక దానిపై నొకటి సృష్టించాడో, వాటిలో చంద్రుణ్ణి కాంతిగానూ, సూర్యుణ్ణి దీపంగానూ చేశాడో, మీరు చూడటం లేదా? అల్లాహ్ మిమ్మల్ని భూమినుండి చిత్రవిచిత్రంగా మొలిపిం చాడు, తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు, మళ్లీ దానినుండే యెకాయెకీ మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు. అల్లాహ్ మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు
మీరు దానిపై ఉన్న విశాలమైన మార్గాలలో నడవటానికి వీలు కల్పించాడు.
21 - 24 ప్రవక్త నూహ్ ఇలా అన్నాడు, ‘‘ప్రభూ! వారు నా మాటను కొట్టి పారేశారు, సంపదనూ, సంతానాన్నీ పొంది మరింత నష్టానికే గురి అయిన వారిని (సంపన్నులను) అనుసరించారు. వారు పెద్ద పెద్ద కుట్రలను పన్నారు. వారు, ‘‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎంతమాత్రం విడిచిపెట్టకండి. వద్దా, సువాలను విడిచిపెట్టకండి. యగూస్ను, యఊఖ్ను, నసర్ను కూడ విడనాడ కండి’’ అని అన్నారు. వీరు చాలామందిని మార్గచ్చ్యుతులుగా చేశారు. నీవు కూడ ఈ దుర్మార్గులకు మార్గచ్చ్యుతిలో తప్ప మరెందులోనూ వృద్ధిని ఈయకు.
25 - 28 వారు తమ పాపాల మూలంగానే ముంచబడ్డారు, నరకాగ్నిలోకి తోసివేయబడ్డారు. ఆ
తరువాత వారు అల్లాహ్ నుండి తమను రక్షించే సహాయకుడెవణ్ణీ పొందలేకపోయారు. ప్రవక్త నూహ్ ఇలా అన్నాడు, ‘‘ప్రభూ! భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకు. ఒకవేళ నీవు వారిని వదలిపెడితే, వారు నీ దాసులను అపమార్గం పట్టిస్తారు. వారి సంతతిలో ఎవడు పుట్టినా పరమ పాపిగా, కరుడుగట్టిన అవిశ్వాసిగా మాత్రమే రూపొందు తాడు. ప్రభూ! నన్నూ నా తల్లిదండ్రులనూ, విశ్వాసిగా నా ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తినీ, విశ్వాసులైన పురుషులూ, స్త్రీలూ అందర్నీ క్షమించు. దుర్మార్గులకు వినాశాన్ని తప్ప మరి దేనినీ అధికం చెయ్యకు.’’
No comments:
Post a Comment