19. మర్యమ్
ఆయతులు
: 98 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
19. మర్యమ్ 1
- 3 కాఫ్.హా.యా.ఐన్.సాద్. ఇది నీ ప్రభువు తన దాసుడైన జకరియ్యాపై చూపిన కారుణ్య ప్రస్తావన - అపుడు అతను తన ప్రభువునకు ఏకాంతంగా మొరపెట్టుకున్నాడు.
19. మర్యమ్ 4
- 11 అతను ఇలా మనవి చేసుకున్నాడు, ‘‘ప్రభూ! నా ఎముకలు సైతం కృశించిపోయాయి. ముదిమి వల్ల తల (నెరసి) మెరిసిపోతోంది. ప్రభూ! నిన్ను వేడుకుని నేను ఎన్నడూ నిష్ఫలుణ్ణి కాలేదు. నా తరువాత నా బంధు మిత్రులు చేసే చెడు పనులను గురించి నేను భయపడుతున్నాను నా భార్యేమో గొడ్రాలు
కనుక నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు. అతడు నాకు వారసుడూ
కావాలి, యాఖూబ్ సంతతి వారసత్వాన్నీ పొందాలి. ప్రభూ! అతనిని అందరికీ ఇష్టుడైన వ్యక్తిగా చేయి.’’ (ఇలా జవాబు ఇవ్వబడిరది) ‘‘జకరియ్యా! మేము నీకు యహ్యా అనే పేరుగల ఒక కుమారుని శుభవార్తను తెలియజేస్తున్నాము. ఈ పేరుగల మనిషిని మేము ఇంతకు పూర్వం ఎన్నడూ పుట్టించలేదు.’’ ఇలా మనవి చేసుకున్నాడు, ‘‘ప్రభూ! నాకు కుమారుడెలా పుడతాడు, నా భార్యయేమో గొడ్రాలు, నేనా, వృద్ధుడనై కృశించిపోయాను.’’ బదులు లభించింది, ‘‘అలాగే జరుగుతుంది.’’ నీ ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, ‘‘ఇది నాకు చాల చిన్న విషయం. వాస్తవానికి ఇంతకు ముందు నీవు అసలు ఏమీ కానపుడు,
నేను నిన్ను పుట్టించాను కదా!’’ జకరియ్యా ఇలా అన్నాడు, ‘‘ప్రభూ!
నా కొరకేదైనా గుర్తును నిర్ణయించు.’’ సెలవిచ్చాడు, ‘‘నీ కొరకు గుర్తు ఏమిటంటే, నీవు వరుసగా మూడు రోజుల
వరకు ప్రజలతో మాట్లాడలేవు.’’ తరువాత అతను తన ప్రత్యేకమైన గదినుండి బయటకు వచ్చి తన జాతివారి వద్దకు వెళ్లి, ఉదయం, సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడండి అని సైగ ద్వారా వారికి హితోపదేశం చేశాడు.
19. మర్యమ్ 12
- 15 మేము అతనితో, ‘‘యహ్యా! దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకో’’ అని అన్నాము. మేము అతనికి బాల్యంలోనే ‘హుక్మ్’ (వివేకం)ను ప్రసాదించాము. తరువాత మా తరఫు నుండి అతనికి దయార్ద్ర హృదయాన్నీ, పరిశుద్ధతనూ అనుగ్రహించాము. అతను ఎక్కువ భయభక్తులు కలవాడు. తల్లిదండ్రుల హక్కులను గుర్తించినవాడు. అతను దౌర్జన్యపరుడూ కాడు,
అవిధేయుడూ కాడు. అతను పుట్టిన రోజునా, అతను మరణించే రోజునా, అతనిని బ్రతికించి లేపే రోజునా అతనిపై శాంతి నెలకొనుగాక.
19. మర్యమ్ 16
- 21 ప్రవక్తా! ఈ గ్రంథంలో, మర్యమ్ తన వారినుండి వేరైపోయి, తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి, వారికి చాటుగా తెర కట్టుకుని ఉండిపోయినప్పటి వృత్తాంతాన్ని ప్రస్తావించు. ఈ స్థితిలో మేము ఆమె వద్దకు మా ‘ఆత్మ’ను (అంటే దూతను) పంపాము. అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారంలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మర్యమ్ ఇలా పలికింది, ‘‘నీవు దైవభీతి కల మనిషివే అయితే, నేను నీ బారినుండి రక్షించ వలసినదిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను.’’ అతను ‘‘నేను నీ ప్రభువు
దూతను మాత్రమే. నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను’’ అని చెప్పాడు.
