38 సూరహ్ సాద్

 

38. సాద్

ఆయతులు : 88                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

38. సాద్  1 - 3 సాద్‌. హితబోధతో నిండి ఉన్న ఖుర్ఆన్సాక్షిగా! అసలు విషయం ఏమిటంటే విశ్వసించటానికి తిరస్కరించిన ప్రజలే దురహంకారులు, పరమమూర్ఖులు, వారికి పూర్వం మేము ఇటువంటి ఎన్నో జాతులను నాశనం చేశాము. (వారికి పోగాలము దాపురించగా) అపుడు వారు హాహాకారాలు చేశారు. కాని అది తప్పించుకునే సమయం కాదు కదా!

38. సాద్  4 - 8 ... భయపెట్టేవాడొకడు స్వయంగా తమనుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు. సత్యతిరస్కారులు ఇలా అనసాగారు, ‘‘ఇతడు మంత్రవాది, అసత్యవాది, సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే ఒక దైవాన్ని నిలబెట్టాడేమిటి? ఇది ఎంతో విచిత్రమైన విషయం.’’ జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు, ‘‘పదండి మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి. విషయం ఒక ప్రయోజనం కోరి చెప్పబడుతోంది. విషయాన్ని మేము ఇటీవలి కాలపు సమాజంలో ఎవరినోటా వినలేదు. ఇది కల్పిత విషయం తప్ప మరేమీ కాదు. మన అందరిలోనూ కేవలం ఇతడొక్కడే అర్హుడా ఇతని మీదనే అల్లాహ్ యొక్క హితోపదేశంఅవతరించటానికి?’’

38. సాద్  ... 8 - 10 అసలు విషయం ఏమిటంటే, వారు నా ‘‘జిక్ర్’’ (గ్రంథం) గురించి సంశయగ్రస్తులయ్యారు. వారు నా శిక్షను రుచి చూడలేదు కాబట్టి మాటలన్నీ అంటున్నారు. ప్రబలుడు, ప్రదాత అయిన నీ ప్రభువు కారుణ్య నిధులు వారి అధీనంలో ఉన్నాయా? ఆకాశాలకూ, భూమికీ, వాటికి మధ్య ఉన్న వస్తువులకూ వారు యజమానులా? అలా అయితే, ప్రాపంచిక సాధనాల శిఖరాలకు చేరి చూడమనండి.

38. సాద్  11 - 16 ఇది బృందాలలోని ఒక చిన్న బృందం మాత్రమే. ఇదే స్థలంలో అది పరాజయం పాలు కానున్నది. వీరికి పూర్వం నూహ్ జాతివారు, ఆద్జాతివారు, మేకుల ఫిరౌన్, సమూద్జాతివారు, లూత్జాతివారు, ‘‘అయికా’’ వారు తిరస్కరించే ఉన్నారు. వారూ బృందాలే. వాటిలో ప్రతిబృందమూ దైవసందేశహరులు అసత్యవాదులని తిరస్కరించింది. నా శిక్షా నిర్ణయం వారికి సరిగ్గా అతికిపోయింది. వీరు కూడా కేవలం ఒక్క ప్రేలుడు కోసమే ఎదురు చూస్తున్నారు. తరువాత మరొక ప్రేలుడేదీ సంభవించదు. వారు, ‘‘మా ప్రభూ! లెక్కదినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చివెయ్యి’’ అని అంటున్నారు.

