3 సూరహ్ ఆలి ఇమ్రాన్‌

 

3. ఆలి ఇమ్రాన్

ఆయతులు : 200        అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

3. ఆలి ఇమ్రాన్1 - 2 అలిఫ్లామ్మీమ్‌. అల్లాహ్ - సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు.

3. ఆలి ఇమ్రాన్3 - 4 ప్రవక్తా! ఆయన గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మునుపు అవతరించిన గ్రంథాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గం చూపటానికి తౌరాతు, ఇన్జీలు గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంకా (సత్యాసత్యాలను వేరుచేసి చూపే) గీటురాయిని అవతరింపజేశాడు. ఇకనుండి అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠినశిక్ష పడటం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడూను.

3. ఆలి ఇమ్రాన్5 - 9 భూమ్యాకాశాలలోని వస్తువూ అల్లాహ్ కు గోప్యంగా లేదు. మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా! మహాశక్తిశాలీ, మహా వివేకీ అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్తా! నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు దేవుడే!  గ్రంథంలో రెండు రకాల ఆయతులు ఉన్నాయి. మొదటివి, ముహ్కమాత్‌ (స్పష్టమైనవి). అవి గ్రంథానికి పునాదుల వంటివి. రెండోవి, ముతషాబిహాత్‌ (అస్పష్టమైనవి). వక్ర మనస్కులు కలతలను రేపేందుకు ఎల్లప్పుడూ ముతషాబిహాత్వెంటపడి వాటికి అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. కాని వాటి అసలు అర్థాన్ని అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు. దీనికి భిన్నంగా, పరిపక్వ జ్ఞానం కలవారు ఇలా అంటారు: ‘‘వాటిని మేము విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే.’’ యథార్థం ఏమిటంటే, విషయాన్నుండైనా విజ్ఞతగలవారే గుణపాఠం నేర్చుకుంటారు. వారు అల్లాహ్ ను ఇలా ప్రార్థిస్తారు : ‘‘ప్రభూ! నీవు మాకు సరియైన మార్గాన్ని చూపావు. ఇక మా మనస్సులను వక్రమార్గం వైపునకు మళ్ళించకు. నీ కారుణ్య నిధినుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైనదాతవు నీవే. ప్రభూ! నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. రోజు రావటంలో ఏమాత్రం సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడవు కావు.’’

3. ఆలి ఇమ్రాన్10 - 13 అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి, వారి ఐశ్వర్యబలంకాని, సంతానబలంకాని అల్లాహ్ కు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనం అయి తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిరౌను అనుచరులు, అంతకు పూర్వపు అవిధేయుల ముగింపు వంటిది అవుతుంది - వారు అల్లాహ్ ఆయతులను అసత్యాలుగా తిరస్కరించారు. పర్యవసానంగా వారి పాపాలకుగాను అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే, నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ప్రవక్తా! నీ సందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించిన వారికి ఇలా చెప్పు : ‘‘అనతికాలంలోనే మీరు లోబరుచుకో బడతారు, నరకానికి తరుమబడతారు. నరకం చాలా చెడ్డ నివాసం.’’ (బద్ర్యుద్ధరంగంలో) మార్కొన్న రెండు వర్గాలలో మీకు గుణపాఠ సూచన ఉండినది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడింది. రెండోది అవిశ్వాసుల వర్గం. అవిశ్వాసులు విశ్వాసులకు రెట్టింపుగా ఉన్న విషయాన్ని చూసేవాళ్ళు స్వయంగా తమ కళ్ళతోనే చూశారు. కాని అల్లాహ్ తాను ఇష్టపడ్డ వారిని తన సహాయంతో బలపరుస్తాడు (అనే విషయాన్ని యుద్ధపరిణామం నిరూపించింది). కళ్ళున్న వారికి ఇందులో ఒక మహత్తరమైన బోధ ఇమిడి ఉంది.

3. ఆలి ఇమ్రాన్14 - 17 స్త్రీలూ, సంతానమూ, వెండి బంగారు రాసులూ, మేలుజాతి గుర్రాలూ, పశువులూ, సేద్యపు భూములూ వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షకంగా చెయ్యబడిరది. కాని ఇవన్నీ అనిత్యమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నదే. ఇలా చెప్పు : వాటికంటే ప్రశస్తమైనదేదో నేను మీకు తెలిపేదా? భయభక్తులు కలవారి కొరకు వారి ప్రభువు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి శాశ్వతమైన జీవితం లభిస్తుంది. పరిశుద్ధ చరిత్రలైన భార్యల సాంగత్యం లభిస్తుంది. అల్లాహ్ సమ్మతి లభిస్తుంది. అల్లాహ్ తన దాసుల నడవడికను శ్రద్ధతో గమనిస్తాడు. వారు అల్లాహ్ ను ఇలా వేడుకుంటారు : ‘‘ప్రభూ! మేము విశ్వసించాము. మా తప్పులను మన్నించు. మమ్మల్ని నరక జ్వాలల నుండి కాపాడు.’’ వారు సహనశీలురు, సత్యసంధులు, విధేయులు, దానపరులు, క్షమించు అని రాత్రి చివరి గడియలలో అల్లాహ్ ను వేడుకుంటారు.

3. ఆలి ఇమ్రాన్18 - 20 తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్యే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడ మహాశక్తిమంతుడూ, మహాజ్ఞానీ తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగానూ, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు. అల్లాహ్ దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లామ్మాత్రమే. గ్రంథం ఇవ్వబడిన వారు ధర్మాన్ని త్రోసిరాజని విభిన్న విధానాలను అవలంబించారు. వారి వైఖరికి కారణం, వారు జ్ఞానం వచ్చిన తరువాత కూడా ఒకరిపై ఒకరు అత్యాచారం చెయ్యటానికి సంకల్పించటమే. అల్లాహ్ ఆజ్ఞలను, ఆయన బోధలను శిరసావహించ టానికి తిరస్కరించేవారి లెక్కలను పరిష్కరించటం అల్లాహ్ కు ఎంతోసేపు పట్టదు. ప్రవక్తా! ఇక వీరు నీతో ఘర్షణకు తలపడితే, ఇలా చెప్పు : ‘‘నేనూ నా అనుచరులూ అల్లాహ్ కు సంపూర్ణంగా విధేయులమయ్యాము.’’ గ్రంథం కలవారినీ, గ్రంథం లేనివారినీ ఉభయులనూ ఇలా అడుగు : ‘‘మీరు కూడ ఆయనపట్ల విధేయతకూ, దాస్యానికీ అంగీకరించారా?’’ అలా చేస్తే వారు సరియైన మార్గాన్ని పొందినట్లే. కాని ఒకవేళ వారు దానికి విముఖులైతే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అంద జెయ్యటమే. తరువాత అల్లాహ్ తన దాసుల విషయాలను తానే స్వయంగా చూసుకుంటాడు.

3. ఆలి ఇమ్రాన్21 - 22 అల్లాహ్ ఆదేశాలనూ, బోధలనూ శిరసావహించటానికి తిరస్కరించేవారికీ, ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికీ, సత్యాన్నీ న్యాయాన్నీ శాసించటానికి ప్రజలలో నుండి లేచే వారి ప్రాణాల వెంట పడేవారికీ బాధాకరమైన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. వారి కర్మలు ఇహపరాలు రెండిరటిలోనూ వృధా అవుతాయి. వారికి సహాయపడే వాడెవడూ ఉండడు.

3. ఆలి ఇమ్రాన్  23 - 25 గ్రంథ జ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవగ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందులకుగాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు, వారిలోని ఒక వర్గంవారు జారుకుంటారు. తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు. వారి నడతకు కారణం, వారు, ‘‘మమ్మల్ని నరకాగ్ని అసలు ముట్టుకోదు.  ఒకవేళ మాకు నరకశిక్ష పడినా, అది కొన్ని రోజులు మాత్రమే’’ అని చెప్పుకోవటం. స్వయం కల్పితాలైన వారి నమ్మకాలే వారిని తమ ధర్మం విషయంలో అనేక అపోహలకు లోనుచేశాయి. దినమైతే రావటం తథ్యమో, దినాన మేము వారిని సమావేశపరచినప్పుడు వారి గతి ఏమవుతుందో? రోజున ప్రతి మనిషికీ తాను సంపాదించుకున్నదానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ అన్యాయం జరగదు.