మర్యమ్ ‘‘నాకు పుత్రుడు ఎలా పుడతాడు, నన్ను పురుషుడు ఎవడూ తాకనైనా లేదు, నేను చెడు నడత గల దానినీ కాను’’ అని అన్నది. దైవదూత ఇలా అన్నాడు, ‘‘అలాగే జరుగుతుంది.’’ నీ ప్రభువు, ‘‘అలా చేయటం నాకు చాల సులభం.
ఆ బాలుణ్ణి ప్రజల కొరకు ఒక సూచనగా, మా తరఫు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాము. ఇది జరిగి తీరవలసిన విషయమే’’ అని సెలవిస్తున్నాడు.
19. మర్యమ్ 22
- 26 మర్యమ్ ఆ మగ శిశువును గర్భంలో దాల్చింది. గర్భవతి అయిన ఆమె ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. తరువాత ప్రసవ వేదన పడుతూ ఆమె
ఒక ఖర్జూరపు చెట్టు క్రిందకు చేరింది. ఆమె ఇలా వాపోయింది, ‘‘అయ్యో! నేను ఇంతకు ముందే మరణించి ఉంటే, నామరూపాలు లేకుండా నశించి ఉంటే ఎంత బాగుండేది!’’ అపుడు దైవదూత కాళ్లవైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, ‘‘బాధపడకు. నీ ప్రభువు నీకు దిగువ భాగంలో ఒక సెలయేరును సృజించాడు. నీవు ఈ చెట్టు మొదలు కొంచెం ఊపు. నీపై స్వచ్ఛమైన తాజా ఖర్జూరపు పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు, నీ కళ్లను చల్లబరచుకో. తరువాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే, అతనికి, నేను కరుణా మయుని కోసం ఉపవాసముంటానని మొక్కుకున్నాను. కనుక ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను’’ అని చెప్పు.
19. మర్యమ్ 27
- 33 తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, ‘‘మర్యమ్! నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారున్ సోదరీ! నీ తండ్రి కూడ చెడ్డ మనిషికాడే
నీ తల్లి కూడ నీతిబాహ్యమైన నడతగల స్త్రీకాదే!’’ మర్యమ్ బాలునివైపు సైగజేసి చూపింది. దానికి ప్రజలు, ‘‘ఉయ్యాలలోని ఈ పసిపిల్లవానితో మేము ఏం మాట్లాడము?’’ అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు, ‘‘నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే, ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంత కాలం నమాజును, జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, పాషాణ హృదయునిగాను చేయలేదు. నేను పుట్టిన రోజునా, నేను మరణించేరోజునా, బ్రతికింపబడి లేపబడే రోజునా నాకు శాంతి కలుగుతుంది.’’
19. మర్యమ్ 34
- 35 ఇతనే మర్యమ్ కుమారుడు ఈసా
ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం.
దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవడం
అనేది అల్లాహ్ కు తగిన పద్ధతి కాదు. ఆయన పరమ పవిత్రుడు. ఏ విషయాన్ని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే, ‘‘అయిపో’’ అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది.
19. మర్యమ్ 36
- 40 (ఈసా ఇలా ప్రకటించాడు) ‘‘నాకూ, మీకూ ప్రభువు అల్లాహ్ యే. కనుక మీరు ఆయనకే దాస్యం చేయండి. ఇదే ఋజుమార్గం.’’ కాని తరువాత విభిన్న వర్గాలు పరస్పరం విభేదించుకోసాగాయి. కనుక అవిశ్వాసులకు తాము ఒక మహాదినాన్ని చూడబోయే సమయం ఎంతో వినాశాత్మకంగా ఉంటుంది. వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు కూడ బాగానే వింటాయి, వారి కళ్లు కూడ బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయారు. ప్రవక్తా! వారు ఏమరుపాటులో ఉన్నారు, విశ్వసించటానికి సిద్ధంగా లేరు. ఈ స్థితిలో వారిని ద్ణుఖం తప్ప మార్గాంతరమే ఉండని తీర్పు
దినం గురించి భయపెట్టు. చివరకు మేమొక్కరమే భూమికీ, దానిపై ఉన్న సమస్తానికీ వారసులమవుతాము. ఆపై అందరూ మా వైపునకే మరలింపబడతారు.