38. సాద్  17 - 26 ప్రవక్తా! వారు కల్పించే మాటల పట్ల సహనం వహించు. వారికి మా దాసుడు దావూద్వృత్తాంతాన్ని వినిపించు. అతను గొప్ప బలవంతుడు, ప్రతి వ్యవహారంలోనూ అల్లాహ్ వైపునకు మరలుతూ ఉండేవాడు. మేము పర్వతాలను అతనికి లొంగిపోయేలా చేశాము. ఉదయం, సాయంత్రం అవి అతనితో పాటు కీర్తన చేసేవి. పక్షులు గుమిగూడేవి, అవన్నీ అతని కీర్తన వైపునకు శ్రద్ధతో మరలేవి. మేము అతని రాజ్యాన్ని శక్తిమంతమైనదిగా చేశాము. అతనికి వివేకాన్ని ప్రసాదించాము. తిరుగులేని తీర్పు చెప్పే సామర్థ్యాన్ని అనుగ్రహించాము. ఇంకా, గోడపైకి ఎక్కి అతని మేడ గదిలోకి జొరబడిన వ్యాజ్యగాళ్ల వార్త ఏదైనా నీదాకా వచ్చిందా? వారు దావూద్ముందుకు వచ్చినపుడు అతను వారిని చూచి కలవరపడ్డాడు. వారు ఇలా అన్నారు : ‘‘భయపడకండి. ఒక వ్యాజ్యంలో మేము ఇద్దరం ప్రత్యర్థులం. మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కనుక మీరు మా మధ్య సత్యం ప్రకారం సరిjైున తీర్పు చెయ్యండి. అన్యాయం చేయకండి. మాకు ఋజుమార్గం చూపండి. ఇతను నా సోదరుడు, ఇతని వద్ద తొంభైతొమ్మిది గొర్రెలు ఉన్నాయి. నా దగ్గరేమో కేవలం ఒకే గొర్రె ఉన్నది. ఒక్క గొర్రెను కూడా నాకు ఇచ్చివేయి అని ఇతడు అన్నాడు. మాటలతో నన్ను వశపరచు కున్నాడు.’’ దావూద్ఇలా సమాధానం చెప్పాడు : ‘‘ వ్యక్తి తన గొర్రెలలో నీ గొర్రెను కలుపు కోవాలని అనుకుని నిస్సందేహంగా నీకు అన్యాయం చేశాడు. యథార్థం ఏమిటంటే, కలసి ఒకచోట ఉండేవారు తరచూ ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మాత్రం దీనికి దూరంగా ఉంటారు. అటువంటివారు కొందరు మాత్రమే.’’ ( విషయం అంటూ) అసలు అతన్ని పరీక్షించేందుకే మేము ఇలా చేశామని దావూద్అర్థం చేసుకున్నాడు. కనుక అతను తన ప్రభువును క్షమాభిక్ష కోరాడు, సజ్దాలో పడిపోయాడు, పశ్చాత్తాపంతో మరలాడు. అపుడు మేము అతని తప్పును మన్నించాము. నిశ్చయంగా మా వద్ద అతని కొరకు సాన్నిహిత్యం, ఉత్తమ  పర్యవసానం ఉన్నాయి. (మేము అతనితో ఇలా అన్నాము), ‘‘దావూద్‌! మేము నిన్ను భూమిపై ప్రతినిధిగా నియమించాము. కనుక నీవు ప్రజల మధ్య న్యాయంతో పరిపాలన చెయ్యి. మనోరథాలను అనుసరించకు, ఎందుకంటే అది నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తుంది. అల్లాహ్ మార్గం నుండి తప్పిపోయినవారికి తీవ్రమైన శిక్ష పడటం నిశ్చయం. ఎందుకంటే, వారు లెక్కల దినాన్ని మరచిపోయారు.

38. సాద్  27 - 29 మేము ఆకాశాన్నీ, భూమినీ వాటి మధ్య ఉన్న ప్రపంచాన్నీ వృధాగా సృజించలేదు. ఇది అవిశ్వాసుల భ్రమమాత్రమే. అటువంటి అవిశ్వాసులకు నరకాగ్ని ద్వారా వినాశం తప్పదు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారినీ, ధరణిపై కల్లోలాన్ని రేకెత్తించే వారినీ మేము ఒకటిగా చేసెయ్యాలా?  భయభక్తులు కలవారిని మేము పాపాత్ములు మాదిరిగా చేయాలా? - (ప్రవక్తా!) మేము ఎంతో శుభవంతమైన గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము  ప్రజలు దాని వాక్యాలను గురించి ఆలోచించాలనీ, బుద్ధిమంతులూ, ఆలోచనాపరులూ దానినుండి గుణపాఠం నేర్చుకోవాలనీని.

38. సాద్  30 - 40 దావూద్కు మేము సులైమాన్‌ (వంటి కొడుకు)ను ప్రసాదించాము  అతను మంచిదాసుడు, అత్యధికంగా తన ప్రభువు వైపునకు మరలుతూ ఉండేవాడు. బాగా తర్ఫీదు పొందిన అతివేగంగా పరుగెత్తే గుర్రాలు అతని ముందుకు తీసుకురాబడినప్పటి సాయంత్ర సమయం ప్రస్తావించదగినది. అప్పుడు అతను ఇలా అన్నాడు: ‘‘నేను సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.’’ చివరికి గుర్రాలు కనుమరుగైపోయినపుడు, ‘‘వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి’’ (అని ఆజ్ఞాపించాడు). తరువాత అతను వాటి పిక్కలనూ, మెడలనూ నిమురసాగాడు. (చూడండి) మేము సులైమాన్ను కూడా పరీక్షకు గురిచేశాము. అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని తెచ్చి పడవేశాము. అప్పుడు అతను (అల్లాహ్ వైపునకు) మరలి ఇలా అన్నాడు : ‘‘నా ప్రభూ! నన్ను క్షమించు. నా తరువాత మరెవ్వరికీ లభించని రాజ్యాధికారాన్ని నాకు ప్రసాదించు. నిస్సందేహంగా అసలు దాతవు నీవే.’’ అప్పుడు  మేము  గాలిని అతని వశం చేశాము.  అది  అతని ఆజ్ఞానుసారం అతను కోరిన వైపునకు మృదువుగా వీచేది. మేము షైతానులను అతని అధీనంలో ఉంచాము. వాటిలో నిర్మాణం చేసేవీ, నీటిలో మునిగి వెదికేవీ, సంకెళ్లతో బంధింపబడిన ఇతరమైనవి కూడా ఉన్నాయి. (మేము అతనితో ఇలా అన్నాము), ‘‘ఇది మా అనుగ్రహం, నీకు ఇష్టమైన వాడికి దానిని ఇచ్చివేయి. నీకు ఇష్టం కాని వాడికి ఇవ్వకు, నీకు అధికారం ఉన్నది. లెక్క అడగటం ఉండదు.’’ నిశ్చయంగా అతనికి మా  వద్ద సమీప స్థానమూ ఉత్తమ ఫలితమూ ఉన్నాయి.