3. ఆలి ఇమ్రాన్26 - 27 ఇలా అను : ‘‘ అల్లాహ్! విశ్వసామ్రాజ్యాధిపత్యానికి ప్రభూ! నీవు కోరినవారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారిని పరాభవంపాలు చేస్తావు. శుభాలు నీ అధీనంలో ఉన్నాయి. నిస్సందేహంగా నీకు అన్నింటిపైనా అధికారం ఉంది. నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపచేస్తావు. పగలును రాత్రిలోకి ప్రవేశింపచేస్తావు. ప్రాణంలేని దాని నుండి ప్రాణమున్న దానిని తీస్తావు. ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేనిదానిని తీస్తావు. నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు.’’

3. ఆలి ఇమ్రాన్28 - 30 విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరు లుగా, తమ సహాయకులుగా ఎంతమాత్రం ఎన్నుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్తో విధమైన సంబంధమూ లేదు. అయితే వారి దౌర్జన్యం నుండి రక్షణ పొందటానికి, మీరు వైఖరిని అభినయిస్తే అది క్షమార్హమే. కాని అల్లాహ్ తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. ప్రవక్తా! ప్రజలను ఇలా హెచ్చరించు : ‘‘మీ మనస్సులలో ఉన్నదంతా - మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా - అల్లాహ్ కు తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్నది ఏదీ ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపైనా ఉంది. ప్రతి మనిషీ తాను చేసిన- మంచి చేసినా లేక చెడ్డ చేసినా-దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసేరోజు రాబోతోంది. తనకు రోజు ఇంకా ఎంతో దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని మనిషి రోజున కోరుకుంటాడు. అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ.’’

3. ఆలి ఇమ్రాన్31 - 32 ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు : ‘‘మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడూను.’’ వారితో ఇంకా, ‘‘అల్లాహ్ కూ, ప్రవక్తకూ విధేయత చూపండి’’ అని అను. ఒకవేళ వారు నీ సందేశాన్ని స్వీకరించకపోతే, అల్లాహ్ తనకూ, తన ప్రవక్తకూ విధేయత చూపటానికి నిరాకరించిన వారిని ప్రేమించటం అనేది నిశ్చయంగా జరగదు.

3. ఆలి ఇమ్రాన్33 - 37 అల్లాహ్ ఆదమ్కూ, నూహ్ కూ, ఇబ్రాహీము సంతతికీ, ఇమ్రాను సంతతికీ, సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యత ఇచ్చి (తన సందేశం కొరకు) ఎన్నుకున్నాడు. ఒకరి వంశాన్నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఇమ్రాను స్త్రీ అల్లాహ్ ను ఇలా ప్రార్థించినపుడు (అల్లాహ్ విన్నాడు). ‘‘ప్రభూ! నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసిన వాడవు.’’ తరువాత ఆమెకు ఆడు శిశువు జన్మించినపుడు, ఆమె ఇలా విన్నవించుకుంది : ‘‘ప్రభూ! నాకు ఆడు శిశువు కలిగింది - ఆమెకు శిశువు పుట్టిందో అల్లాహ్ కు బాగా తెలుసు - బాలుడు బాలిక వంటివాడు కాడు. సరే, నేను దానికి మర్యమ్అని పేరు పెట్టాను. శాపగ్రస్తుడైన షైతాను బారినుండి రక్షణ కొరకు నేను దానినీ, దాని సంతానాన్నీ నీకు అప్పగిస్తున్నాను.’’ చివరకు ఆమె ప్రభువు బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు. ఇంకా, జకరియ్యాను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు....

3. ఆలి ఇమ్రాన్37 - 41 .... జకరియ్య ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థము లను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు : ‘‘మర్యమ్‌! ఇవి నీ వద్దకు ఎక్కడ నుండి వచ్చాయి?’’ ఆమె ఇలా జవాబు చెప్పేది : ‘‘అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.’’ పరిస్థితిని చూసిన జకరియ్య తన ప్రభువును ఇలా ప్రార్థించాడు, ‘‘ప్రభూ! నీవు నీ మహిమతో నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. ప్రార్థనలను వినేవాడవు నీవే.’’ జకరియ్య తన గదిలో నిలబడి నమాజు చేస్తూ ఉన్నప్పుడు, దైవదూతలు సమాధానంగా ఇలా ప్రకటించారు : ‘‘అల్లాహ్ నీకు యహ్యా (ను గురించిన) శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్ ఆజ్ఞను ఒకదాన్ని ధ్రువపరిచేవాడుగా వస్తాడు. అతనిలో నాయకత్వపు దర్పమూ, పెద్దరికపు ఠీవీ ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం కలిగి ఉంటాడు. ప్రవక్తగా నియమింపబడతాడు. సజ్జనులలో పరిగణింపబడతాడు.’’ జకరియ్య ఇలా అన్నాడు : ‘‘ప్రభూ! నేనా ముసలివాణ్ణి, నా భార్యయేమో గొడ్రాలు. నాకు కొడుకు ఎలా కలుగుతాడు?’’ ఇలా సమాధానం వచ్చింది:  ‘‘అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరిన దానిని చేస్తాడు.’’ అతను ఇలా మనవి చేసుకున్నాడు : ‘‘స్వామీ! నా కొరకేదయినా సూచనను నిర్ణయించు.’’ అల్లాహ్ ఇలా అన్నాడు : ‘‘సూచన ఏమిటంటే, నీవు మూడు రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడవు (మాట్లాడలేవు), అప్పుడు నీవు నీ ప్రభువును ఎక్కువగా స్మరించు. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడు.’’

3. ఆలి ఇమ్రాన్42 - 43 తరువాత ఒకప్పుడు దైవదూతలు వచ్చి మర్యమ్తో ఇలా అన్నారు : ‘‘మర్యమ్‌! అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు. నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యము నిచ్చి నిన్ను తన సేవకొరకు ఎన్నుకున్నాడు. మర్యమ్‌! నీవు నీ ప్రభువునకు విధేయురాలవుగా ఉండు. ఆయన సాన్నిధ్యంలో సజ్దా చెయ్యి (సాష్టాంగపడు). రుకూచేసే దాసులతో నీవూ రుకూ చెయ్యి (నమ్రతతో వంగు).’’

3. ఆలి ఇమ్రాన్44 ప్రవక్తా! ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు. వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. లేకపోతే, మర్యమ్సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయ నిర్ణయం కొరకు, ఆలయ సేవకులు  తమ  తమ కలములను విసరినప్పుడు నీవు అక్కడ లేవుకదా! ఇంకా, వారి మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు.

3. ఆలి ఇమ్రాన్45 - 48 దైవదూతలు ఇలా అన్నారు :  ‘‘మర్యమ్‌! అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభ వార్తను నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసీప్. అతను మర్యమ్కుమారుడు. అతడు ఇహపర లోకాలలో గౌరవనీయుడౌతాడు. అల్లాహ్ సామీప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణింపబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెరిగి పెద్దవాడైనప్పుడూ ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడౌతాడు.’’ ఇది విన్న మర్యమ్ఇలా అన్నారు : ‘‘ప్రభూ! నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను పురుషుడూ చేతితోనైనా తాకలేదే!’’ సమధానం లభించింది : ‘‘అలానే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినదాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పుడు, కేవలం దానిని ‘‘అయిపో’’ అంటాడు. అంతే, అది అయిపోతుంది.’’ (దైవదూతలు ఇంకా ఇలా అన్నారు): ‘‘అల్లాహ్ అతనికి గ్రంథాన్నీ, దివ్య జ్ఞానాన్నీ బోధిస్తాడు. తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు.

3. ఆలి ఇమ్రాన్49 - 51 ఇంకా అతనిని ఇస్రాయీలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు.’’ (ప్రవక్తగా ఇస్రాయీలు సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు) : ‘‘నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. మీముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారుచేసి దానిలోకి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, కుష్ఠరోగిని బాగుచేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించే వారే అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధ్రువపరచటానికి నేను వచ్చాను. ఇంకా, పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్‌) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్‌) చెయ్యటానికి కూడా వచ్చాను. చూడండి! నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. కనుక అల్లాహ్ కు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకూ ప్రభువే మీకూ ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్నే చెయ్యండి. ఇదే రుజుమార్గం.