19. మర్యమ్ 41
- 50 ఈ గ్రంథంలో ఇబ్రాహీమ్ గాథను ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యసంధుడైన వ్యక్తి. ఒక దైవప్రవక్త. (వారికి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చెయ్యి). అప్పుడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు, ‘‘తండ్రీ! వినలేని, కనలేని, మీ ఏ పనినీ చేసిపెట్టలేని వాటిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? తండ్రీ! నా
వద్దకు వచ్చిన జ్ఞానం మీ వద్దకు రాలేదు. మీరు నన్ను అనుస రించండి, నేను మీకు సరిjైున మార్గం చూపుతాను. తండ్రీ! మీరు షైతానుకు దాస్యం చేయకండి. షైతాను కరుణామయుణ్ణి ధిక్కరించాడు. తండ్రీ! మీరు కరుణామయుని శిక్షకు గురి అవుతారేమో అని, షైతాను సహచరులైపోతారేమో అని నాకు భయంగా ఉంది.’’ తండ్రి ఇలా అన్నాడు, ‘‘ఓ ఇబ్రాహీమ్! నీవు నాకు ఆరాధ్యులైన వాటికి విముఖుడవు అయ్యావా? నీవు దీనిని మానుకోక పోతే, నేను నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాను. కనుక నీవు శాశ్వతంగా నాకు దూరంగా వెళ్లిపో.’’ ఇబ్రాహీమ్ ఇలా అన్నాడు,
‘‘మీకు సలామ్. మిమ్మల్ని మన్నించవలసిందని నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నా ప్రభువు నాపై ఎంతో దయకలవాడు. నేను మిమ్మల్ని కూడ విడిచిపోతున్నాను, మీరు దేవుణ్ణి కాదని ప్రార్థిస్తున్న శక్తులను కూడ విడిచిపోతున్నాను. నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను. నా ప్రభువును ప్రార్థించి నేను విఫలుణ్ణి కాబోనని నమ్ముతున్నాను.’’ ఈ విధంగా అతను వారి నుండి, వారి అల్లాహ్ యేతర ఆరాధ్యుల నుండి వేరైపోయినపుడు, మేము అతనికి ఇస్హాఖ్, యాఖూబ్ల వంటి సంతానాన్ని ప్రసాదించాము, ప్రతి ఒక్కరినీ ప్రవక్తగా చేశాము, వారికి మా కరుణను ప్రసాదించాము. వారికి నిజమైన, ఉన్నతమైన కీర్తి ప్రతిష్ఠలను కలుగజేశాము.
19. మర్యమ్ 51
- 53 మూసాను గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించు. అతను ఎన్నుకో బడిన వ్యక్తి, ఒక సందేశహరుడైన ప్రవక్త. మేము అతనిని తూర్ పర్వతం కుడివైపు నుండి పిలిచాము. రహస్య సంభాషణల ద్వారా అతనికి సాన్నిధ్యాన్ని ప్రసాదించాము.
దయతో మేము అతని సోదరుడు హారూన్ను ప్రవక్తగా నియమించి అతనికి (సహాయకునిగా) ఇచ్చాము.
19. మర్యమ్ 54
- 55 ఈ గ్రంథంలో ఇస్మాయీల్ను గురించి ప్రస్తావించు. అతను వాగ్దాన పాలకుడు, సందేశహరుడైన ప్రవక్త. అతను తన ఇంటివారిని నమాజు, జకాత్లను పాటించండి అని ఆజ్ఞాపించేవాడు. తన ప్రభువునకు ప్రీతిపాత్రుడు.
19. మర్యమ్ 56
- 57 ఈ గ్రంథంలో ఇద్రీస్ను గురించి ప్రస్తావించు.అతను ఒక నిజాయితీ పరుడైన మనిషి, ఒక ప్రవక్త. మేము అతనిని ఉన్నత స్థాయికి లేపాము.
19. మర్యమ్ 58 అల్లాహ్ అనుగ్రహించిన దైవప్రవక్తలు వీరు, ఆదమ్ సంతతిలోనివారు, మేము నూహ్తోపాటు పడవపైకి ఎక్కించిన వారి వంశంలోనివారు, ఇబ్రాహీమ్ సంతతికి చెందినవారు, ఇస్రాయీల్ వంశానికి చెందినవారు, మేము ఋజుమార్గం
చూపినవారు,
మేము ఎన్నుకున్న ప్రజలలోనివారు. కరుణామయుని వాక్యాలు వారికి వినిపించినపుడు వారు విలపిస్తూ సజ్దాలో పడిపోయేవారు.
19. మర్యమ్ 59
- 63 వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు, మనోవాంఛలను అనుసరించారు.
