87 సూరహ్ అల్ ఆలా

 

87 అల్ ఆలా

ఆయతులు : 19                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5 ( ప్రవక్తా!) మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని కొనియాడు  ఆయన (విశ్వాన్ని) సృష్టించాడు, సమమైన తూకాన్ని నెలకొల్పాడు, జాతకం నిర్ణయించాడు, ఆపై, మార్గం చూపించాడు, వృక్షజాతులను పుట్టించాడు, తిరిగి వాటిని నల్లని చెత్తాచెదారంగా మార్చాడు.

6 - 7 మేము నిన్ను చదివిస్తాము,  తరువాత నీవు మరచిపోవు అల్లాహ్ కోరినదాన్ని తప్ప. ఆయనకు బహిరంగమయినవీ తెలుసు, గోప్యమయినవీ తెలుసు.

8 - 13 మేము నీకు సులభమైన మార్గంలో ఉండే సౌకర్యాన్ని కలుగజేస్తు న్నాము, కనుక నీవు హితబోధ చేస్తూ ఉండు, హితబోధ గనక లాభదాయక మయితే. (దేవునికి) భయపడేవాడు హితబోధను స్వీకరిస్తాడు  దానిని పెడచెవిని పెట్టేవాడే పరమ దౌర్భాగ్యుడు, అతడు ఘోరమైన అగ్నిలో పడతాడు.  ఇక అందులో అతడు చావడూ, బ్రతకడూ.

14 - 19 పరిశుద్ధతను పాటించి, తన ప్రభువు నామాన్ని స్మరించి, తరువాత నమాజు చేసినవాడు తప్పక సాఫల్యం పొందుతాడు. కాని మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.  వాస్తవానికి పరలోక జీవితమే మేలైనది, శాశ్వతమైనదీను. విషయమే  పూర్వం వచ్చిన గ్రంథాల్లోనూ చెప్పబడిరది, (అంటే) ఇబ్రాహీమ్, మూసాలపై అవతరించిన గ్రంథాలలో.

No comments:

Post a Comment