3. ఆలి ఇమ్రాన్52 - 53 ఇస్రాయీలు వంశస్థుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: ‘‘అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?’’  అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు : ‘‘మేము అల్లాహ్ కు సహాయకులం.  మేము అల్లాహ్ ను విశ్వసించాము. మేము ముస్లిములము (అల్లాహ్ కు విధేయులము) అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభూ! నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము. సందేశహరుణ్ణి అనుసరించటానికి మేము అంగీక రించాము. మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాయి.’’

3. ఆలి ఇమ్రాన్54 - 57 ఇస్రాయీలు సంతతివారు (ఈసాకు వ్యతిరేకంగా) రహస్యపుటెత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వెయ్యటంలో అల్లాహ్ మేటి. (అది అల్లాహ్ రహస్య తంత్రమే). అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు : ‘‘ఈసా! నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి (అంటే వారి చెడు సాంగత్యం నుండి, వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండటం నుండి కాపాడి) నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలివస్తారు. అప్పుడు మీమధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. అవిశ్వాస వైఖరినీ తిరస్కార ధోరణినీ అవలంబించిన వారిని ఇహపరాలు రెండిరటిలోనూ కఠినంగా శిక్షిస్తాను. వారు సహాయకులనెవ్వరినీ పొందలేరు. ఇక విశ్వసించి మంచిపనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడతాయి. బాగా తెలుసుకోండి! దుర్మార్గులను అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు.’’

3. ఆలి ఇమ్రాన్58 - 60 ప్రవక్తా! మేము నీకు వినిపించేవి సూచనలతోనూ, వివేకంతోనూ నిండివున్న గాధలు. అల్లాహ్ దృష్టిలో ఈసా పుట్టుక ఆదమ్పుట్టుక వంటిదే. అల్లాహ్ ఆదమును మట్టితో చేసి ‘‘అయిపో’’ అని ఆజ్ఞాపించాడు, అతను అయ్యాడు. అసలు వాస్తవం ఇది. అది మీ ప్రభువు తరఫు నుండి మీకు తెలుపబడుతోంది. దాన్ని శంకించేవారిలో నీవు చేరిపోకు.

3. ఆలి ఇమ్రాన్61 - 63   జ్ఞానం  వచ్చిన తరువాత ఇక నీతో ఎవరైనా విషయంలో వివాదానికి దిగితే, ప్రవక్తా! వారితో ఇలా  అను: ‘‘రండి! మీరూ మేమూ స్వయంగానూ వద్దాము. మన ఆలుబిడ్డలను కూడ పిలుచుకు వద్దాము. ‘‘అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం పడుగాక అని ప్రార్థిద్దాము.’’ ఇవి పూర్తిగా నిజమైన సంఘటనలే. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు. అల్లాహ్ - నిశ్చయంగా ఆయన శక్తియే అన్ని శక్తులకంటే మహత్తరమైనది. ఆయన వివేకమే విశ్వవ్యవస్థను నడుపుతున్నది. ఒకవేళ వారు ( షరతుపై పోటీలో పాల్గొనటానికి) విముఖులైతే (వారు సంక్షోభాన్ని రేకెత్తించేవారు మాత్రమే అనేది స్పష్టమైపోతుంది). అల్లాహ్ సంక్షోభాన్ని రేకెత్తించేవారి స్థితిని బాగా ఎరిగినవాడే.

3. ఆలి ఇమ్రాన్64 ప్రవక్తా! ఇలా చెప్పు : ‘‘గ్రంథ ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. (అది ఏమిటంటే) మనం అల్లాహ్ కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్ ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది.’’ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే, వారితో స్పష్టంగా ఇలా అను : ‘‘మేము ముస్లిములము (కేవలం అల్లాహ్కే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.’’

3. ఆలి ఇమ్రాన్65 - 68 గ్రంథప్రజలారా! ఇబ్రాహీము ధర్మం గురించి మీరు ఎందుకు తగాదాపడుతున్నారు? తౌరాతు, ఇంజీలు గ్రంథాలు ఇబ్రాహీము తరువాతేగా అవతరించాయి. మీరు స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా? మీకు తెలిసిన విషయాలను గురించి మీరు బాగా వాదించారు. కాని మీకు తెలియని విషయాలను గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహ్ కు తెలుసు కానీ మీకు తెలియదు. ఇబ్రాహీము యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. అతను అచంచలమైన విశ్వాసముకల ముస్లిము. అతను ఎంతమాత్రం ముష్రిక్కులలోని వాడు కాదు. ఇబ్రాహీముతో సంబంధం కలిగి వుండే హక్కు ఎవరికైనా ఉందీ అంటే, అది అతన్ని అనుసరించిన ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ప్రవక్త, ఇతన్ని విశ్వసించేవారు సంబంధానికి అందరికంటే ఎక్కువగా అర్హులు. కేవలం విశ్వసించిన వారికే అల్లాహ్ అండదండలు లభిస్తాయి.

3. ఆలి ఇమ్రాన్69 - 71 (విశ్వసించిన ప్రజలారా!) గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతున్నది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవరినీ అపమార్గం పట్టించటం లేదు. కాని వారు దానిని గ్రహించటం లేదు. గ్రంథప్రజలారా! అల్లాహ్ సూచనలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు, స్వయంగా మీరే వాటిని చూస్తూ ఉన్నప్పటికీ? గ్రంథ ప్రజలారా!  మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? బుద్ధిపూర్వకంగా సత్యాన్ని ఎందుకు దాస్తారు?

3. ఆలి ఇమ్రాన్72 - 74 గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఇలా అంటుంది: ‘‘ ప్రవక్తను విశ్వసించిన వారిపై అవతరించిన దాన్ని ఉదయం విశ్వసించండి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఉపాయం వల్ల వారు తమ విశ్వాసం నుండి వెనక్కి మరలవచ్చు.’’ ఇంకా వారు ‘‘మన మతం వాణ్ణి తప్ప మరెవరినీ నమ్మకండి’’ అని పరస్పరం చెప్పుకుంటారు. ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘వాస్తవానికి మార్గదర్శకత్వ మంటే అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వమే. మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దానినే ఆయన మరొకరికి ఇవ్వటం అనేదీ, లేదా మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించటానికి ఇతరులకు బలమైన వాదాన్ని ఇవ్వటం అనేదీ కేవలం ఆయన అనుగ్రహమే.’’ ప్రవక్తా! వారితో ఇంకా ఇలా అను : ‘‘అనుగ్రహమూ, గౌరవమూ అనేవి అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరినవారికి వాటిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విశాల దృష్టి కలవాడు, అంతా తెలిసినవాడు, తాను కోరినవారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ అనుగ్రహం మహత్తరమైనది.’’

3. ఆలి ఇమ్రాన్75 - 77 గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటివాడంటే అతడిపై నమ్మకంతో మీరు ధన, కనక రాశిని అప్పగించినా, దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు, కేవలం ఒక దీనార్విషయంలో కూడా మీరు అతణ్ణి నమ్మితే, అతడు దానిని, మీరు అతడి నెత్తిపై నిల్చుంటే తప్ప, తిరిగి ఇవ్వడు. వారి నైతిక స్థితికి కారణం ఏమిటంటే, వారు విధంగా అంటారు : ‘‘ఉమ్మీల (యూదులు కానివారి) వ్యవహారంలో మమ్మల్ని పట్టుకోవటం జరగదు.’’ అబద్ధాన్ని వారు కల్పించి అల్లాహ్ కు ఆరోపిస్తున్నారు. అది (అంటే అటువంటి మాటనూ అల్లాహ్ అనలేదనే విషయం) వారికి బాగా తెలుసు. అసలు వారిని ప్రశ్నించటం ఎందుకు జరగదు? ఎవరు తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, చెడుకు దూరంగా ఉంటారో, వారు అల్లాహ్ కు ప్రీతిపాత్రులవుతారు. ఎందుకంటే, భయభక్తులు కలవారంటే అల్లాహ్ కు ఎంతో ప్రేమ. ఇక ఎవరు అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో, వారికి పరలోకంలో భాగమూ లేదు. ప్రళయం రోజున అల్లాహ్ వారిని పలుకరించడు, వారివైపు చూడడు, వారిని పరిశుద్ధులుగానూ చెయ్యడు. పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది.

