111 సూరహ్ అల్ లహబ్

 

111 అల్ లహబ్

ఆయతులు : 5                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5 అబూ లహబ్చేతులు విరిగిపోయాయి! అతడు సర్వనాశనం అయిపోయాడు! అతడి ఆస్తి పాస్తులు, అతడి సంపాదన అంతా దేనికీ పనికి రాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా భగ భగ మండే అగ్నిలో పడవేయబడతాడు. అంతేకాదు (అతడితోపాటు) అతడి భార్య కూడ అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.

No comments:

Post a Comment