కనుక వారు త్వరలోనే
మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలేవారూ, విశ్వసించి సత్కార్యాలు చేసేవారూ స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడ జరగదు. వారికై శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉన్నాయి. అవి అగోచర జగత్తులో లభిస్తాయని కరుణా మయుడు తన దాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేరితీరుతుంది. అక్కడ వారు వ్యర్థమైన మాట ఏదీ వినరు. అక్కడ దేనిని విన్నా సరిjైున దానినే వింటారు. వారి ఆహారం వారికి ఉదయం, సాయంత్రం నియమం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మేము మా దాసులలో భయభక్తుల జీవితం గడిపేవాణ్ణి వారసుడుగా చేసే స్వర్గం ఇదే.
19. మర్యమ్ 64
- 65 ప్రవక్తా! మేము నీ ప్రభువు ఆజ్ఞలేకుండా క్రిందికి దిగిరాము. మా ముందు ఉన్నదానికీ, మా వెనుక ఉన్నదానికీ, ఈ రెండిరటి మధ్య ఉన్నదానికీ, ప్రతిదానికీ ప్రభువు ఆయనే. నీ ప్రభువు ఎన్నడూ మరచిపోయేవాడు కాడు. ఆకాశాలకూ, భూమికీ, భూమ్యాకాశాల మధ్య ఉన్న సర్వానికి ఆయన ప్రభువు. కాబట్టి మీరు ఆయనకు దాస్యం చేయండి.
ఆయన దాస్యంలోనే స్థిరంగా ఉండండి. మీకు తెలిసినంత వరకు, ఆయనతో సమానమైన స్థాయిగలవాడె వడైనా ఉన్నాడా?
19. మర్యమ్ 66
- 72 ‘‘ఏమిటి,
నేను చనిపోయిన తరువాత, మళ్లీ నన్ను బ్రతికించటం నిజంగానే జరుగుతుందా?’’ అని అంటాడు మనిషి.
అసలు అతడు ఏమీ కానపుడే మేము అతనిని సృష్టించామన్న విషయం అతడికి జ్ఞాపకం రావటం లేదా? నీ ప్రభువు సాక్షిగా! మేము వారందరినీ, వారితో పాటు షైతానులను కూడ తప్పకుండా పోగు చేస్తాము. తరువాత నరకం చుట్టూ హాజరుపరచి, వారిని మోకాళ్లపై కూలదోస్తాము. ఆ తరువాత కరుణామయునికి వ్యతిరేకంగా అహంకారంతో తిరుగుబాటు చేసిన ప్రతి వ్యక్తినీ ప్రతి వర్గం నుండీ వేరు చేస్తాము. ఇంకా వారిలో నరకంలో త్రోయబడటానికి ఎక్కువగా అర్హులెవరో మాకు తెలుసు. మీలో నరకం దరిదాపులకు పోనివాడెవడూ లేడు. ఇది ఒక నిర్ణీత విషయమే. దానిని నెరవేర్చటం నీ ప్రభువు బాధ్యత. తరువాత మేము (ప్రపంచంలో) భయభక్తులు కలిగి ఉన్నవారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో వారు పడి ఉన్న స్థితిలోనే విడిచిపెడతాము.
19. మర్యమ్ 73
- 76 స్పష్టమైన మా ఆయతులను వారికి వినిపించినపుడు, తిరస్కారులు విశ్వాసులతో ఇలా అంటారు
‘‘మన ఇరు వర్గాలలో మంచి స్థితిలో ఉన్న వర్గం ఏదో, ఎవరి సభలు అద్భుతంగా ఉన్నాయో చెప్పండి.’’ వాస్తవానికి మేము వారికి పూర్వం ఇలాంటి జాతులను ఎన్నింటినో నాశనం చేశాము. అవి వారికంటే అపారమైన వస్తుసామగ్రిని కలిగి ఉండేవి
బాహ్య ఆడంబరాల విషయంలో వారికన్న ఎంతో మిన్నగా ఉండేవి. వారితో ఇలా అనండి, మార్గం తప్పిన వ్యక్తికి కరుణామయుడు వ్యవధినిస్తూ పోతాడు. చిట్టచివరకు ఇలాంటి వ్యక్తులు తమకు వాగ్దానం చేయబడిన దానిని గమనించినప్పుడు- అది దైవశిక్ష అయినా కావచ్చు లేదా ప్రళయవేళ అయినాకావచ్చు - వారు తెలుసుకుంటారు, హీన స్థితిలో ఎవరు ఉన్నారో, బలహీనపక్షం ఎవరిదో, దానికి ప్రతిగా ఋజువైన మార్గం అవలంబించిన వారికి అల్లాహ్ ఋజు మార్గావలంబనలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలు మాత్రమే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలం రీత్యా, పర్యవసానం దృష్ట్యా ఉత్తమ మైనవి.