3. ఆలి ఇమ్రాన్78 వారిలో కొందరు, తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని, గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలికలు త్రిప్పుతారు. కాని వాస్తవంగా అది గ్రంథంలోని భాగం కాదు. వారు, ‘‘మేము చదివేదంతా అల్లాహ్ తరఫు నుండి వచ్చినదే’’ అని అంటారు. కాని అది అల్లాహ్ తరఫు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాహ్ కు అంటగడుతున్నారు.

3. ఆలి ఇమ్రాన్79 - 80 వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్తపదవిని ప్రసాదిస్తే, అతడు ప్రజలతో, ‘‘మీరు అల్లాహ్ కు బదులుగా నాకు దాసులు కండి’’ అని అనటం తగదు. అతడు ఇదే అంటాడు, ‘‘మీరు ఇతరులకు బోధించేటటువంటి, స్వయంగా చదివేటటువంటి గ్రంథంలోని ఉపదేశాలు కోరేవిధంగా నిజమైన ‘‘రబ్బానీలు’’ అవండి.’’ దైవదూతలనో లేక ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండి అని అతను మీతో ఎన్నటికీ అనడు. ముస్లిములయిన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించటం సాధ్యమా?

3. ఆలి ఇమ్రాన్81 - 82 జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవక్తల నుండి అల్లాహ్ వాగ్దానం తీసుకున్నాడు : ‘‘నేను రోజు మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తాను. పూర్వం నుండి మీ వద్ద ఉన్న హితోపదేశాన్ని ధ్రువీకరిస్తూ రేపు ప్రవక్త ఎవరైనా మీ వద్దకు వస్తే, ఆయనను మీరు విశ్వసించవలసి ఉంటుంది, ఆయనకు సహాయం చెయ్యవలసి ఉంటుంది. విధంగా ప్రవచించి అల్లాహ్ ఇలా అడిగాడు : ‘‘ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? నా తరఫు నుండి మీపై మోపబడిన ప్రమాణం బరువు బాధ్యతలను మీరు స్వీకరిస్తారా?’’ వారు ఇలా అన్నారు: ‘‘అవును, మేము స్వీకరిస్తాము.’’ అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ‘‘అయితే దీనికి సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేను కూడా సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో, వారే హద్దులు మీరేవారు.’’

3. ఆలి ఇమ్రాన్83 - 85  ఇక ప్రజలు అల్లాహ్ కు విధేయత చూపే విధానాన్ని (అల్లాహ్ ధర్మాన్ని) వదలిపెట్టి, మరొక విధానాన్ని దేన్నయినా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమ్యాకాశాలలో ఉన్న సకల వస్తువులూ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములై ఉన్నాయి. ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్తా! ఇలా అను : ‘‘మేము అల్లాహ్ ను విశ్వసిస్తాము. మాపై అవతరింపజెయ్యబడిన హితోపదేశాన్ని విశ్వసిస్తాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబు మరియు యాఖూబు సంతానములపై అవతరించిన దానిని కూడ విశ్వసిస్తాము. ఇంకా మూసా, ఈసా, ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను కూడా విశ్వసిస్తాము. మేము వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లాహ్ విధేయతకు కట్టుబడి (ముస్లిములుగా) ఉన్నాము.’’ ఎవడైనా విధేయతా విధానాన్ని (ఇస్లామ్‌) కాక మరొక విధానాన్ని అవలంబించదలిస్తే, మార్గం ఎంతమాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు.

3. ఆలి ఇమ్రాన్86 - 91 విశ్వాసవరం పొందిన తరువాత మళ్ళీ అవిశ్వాసాన్ని అవలంబించే ప్రజలకు అల్లాహ్ సన్మార్గం చూపుతాడనేది ఎలా జరుగుతుంది? వాస్తవానికి, ఈయన ప్రవక్త అనే విషయం సత్యం అని వారే స్వయంగా సాక్ష్యమిచ్చారు. ఇంకా వారి వద్దకు స్పష్టమైన సూచనలు కూడా వచ్చాయి. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. వారి దుర్మార్గానికి తగిన ప్రతిఫలం వారిని అల్లాహ్, దైవదూతలు, సర్వమానవులు శపించటమే. ఇదే స్థితిలో వారు సదా ఉంటారు. వారి శిక్షా తగ్గదు, వారికి వ్యవధీ ఇవ్వబడదు. కాని ఎవరు తరువాత పశ్చాత్తాపపడతారో, తమ నడవడికను సరిదిద్దు కుంటారో వారు రక్షింపబడతారు. అల్లాహ్ క్షమించేవాడూ కనికరించేవాడూను. అయితే, విశ్వసించిన తరువాత, ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో, ఇంకా తమ అవిశ్వాసంలోనే ముందుకు పోతారో, వారి పశ్చాత్తాపం ఎంతమాత్రం అంగీకరించబడదు. ఇటువంటివారు పక్కా మార్గభ్రష్టులు. ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసువులు బాశారో, వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవటానికి భూమినంతా బంగారం నింపి పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విషయం నిశ్చయం. ఇలాంటి వారికొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసేవారెవరూ ఉండరు.

3. ఆలి ఇమ్రాన్92 మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

3. ఆలి ఇమ్రాన్93 - 95 ఆహార పదార్థాలన్నీ (ముహమ్మద్షరీయత్తులో ధర్మ సమ్మతమైనవి) ఇస్రాయీలు సంతతికి కూడ ధర్మ సమ్మతంగా ఉండేవి. కాని తౌరాతు గ్రంథం అవతరణకు పూర్వం ఇస్రాయీలు (హజ్రత్యాఖూబు) స్వయంగా తనకు కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారిని ఇలా అడుగు: ‘‘మీరు (అభ్యంతరం తెలుపుటలో) సత్యవంతులే అయితే తౌరాతును తీసుకురండి. దానిలోని ఏదైనా భాగాన్ని చూపించండి. దీని తరువాత కూడ ఎవరైనా అబద్ధాన్ని సృష్టించి అల్లాహ్ కు ఆపాదించినట్లయితే వారే వాస్తవానికి దుర్మార్గులు.’’ వారికి ఇలా బోధించు : ‘‘అల్లాహ్ చెప్పింది నిజం. కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీము పద్ధతినే అనుసరించాలి. ఇబ్రాహీము షిర్కు చేసే వారిలోని వాడు కాదు.’’

3. ఆలి ఇమ్రాన్96 - 97  ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడిరది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి, ఇబ్రాహీము యొక్క ప్రార్థనాస్థలం ఉన్నది. దానిలో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. ప్రజలపై అల్లాహ్ కు ఉన్న హక్కు ఏమిటంటే, గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్ను విధిగా చెయ్యాలి. ఆజ్ఞను పాలించటానికి తిరస్క రించేవాడు అల్లాహ్ కు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి.

3. ఆలి ఇమ్రాన్98 - 99 ఇలా చెప్పు: ‘‘గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నింటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు.’’ ఇంకా ఇలా అను : ‘‘గ్రంథ ప్రజలారా! ఏమిటి మీ వైఖరి, అల్లాహ్ మాటను విశ్వసించే వాణ్ణి కూడా అల్లాహ్ మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారా? (అతడు సత్యమార్గంపై ఉన్నాడనటానికి) స్వయంగా మీరే సాక్షులై కూడా అతడు వక్రమార్గంలో నడవాలని కోరుకుంటున్నారా? అల్లాహ్ మీ చేష్టలపట్ల అజాగ్రత్తగా లేడు.’’

3. ఆలి ఇమ్రాన్100 - 101 విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాటను వింటే, వారు మిమ్మల్ని విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాసం దెసకు మరలిస్తారు. మీరు అవిశ్వాసం దెసకు ఎలా మరలిపోగలరు, అల్లాహ్ వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రవక్త మీ మధ్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు? అల్లాహ్ ను గట్టిగా పట్టుకునేవాడికి తప్పకుండా రుజుమార్గం లభిస్తుంది.

3. ఆలి ఇమ్రాన్102 - 103 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏవిధంగా భయపడాలో, విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి. అంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పుతో నిండివున్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు. అల్లాహ్ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు, బహుశా సూచనల ద్వారా సాఫల్యం సిద్ధించే సరియైన మార్గం మీకు లభిస్తుందేమో అని.

