30. అర్ రూమ్
ఆయతులు
: 60 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
30. అర్
రూమ్ 1
- 6 అలిఫ్. లామ్. మీమ్. రోమన్ ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితు లయ్యారు
తమ ఈ పరాజయం
తరువాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు.
ముందయినా తరువాత అయినా అధికారం మట్టుకు అల్లాహ్దే. ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు. అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి సహాయపడతాడు. అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు మరియు అనంతకరుణామయుడు, ఈ వాగ్దానం అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. కాని ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు.
30. అర్
రూమ్ 7
- 10 ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్యరూపాన్ని మాత్రమే ఎరుగుదురు
పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్షాభావంతో ఉన్నారు. వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదా? అల్లాహ్ భూమినీ, ఆకాశాలనూ, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులనూ సత్యంతో, ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు. కాని చాలామంది తమ ప్రభువుతో సమావేశం కావలసి ఉన్నది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు. వారు భూమిపై ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేదా? తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపును వారు చూడగలందులకు? వారు (పూర్వీకులు) వీరికంటే ఎక్కువ బలవంతులు. వారు భూమిని బాగా త్రవ్వారు. వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువగా వసింపచేశారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు. ఇంకా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాదు, కాని స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండినారు. చివరకు చెడు పనులు చేసిన వారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరించారు వాటిని ఎగతాళి చేశారు.
30. అర్
రూమ్ 11
- 16 అల్లాహ్ యే సృష్టిని ప్రారంభిస్తాడు, ఆయనే దానిని తిరిగి సృష్టిస్తాడు, తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఆ గడియ నెలకొన్ననాడు, అపరాధులు దిగ్భ్రమకు లోనవుతారు, వారు అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టినవారెవరూ వారిని గురించి సిఫారసు చేయరు. అప్పుడు వారు తాము కల్పించుకున్న దైవాలను సైతం తిరస్కరిస్తారు. ఆ గడియ నెలకొన్న రోజున (మానవులందరూ) విభిన్న వర్గాలుగా చీలిపోతారు. విశ్వసించి మంచి పనులు చేసినవారు ఒక ఉద్యానవనంలో సుఖంగా సంతోషంగా ఉంచబడతారు, కాని విశ్వసించనివారు మా వాక్యాలనూ, పరలోక సమావేశాన్నీ నిరాకరించిన వారు శిక్షలోనే ఉంచబడతారు.
30. అర్
రూమ్ 17
- 19 కనుక నీవు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడు, సాయంత్రం అయినపుడు, ఉదయం అయినపుడు, ఆకాశాలలోనూ, భూమిలోనూ ఆయనే స్తుతింపదగినవాడు, మధ్యాహ్నం అయినపుడు సూర్యాస్తమయం అయినప్పుడు (ఆయనను స్తుతించు). ఆయన జీవిని నిర్జీవి నుండి వెలికి తీస్తాడు, నిర్జీవిని జీవి నుండి వెలికి తీసుకువస్తాడు. భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇలానే నీవు కూడా (మరణావస్థ నుండి)
వెలికి తీయ బడతావు.
30. అర్
రూమ్ 20 ఆయన సూచనలలో ఒకటి ఏమిటంటే
ఆయన మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత అకస్మాత్తుగా మీరు మానవులయ్యారు. (భూమిపై) వ్యాపిస్తూ ఉన్నారు.
30. అర్
రూమ్ 21 ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే
ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు- మీరు వారివద్ద శాంతిని పొందటానికి, మీ మధ్య ప్రేమనూ, కారుణ్యాన్నీ సృజించాడు. నిశ్చయంగా ఆలోచనాపరులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి.
30. అర్
రూమ్ 22 ఆయన సూచనలలో, ఆకాశాలనూ, భూమినీ సృష్టించటమూ, మీ భాషల, మీ రంగుల వైవిధ్యాలూ ఉన్నాయి. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి.
30. అర్
రూమ్ 23 ఆయన సూచనలలో రాత్రి, పగలు, మీరు నిద్రపోవటం, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, (శ్రద్ధగా) వినే వారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి.
30. అర్
రూమ్ 24 ఇంకా ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే ఆయన మీకు మెరుపు తళతళలను చూపిస్తాడు, భయాన్ని కలిగిస్తూనూ, ఆశను రేకిత్తిస్తూనూ, ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు, తరువాత దాని ద్వారా భూమికి, దాని మరణా నంతరం జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, నిశ్చయంగా ఇందులో తెలివిని వినియో గించుకునే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి.
30. అర్
రూమ్ 25
- 27 ఆయన సూచనలలో ఇంకొకటి ఏమిటంటే, ఆకాశమూ, భూమీ ఆయన ఆజ్ఞ మూలంగానే సుస్థిరంగా ఉన్నాయి. తరువాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే, కేవలం ఒకే ఒక పిలుపునకు మీరు అకస్మాత్తుగా బయటికి వచ్చేస్తారు, ఆకాశాలలో, భూమిపై ఉన్న వారెవరైనా ఆయన దాసులే. అందరూ ఆయన ఆజ్ఞకే కట్టుబడి ఉన్నారు. ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు. ఆయనే దానిని మళ్లీ సృష్టిస్తాడు. ఇది ఆయనకు సులభతరం. ఆకాశాలలోనూ, భూమిపైనా ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి, ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడూను.