38. సాద్  41 - 44 మా దాసుడు అయ్యూబ్ను గురించి ప్రస్తావించు  అప్పుడు అతను, ‘‘షైతాన్నన్ను ద్ణుఖానికీ, యాతనకూ గురిచేశాడు,’’ అని తన ప్రభువునకు మొరపెట్టుకున్నాడు. (మేము అతనికి ఇలా ఆజ్ఞాపించాము), ‘‘నీ కాలుతో నేలపై కొట్టు  ఇదో చల్లని నీరు  స్నానానికీ, త్రాగటానికీను.’’ మేము అతనికి అతని కుటుంబాన్ని తిరిగి ఇచ్చాము. వారితో పాటు ఇంకా అంతమందిని కూడా ఇచ్చాము, మా తరఫు నుండి కారుణ్యంగానూ, బుద్ధీ యోచన కలవారి కొరకు హితబోధగా ఉండేందుకు. (మేము అతనితో ఇలా అన్నాము), ‘‘గుప్పెడు పుల్లలు తీసుకో,  వాటితో కొట్టు,  నీ ఒట్టును భగ్నం చేయకు,’’ మేము అతనిని సహనశీలునిగా చూశాము  అతను మంచిదాసుడు, తన ప్రభువు వైపునకు ఎక్కువగా మరలుతూ ఉండేవాడు.

38. సాద్  45 - 48 మా దాసులైన ఇబ్రాహీమ్, ఇస్హాఖ్, యాఖూబ్లను గురించి ప్రస్తావించు. వారు గొప్ప కార్యశీలురు, దూరదృష్టికలవారు. మేము వారిని ఒక విశిష్టగుణం కారణంగా ఎన్నుకున్నాము- అది వారిలోని పరలోక చింతన. నిశ్చయంగా మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన పుణ్యపురుషులలో పరిగణింప బడతారు. ఇస్మాయీల్, అల్యస్, జుల్కిఫ్ల్లను గురించి ప్రస్తావించు  వారందరూ పుణ్యపురుషులలోని వారు.

38. సాద్  49 - 54 ఇది ఒక ప్రస్తావన: (ఇక వినండి) భయభక్తులు కలవారి కొరకు నిశ్చయంగా ఉత్తమ నివాసం ఉన్నది  శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి  వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి  వాటిలో వారు దిండ్లకు ఆనుకుని కూర్చుంటారు  ఎక్కువగా పండ్లనూ పానీయాలనూ కోరుతూ ఉంటారు  వారి ప్రక్కన సమవయస్కలైన, లజ్జావతులైన భార్యలు ఉంటారు. వస్తువులే లెక్కల రోజున మీకు ప్రసాదించబడతాయని వాగ్దానం చేయబడు తోంది. ఇది మా ప్రసాదం, ఇది అనంతం.

38. సాద్  55 - 64 ఇది భయభక్తులు కలవారి పర్యవసానం. ఇక తలబిరుసుతనం కలవారికి అతి చెడ్డ నివాసం ఉన్నది, అది నరకం  అందులో వారు కాల్చ బడుతూ ఉంటారు. అది బహుచెడ్డ నివాస స్థలం. ఇదీ వారికి లభించేది  కనుక వారు సల సల మరిగే నీటినీ, చీము, నెత్తురులనూ, ఇంకా ఇటువంటి చేదు పదార్థాలనూ రుచి చూడాలి.  (తమ అనుచరులు నరకం వైపునకు రావటాన్ని చూచి వారు పరస్పరం ఇలా అనుకుంటారు) ‘‘ఇది ఒక సైన్యం, మీ వైపునకు తోసుకుంటూ వస్తోంది. వారికి స్వాగతం పలకటం అనేదిలేదు, వారు అగ్నిలో కాలేవాళ్లు’’ వారు వీరితో ఇలా అంటారు: ‘‘లేదు, స్వయంగా మీరే కాల్చబడుతున్నారు. మీకు స్వాగతమూ లేదు. పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చింది మీరేకదా! ఎంత పాపిష్ఠ నివాస స్థలం ఇది.’’ వారు ఇంకా ఇలా అంటారు: ‘‘మా ప్రభూ! మమ్మల్ని దుష్పరిణామానికి చేరవేసే ఏర్పాట్లు చేసిన వాడికి రెట్టింపు నరక శిక్షను ఇవ్వు.’’ తరువాత వారు ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు, ‘‘ఏమిటి విశేషం! మనం ప్రపంచంలో చెడ్డవారుగా భావించినవారు మనకు ఎక్కడా కనిపించరే? మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా లేక వారు మనకు కనుమరుగయ్యారా?’’ నిస్సం దేహంగా ఇది నిజం  నరకవాసుల మధ్య ఇటువంటి తగాదాలే జరుగుతాయి.