3. ఆలి ఇమ్రాన్104 - 109 మీలో మంచి వైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి  అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించేవారూ కొందరు తప్పకుండా ఉండాలి. పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే తెగలుగా చీలిపోయారో, ఎవరైతే విభేదాలకు గురిఅయ్యారో,  వారి మాదిరిగా మీరూ కావద్దు. కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉండేరోజున,  మరికొందరి ముఖాలు నల్లబడిపోయేరోజున, ఇటువంటి వైఖరిని అవలంబించేవారికి కఠిన శిక్ష పడుతుంది. ఎవరి ముఖాలయితే నల్లబడిపోతాయో (వారితో ఇలా అనబడుతుంది): ‘‘విశ్వాస భాగ్యం పొందిన తరువాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని అవలంబించారా? సరే, కృతఘ్నత చూపిన దానికి ఫలితంగా మీరు ఇప్పుడు ఘోర శిక్షను చవిచూడండి. ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారికి అల్లాహ్ కారుణ్యచ్ఛాయలో చోటు లభిస్తుంది. అదేస్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇవి అల్లాహ్ సూక్తులు. వాటిని మేము మీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఎందుకంటే, ప్రపంచ ప్రజలకు అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం అల్లాహ్ కు మాత్రం లేదు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తానికి అల్లాహ్ యజమాని. అన్ని వ్యవహారాలూ అల్లాహ్ సమక్షంలోనే పెట్టబడతాయి.’’

3. ఆలి ఇమ్రాన్110 - 112 ఇకనుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడునుండి ఆపుతారు. అల్లాహ్ ను విశ్వసిస్తారు. గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే, వారికే మేలు కలిగి వుండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని వారిలో అధికులు అవిధేయులు. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు - మహాఅయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ వారు మీతో పోరాడితే వెన్ను చూపుతారు. తరువాత వారు ఎంత అసహాయులై పోతారంటే, వారికి ఎక్కడ నుండీ తోడ్పాటు లభించదు. వారు ఎక్కడున్నా అవమానానికే గురిచెయ్యబడతారు - అల్లాహ్ శరణులోనో లేక మానవుల రక్షణలోనో వారికి ఆశ్రయం లభిస్తే అది వేరే విషయం. వారు అల్లాహ్ ఆగ్రహంలో చిక్కుకున్నారు. పరాధీనత, పరాజయం వారిపై ముద్రించబడ్డాయి. ఇదంతా కేవలం ఇందువల్లనే జరిగింది  వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తూ వచ్చారు. ప్రవక్తలను అన్యాయంగా చంపారు. ఇది వారి అవిధేయతల, అతిక్రమణల పర్యవసానం.

3. ఆలి ఇమ్రాన్113 - 117 కాని గ్రంథ ప్రజలందరూ ఒకలాంటివారు కాదు. వారిలో సత్యమార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు.  వారు రాత్రి సమయాలలో అల్లాహ్ ఆయతులను పఠిస్తారు. ఆయన ముందు సజ్దా చేస్తారు.  అల్లాహ్నూ, అంతిమ దినాన్నీ విశ్వసిస్తారు. మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడుల నుండి ఆపుతారు. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే మంచి పనికైనా విలువను ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు కలవారిని అల్లాహ్ బాగా ఎరుగును. ఇక అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారి విషయం : వారి సంపద కానీ, వారి సంతానం కానీ వారికి అల్లాహ్ కు వ్యతిరేకంగా ఉపకరించవు. వారు అగ్నిలోకి పోయేవారు. అగ్నిలోనే సదా ఉంటారు - వారు తమ ఐహిక జీవితంలో చేసే ధనవ్యయాన్ని తమకు తామే అన్యాయం చేసుకునేవారి పంట పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే మంచుగాలితో పోల్చవచ్చును - అల్లాహ్ వారికి అన్యాయం చెయ్యలేదు. వాస్తవానికి వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు.

3. ఆలి ఇమ్రాన్118 - 120 విశ్వాసులారా! మీ పక్షంవారిని తప్ప ఇతరులెవ్వరినీ మీకు ఆంతరంగికులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే అవకాశాన్నైనా ఉపయోగించుకోవటానికి వెనుదీయరు. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం. వారి కడుపుమంట వారి నోటి నుండి బయటపడుతుంది. కానీ వారు తమ హృదయాలలో దాచివుంచింది దీనికంటే తీవ్రమైనది. మేము మీకు స్పష్టమైన సూచనలు ఇచ్చాము. మీకు వివేకమే ఉంటే, (వారితో మీ సంబంధాలను గురించి జాగ్రత్తపడతారు) మీరు వారిని ప్రేమిస్తారు. కాని వారికి మీరంటే ప్రేమేలేదు. వాస్తవానికి మీరు దైవగ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు. వారు మీతో కలిసినప్పుడు ఇలా అంటారు : ‘‘మేమూ (మీ ప్రవక్తనూ, మీ గ్రంథాన్నీ) విశ్వసించాము.’’ కాని వేరుగా ఉన్నప్పుడు వారు మీపై కోపావేశంవల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు - వారితో ఇలా అను : ‘‘మీ కోపావేశంలో మీరే మాడిచావండి.’’ హృదయాలలో దాగివున్న రహస్యాలు సైతం అల్లాహ్ కు తెలుసు - మీకు మేలు కలిగితే వారు బాధపడతారు. మీకు కీడు జరిగితే వారు సంబరపడతారు. మీరు సహనం కలిగివుంటే, అల్లాహ్ కు భయపడుతూ పనిచేస్తూపోతే, వారి కుతంత్రమూ మీకు వ్యతిరేకంగా పనిచేయదు. వారు చేస్తూవున్న దాన్ని అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.

3. ఆలి ఇమ్రాన్121 (ప్రవక్తా! నీవు ముస్లిములకు సమయాన్ని గురించి తెలుపు) అప్పుడు నీవు వేకువజామున నీ ఇంటి నుండి బయలుదేరి (ఉహుద్క్షేత్రంలో) ముస్లిములను యుద్ధం కొరకు వారి వారి స్థానాలలో నియమించావు. అల్లాహ్ అన్ని మాటలూ వింటాడు. ఆయన అన్నీ తెలిసినవాడు.

3. ఆలి ఇమ్రాన్122 - 123 మీలోని రెండు వర్గాలు పిరికితనం చూపటానికి సిద్ధపడిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వాస్తవానికి అల్లాహ్ వారికి సహాయంగా అక్కడ ఉన్నాడు. విశ్వాసులైన వారు అల్లాహ్నే నమ్ముకోవాలి. మధ్యనే బద్ర్  సంగ్రామంలో అల్లాహ్ మీకు సహాయం చేశాడు కదా! యథార్థానికి అప్పుడు మీరు చాలా బలహీనంగా ఉన్నారు. కనుక అల్లాహ్ పట్ల కృతఘ్నతకు దూరంగా ఉండండి, తద్వారా ఇప్పుడైనా మీరు కృతజ్ఞులౌతారని ఆశ.

3. ఆలి ఇమ్రాన్124 - 127 ప్రవక్తా! నీవు విశ్వాసులతో ఇలా అన్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకో : ‘‘అల్లాహ్ మూడువేల మంది దూతలను దింపి మీకు సహాయం చెయ్యటం మీకు సరిపోదా?’’ మీరు సహనం చూపితే, ఆచరణలో అల్లాహ్ కు భయపడితే, క్షణంలో శత్రువులు మీపై దాడిచేస్తారో, క్షణంలో మీ ప్రభువు (మూడు వేలు కాదు) ఐదు వేలమంది ప్రత్యేక గుర్తులు కల దూతలతో మీకు నిస్సందేహంగా సహాయం చేస్తాడు. అల్లాహ్ మీకు విషయాన్ని తెలిపింది, మీకు సంతోషం కలగాలని, మీ మనస్సులకు తృప్తి కలగాలని. విజయం, సహాయం వచ్చేది అల్లాహ్ తరఫు నుండి మాత్రమే. ఆయన అత్యంత శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ( సహాయం ఆయన మీకు ఎందుకు చేస్తాడంటే) అవిశ్వాస మార్గంలో నడిచేవారి ఒక పార్శ్వాన్ని ఖండిరచాలని లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుతిరిగి పోవాలని.

3. ఆలి ఇమ్రాన్128 - 129 (ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు. వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఎందుకంటే వారు దుష్టులు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికీ యజమాని అల్లాహ్. ఆయన తాను కోరినవారిని క్షమిస్తాడు. తాను కోరినవారిని శిక్షిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడూను.

