85 సూరహ్ అల్ బురూజ్

 85 అల్ బురూజ్

ఆయతులు : 22                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 9 దృఢమైన బురుజులు గల ఆకాశం సాక్షిగా! వాగ్దానం చేయబడిన (ప్రళయం) దినం సాక్షిగా! చూసేవాడు సాక్షిగా! చూడబడేది సాక్షిగా! - కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు. అది ఇంధనంతో తీవ్రంగా మండే అగ్ని గల కందకం. అప్పుడు వారు కందకం చుట్టూ కూర్చుండి విశ్వాసుల పట్ల తాము చేసిన నిర్వాకాన్ని చూస్తూ ఉండేవారు. విశ్వాసుల పట్ల వారి శత్రుత్వానికి కారణం ఇది తప్ప మరేమీ కాదు - మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవాడు, భూమ్యాకాశాల సామ్రాజ్యానికి యజమాని అయిన అల్లాహ్ ను వారు విశ్వసించారు. దేవుడు సమస్త విషయాలను గమనిస్తు న్నాడు.

10 - 11 ఎవరైతే విశ్వాసులైన పురుషులను, స్త్రీలను హింసించారో, తరువాత దానికి పశ్చాత్తాపపడరో, నిశ్చయంగా వారు నరక యాతనకు గురిఅవుతారుఆపై వారికి కాల్చివేసే శిక్ష పడుతుంది. విశ్వసించి ఆపై  సత్కార్యాలు  చేసినవారి  కొరకు నిశ్చయంగా స్వర్గవనాలు ఉన్నాయి, వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. ఇదే గొప్ప విజయం.

12 - 22 నిశ్చయంగా నీ ప్రభువు పట్టు బహుగట్టిది. ఆయనే మొదటిసారి పుట్టించాడు, మళ్ళీ ఆయనే రెండోసారి పుట్టిస్తాడుఆయన క్షమించేవాడు, ప్రేమించేవాడు, అధికార పీఠాధిపతి, మహిమాన్వితుడు, తాను తలచిన దాన్ని చేయగలవాడు. మీకు సైన్యాల గురించిన సమాచారమేదైనా అందిందా? ఫిరౌన్, సమూద్ (సైన్యాల) సమాచారం? కాని తిరస్కార వైఖరిని అవలంబిం చిన వారు తిరస్కరించటంలో నిమగ్నులై ఉన్నారు. వాస్తవానికి అల్లాహ్ వారిని చక్రబంధం చేసి ఉంచాడు. (వారు తిరస్కరించినంత మాత్రాన ఖురాన్కు నష్టమేమీ వాటిల్లదు) ఖురాన్మహత్తరమైనది, ఫలకంపై వ్రాయబడి భద్రంగా ఉన్నది.

No comments:

Post a Comment