77 సూరహ్ అల్‌ ముర్సలాత్

 

77. అల్ముర్సలాత్

ఆయతులు : 50                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 7 ఒకదాని తరువాత ఒకటి వరుసగా పంపబడే వాటి (గాలులు) సాక్షిగా! అవి తుఫాను వేగంతో వీస్తాయి మరియు (మేఘాలను) లేపి వ్యాపింప జేస్తాయి, తరువాత (వాటిని) చీల్చివేరుచేస్తాయి, అటుపై (హృదయాలలో దేవుని) జ్ఞాపకాన్ని జనింపజేస్తాయి - సాకుగా కాని లేదా హెచ్చరికగా కాని. విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతోందో, అది తప్పనిసరిగా జరగవలసి ఉన్నది.

8 - 15 ఎప్పుడైతే నక్షత్రాల కాంతి మందగిస్తుందో, ఆకాశం చీల్చివేయబడు తుందో, పర్వతాలు తుత్తునియలుగా చేయబడతాయో దైవప్రవక్తలు హాజరయ్యే సమయం వస్తుందో ( రోజున అది సంభవిస్తుంది). రోజుకై పనులన్నీ ఆపి ఉంచబడ్డాయి? తీర్పు దినానికై. తీర్పు దినమంటే ఏమిటో నీకేమి తెలుసు? రోజున సత్యతిరస్కారులకు వినాశం కలుగుతుంది.

16 - 19  మేము  పూర్వీకులను నాశనం చేయలేదా? తరువాత మేము రాబోవు వారిని  కూడ వారి వెనుకనే పంపుతాము. నేరస్థుల పట్ల మేము ఇలానే వ్యవహరిస్తూ ఉంటాము. సత్య తిరస్కారులకు ఆరోజున వినాశం కలుగుతుంది.

20 - 24 మేము తుచ్ఛమైన నీటితో మిమ్మల్ని పుట్టించలేదా? ఒక నిర్ణీత కాలం వరకు దానిని ఒక సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచలేదా? చూడండి మేము దీనిని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. కనుక మేము ఎంతో గొప్ప శక్తి సామర్థ్యాలు కలవారము, సత్య తిరస్కారులకు రోజున వినాశం కలుగుతుంది.

25 - 28 భూమిని మేము జీవులను, నిర్జీవులను సమీకరించే స్థానంగా చేయలేదా? అందులో ఎత్తైన పర్వతాలను అమర్చలేదా? మీకు త్రాగటానికి మంచి నీరు ప్రసాదించలేదా?  రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది.

29 - 34 ఇక పదండి, మీరు తిరస్కరిస్తూ ఉండిన దాని వైపునకే. నడవండి, మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు - అది చల్లదనాన్ని ఇచ్చేదీకాదు, అగ్ని బారినుండి రక్షించేదీ కాదు, అగ్ని, మేడల వంటి పెద్ద పెద్ద రవ్వలను విసురుతుంది. రవ్వలు (ఎగురుతూ) పసుపుపచ్చని ఒంటెలవలె కనిపిస్తాయి. రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది.

35 - 37 వారు ఏమీ మాట్లాడలేని రోజు, వారికి సాకులు చెప్పుకునే అవకాశం సైతం ఇవ్వబడని రోజు ఇదే. రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది.

38 - 40 ఇది తీర్పు దినం. మేము మిమ్మల్నీ, మీకు పూర్వం గతించిన వారినీ సమావేశపరిచాము. ఇప్పుడు మీరు గనుక నాకు వ్యతిరేకంగా ఏదైనా పన్నాగం పన్నగలిగితే, పన్ని చూడండి.    రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది.

41 - 45 దైవభీతి కలవారు రోజున నీడల క్రింద సెలయేళ్ల మధ్య ఉన్నారు.  వారు  పండ్లు కోరినా (అవి వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి). హాయిగా తినండి, త్రాగండి, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా. మేము సజ్జనులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము. రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది.

46 - 50 కొన్నాళ్లపాటు హాయిగా తినండి, సుఖంగా అనుభవించండి. నిజానికి మీరు అపరాధులు. రోజున సత్యతిరస్కారులకు వినాశం కలుగు తుంది. వారితో ‘‘(అల్లాహ్ ముందు) తలవంచండి’’ అని అన్నప్పుడు, వారు తలవంచరు. రోజున సత్యతిరస్కారులకు వినాశం కలుగుతుంది. ఇక దీని (ఖుర్ఆన్‌) తరువాత, మరొక విషయమేముంటుంది వారు విశ్వసించటానికి?

No comments:

Post a Comment