3. ఆలి ఇమ్రాన్130 - 138 విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే వడ్డీని తినటం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చెయ్యబడిన అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్ కూ, ప్రవక్తకూ విధేయత చూపండి. మీరు కరుణింపబడే అవకాశం ఉంది. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే  మార్గంలో పరుగెత్తండి.  స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమయింది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడిరది. వారు కలిమిలో, లేమిలో, స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చుచేసేవారు, కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు - ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం- వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీలకార్యం వారివల్ల జరిగిపోతే లేదా ఏదైనా పాపం చేసి, వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే, వెంటనే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించు అని వేడుకుంటారు - ఎందుకంటే అల్లాహ్ తప్ప పాపాలను క్షమించగలిగే వాడెవడున్నాడని - వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా మొండివాదం చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే, ఆయన వారిని క్షమిస్తాడు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. మంచిపనులు చేసేవారికి ఎంత చక్కని ప్రతిఫలం! మీకు పూర్వం ఎన్నో యుగాలు గతించాయి. (అల్లాహ్ ఉపదేశాలు అసత్యాలని) తిరస్కరించే వారి ముగింపు ఎలా జరిగిందో స్వయంగా భూమిపై సంచారం చేసి చూడండి. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన హెచ్చరిక, అల్లాహ్ కు భయపడే వారికి మార్గదర్శకత్వం, హితోపదేశం.

3. ఆలి ఇమ్రాన్139 - 143 క్రుంగిపోకండి, ద్ణుఖపడకండి, మీరే ప్రాబల్యం పొందుతారు. మీరు విశ్వాసులే అయితే. ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు. నిజమే. ఇదివరకు మీ ప్రత్యర్థికూడ ఇటువంటి దెబ్బనే తిన్నాడు కదా! ఇవి కాలం యొక్క మిట్టపల్లాలు. వాటిని మేము ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. ఇటువంటి కాలం మీకు ఎందుకు ప్రాప్తించిందంటే మీలో నిజమైన విశ్వాసులెవరో అల్లాహ్ చూడదలిచాడు. (సత్యానికి) నిజమైన సాక్షులెవరో ఏరదలిచాడు - ఎందుకంటే దుర్మార్గులైన ప్రజలంటే అల్లాహ్ కు ఇష్టం లేదు - ఇంకా ఆయన పరీక్ష ద్వారా విశ్వాసులను వేరుచేసి అవిశ్వాసులను తుదముట్టించ దలిచాడు. మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా? వాస్తవానికి ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి కృషిచేసేవారు, ఆయన కొరకు సహనం చూపేవారు మీలో ఎవరో అల్లాహ్ ఇంకా చూడనేలేదు కదా! మీరు ఇదివరకు మరణాన్ని కోరుతూ ఉండేవారు! కాని ఇది, మరణం మీ ముందుకు రానప్పటి విషయం. ఇదిగో, అది ఇప్పుడు మీ ముందుకే వచ్చింది. దాన్ని స్వయంగా మీరే మీ కళ్ళతో చూశారు.

3. ఆలి ఇమ్రాన్144. ముహమ్మద్ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చెయ్యబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయే వాడు అల్లాహ్ కు ఏమాత్రం నష్టం కలిగించలేడు.  కాని అల్లాహ్ కు కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగువిధంగా బహూకరిస్తాడు.

3. ఆలి ఇమ్రాన్145 - 148 అల్లాహ్ అనుమతి లేనిదే ప్రాణి కూడా చావజాలదు. మరణకాలం వ్రాయబడే ఉంది. ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశ్యంతో పనిచేసే వాడికి మేము ప్రపంచాన్నుండే ఇస్తాము. పరలోక ప్రతిఫలాపేక్షతో పనిచేసే వాడు పరలోక ప్రతిఫలాన్ని పొందుతాడు. కృతజ్ఞతలు తెలిపే వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాము. ఇంతకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు గతించారు. వారితో కలిసి దైవభక్తులు యుద్ధంచేశారు. అల్లాహ్ మార్గంలో ఎదురయిన కష్టాలకు వారు క్రుంగిపోలేదు. బలహీనత కనబరచలేదు. (అసత్యం ముందు) తలవంచలేదు. అలాంటి సహనశీలురనే అల్లాహ్ ప్రేమిస్తాడు.  వారి  ప్రార్థన కేవలం ఇదే : ‘‘మా ప్రభూ! మా తప్పులను, మా పొరపాట్లను మన్నించు. మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమణను క్షమించు. మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు. అవిశ్వాసులకు ప్రతికూలంగా మాకు సహాయం చెయ్యి.’’ చివరకు అల్లాహ్ వారికి ఇహలోక ప్రతిఫలాన్నీ ఇచ్చాడు, దానికంటే మేలైన పరలోక ప్రతిఫలాన్నీ ప్రసాదించాడు. అల్లాహ్ కు మంచిపనులు చేసే ఇలాంటి ప్రజలే ఇష్టం.

3. ఆలి ఇమ్రాన్149 - 151 విశ్వాసులారా! మీరు గనక అవిశ్వాస మార్గం అవలంబించిన వారి సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు మరలిస్తారు. అప్పుడు మీరు నష్టపోతారు. (వారు చెప్పేదంతా అసత్యం) వాస్తవం ఏమిటంటే అల్లాహ్యే మీకు అండ, ఆయనే మీకు తోడు. ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం త్వరలోనే రాబోతోంది. ఎందుకంటే ఎవరిని గురించి అల్లాహ్ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదో, వారిని, వారు అల్లాహ్తో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు. వారి తుది నివాసం నరకం. దుర్మార్గులకు లభించే నివాసం ఎంతో చెడ్డది.

3. ఆలి ఇమ్రాన్152 అల్లాహ్ మీకు చేసిన (సహాయం చేస్తాననే) తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రారంభంలో ఆయన ఆజ్ఞ ప్రకారం మీరే వారిని చంపుతూ ఉన్నారు. కాని మీరు బలహీనతను ప్రదర్శించినప్పుడు మీ కర్తవ్యం విషయంలో పరస్పరం విభేదాలకు గురిఅయినప్పుడు మీరు వ్యామోహపడిన వస్తువును (అంటే విజయధనం) అల్లాహ్ మీకు చూపగానే మీరు మీ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు - ఎందుకంటే, మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరికొందరు పరాన్ని కోరారు - అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించటానికి అవిశ్వాసులకు బదులుగా మిమ్మల్ని ఓటమిపాలు జేశాడు. అయినప్పటికీ వాస్తవానికి అల్లాహ్ మిమ్మల్ని క్షమించాడు. ఎందుకంటే, విశ్వాసుల పట్ల అల్లాహ్ కు ఎనలేని అనుగ్రహం.

3. ఆలి ఇమ్రాన్153 జ్ఞాపకం తెచ్చుకోండి, అప్పుడు మీరు పారిపోతున్నారు. వెనక్కి తిరిగి ఎవరినీ చూసే అంత స్పృహ కూడా మీకు లేదు. వెనుక నుండి ప్రవక్త మిమ్మల్ని కేకవేస్తూ ఉన్నాడు. అప్పుడు మీ వైఖరికి ప్రతిఫలంగా అల్లాహ్ మీకు ద్ణుఖం తరువాత ద్ణుఖం కలుగజేశాడు, మీరు ఏదైనా పోగొట్టు కున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేటందుకు ఇది భవిష్యత్తులో మీ కొరకు గుణపాఠంగా ఉండాలని. అల్లాహ్ కు మీరు చేసే పనులన్నీ తెలుసు.

