63. అల్ మునాఫిఖూన్
ఆయతులు
: 11 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 3 ఓ ప్రవక్తా! ఈ కపటులు నీ వద్దకు వచ్చినప్పుడు, ‘‘మీరు నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలే అని మేము సాక్ష్యమిస్తున్నాము’’ అని అంటారు. అవును, నీవు నిజంగానే ఆయన ప్రవక్తవు అని అల్లాహ్ కు తెలుసు. కాని ఈ కపటులు
పచ్చి అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకున్నారు. మరియు ఈ విధంగా వారు అల్లాహ్ మార్గం అవలం బించకుండా స్వయంగానూ ఆగిపోతున్నారు, లోకాన్ని కూడ ఆపుతున్నారు. వారు చేస్తున్న చేష్టలు ఎంత నీచమైనవి. దీనికంతటికీ కారణం, వారు విశ్వసిం చిన తరువాత తిరస్కరించటమే. అందుకని వారి హృదయాలపై ముద్రవేయ బడిరది
ఇక వారు దేనినీ అర్థం చేసుకోరు.
4 వారిని చూస్తే, వారి రూపాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వారు మాట్లాడితే నీవు వారి మాటలను వింటూనే
ఉండిపోతావు. కాని వారసలు గోడకు ఆనించబడిన కొయ్యదుంగల వంటివారు. ప్రతి అరుపును వారు తమకు వ్యతిరేకమైనదిగా భావిస్తారు. వారు ఆగర్భశత్రువులు, వారికి దూరంగా ఉండండి.
అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! వారు ఎలా పెడమార్గం వైపునకు మరలించబడుతున్నారు!
5 - 6 వారితో, ‘‘రండి, అల్లాహ్ ప్రవక్త మీకొరకు మన్నింపు ప్రార్థన చేస్తాడు’’ అని పిలిచినప్పుడు, వారు తల విదిలిస్తారు. వారు పొగరుబోతుతనంతో రాకుండా ఆగిపోవటాన్ని నీవు చూస్తావు. ఓ ప్రవక్తా! నీవు వారి కొరకు మన్నింపు ప్రార్థన చేసినా, చేయకపోయినా, వారి విషయంలో ఒక్కటే
అల్లాహ్ వారిని ఎంతమాత్రం మన్నించడు. అల్లాహ్ దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు.
7 - 8 వారే ఇలా అనేది
‘‘ప్రవక్త అనుచరులకోసం ఖర్చుపెట్టటం ఆపెయ్యండి అప్పుడు వారు చెల్లాచెదరైపోతారు’’. వాస్తవానికి భూమిలో, ఆకాశాలలో ఉన్న నిధులకు యజమాని అల్లాహ్ యే. కాని ఈ కపటులు గ్రహించరు. వారు ఇంకా ఇలా అంటారు, ‘‘మనం మదీనా నగరానికి తిరిగి వెళ్లిన తరు వాత, మనలోని గౌరవనీయులు నీచులను అక్కణ్ణించి వెళ్లగొట్టాలి.’’ వాస్తవానికి గౌరవం అనేది అల్లాహ్ కు,
ఆయన ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే చెల్లుతుంది. కాని ఈ కపటులు అది ఎరుగరు.
9 - 11 విశ్వాసులారా! మీ సిరిసంపదలూ, మీ సంతానమూ మిమ్మల్ని అల్లాహ్ సంస్మరణ నుండి మరల్చరాదు. ఎవరైతే ఇలా మరల్చబడతారో వారే నష్టానికి గురి అయ్యేవారు. మీలో ఎవరికైనా మరణ సమయం సమీ పించి, అతను, ‘‘ఓ నా ప్రభూ! నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు
నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ణి కదా?’’ అని వాపోయే పరిస్థితి రాకముందే మేము మీకు ఇచ్చిన ఉపాధినుండి ఖర్చుపెట్టండి. కాని ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, అల్లాహ్ ఇక అతనికి
ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
No comments:
Post a Comment