30. అర్
రూమ్ 28
- 29 ఆయన మీకు స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని ఇస్తు న్నాడు. మీ అధీనంలో ఉన్న బానిసలలో కొందరు మేము మీకు ఇచ్చిన సిరి సంపదలలో మీతోపాటు సమానమైన భాగ స్వాములుగా ఉన్నవారూ, మీరు పరస్పరం మీ సమానులకు భయపడేవిధంగా, మీరు భయపడేటటువంటి వారు వారిలో ఎవరైనా ఉన్నారా?- ఈవిధంగా బుద్ధి కుశలత కలవారికి మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము. కాని ఈ దుర్మార్గులు జ్ఞానం లేకుండానే తమ భ్రమలవెంట పడ్డారు.అల్లాహ్ అపమార్గం పట్టించిన వ్యక్తికి మార్గం చూపగలవాడెవడు? అటువంటి వారికి సాయపడేవాడెవడూ ఉండడు.
30. అర్
రూమ్ 30
- 32 కనుక (ప్రవక్తా! ప్రవక్త యొక్క అనుచరులారా!) ఏకాగ్రచిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా నిలపండి. అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. అల్లాహ్ సృజిం చిన స్వరూప స్వభావాలు మార్చటానికి శక్యం కానివి, ఇదే సవ్యమైన, తిన్నని ధర్మమార్గం,
కాని చాలామందికి తెలియదు. (స్థిరముగా ఉండండి ఈ విషయంలో) అల్లాహ్ వైపునకు మరలుతూ
ఆయనకు భయపడండి, నమాజును స్థాపించండి,
తమ ధర్మాన్ని వేర్వేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రిక్కులలో కలసిపోవకండి. ప్రతి వర్గమూ తన వద్ద ఉన్న దానితోనే ఆనందపడుతున్నది.
30. అర్
రూమ్ 33
- 35 మానవుల స్థితి ఎలాంటిదంటే, వారికి ఏదైనా కష్టం కలిగినపుడు, వారు తమ ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన తన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం వారికి రుచి చూపిస్తే అపుడు వారిలో
కొందరు వెంటనే షిర్కు చేయటం ప్రారంభిస్తారు, మేము చేసిన ఉపకారానికి కృతఘ్నత చూపటానికిగాను. సరే, మంచిది, సుఖాలు అనుభవించండి, త్వరలోనే మీకు తెలిసిపోతుంది. వారు చేస్తూ ఉన్న షిర్కు యొక్క సత్యతకు సాక్ష్యం పలికే ఏదైనా నిదర్శనాన్ని గానీ, ప్రమాణాన్ని గానీ మేము వారిపై అవతరింపజేశామా?
30. అర్
రూమ్ 36
- 39 మేము మానవులకు కారుణ్యపు కమ్మదనాన్ని రుచి చూపించి నప్పుడు, వారు దానికి పొంగి పోతారు. స్వయంగా వారు చేసుకున్న చేష్టలు కారణంగా
వారిపైకి ఏదైనా ఆపద వచ్చిపడితే, వెంటనే వారు నిరాశకు లోనవుతారు. అల్లాహ్ యే తనకు ఇష్టమైన వారి ఉపాధిని వృద్ధిపరుస్తాడు, (తనకు ఇష్టమైన వారి ఉపాధిని) తక్కువ చేస్తాడు.
ఈ విషయాన్ని వారు చూడటం లేదా? నిశ్చయంగా ఇందులో
విశ్వసించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి.
కనుక (విశ్వాసీ) బంధువునకు అతని హక్కును ఇచ్చివేయి, పేద వానికీ,
బాటసారికీ (వారి హక్కులను) ఇచ్చివేయి.
అల్లాహ్ ప్రసన్నతను కోరుకునే వారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. వారే సాఫల్యం పొందేవారు. ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో పెరగదు. అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో, మీరు ఇచ్చే జకాతు - దానిని ఇచ్చే వారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు.
30. అర్
రూమ్ 40
- 45 అల్లాహ్ యే
మిమ్మల్ని పుట్టించాడు. తరువాత మీకు ఉపాధిని ఇచ్చాడు. ఆ తరువాత ఆయన మీకు మరణం కలిగిస్తాడు, తరువాత ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్నవారిలో, ఎవడైనా ఈ
పనులలో ఏ పనినైనా చేసేవాడు ఉన్నాడా? ఈ మానవులు చేసే షిర్కునుండి ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. మానవులు చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగానే నేలపైనా, నీటిలోనూ కల్లోలం చెలరేగింది
వారి కొన్ని చేష్టల (ఫలితం)ను వారికి చవి చూపటానికి
బహుశా వారు తమను సంస్కరించుకుంటారేమో అని. (ప్రవక్తా) వారితో ఇలా అను, భూమిపై సంచారం చేసి చూడండి, పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో, వారిలో చాలమంది బహుదైవారాధకులే. కనుక (ప్రవక్తా) ఈ సత్య ధర్మంవైపు నీ ముఖాన్ని స్థిరంగా నిలుపు - ఆ రోజు రాకమునుపే, ఏ రోజు తొలగిపోయే ఏ అవకాశమూ అల్లాహ్ తరఫు నుండి లేదో. ఆ రోజున మానవులు చెదరిపోయి ఒకరినుండి ఒకరు వేరైపోతారు, అవిశ్వాసానికి పాల్పడిన వాడు తన అవిశ్వాసపు దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. మంచి పనులు చేసేవారు తమ కొరకే (సాఫల్య మార్గాన్ని) సుగమం చేసుకుంటున్నారు విశ్వసించి మంచి
పనులు చేసే వారికి అల్లాహ్ తన అనుగ్రహం నుండి ప్రతిఫలం ఇచ్చేందుకు. నిశ్చయంగా ఆయన అవిశ్వాసులను ప్రేమించడు.