3. ఆలి ఇమ్రాన్154   ద్ణుఖం  తరువాత అల్లాహ్ మీలో కొందరిపై నిశ్చింత స్థితిని ఆవహింపజేశాడు. దానివల్ల వారు కునికిపాట్లు పడసాగారు. కాని కేవలం స్వప్రయోజనానికే పూర్తిగా ప్రాముఖ్యం ఇచ్చే రెండోవర్గం వారు, అల్లాహ్ ను గురించి అజ్ఞాన భూయిష్టమైన, సత్యదూరమైన అనుమానాలు వ్యక్తం చెయ్యసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే :  ‘‘ వ్యవహారాన్ని నడపటంలో మాకూ ఏదైనా భాగం ఉందా?’’ వారికి ఇలా చెప్పు : ‘‘(ఎవరికీ భాగమూ లేదు) వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలూ అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి.’’  వాస్తవానికి వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని మీకు వ్యక్తం చెయ్యటం లేదు. వారి అసలు ఉద్దేశ్యమేమిటంటే : ‘‘(నాయకత్వపు) అధికారాలలో మాకూ భాగం ఉండివున్నట్లయితే ఇక్కడ మేము చంపబడి ఉండేవారము కాము.’’ వారితో ఇలా అను : ‘‘మీరు మీ ఇళ్ళల్లోనే ఉండివున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్యస్థానాలకు తరలివచ్చి ఉండేవారు. వ్యవహారమంతా ఎందుకు జరిగిందంటే, మీ గుండెలలో దాగివున్న దానిని అల్లాహ్ పరీక్షించేందుకు, మీ మనస్సులలో ఉన్న మాలిన్యాన్ని వేరుచెయ్యటానికి. అంతరంగాల స్థితి అల్లాహ్ కు బాగా తెలుసు.

3. ఆలి ఇమ్రాన్155 మీలో కొందరు శత్రువును మార్కొనే రోజున వెన్ను చూపారు. వారి పొరపాటుకు కారణమేమి టంటే, వారిలోని కొన్ని బలహీనతలవల్ల షైతాను వారి పాదాలను చలింపజేశాడు. అయినా అల్లాహ్ వారిని క్షమించాడు. అల్లాహ్ అధికంగా క్షమించేవాడు, సహించేవాడూను.

3. ఆలి ఇమ్రాన్156 - 158 విశ్వాసులారా! అవిశ్వాసులు మాదిరిగా ప్రవర్తించకండి. తమ బంధుమిత్రులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురిఅయితే) వారు ఇలా అంటారు : ‘‘వారు మాతోపాటు ఉండివున్నట్లయితే చనిపోయేవారూ కాదు, చంపబడేవారూ కాదు.’’ విధమైన వారి మాటలను అల్లాహ్ వారి హృదయశోకానికీ, ఆవేదనకూ కారణాలుగా చేస్తాడు. వాస్తవానికి చంపేవాడూ, బ్రతికించేవాడూ అల్లాహ్ మాత్రమే. మీరు చేసే అన్ని పనులనూ ఆయన కనిపెట్టే ఉన్నాడు. మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీ వంతుగా మీకు లభించే అల్లాహ్ కారుణ్యం, ఆయన క్షమాభిక్ష, వారు కూడబెట్టే సమస్త వస్తువులకంటే ఎంతో ఉత్తమమైనవి. మీరు చనిపోయినా లేక చంపబడినా, స్థితిలో అయినాసరే మీరంతా అల్లాహ్ సమక్షంలో సమీకరింపబడతారు.

3. ఆలి ఇమ్రాన్159 - 160 (ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదుస్వభావుడవు అయ్యావు. నీవేగనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించు, వారిని క్షమించు అని అల్లాహ్ ను ప్రార్థించు. ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలుపరచటానికి సంకల్పించినప్పుడు అల్లాహ్పై భారం వెయ్యి. తననే నమ్ముకుని పనిచేసే వారంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.  అల్లాహ్ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే, శక్తీ మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే, తరువాత మీకు సహాయం చేయగలవాడెవడు? కనుక నిజమైన విశ్వాసులు అల్లాహ్నే నమ్ముకోవాలి.

3. ఆలి ఇమ్రాన్161 - 164   ప్రవక్త అయినా నమ్మక ద్రోహాని (ఖియానత్‌)కి పాల్పడడు. నమ్మకద్రోహం చేసినవాడు ప్రళయంనాడు తన నమ్మకద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తన సంపాదనకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఏమాత్రం అన్యాయం జరగదు - ఎల్లప్పుడూ అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురిఅయి, తన చివరి నివాసము, అతి చెడ్డ నివాసము అయిన నరకానికి పోయే వ్యక్తి మాదిరిగా వ్యవహరించడం ఎలా సంభవం? అల్లాహ్ దృష్టిలో రెండు రకాల వ్యక్తుల మధ్య, స్థానాల విషయంలో ఎంతో తారతమ్యముంది. అల్లాహ్ అందరి పను లను పరిశీలిస్తున్నాడు. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు : స్వయంగా వారినుండే వారిమధ్య ఒక ప్రవక్తను లేపాడు. అతడు ఆయన ఆయతులను వారికి వినిపిస్తాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు. వారికి గ్రంథాన్నీ, వివేకాన్నీ నేర్పుతాడు. వాస్తవానికి వారు ఇంతకు పూర్వం స్పష్టమయిన అపమార్గాలలో పడివున్నారు.

3. ఆలి ఇమ్రాన్165 - 168 మీపై ఆపద వచ్చిపడగానే, ‘‘ఇదెక్కణ్ణుంచి దాపురించింది’’ అని అంటారేమిటి? (బద్ర్సంగ్రామంలో) దీనికి రెండిరతల ఆపద స్వయంగా మీ చేతుల ద్వారానే (మీ శత్రువులపై) పడిరదికదా! ప్రవక్తా! వారితో ఇలా చెప్పు : ‘‘ ఆపద స్వయంగా మీరు తెచ్చుకున్నదే.’’ నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి వస్తువుపై అధికారం ఉంది. పోరాటం నాడు మీకు కలిగిన నష్టం అల్లాహ్ అనుమతితోనే కలిగింది. ఎందుకంటే తద్వారా మీలో విశ్వాసులెవరో కపటులెవరో అల్లాహ్ చూడదలచాడు - కపటులతో : ‘‘రండి, అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యండి. లేదా కనీసం (మీ నగరాన్నయినా) రక్షించుకోండి’’ అని అన్నప్పుడు వారు ఇలా అన్నారు : ‘‘ రోజు యుద్ధం జరుగుతుందని మాకు తెలిసివున్నట్లయితే మేము తప్పకుండ మీతోపాటు వచ్చివుండే వారము.’’ మాటలు అంటున్నప్పుడు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికే చేరువగా ఉన్నారు. వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోటితో అంటారు. వారు తమ హృదయాలలో దాస్తున్న దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. తాము మాత్రం కూర్చుండిపోయి, యుద్ధం చెయ్యటానికి పోయి చంపబడినటువంటి తమ సోదరులను గురించి : ‘‘వారు గనక మా మాటలు ఆలకించివున్నట్లయితే చంపబడి ఉండేవారు కారు’’ అని అన్నవారు వీరే. వారితో ఇలా చెప్పు: ‘‘మీరు చెప్పే విషయంలో మీరు గనక నిజాయితీపరులే అయితే, మీకు చావు దాపురించినప్పుడు మీరు దానిని నివారించి చూపాలి.’’

3. ఆలి ఇమ్రాన్169 - 175 అల్లాహ్ మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. తమ ప్రభువువద్ద జీవికను పొందుతున్నారు. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానితో వారు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నారు. తమ వెనుక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా తమతో చేరని విశ్వాసులకు కూడా విధమైన భయంకానీ, ద్ణుఖంకానీ కలిగే అవకాశం లేదని వారు నిశ్చింతగా ఉన్నారు. అల్లాహ్ బహుమానాలకు, ఆయన అనుగ్రహాలకు వారు పొంగిపోతున్నారు. విశ్వాసుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధాకానివ్వడని వారికి తెలిసిపోయింది  క్షతగాత్రులయిన తరువాత కూడా అల్లాహ్ పిలుపునకు, ప్రవక్త పిలుపునకు సమాధానమిచ్చినటువంటి విశ్వాసుల ప్రతిఫలం - వారిలో సజ్జనులు, భయభక్తులు కలవారు అయిన వ్యక్తుల కొరకు గొప్ప ప్రతిఫలం ఉంది - వారితో ప్రజలు, ‘‘మీకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి’’ అని అన్నప్పుడు దానిని విని వారి విశ్వాసం ద్విగుణీకృత మయింది. వారు ఇలా సమాధానం చెప్పారు: ‘‘మాకు అల్లాహ్ చాలు. ఆయనే శ్రేష్టుడైన కార్యసాధకుడు.’’ చివరకు వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికి విధమైన హాని కలగలేదు. ఇంకా వారికి అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే మహాభాగ్యం కూడా లభించింది.  అల్లాహ్ అపరిమితంగా అనుగ్రహించేవాడు. వాస్తవానికి తన మిత్రులను గురించి ఊరకే ప్రజలను భయపెట్టింది షైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయ పడకండి. నాకు భయపడండి.