38. సాద్  65 - 68 (ప్రవక్తా!) వారితో ఇలా అను, ‘‘నేను కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు, ఆయన అద్వితీయుడు, అందరిపై ఆధిక్యం కలవాడు, ఆకాశాలకూ, భూమికీ స్వామి, వాటి మధ్య ఉన్న సకల వస్తువులకూ ప్రభువు, మహాశక్తిమంతుడు, క్షమించేవాడు.’’ వారితో ఇంకా ఇలా అను: ‘‘ఇది ఒక గొప్ప వార్త. దానిని విని కూడా మీరు పెడముఖం పెడుతున్నారు.’’

38. సాద్  69 - 85 (వారితో ఇలా అను), ‘‘ఉన్నత స్థాయిలో ఉన్నవారి మధ్య వివాదం జరిగినప్పటి సమయం గురించి నాకు ఏమీ తెలియదు. నేను స్పష్టంగా బహిరంగంగా హెచ్చరిక చేసేవాణ్ణి అయినందువల్లనే విషయాలు వహీ ద్వారా నాకు తెలుపబడుతున్నాయి.’’ నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్నాడు, ‘‘నేను మట్టితో ఒక మనిషిని సృజించబోతున్నాను. అతని సృష్టిని పూర్తిచేసిన తరువాత, నేను అతనిలోకి నా ఆత్మను ఊదుతాను, అపుడు మీరు అతని ముందు మోకరిల్లి సజ్దా చేయండి.’’ ఆజ్ఞ ప్రకారం దైవదూతలందరూ సజ్దా చేశారు. కాని ఇబ్లీస్తాను గొప్పవాడినని గర్వించాడు  అతడు తిరస్కారులలో కలిసిపోయాడు. ప్రభువు ఇలా సెలవిచ్చాడు, ‘‘ఇబ్లీస్‌! నేను నా రెండు చేతులతో సృజించినవానికి సజ్దా చెయ్యకుండా నిన్ను విషయం ఆపింది? నీవు గొప్ప వాడివైపోయావా లేదా ఉన్నత శ్రేణికి చెందినవారిలోని వాడవా?’’ అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘‘నేను అతడి కంటె శ్రేష్ఠుణ్ణి. మీరు నన్ను అగ్నితో పుట్టించారు. ఇతన్నేమో మట్టితో సృష్టించారు.’’ ఇలా సెలవిచ్చాడు : ‘‘సరే, ఇక్కడ నుండి వెళ్లిపో. నీవు శపించబడ్డావు. నీ మీద నా శాపం ప్రతిఫలదినం వచ్చేవరకూ ఉంటుంది.’’ అతడు ఇలా అన్నాడు: ‘‘ప్రభూ! అలా అయితే వారు మళ్లీ లేపబడే దినం వరకూ నాకు గడువు ఇవ్వు.’’ ఇలా సెలవిచ్చాడు, ‘‘సరే, రోజు వరకూ నీకు గడువు ఉంది. అది వచ్చే కాలం నాకు తెలుసు.’’ అతడు ఇలా అన్నాడు, ‘‘నీ గౌరవం సాక్షిగా! నేను వారందరినీ మార్గభ్రష్టులుగా చేసి తీరుతాను, నీవు ప్రత్యేకంగా ఎన్నుకున్న దాసులను తప్ప.’’ ఇలా సెలవిచ్చాడు, ‘‘కనుక సత్యం ఇదే  నేను సత్యాన్నే పలుకుతాను. నీతోనూ, మానవులలో నిన్ను అనుసరించే వారందరితోనూ నరకాన్ని నింపుతాను.’’

38. సాద్  86 - 88 ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నేను ధర్మ ప్రచారానికి మీనుండి ఎటువంటి ప్రతిఫలాన్నీ కోరను, నేను వంచకులలోని వాడనుకాను. ఇది ఒక హితబోధ, విశ్వప్రజలందరికినీ, అచిర కాలంలోనే మీకు స్వయంగా దీని పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది.’’

No comments:

Post a Comment