30. అర్
రూమ్ 46
- 47 ఇది, ఆయన సూచనలలోనిది. ఆయన వాయువులను పంపుతాడు, శుభవార్తను తెలిపేందుకూ,
మీకు తన కారుణ్యాన్ని రుచి చూపేందుకూ, ఇంకా ఈ ఉద్దేశ్యంతో కూడా, పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేటందుకు, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు, ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారుగా అయ్యేటందుకు. మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపునకు పంపాము, వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకుని వచ్చారు. తరువాత నేరం చేసిన వారికి మేము ప్రతీకారం చేశాము. మేము విశ్వాసులకు సహాయపడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు.
30. అర్
రూమ్ 48
- 53 అల్లాహ్ యే గాలులను పంపేవాడు, అవి మేఘాలను లేపుతాయి, తరువాత ఆయన ఆ మేఘాలను తన ఇష్టం ప్రకారం ఆకాశంలో వ్యాపింప జేస్తాడు, వాటిని ఖండికలుగా విభజిస్తాడు, తరువాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు. ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే, వారు ఆనందంతో పొంగిపోతారు. వాస్తవానికి దాని అవతరణకు పూర్వం వారు నిరాశకు లోనై ఉండేవారు, అల్లాహ్ కారుణ్యం యొక్క ప్రభావాలను చూడు
నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించిలేపుతాడో నిశ్చయంగా ఆయన మృతు లకు ప్రాణం పోసేవాడు, ఆయన ప్రతి విషయంపై అధికారం కలవాడు. మేము గాలిని పంపితే, దాని ప్రభావం వల్ల వారు తమ పంటలు పసుపుపచ్చగా మారటాన్ని చూస్తే, అప్పుడు వారు అవిశ్వాసంపై మరింత స్థిరపడిపోతారు, (ప్రవక్తా!) నీవు మృతులకు వినిపించలేవు, వెనుతిరిగి వెళ్ళిపోయే చెవిటి వారికీ నీవు నీ సందేశాన్ని వినిపించలేవు
నీవు అంధులను అపమార్గం నుండి తప్పించి వారికి ఋజుమార్గమూ చూపలేవు. నీవు కేవలం మా వాక్యాలను విశ్వసించేవారికే, విధేయతతో తలవంచే వారికే వినిపించగలవు.
30. అర్
రూమ్ 54
- 57 బలహీనావస్థ నుండి మీ పుట్టుకను ప్రారంభించినవాడూ, మళ్లీ ఆ బలహీనత తరువాత మీకు బలాన్ని ప్రసాదించినవాడూ, ఆ బలం తరువాత మళ్లీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారుగా చేసినవాడూ అల్లాహ్ యేకదా! ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, ప్రతిదానిపై అధికారం కలవాడు. ఆ గడియ సంభవించినప్పుడు, నేరస్తులు ప్రమాణాలు చేసి, మేము ఒక గంటసేపు కంటే ఎక్కువ కాలం ఉండలేదు అని అంటారు. ఈ విధంగానే వారు ప్రాపంచిక జీవితంలో మోసపోతూ ఉండేవారు. కాని జ్ఞానమూ, విశ్వాసమూ అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు, ‘‘దైవలేఖనం ప్రకారం మీరు ప్రళయదినం వరకు పడి ఉన్నారు, కనుక ఇదే ఆ ప్రళయదినం, కాని మీకు తెలియదు.’’ కనుక ఆ రోజున దుర్మార్గులకు వారి సాకులు ఏ ప్రయోజనాన్నీ కలిగించలేవు. వారిని క్షమాభిక్ష కోరండి అని అడగటమూ జరగదు.
30. అర్ రూమ్ 58 - 60 మేము ఈ ఖురానులో మానవులకు రకరకాలుగా బోధించాము. నీవు ఏ సూచనను తెచ్చినా, అవిశ్వాసులు, ‘‘నీవు అసత్యాన్ని ఆశ్రయించావు’’ అనే అంటారు. ఈ విధంగా అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాలకు ముద్ర వేస్తాడు. ‘‘కనుక (ప్రవక్తా!) సహనంతో ఉండు, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది, అవిశ్వాసులు నిన్ను తేలికగా తీసుకోరాదు.’’
No comments:
Post a Comment