3. ఆలి ఇమ్రాన్176 - 178 ప్రవక్తా! నేడు అవిశ్వాస మార్గంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్న వారి కార్యకలాపాలు నిన్ను ఖేదపరచరాదు. వారు అల్లాహ్ కు ఏమాత్రం హాని కలిగించలేరు. పరలోకంలో వారికి భాగమూ ఇవ్వరాదనేదే అల్లాహ్ అభిమతం. చివరకు వారికి కఠిన శిక్ష పడుతుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కొనుక్కునేవారు నిశ్చయంగా అల్లాహ్ కు నష్టమూ కలిగించటం లేదు. వారికొరకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉంది. మేము ఇస్తూ ఉన్నటువంటి అవకాశాన్ని అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు. వారు ఇంకా ఎక్కువ పాపాలు కూడబెట్టుకోవాలనే మేము వారికి అవకాశాన్ని ఇస్తున్నాము. వారికి తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది.

3. ఆలి ఇమ్రాన్179 మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏమాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను అపవిత్రులనుండి తప్పకుండా వేరుచేస్తాడు. అయితే అగోచర విషయాల రహస్యాలను మీకు తెలుపడం అల్లాహ్ విధానం కాదు. (అగోచర విషయాలు తెలుపడానికి) అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరినవారిని ఎన్నుకుంటాడు.  కనుక (అగోచర విషయాలను గురించి) అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను నమ్మండి. మీరు గనక విశ్వాస భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తే మీకు పెద్ద బహుమానం లభిస్తుంది.

3. ఆలి ఇమ్రాన్180 అల్లాహ్ తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించినప్పటికీ పిసినారితనం చూపేవారు, పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారికొరకు ఎంతో హానికరమయినది. వారు తమ లోభత్వంతో కూడబెడుతూ ఉన్నదే ప్రళయం నాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్కే చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది అల్లాహ్ కు తెలుసు.

3. ఆలి ఇమ్రాన్181 - 182 ‘‘అల్లాహ్ దరిద్రుడు. మేము ధనికులం’’ అని  అన్నవారి ప్రేలాపన అల్లాహ్ విన్నాడు. వారి మాటలను కూడా మేము వ్రాసుకుంటాము. ఇంకా ఇదివరకు వారు అన్యాయంగా ప్రవక్తలను చంపిన విషయం కూడా వారి కర్మపత్రంలో వ్రాశాము. (తీర్పు సమయం వచ్చినప్పుడు) మేము వారితో ఇలా అంటాము : ‘‘ఇదిగో నరకబాధను చవిచూడండి. ఇది స్వయంగా మీచేతి సంపాదనే. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.’’

3. ఆలి ఇమ్రాన్183 - 185 ‘‘(ఆకాశం నుండి) అగ్ని (దిగివచ్చి) తినేటటువంటి బలిని మా సమక్షంలో ఇయ్యనంత వరకూ మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించకూడదని అల్లాహ్ మాకు ఉపదేశించాడు’’ అని అనేవారితో ఇలా అను : ‘‘నాకు పూర్వం మీ వద్దకు చాలామంది ప్రవక్తలు వచ్చారు. స్పష్టమైన ఎన్నో నిదర్శనాలు తీసుకువచ్చారు. మీరు ప్రస్తావించిన నిదర్శనాన్ని సైతం తీసుకువచ్చారు. (ప్రవక్తలను విశ్వసించటానికి షరతును పెట్టటంలో) మీరు గనక సత్యవంతులే అయితే, ప్రవక్తలను మీరు ఎందుకు హత్యచేశారు?’’ ప్రవక్తా! ఇక వారు గనక నిన్ను తిరస్కరిస్తే నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను (Psalms) వెలుగును ప్రసాదించే గ్రంథాలను తీసుకువచ్చిన చాలామంది ప్రవక్తలు కూడా తిరస్కరించబడ్డారు. చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయంనాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ప్రపంచం, అది కేవలం మాయావస్తువు మాత్రమే.

3. ఆలి ఇమ్రాన్186 - 189 ముస్లిములారా! మీరు ధన ప్రాణాలకు సంబంధించిన పరీక్షను తప్పకుండా ఎదుర్కొంటారు. గ్రంథ ప్రజల నుండి, ముష్రిక్కుల నుండి మీరు కష్టం కలిగించే మాటలు అనేకం వింటారు. పరిస్థితులలో మీరు గనక సహనంతో, భయభక్తులతో నిలకడగా ఉంటే, ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం. గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని, వాటిని మరుగుపరచరాదని, అల్లాహ్ వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చెయ్యండి. కాని వారు గ్రంథాన్ని తమ వీపుల వెనుక పడవేశారు. స్వల్ప మూల్యానికి దానిని అమ్మి వేశారు. వారు చేసే వ్యాపారం ఎంత చెడ్డది! తాము చేసిన పనులకు సంతోషపడేవారు, యథార్థంగా తాము చేయని పనులకు తమకు ప్రశంసలు లభించాలని కోరేవారు శిక్షను తప్పించుకుంటారని భావించకండి. వాస్తవానికి వారికొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. భూమికీ, ఆకాశాలకూ యజమాని అల్లాహ్, ఆయన శక్తి సమస్తాన్నీ ఆవరించివుంది.

3. ఆలి ఇమ్రాన్190 - 194 భూమీ, ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్నివేళలా అల్లాహ్ ను స్మరించే వారున్నూ, భూమీ, ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. (వారు అప్రయత్నంగా ఇలా అంటారు) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కాబట్టి నిష్ఫల కార్యాలు చెయ్యవు. కనుక ప్రభూ! మమ్మల్ని నరక బాధనుండి కాపాడు. నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికీ, అవమానానికీ గురిచేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ! మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామీ! మేము చేసిన తప్పులను మన్నించు. మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి. సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. దేవా! నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభవానికి గురి చెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు.

3. ఆలి ఇమ్రాన్195 సమాధానంగా వారి ప్రభువు ఇలా అన్నాడు : ‘‘మీలోని ఎవరి శ్రమనూ నేను వృధాగా పోనివ్వను. పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు. కనుక నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టినవారు, నా మార్గంలో తమ గృహాల నుండి గెంటివేయబడినవారు, హింసించబడినవారు, నా కొరకు పోరాడి చంపబడిన వారు - అటువంటివారి తప్పులన్నింటినీ నేను క్షమిస్తాను. క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాను.’’ ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం - ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ వద్దనే ఉంది.

3. ఆలి ఇమ్రాన్196 - 199 ప్రవక్తా! ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అవిశ్వాసులు దర్జాగా తిరుగాడటం నిన్ను మోసంలో పడవేయరాదు. అది కేవలం కొన్ని రోజుల జీవితపు కొద్దిపాటి సుఖం మాత్రమే. తరువాత వారంతా నరకానికి పోతారు. అది అధ్వాన్నమైన నివాసస్థలం. దీనికి భిన్నంగా తమ ప్రభువుకు భయపడుతూ జీవితం గడిపేవారి కొరకు, క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. తోటలలో వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్ తరఫు నుండి వారికి లభించే ఆతిథ్యం. అల్లాహ్ వద్ద ఉన్నదే సజ్జనుల కొరకు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. గ్రంథ ప్రజలలో కూడా కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. నీ వైపునకు పంపబడిన గ్రంథాన్ని విశ్వసిస్తారు. స్వయంగా వారి వైపునకు ఇదివరకు పంపబడిన గ్రంథాన్ని కూడ విశ్వసిస్తారు. అల్లాహ్ సమక్షంలో వినమ్రులౌతారు. అల్లాహ్ ఆయత్తులను స్వల్పమయిన మూల్యా నికి అమ్మరు. వారి ప్రతిఫలం వారి ప్రభువువద్ద ఉంది. అల్లాహ్ లెక్క తీసుకోవడంలో ఆలస్యం చెయ్యడు.

3. ఆలి ఇమ్రాన్200 విశ్వాసులారా! సహనంతో వ్యవహరించండి. అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి. సత్య సేవకొరకు సిద్ధంగా ఉండండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.

No comments:

Post a Comment