19. మర్యమ్ 77
- 80 ఇంకా, మా ఆయతులను తిరస్కరించి, ‘‘నేను సంపదతోనూ, సంతానంతోనూ అనుగ్రహింపబడుతూనే ఉంటాను’’ అని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నీవు చూశావా? అగోచర విషయమేమైనా అతనికి తెలిసిపోయిందా లేక కరుణామయుడి నుండి అతడేమైనా వాగ్దానం
పొంది ఉన్నాడా?- ఎంతమాత్రం కాదు, అతడు వాగే దానిని మేము వ్రాసుకుంటాము, అతడి శిక్షను మరింత పెంచుతాము. అతడు ప్రస్తావిస్తున్నటువంటి వస్తు సామగ్రీ, మందీ మార్బలమూ, అంతా తిరిగి మా వద్దకే చేరిపోతుంది. అతడు ఒక్కడే ఒంటరిగా మా ముందు హాజరవుతాడు.
19. మర్యమ్ 81
- 82 వారు అల్లాహ్ ను కాదని, కొందరిని తమ దేవుళ్లుగా చేసుకున్నారు, తమకు వారు అండగా ఉంటారని భావించారు. కాని అండగా ఎవరూ ఉండరు. ఆ దేవుళ్లు అందరూ వారి ఆరాధనను నిరాకరిస్తారు, పైగా వారికి ప్రత్యర్థులవుతారు.
19. మర్యమ్ 83
- 87 మేము సత్యధిక్కారుల మీదకు షైతానులను వదలిపెట్టి ఉన్న విషయాన్ని
నీవు చూడటం లేదా? అవి వారిని (సత్యాన్ని వ్యతిరేకించండి అని) అమితంగా పురికొల్పుతున్నాయి. సరే, ఇక వారిపై శిక్ష అవతరించే విషయంలో నీవు తొందరపడకు. మేము వారి రోజులను లెక్కిస్తున్నాము. భయభక్తులు కలవారిని మేము అతిధులుగా కరుణామయుని సన్నిధిలో ప్రవేశ పెట్టబోయే రోజు, అపరాధులను దప్పికగొన్న జంతువులవలే నరకం వైపునకు తోలుకొని పోయే రోజు రానున్నది. అపుడు ప్రజలు ఏ సిఫారసునూ తీసుకు రాగలిగే శక్తిని కలిగి ఉండరు
కరుణామయుని సమ్ముఖం నుండి అనుమతి పత్రం పొంది ఉన్నవాడు తప్ప.
19. మర్యమ్ 88
- 95 కరుణామయుడు ఎవరినో కుమారునిగా చేసుకున్నాడు అని వారు అంటారు - ఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు! కరుణామయునికి సంతానం ఉన్నదని వారు చేసే వాదం కారణంగా, త్వరలోనే ఆకాశాలు పగిలిపోతాయేమో, భూమి బ్రద్దలవుతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో! ఎవరినైనా కుమారునిగా
చేసుకోవటం అనేది కరుణా మయుని ఔన్నత్యానికి తగినది కాదు.
భూమ్యాకాశాలలో ఉన్న వారందరూ ఆయన సమక్షంలో దాసులుగా హాజరు కానున్నారు. ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు,
వారిని సరిగ్గా లెక్కపెట్టి ఉంచాడు. ప్రళయం నాడు అందరూ ఆయన ముందు ఒక్కొక్కరే హాజరవుతారు.
19. మర్యమ్ 96
- 98 నిశ్చయంగా, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ ఉన్నవారి పట్ల త్వర లోనే కరుణామయుడు ప్రేమను హృదయాలలో కలుగజేస్తాడు. కనుక ప్రవక్తా! నీవు భయభక్తులు కలవారికి శుభవార్తను అందజేయాలనీ, వితండవాదులను భయపెట్టాలనీ మేము ఈ గ్రంథాన్ని సులభతరం చేసి నీ భాషలో అవతరింప జేశాము. వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేశాము. ఈనాడు ఎక్కడైనా నీవు వారి గుర్తులను చూస్తున్నావా? లేక ఎక్కడన్నా వారిని గురించిన గుస గుస ఏదైనా నీకు వినిపిస్తోందా?
No comments:
Post a Comment